Para Medical
-
పారా మెడికల్ సిబ్బంది తొలగింపునకు కుట్ర
ముషీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని తొలగించి ఆ శాఖను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద వేలాది మందితో భారీ ధర్నా తలపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, ఏరియా ఆస్పత్రులు, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సరిపడినంతమంది సిబ్బందిని నియమించకుండా.. ఉన్నవారిని కుదించడానికి కుట్ర పన్నుతూ జీవో 142ను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుని కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే పారా మెడికల్ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. -
పారా మెడికల్ విద్యార్థిని సుమన హత్య
రాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లాలో ఓ పారా మెడికల్ విద్యార్థిని హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు..ఇలకల్‌కు చెందిన పారా మెడికల్ విద్యార్థిని సుమన మనోహర్ పత్తార్ బాగల్‌కోటెలోని కుమారేశ్వర పారా మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపి మూడో సంవత్సరం చదువుతోంది. కాగా హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె కనిపించడం లేదని ఈనెల 14న సుమన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాగల్కోటె జిల్లా ఎస్పీ అమర్నాధ్రెడ్డి తెలిపారు. ఈనెల 16న సీగీకెరె క్రాస్ రైల్వే వంతెన కింద ఆమె మృతదేహం లభించిందని, హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో పారా మెడికల్ స్టాఫ్ ఆందోళన
-
ఏపీ: వైద్యశాఖ నియామకాల్లో ఉమ్మడి విధానం
సాక్షి, అమరావతి: వైద్య విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. బయో మెడికల్ ఇంజినీర్, డైటీషియన్ తదితర 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్ పోస్టులను ఈ నెలలోనే భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో పబ్లిక్ హెల్త్ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాలు, పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడిగా నియామక ప్రక్రియను చేపట్టాలని జిల్లాల ఎంపిక కమిటీల (డీఎస్సీ)కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి ఈ నెలాఖరులోగా స్రూ్కటినీ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేకుండా, ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల మెరిట్ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు. ఉమ్మడి నోటిఫికేషన్‌తో అభ్యర్థులకు మేలు గతంలో డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులకు అర్హతలు ఒక్కటే అయినప్పటికీ భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవి. అభ్యర్థులు కూడా మూడు విభాగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అందుకు అప్లికేషన్ నుంచి మొదలు అన్ని దశల్లోనూ మూడుసార్లు అదనపు భారం, ప్రయాస పడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల్లోను ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులు మూడు విభాగాలకు ఒక్క దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లో ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆ విభాగాన్ని ఎంచుకునే అవకాశం వారికే కల్పించింది. ఉమ్మడి ఎంపికవిధానం ద్వారా ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు రుసుం రూ.500 కలిసి రావడంతో పాటు ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుంది. ఉమ్మడి భర్తీ ప్రక్రియ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి జిల్లా ఎంపిక కమిటీలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండే ఎంపిక కమిటీలో వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ, డీఎంఈ విభాగాలకు చెందిన అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను వీరు పరిశీలించి, రిజర్వేషన్లు పాటించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. -
పోస్టులు భర్తీ అయ్యేనా!
మెడికల్ కళాశాలకు సంబంధించి పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 9న జీఓ నెం. 150 విడుదల చేశారు. ఇందులో పరిపాలన విభాగం, పారా మెడికల్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటిని 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు. జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా నవంబర్ 27 లోపు పోస్టుల భర్తీ చేస్తామని జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు. కానీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వలేదు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం చేశారు. డిసెంబర్లో జరిగిన రాష్ట్ర మంత్రి వర ్గసమావేశంలో మెడికల్ కళాశాలలో 810 కొత్త పోస్టులకు ఆమోదముద్ర వేశారు. జనవరి 6వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిం ది. దీంతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశా రు. కానీ ఇంతవరకూ ఆర్థిక శాఖ నిధులు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పోస్టుల భర్తీపై సందిగ్ధత నెల కొంది. ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. 20 తరువాత రానున్న ఎంసీఐ మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం అనుమతి కోసం ఈ నెల 20వ తేదీ తరువాత ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం వస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కానీ కళాశాలలో ఏర్పాట్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మొదటి సంవత్సరం అనుమతికి ఎంసీఐ బృందం గతేడాది ఏప్రిల్ 15,16,17వ తేదీల్లో వచ్చినప్పుడు పోస్టుల భర్తీ, పరిపాలన విభాగం ఏర్పాటు తక్షణం చేయాలని ఆదేశించింది. కా నీ నేటివరకు ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం ఎంసీఐ ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తుందోనని మెడికల్ కళాశాల అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఏడాది కొత్తగా పీజీ కోర్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున ఖాళీల కొరత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కళాశాలలో జూలై వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోనుంది. ఫలితంగా కళాశాలలో, ఆస్పత్రిల్లో తీ వ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంసీఐ మాత్రం తన పర్యటనను కొనసాగించనుంది. -
పారా మెడికల్ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు కరువు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: పారా మెడికల్ కోర్సుకు అభ్యర్థులు కరువైపోతున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగం సీట్లకు కూడా దరఖాస్తులు రాలేదు. మరికొన్ని కోర్సులకైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో కౌన్సెలింగ్ ఎలా చేయాలా అని అధికారులు, నర్సిం గ్ కళాశాల యజమానులు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో 13 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వ సీట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్ల భర్తీకి మంగళవారం కౌ న్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రభు త్వ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కరువయ్యారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో పాటు కళాశాలల యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సీట్ల వివరాలు డీఎంఎల్టీ కోర్సుకు సంబంధించి 100 సీట్లకు గాను కేవలం 31 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఎనస్తీషియా టెక్నీషియన్‌కు 10 సీట్లకు గాను 8 మంది, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ 36 సీట్లకుగాను 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. డార్క్ రూం అసిస్టెంట్ 12 సీట్లకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కు కూడా పది సీట్లకు ఒక్క దరఖాస్తు వచ్చింది. అఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ 14కుగాను 7, ఆడియోమెట్రిక్ 30 సీట్లకుగాను 3 మాత్రమే వచ్చాయి. అప్టోమెట్రిక్ విభాగంలో 6 సీట్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా దరఖాస్తులు వచ్చిన వాటికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. -
పారా మెడికల్ విద్యార్థుల అవస్థలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు చుక్కెదురైంది. ఎంసెట్ ద్వారా వైద్యవిద్య కోర్సులు చేయలేని విద్యార్థులు పారామెడికల్ కోర్సులను ఆశ్రయిస్తే ఈ విద్యా సంవత్సరం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ వంటి పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ విద్య కనీస విద్యార్హతగా ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయించింది. దీంతో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో ఈ కోర్సుల్లో ప్రవేశాలను నిలిపేశారు. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులను ఎప్పటిలానే పదో తరగతి విద్యార్హతతోనే ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు వాటిలో చేరారు. జిల్లాలో ఓకేషనల్ జూనియర్ కళాశాలలు 18 ఉండగా వాటిలో ఒకటే ప్రభుత్వ కళాశాల. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నమ్మబలికి విద్యార్థులను చేర్చుకున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ప్రైవేటు కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు మూడు నెలలుగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకేషనల్ ప్రైవేటు యాజమాన్యాలు ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి. అయితే జూనియర్ కళాశాలల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లేదంటూ బోర్డు తేల్చి చెప్పింది. అంతేకాదు ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్న కళాశాలలు వారిని ఇతర కోర్సుల్లోకి మార్చాలని ఆదేశించింది. జూలై నుంచి పారా మెడికల్ తరగతులు వింటున్న విద్యార్థులను ఇతర కోర్సుల్లో చేరమనడంతో వారు కంగుతింటున్నారు. మూడు నెలలు ఒక కోర్సును అభ్యసించి ఇప్పుడు మరో కోర్సులో చేరాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కొత్త కోర్సులో విద్యా సంవత్సరం మూడు నెలలు నష్ట పోవాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి ఫొటో, సంతకం, ఇతర వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరచాలి. అలా నమోదు చేసిన విద్యార్థికే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీతో ఆన్లైన్లో నమోదు గడువు ముగిసింది. రూ. 400ల అపరాధ రుసుముతో ఈ నెల 21వ వరకూ అంటే శనివారం వరకూ ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. దీంతో ఇతర కోర్సుల్లో చేరే అవకాశాన్ని కూడా విద్యార్థులు కోల్పోయారు. కొన్ని కళాశాలల వారు ఆర్ఐఓ కార్యాలయం బాట పట్టారు. మరి కొందరు ఇంటర్మీడియెట్ బోర్డు తమకు అనుకూలంగా వ్యవహరించి ఈ సంవత్సరానికి అనుమతులు మంజూరు చేస్తుందని విద్యార్థులకు నమ్మబలుకుతున్నారు. మొత్తం మీద వృత్తి విద్యను అభ్యసిస్తే తమ కాళ్ల మీద తాము బతకవచ్చు అనే ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మోసపోయారు. అటు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరలేక, అదే విధంగా ఒకేషనల్ కోర్సుల్లోనూ చేరలేక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు.