మెడికల్ కళాశాలకు సంబంధించి పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 9న జీఓ నెం. 150 విడుదల చేశారు. ఇందులో పరిపాలన విభాగం, పారా మెడికల్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటిని 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు. జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా నవంబర్ 27 లోపు పోస్టుల భర్తీ చేస్తామని జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు. కానీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వలేదు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం చేశారు.
డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి వర ్గసమావేశంలో మెడికల్ కళాశాలలో 810 కొత్త పోస్టులకు ఆమోదముద్ర వేశారు. జనవరి 6వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిం ది. దీంతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశా రు. కానీ ఇంతవరకూ ఆర్థిక శాఖ నిధులు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పోస్టుల భర్తీపై సందిగ్ధత నెల కొంది. ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు.
20 తరువాత రానున్న ఎంసీఐ
మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం అనుమతి కోసం ఈ నెల 20వ తేదీ తరువాత ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం వస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కానీ కళాశాలలో ఏర్పాట్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మొదటి సంవత్సరం అనుమతికి ఎంసీఐ బృందం గతేడాది ఏప్రిల్ 15,16,17వ తేదీల్లో వచ్చినప్పుడు పోస్టుల భర్తీ, పరిపాలన విభాగం ఏర్పాటు తక్షణం చేయాలని ఆదేశించింది. కా నీ నేటివరకు ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం ఎంసీఐ ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తుందోనని మెడికల్ కళాశాల అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఏడాది కొత్తగా పీజీ కోర్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున ఖాళీల కొరత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం
పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కళాశాలలో జూలై వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోనుంది. ఫలితంగా కళాశాలలో, ఆస్పత్రిల్లో తీ వ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంసీఐ మాత్రం తన పర్యటనను కొనసాగించనుంది.
పోస్టులు భర్తీ అయ్యేనా!
Published Mon, Feb 17 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement