
యూపీ సర్కారు కొత్త డిజిటల్ మీడియా పాలసీ
లక్నో: సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అలాగే ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
యూపీ డిజిటల్ మీడియా పాలసీ–2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికింద దేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్టు చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మూడేళ్ల నుంచి జీవితఖైదు విధించే ఆస్కారం కలి ్పంచారు. ఇదివరకు దేశ వ్యతిరేక పోస్టులైతే ఐటీ చట్టం సెక్షన్ 66ఇ, 66ఎఫ్‌ల కింద నేరంగా చూసేవారు. అసభ్య, పరువునష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ పరువునష్టం అభియోగాలు నమో దు చేస్తారు.
ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పంచే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు (వారి ఫాలోవర్స్, స్కబ్‌్రస్కయిబర్స్‌ను బట్టి) ఎక్స్‌లో అయితే రూ. 5 లక్షలు, ఫేస్‌బుక్‌లో రూ. 4 లక్షలు, ఇన్‌స్ట్రాగామ్‌లో 3 లక్షలు గరిష్టంగా యూపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. యూట్యూబ్‌లో అయితే ఫాలోవర్లను బట్టి కేటగిరీలు విభజించి, రూ. 8 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇవి నెలవారీ చెల్లింపులు. ఎవరైనా అభ్యంతరక కంటెంట్‌ను పెడితే ఆయా సంస్థలపై కూడా చర్యలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment