సాక్షి, బాపట్ల: సోదరి రక్షణ కోసం ఎదురెళ్లి దుండగుల చేతిలో హతమైన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అమర్నాథ్ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారాయన.
అమర్నాథ్ కుటుంబాన్ని అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారాయన. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
Comments
Please login to add a commentAdd a comment