
రాయచూరు రూరల్: బాగల్‌కోటె జిల్లాలో ఓ పారా మెడికల్ విద్యార్థిని హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు..ఇలకల్‌కు చెందిన పారా మెడికల్ విద్యార్థిని సుమన మనోహర్ పత్తార్ బాగల్‌కోటెలోని కుమారేశ్వర పారా మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపి మూడో సంవత్సరం చదువుతోంది. కాగా హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె కనిపించడం లేదని ఈనెల 14న సుమన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాగల్‌కోటె జిల్లా ఎస్పీ అమర్‌నాధ్‌రెడ్డి తెలిపారు. ఈనెల 16న సీగీకెరె క్రాస్ రైల్వే వంతెన కింద ఆమె మృతదేహం లభించిందని, హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment