Female BA student Shot Dead by 2 Youths In Daylight In UP Jalaun - Sakshi
Sakshi News home page

పట్టపగలే యూపీలో దారుణం.. నడిరోడ్డుపై యువతిని కాల్చిచంపిన దుండగులు

Published Mon, Apr 17 2023 7:58 PM | Last Updated on Mon, Apr 17 2023 8:44 PM

Female BA student Shot Dead by 2 Youths In Daylight In UP Jalaun - Sakshi

ఉత్తర​ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై  ఓ విద్యార్థిని హత్యోదంతం కలకలం రేపుతోంది. కాలేజీ నుంచి వస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పులో తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జలౌన్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగుచూసింది.

హత్యకు గురైన యువతిని బీఏ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి రోషిని అహిర్వార్‌గా(21) గుర్తించారు. ఈమె రామ్‌ లఖన్‌ పటేల్‌ మహావిద్యాలయ కళాశాలలో పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తోంది. 11 గంటల సమయంలో ఇద్దరు యువకులు బజాజ్‌ పల్సర్‌ బైక్‌పై వచ్చి కంట్రీ మేడ్‌ పిస్తోల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వెంటనే వారిలో ఒకరు యువతి తలపై కాల్పులు జరిపారు.దీంతో బాధితురాలు అక్కడిక్కడే మరణించింది. హంతకులు తుపాకీని అక్కడే విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఒకరిని వెంబడించి పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. కాగా కళాశాల యూనిఫాం ధరించి రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న విద్యార్థినిని, స్థానికులు, పోలీసులు చూస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
చదవండి: అతీఖ్‌ హంతకుల జైలు మార్పు

ఇక ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన రెండు రోజులకే ఈ ఈ ఘటన చోటుచేసుకోవడంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు. డం రాష్ట్రంలోని శాంతి భదత్రలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వీడియోను ఆర్జేడీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ యూపీ పోలీసులు, అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పించింది. ‘ఈ చావును కూడా బీజేపీ, గోడీ మీడియా తోడేళ్లు సంబరాలు చేసుకుంటాయా అని మండిపడింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement