Jalaun
-
షాకింగ్ ఘటన.. పట్టపగలే నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ విద్యార్థిని హత్యోదంతం కలకలం రేపుతోంది. కాలేజీ నుంచి వస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పులో తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జలౌన్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగుచూసింది. హత్యకు గురైన యువతిని బీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి రోషిని అహిర్వార్‌గా(21) గుర్తించారు. ఈమె రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయ కళాశాలలో పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తోంది. 11 గంటల సమయంలో ఇద్దరు యువకులు బజాజ్ పల్సర్ బైక్‌పై వచ్చి కంట్రీ మేడ్ పిస్తోల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వెంటనే వారిలో ఒకరు యువతి తలపై కాల్పులు జరిపారు.దీంతో బాధితురాలు అక్కడిక్కడే మరణించింది. హంతకులు తుపాకీని అక్కడే విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఒకరిని వెంబడించి పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. కాగా కళాశాల యూనిఫాం ధరించి రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న విద్యార్థినిని, స్థానికులు, పోలీసులు చూస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. చదవండి: అతీఖ్ హంతకుల జైలు మార్పు ఇక ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన రెండు రోజులకే ఈ ఈ ఘటన చోటుచేసుకోవడంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు. డం రాష్ట్రంలోని శాంతి భదత్రలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వీడియోను ఆర్జేడీ ట్విటర్లో షేర్ చేస్తూ యూపీ పోలీసులు, అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పించింది. ‘ఈ చావును కూడా బీజేపీ, గోడీ మీడియా తోడేళ్లు సంబరాలు చేసుకుంటాయా అని మండిపడింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
హత్య కేసులో ఎమ్మెల్యేకు జీవితఖైదు
జలౌన్: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ ఎమ్మెల్యే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు జీవితఖైదు పడింది. 2002 నాటి హత్య కేసులో కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు, ఆయన సోదరుడికి ప్రత్యేక కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2002, ఏప్రిల్ 20న కిషన్ దుబే అనే వ్యక్తిపై దాడిచేసి చంపిన ఉదంతంలో రాజ్‌పుత్, అతడి సోదరుడు, మరో 9 మందిపై ఈ కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్, ఆయన సోదరుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.