హత్య కేసులో ఎమ్మెల్యేకు జీవితఖైదు | Samajwadi Party MLA Kaptan Singh Rajput sentenced to life imprisonment | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఎమ్మెల్యేకు జీవితఖైదు

Published Mon, Jan 5 2015 5:13 PM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

Samajwadi Party MLA Kaptan Singh Rajput sentenced to life imprisonment

జలౌన్: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ ఎమ్మెల్యే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు జీవితఖైదు పడింది. 2002 నాటి హత్య కేసులో కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు, ఆయన సోదరుడికి ప్రత్యేక కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 

2002, ఏప్రిల్ 20న కిషన్ దుబే అనే వ్యక్తిపై దాడిచేసి చంపిన ఉదంతంలో రాజ్‌పుత్, అతడి సోదరుడు, మరో 9 మందిపై ఈ కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్, ఆయన సోదరుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement