posts
-
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
డిస్కంలలో 3,260 కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 2,212 జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ల (ఎలక్ట్రికల్, సివిల్)తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 600 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో తెలిపాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం. -
తప్పుడు కేసులో ఇరికించేందుకు పోలీసుల యత్నం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, కులం పేరుతో ఎవరినీ దూషించకపోయినా పోలీసులు అన్యాయంగా తనను ఎస్సీ, ఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పర్సనల్ సెక్రటరీ బండి రాఘవరెడ్డి హైకోర్టుకు నివేదించారు. బండి రాఘవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వివరించారు. వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం పేరుతో రాఘవరెడ్డిని అరెస్టుచేసేందుకు పోలీసులు వెతుకున్నారని తెలిపారు. రవీందర్‌రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేయించారన్నారు. ఆ వాంగ్మూలం పేరుతో పిటిషనర్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కూడా పోలీసులు మరో కేసులో ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా సంబంధంలేని కేసులో పిటిషనర్‌ను ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని.. రాజకీయ కక్ష సాధింçపులో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిపారు. అరెస్టు భయం ఉన్న నేపథ్యంలో ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఉన్నా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అనంతరం.. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సందీప్ వాదనలు వినిపిస్తూ, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులు సంబంధిత కోర్టుల్లోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
అల్లు అర్జున్‌పై జనసేన, టీడీపీ అనుచిత పోస్టులు
సాక్షి, అమరావతి: ప్రముఖ హీరో అల్లు అర్జున్ను కించపరిచేలా గంటల వ్యవధిలో వేలాది పోస్టులు మంగళవారం సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దీనివెనుక జనసేన, టీడీపీ ఉన్నాయని అల్లు అర్జున్ అభిమానులు పేర్కొంటున్నారు. ఒకే రకమైన కంటెంట్‌తో ‘ఆర్గనైజ్డ్’గా చేస్తేనే తక్కువ వ్యవధిలో భారీ సంఖ్యలో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అల్లు అర్జున్ను మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ పోలీసులు నోటీసు జారీ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ అల్లు అర్జున్ను అవమానించేలా ‘కన్నింగ్ స్టార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన, టీడీపీ నేతలు అనుచిత పోస్టులను వేలాదిగా వైరల్ చేశారు. కడుపుమంట చల్లార్చుకోవడానికి ఇలా ఆర్గనైజ్డ్గా హీరో అర్జున్ మీద బురదచల్లి జనసేన, టీడీపీ ఆనందిస్తున్నాయని అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయం ‘ఆర్గనైజ్డ్’గా చేసేవారు భద్రంగా ఉంటూ ఎదుటి వారిపై బురద చల్లుతున్నామని అనుకుంటారని, ఆ బురద తమకు అంటుకోదనే భ్రమలో ఉంటారని చెబుతున్నారు. ‘సొంత పవర్‌ని వదిలి అద్దె లెవన్‌కు వెళ్లినప్పటి నుంచే ఈ దరిద్రాలు’ అంటూ పోస్టుల్లో పేర్కొనడం ద్వారా ఎవరు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో అనే విషయం స్పష్టమవుతోందని అభిమానులు పేర్కొంటున్నారు.‘కర్మ సిద్ధాంతం.. దరిద్రం’ వంటి పోస్టులు అన్నీ ఒక రకంగా వేర్వేరు పేర్లతో కేవలం గంటల సమయంలో ‘ఫేస్బుక్’ తోపాటు ‘ఎక్స్’లోనూ ప్రత్యక్షం కావడంపై ఇదంతా కేవలం ఉద్దే«శపూర్వకంగా రాజకీయ పార్టీలు చేస్తున్న పనేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని.. వాటికి సెక్షన్–111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే రెండు వేర్వేరు సందర్భాల్లో స్పష్టంచేసింది. అసలు ఏ సందర్భంలో బీఎన్ఎస్ సెక్షన్–111 (వ్యవస్థీకృత నేరం) వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్‌ను పెడుతున్న కేసుల్లో పలువురు మేజి్రస్టేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మేజి్రస్టేట్లు ఆ రిమాండ్ రిపోర్టుల పట్ల సంతృప్తి వ్యక్తంచేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సులభంగా బెయిల్ రాకూడదనేతెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చంది మొదలు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా పోలీసులు వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సులభంగా బెయిల్ రాకుండా చేసేందుకు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ సెక్షన్–111 కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి.. ఇప్పుడు ఎవరిపై అయితే కేసులు నమోదు చేశారో వారికి ఈ సెక్షన్ వర్తించదని పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ, రాజకీయ కారణాలతో వారు తప్పుడు కేసులు నమోదుకు వెనుకాడటంలేదు. సెక్షన్–111 వర్తించాలంటే.. భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. ఓ నిందితునికి సెక్షన్–111 వర్తించాలంటే, ఆ వ్యక్తిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్ దాఖలై, అందులో కనీసం ఒక్క చార్జిషీట్నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పులు కూడా స్పష్టంచేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో ఎవ్వరిపై కూడా గత పదేళ్లలో కనీసం రెండు చార్జిషీట్లు దాఖలై, అందులో ఒక దానిని కోర్టు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేనేలేవు. కాబట్టి.. సోషల్ మీడియా పోస్టులపై ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారికి సెక్షన్–111 వర్తించే అవకాశమేలేదు. ఇదే కారణంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ను తప్పుపట్టింది. సోషల్ మీడియా కేసులకు ‘111 సెక్షన్’ వర్తించదు» కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి » మేమేజిస్ట్రేట్లు సైతం ఈ కేసుల్లో రిమాండ్ తిరస్కరిస్తున్నారు » సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు » యథేచ్చగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన » ‘బీఎన్ఎస్ 111’ కేసులపై క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం » ప్రైవేటు కేసులతో పోలీసులను న్యాయస్థానంలో నిలబెడతాం » వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మలసాని మనోహర్రెడ్డిసాక్షి, అమరావతి : రాష్ట్రంలో చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను టీడీపీ కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిపై పోలీసులు బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని.. నిజానికి, ఈ సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని ఆయనన్నారు. అయినా కూడా పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే.. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏపీ పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపేందుకే బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను వారిపై అక్రమంగా బనాయించి వేధిస్తోంది. సాధారణంగా ఈ సెక్షన్‌ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వా«దీనం.. సుపారీలు తీసుకుని హత్యలు చేయడం, ఆరి్థక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారు. అలాగే, ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి.. ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్‌ను వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ, కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభంశుభం తెలియని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ సెక్షన్‌ను బనాయించి వారిని ఎక్కువ కాలం జైళ్లలో నిర్బంధించే కుట్రలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇప్పటికే ఎంతోమందిని జైళ్లకు పంపారు. ఈ అక్రమ నిర్బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ప్రభుత్వం, పోలీసులు తెలుసుకోవాలి. ప్రైవేట్ కేసులు వేస్తాం.. ఈ నేపథ్యంలో.. ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ఈ కేసులు బనాయిస్తున్న అధికారులపైన న్యాయస్థానాల్లో పోరాడుతాం. అర్థరాత్రి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించడాలు, నెంబర్లు లేని వాహనాల్లో మఫ్టీలో వచ్చి అపహరించడం.. కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం, అరెస్టు చూపకుండా.. ఆచూకీ చెప్పకుండా వారిని వేధించడం, రోజుకో పోలీస్‌స్టేషన్‌కి తిప్పడం.. ఇలా పది రోజులపాటు తిప్పిన సందర్భాలున్నాయి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి కార్యకర్తల ఆచూకీ తెలుసుకున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందర్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రైవేట్ కేసులు వేసి వీటితో సంబంధమున్న ప్రతి పోలీస్ అధికారిని కోర్టులో ముద్దాయిగా నిలబెడతాం. మా దారిలోకి రాకపోతే ఏమైనా చేస్తామనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఆఖరికి జడ్జీలపై నిఘా పెట్టే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. న్యాయవాదులుగా మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం. -
ప్రశ్నిస్తే పనిపడతా!
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ఇప్పుడు పార్టీలోని ఇద్దరు బీసీ నేతల మధ్చ చిచ్చు పెట్టారు. సుదీర్ఘ కాలం నుంచి తనకు బలమైన మద్ధతుదారుగా ఉన్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను జీర్ణించుకోలేక ప్రశ్నించడంతో ఆయనపైకి మరో సీనియర్ నేత, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను ఉసిగొల్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియా కూడా యనమలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయి ఆరోపణలతో ట్రోల్ చేస్తోంది. దీనికంతటికీ కాకినాడ పోర్టు వ్యవహారంలో చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా యనమల రామకృష్ణుడు ఆయనకు లేఖ రాయడమే కారణం. కాకినాడ పోర్టుకు చెందిన కేవీ రావు చౌదరికి చంద్రబాబు మద్దతు పలుకుతూ రాజకీయంగా ఆయన్ను పావులా వాడుకుంటున్నారు. కానీ యనమల మాత్రం తాను రాసిన లేఖలో కేవీ రావు చౌదరి కాకినాడ సెజ్ భూముల ద్వారా వేల కోట్ల లబ్ధి పొందారని.. బీసీ, మత్స్యకార రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తనను ధిక్కరిస్తూ లేఖ రాయడంతో చంద్రబాబు.. యనమలను ప్రశ్నించకుండా ఇతర బీసీ నేతలను ఆయనపైకి ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రెడ్డి సుబ్రహ్మణ్యం బహిరంగంగా యనమల రామకృష్ణుడిపై ఆరోపణలు గుప్పించారు. 40 ఏళ్లుగా యనమల బీసీల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు పదవి ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు తోడుగా మరికొందరు కింది స్థాయి నేతలు కూడా యనమలపై విమర్శలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అయితే యనమల పార్టీలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయి ఆడేసుకుంటోంది. చంద్రబాబుకు తెలియకుండానే తిడతారా?పార్టీలో తన స్థాయి ఉన్న ఒక సీనియర్ బీసీ నాయకుడిని, మరో సీనియర్ బీసీ నాయకుడు బహిరంగంగా తిట్టారంటే అందుకు చంద్రబాబు పరోక్ష అనుమతి కచ్చితంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యనమలకు వ్యతిరేకంగా పార్టీలోనే ఇంత జరుగుతున్నా, చంద్రబాబు స్పందించక పోవడాన్ని బట్టి ఆయన అభిమతం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కొందరు బీసీ నేతలు యనమలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ఆది నుంచి తోడు, నీడగా ఉన్న నాయకుడిని ఇలా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పార్టీలోనే బీసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడినా, చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనలాంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికితోడు కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో కేవీ రావు చౌదరికి అనుకూలంగా వ్యవహరించడం, రాజ్యసభ స్థానాలను లాబీయిస్టులకు కట్టబెడుతుండడంతో తట్టుకోలేక ఆయన తొలిసారిగా చంద్రబాబును ధిక్కరించి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం నుంచి చంద్రబాబుతో కలిసి పని చేసిన యనమల లాంటి నాయకుడు తిరుగుబాటు స్వరం వినిపించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. -
మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేసు నమోదు చేయాలి.. ‘బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన 14 రోజుల్లో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిని తప్పుడు ఫిర్యాదు అని ధ్రువీకరించాల్సి ఉంటుంది. కానీ, గుంటూరు పోలిసులు మా ఫిర్యాదులపై ఎలాంటి కేసులు నమోదుచేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారు. జిల్లా ఎస్పీని కలిసి కిందిస్థాయి పోలీస్ సిబ్బంది మా ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. మీరైన చర్యలు తీసుకోవాలని కోరాం.ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదుచేస్తే దర్శకులు రాంగోపాల్‌వర్మ, పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా కేసులు నమోదుచేసి వారిని జైళ్లల్లో కూడా పెట్టారు. మాజీ మంత్రిని అయిన నేను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదు? దీనిపై కోర్టులను ఆశ్రయిస్తాం. పోలీసుల తీరును వ్యవస్థలు గమనించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం.ఈ నిరసన స్థానిక పోలీసుస్టేషన్ల వద్దగాని, ఎస్పీ కార్యాలయం వద్దగాని, డీజీపీ కార్యాలయం వద్దగాని ఉంటుంది. పోలీసులు మా ఫిర్యాదులపై స్పందించకపోతే మా ముఖ్య నాయకులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన తెలియజేస్తాం. అలాగే, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం’ అని అంబటి చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సీడీ భగవాన్, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు
-
కమిషన్ వచ్చాకే వర్సిటీల్లో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు వర్సిటీల్లో నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని విధివిధానాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. కమిషన్ ఏర్పాటై, విధివిధానాలు ఖరారైన తర్వాతే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేయడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కమిషన్ విషయంలో కొన్ని చట్టపరమైన సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.నియామకాలెప్పుడో..?కాలేజ్ సర్వీస్ కమిషన్ కొత్తదేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లోనే దీన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యారంగ నిపుణులతో ఇది ఏర్పడుతుంది. అయితే 2000 సంవత్సరం వరకు పనిచేసిన కమిషన్ అప్పట్లో ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలకే పరిమితమైంది. తర్వాత దీనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఆయా వర్సిటీల వీసీల నేతృత్వంలో జరుగుతుండగా.. 2014–2022 మధ్య యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు.దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో 2022 సెప్టెంబర్ 12న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నియామకాలు చేపడుతుండటం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని, అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు నియామకాలు అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అప్పట్నుంచీ కూడా బోర్డు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర కలిపి 3 వేలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తేడా ఏంటి?ప్రభుత్వ నిర్ణయంతో కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు, కాలేజ్ సర్వీస్ కమిషన్‌కు తేడా ఏంటనే చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితం కాలం చెల్లిన కమిషన్‌ను ఎందుకు తెస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలంటే..తొలుత వర్సిటీలు ఖాళీలను వెల్లడిస్తాయి. అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. మెరిట్ ఆధారంగా బోధన, బోధనేతర సిబ్బందిని ఎంపిక చేసి వర్సిటీలకు సిఫారసు చేస్తుంది. ఇందులో వీసీల ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇక సర్వీస్ కమిషన్‌కు వచ్చేసరికి ఖాళీలను కమిషనే గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ వీసీ ఇందులో సభ్యులుగా ఉంటారు. నియామకాల ప్యానెల్‌లోనూ వీసీ ఉంటారు. కాబట్టి వీసీల పెత్తనానికి అవకాశం ఉంటుంది. అయితే వీసీలు అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీసీ పెత్తనానికి అవకాశం ఉన్న కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చర్చనీయాంశమవుతోంది. కమిషన్ ఎలా చెల్లుతుంది?కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు చట్టపరమైన సమస్యలను పరిశీలించాలి. వర్సిటీలు యూజీసీ పరిధిలో ఉంటాయి. యూజీసీ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయకుండా కమిషన్ ద్వారా వర్సిటీల అధ్యాపకులను నియమించడం చట్టపరంగా ఎలా చెల్లుతుంది? – ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ (పూర్వ కాలేజ్ కమిషన్ సభ్యుడు)ఏదో ఒక సాకుతో జాప్యం సరికాదుబోర్డును రద్దు చేస్తారో..కాలేజ్ సర్వీస్ కమిషన్‌ను తెస్తారో..ఏదో ఒకటి చేసి తక్షణం యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాలి. ఏ విధానంలోనైనా లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుని వెళ్ళాలి. ఏదో ఒక సాకుతో నియామకాల్లో జాప్యం సరికాదు. – ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ)నియామకాలు చేపట్టకపోతే కష్టంవర్సిటీల్లో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఇది విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోర్డును రద్దు చేసి, కమిషన్ తీసుకొచ్చినా ఇబ్బంది లేదుగానీ, తక్షణమే నియామకాలు చేపట్టకపోతే వర్సిటీల మనుగడకే ప్రమాదం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) -
వైద్య, ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కొలువుల జా తర కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా...మరో 6,500 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీ సర్ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనం అని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొంది. నవంబర్ 23న ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా 732 ఫార్మసిస్ట్ పోస్టులు: గత నెల 24న 633 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖా స్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టు ల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచి్చంది. నవంబర్ 30న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీలవారీగా ఖాళీల సం ఖ్యను బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov. in/MHSRB/home.htm లో అందుబాటులో ఉంచారు. -
గనుల శాఖలో బదిలీల ‘వేలం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖలో బదిలీల పర్వం కనక వర్షం కురిపించే కామధేనువులా మారింది. నిబంధనలతో పని లేకుండా.. ఎవరు ఎంత ఎక్కువ ముట్టజెపితే వారికే కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు వేలం నిర్వహిస్తున్న వైనం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సాక్షాత్తూ చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి తెరవెనుక చక్రం తిప్పుతుండగా.. తెరపై సంబంధింత మంత్రి, ఆయన బంధువు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.సాధారణంగా బదిలీల ప్రక్రియను ముఖ్య కార్యదర్శి ఆమోదంతో ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన, కీలకమైన వాటికి రాజకీయంగా సిఫారసు చేసి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని సదరు మంత్రి ఆ శాఖ డైరెక్టర్‌కు నోట్ పంపడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టు బదిలీలు చేయాలనే దశ దాటిపోయి బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని డైరెక్టర్‌ను ఆదేశించడంతో గనుల శాఖలో సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 4వ తేదీన మంత్రి పేషీ కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు ఈ నోట్‌ను అధికారికంగా పంపింది. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారితోపాటు వ్యక్తిగత అభ్యర్థనలు, పరిపాలనా పరమైన అవసరాల కోసం చేసే బదిలీల జాబితాను తనకు పంపాలని అందులో స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మినరల్ రెవెన్యూ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు సహా అన్ని బదిలీ ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీలోపు తనకు పంపాలని ఆదేశించారు. వాటిని పరిశీలించి బదిలీలను తాను ఖరారు చేస్తానని మంత్రి అందులో పేర్కొన్నారు.మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలుమంత్రి నుంచి బదిలీల కోసం నేరుగా ఇలాంటి నోట్ రావడంతో ఆశ్చర్యపోయిన డైరెక్టర్ అలా చేస్తే ఇబ్బందుల్లో పడతానని భావించినట్టు తెలిసింది. అందుకే.. బదిలీలపై తనకున్న అధికారాలు, మంత్రి సూచనలు ఎంతవరకూ పాటించవచ్చనే అంశంపై న్యాయ సలహా తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత బదిలీల ప్రతిపాదనలు పంపాలని మంత్రి నుంచి నోట్ వచ్చిందని, దీనిపై ఏం చేయాలో తెలపాలని ఆయన ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని క్లారిఫికేషన్ అడిగారు.దీనిపై ఏం చేయాలోనని డైరెక్టర్, ముఖ్య కార్యదర్శి మల్లగుల్లాలు పడుతుండగానే.. చినబాబు సన్నిహితుడు రంగప్రవేశం చేసి ఏమీ ఆలోచించకుండా మంత్రి నోట్‌కి అనుగుణంగా పని చేయాలని ఆర్డర్ వేశారు. ఆయన ఆర్డర్ అనధికారిక రాజముద్రతో కావడంతో ముఖ్య కార్యదర్శి మౌనంగా ఉండిపోయారు. దీంతో బదిలీ ప్రతిపాదనల్ని మంత్రికి పంపడం మినహా డైరెక్టర్‌కి మరో మార్గం లేకుండాపోయింది.విజయవాడ హోటల్లో వేలం పాటమరోవైపు అధికారుల ప్రతిపాదనలతో సంబంధం లేకుండానే మంత్రి బంధువు ఒకరు విజయవాడలోని ఒక హోటల్లో గనుల శాఖ అధికారులు, ఉద్యోగులను పిలిపించుకుని బేరసారాలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల డీడీ, ఏడీ పోస్టుల కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతుండటంతో వారికి వేలం పాట పెట్టినట్టు చెబుతున్నారు. ఆ జిల్లాల విజిలెన్స్ విభాగాల్లోని పోస్టులకు మంచి గిరాకీ ఉండటంతో వాటినీ బేరం పెట్టారు. ప్రకాశం, అన్నమయ్య, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల డీడీ పోస్టుల కోసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు సమాచారం.ఆ జిల్లాల ఏడీ పోస్టులు కూడా రూ.కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నా ఇచ్చేందుకు పలువురు వెనుకాడటంలేదు. మిగిలిన పోస్టులకు సైతం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర నిర్ణయించి.. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారిని అక్కడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా పేరుకు మంత్రి బంధువు చేస్తున్నా తెరవెనుక మాత్రం చినబాబు సన్నిహితుడే అంతా తానై నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వేలం పాటలో ఎక్కువ ముట్టజెప్పుకున్న వారిని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత ప్రతిపాదనల ఫైలు తనకు పంపాలని మంత్రి డైరెక్టర్‌కు నోట్ పంపినట్టు స్పష్టమవుతోంది. -
1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుందని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వయో పరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు రెండు, మూడు సెషన్లో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. » మొత్తంగా 1,284 పోస్టులుండగా, అందులో 1,088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. » ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పేస్కేల్ రూ.32,810– రూ.96,890. » ఎంఎన్‌జే ఆస్పత్రిలోని పోస్టులకు పేస్కేల్ రూ.31,040–రూ.92,050. ముఖ్యాంశాలు...»అన్ని పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయి. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. » ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 » మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » విద్యార్హతలు: అభ్యర్థులు ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు చేసి ఉండాలి. ఎంఎల్ ఒకేషనల్, ఇంటర్మీడియట్లో ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారూ అర్హులే. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నిïÙయన్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు » పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజీ మార్కులొస్తాయి. » నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజీ కటాఫ్ తేదీగా నిర్ణయించారు. » కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధ్రువీకరణపత్రాన్ని వారు విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి. » మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb. ్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్ కార్పొరేషన్ లిమిడెట్ సోమవారం ఎంప్లాయ్మెంట్ నోటీసు జారీ చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను పెంపొందించాలని, సోషల్ మీడియా ఖాతాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్‌లో పేర్కొంది. వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థాయిలో అనుభవం గడించిన వారు వైస్ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తుకు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
దేశ వ్యతిరేక పోస్టులకు జీవితఖైదు!
లక్నో: సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అలాగే ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. యూపీ డిజిటల్ మీడియా పాలసీ–2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికింద దేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్టు చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మూడేళ్ల నుంచి జీవితఖైదు విధించే ఆస్కారం కలి ్పంచారు. ఇదివరకు దేశ వ్యతిరేక పోస్టులైతే ఐటీ చట్టం సెక్షన్ 66ఇ, 66ఎఫ్‌ల కింద నేరంగా చూసేవారు. అసభ్య, పరువునష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ పరువునష్టం అభియోగాలు నమో దు చేస్తారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పంచే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు (వారి ఫాలోవర్స్, స్కబ్‌్రస్కయిబర్స్‌ను బట్టి) ఎక్స్‌లో అయితే రూ. 5 లక్షలు, ఫేస్బుక్లో రూ. 4 లక్షలు, ఇన్‌స్ట్రాగామ్‌లో 3 లక్షలు గరిష్టంగా యూపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. యూట్యూబ్‌లో అయితే ఫాలోవర్లను బట్టి కేటగిరీలు విభజించి, రూ. 8 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇవి నెలవారీ చెల్లింపులు. ఎవరైనా అభ్యంతరక కంటెంట్‌ను పెడితే ఆయా సంస్థలపై కూడా చర్యలుంటాయి. -
క్రికెటర్ల హ్యాపీ రక్షాబంధన్.. ఫొటోలు
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇదిగో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించిన జాబ్ కేలండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ కేలండర్‌ను శాసనసభకు సమరి్పంచారు. రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టుల కేటగిరీలు, నోటిఫికేషన్లు జారీ చేసే నెలలు, పరీక్షలు నిర్వహించే నెలలు (తాత్కాలిక ఖరారు), రిక్రూటింగ్ ఏజెన్సీలు, పోస్టులకు అర్హతలను కేలండర్లో సవివరంగా తెలియజేశారు.ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్ పరీక్షల వివరాలతో పాటు భవిష్యత్తులో విడుదల చేయబోయే గ్రూప్ పరీక్షల వివరాలు, వివిధ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టులు, టీచర్లు, లెక్చరర్లు ఎస్ఐలు తదితర పోస్టుల భర్తీ, టెట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే విభాగాల పేర్లను పేర్కొన్నప్పటికీ ఖాళీల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో దీనిపై క్లుప్తంగా ప్రకటన చేశారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం ‘నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ కేలండర్ ప్రకటిస్తామని ముందే చెప్పాం. ఆ విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రావడం, రద్దు కావడం లేదా వాయిదా పడటం, పరీక్షలు జరిగితే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల తేదీలు ఓవర్లాప్ లాంటి వాటితో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్–1 పరీక్ష రెండుసార్లు రద్దయింది.2023 మార్చి 17న పేపర్ లీక్ కావడంతో, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయింది. అధికారంలోకి రాగానే రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి.. యూపీఎస్సీ చైర్మన్‌ను సంప్రదించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ విధానాలను అధ్యయనం చేíసింది. అనంతరం కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గ్రూప్–1 నోటిఫికేషన్లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశాం.ఫలితాలు ప్రకటించాం. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశాం. మొత్తంగా 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుంది. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. గ్రూప్–1, గ్రూప్ 2, గ్రూప్–3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేశాం. ఈ నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో జాబ్ కేలండర్ గురించి చర్చించి ఆమోదించాం..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. అబిడ్స్‌లో అమ్మే కేలండర్‌లా ఉంది: బీఆర్ఎస్ జాబ్ కేలండర్ విడుదలపై భట్టి విక్రమార్క ప్రకటన చేయగానే, తమకు స్పందించే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ స్పీకర్‌ను కోరారు. మంత్రులు చేసే స్టేట్మెంట్లపై స్పందించేందుకు వీలుండదంటూ స్పీకర్ తిరస్కరించారు. దీంతో జాబ్ కేలండర్పై తమకు అసంతృప్తి ఉందని, దానిపై కొంత స్పష్టత అవసరముందని, తనకు మాట్లా డేందుకు అవకాశం కలి్పంచాలని కేటీఆర్ కోరారు. డిప్యూటీ సీఎం భట్టి లేచి శాసనసభ రూల్ బుక్‌లో నిబంధన చదివి వినిపించారు. మంత్రులు స్టేట్మెంట్ ఇచి్చన తర్వాత దాని పై ప్రశ్నలు, వివరణలకు వీలులేదని చెప్పారు.దీంతో స్పీకర్ తదుపరి అంశాన్ని చేపట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు పలువురు కేటీఆర్‌కు మద్దతుగా పోడియం వద్దకు వెళ్లి తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగా రు. అది జాబ్ కేలండర్‌లా లేదని, అబిడ్స్‌లో విక్రయించే సాధారణ కేలండర్‌లా ఉందంటూ ఎద్దేవా చేశారు. అప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌన్సిల్‌కు వెళ్లిపోవడంతో ఆయన వచ్చిన తర్వాత అవకాశమిస్తానని స్పీకర్ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోకుండా చాలాసేపు పోడియం వద్దనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. -
వైద్యశాఖలో నియామకాలకు బ్రేక్!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా గత ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియను నిలిపివేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా జీరో వేకెన్సీ (ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ) పాలసీని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూనే, రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచి్చంది. ఐదేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే ఏకంగా 54 వేల పోస్టుల భర్తీని చేపట్టింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీకి తిలోదకాలు ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైద్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త వైద్య కళాశాలల్లో అవసరాల కోసం వివిధ రకాల 380 పోస్టులను డీఎంఈ పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేయగా.. ఈ పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీíÙయన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిల్లో నోటిఫికేషన్లు జారీ చేశారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 200 నుంచి 250 పోస్టుల చొప్పున మూడు వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టాల్సి ఉంది. దరఖాస్తులను సైతం స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు.అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చంది. దీంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ పూర్తయింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. వైద్య సేవలపై ప్రభావం స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నిలిచిపోయి ఆస్పత్రుల్లో సరిపడా నర్సులు లేక వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయి. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసిన మదనపల్లె ఆస్పత్రిలో కేవలం 30, పాడేరు ఆస్పత్రిలో 39 మంది నర్సులు మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. పాడేరులో ఉన్న వారిలో ముగ్గురు ప్రసూతి సెలవులో ఉన్నారు. 200 మంది నర్సులు ఉండాల్సిన ఈ ఆస్పత్రుల్లో ఐదో వంతు కూడా లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడంలేదు. పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో సేవల కల్పనపై ప్రభావం పడనుంది.కూటమి కక్ష సాధింపు మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాల్సిన పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్‌లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు గత నెలలో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. గత నెల 6వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులందరు ఆరోజు ఆర్డీ కార్యాలయాల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని ఆదేశించింది. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. ఎంపిక జాబితాలు కూడా విడుదల చేసినా పోస్టింగ్‌లు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో వీరు ఎంపికయ్యారనే రాజకీయ కక్షతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఒకవేళ నియామక ప్రక్రియను నిలిపివేస్తే అభ్యర్థులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.టీడీపీ నేత అభ్యంతరమే కారణం! ఉన్నట్టుండి కౌన్సెలింగ్ రద్దు చేయడానికి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పారీ్టకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభ్యంతరం చెప్పడమే కారణమని సమాచారం. గత ప్రభుత్వం నిర్వహించిన నియామక ప్రక్రియలో ఎంపికయ్యారనే అక్కసుతోనే ఈ ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై ఒత్తిడి తెచి్చనట్లు తెలిసింది. కౌన్సెలింగ్ వాయిదా వేసి నెల గడిచినా పోస్టింగ్ ఉత్తర్వులపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. -
హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.న్యాయమూర్తులు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన న్యాయమూర్తుల పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ తరువాత పంజాబ్, హరియాణ హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు, బాంబే హైకోర్టులో 25 న్యాయమూర్తుల పోస్టులు, కోల్కత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో 16, ఏపీలో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది.ఉత్తరప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 1,250 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గుజరాత్లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 535 న్యాయమూర్తుల పదవులు, బిహార్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 467 జడ్జిల పోస్టులు, తమిళనాడులో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 334 న్యాయమూర్తుల పోస్టులు, రాజస్థాన్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 300 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంది. ఏపీలో జిల్లాలు, సబారి్టనేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. -
కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు 21 విభాగాల్లో 380 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25 విద్య సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కళాశాలలను ప్రారంభించనున్నారు. కళాశాలకు 222, బోధన ఆస్పత్రికి 484 చొప్పున గతంలోనే కొత్త పోస్టులను మంజూరు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచడంలో భాగంగా తాజాగా మరో 380 పోస్టులను మంజూరు చేశారు. 60 ప్రొఫెసర్, 85 అసోసియేట్ ప్రొఫెసర్, 75 అసిస్టెంట్ ప్రొఫెసర్, 160 ఎస్ఆర్/ట్యూటర్ పోస్టులకు కొత్తగా మంజూరు చేసిన వాటిలో ఉన్నాయి. కాగా, 2024–25 విద్య సంవత్సరంలో ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం 130 మంది ట్యూటర్, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నియామక ఉత్తర్వులిచ్చింది. కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను డీఎంఈకి అందజేయగా వీరికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. -
చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేస్తోందని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కించపరిచేలా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈవో స్పష్టం చేశారు. సీఈవోకు ఫిర్యాదు చేసిన వారిలో లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మద్దాళి గిరి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎ.నారాయణమూర్తి, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఉన్నారు. -
సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139, మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్) పోస్టులు 2, మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30, సబ్–ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నా యి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దర ఖాస్తులను స్వీకరించనున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్ (https://scclmin es.com) లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం సూచించింది. -
డీఎస్సీ వచ్చేసింది
సాక్షి, అమరావతి: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ అర్హతలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11,12లతో పాటు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వెనువెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. 2022 తర్వాత బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పని చేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు. 2018 నిబంధనలే అమలు డీఎస్సీ 2024లో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని, 2018 డీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న విధివిధానాలు, అర్హతలనే ఖరారు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితి విధించారు. డీఎస్సీ ఎంపికలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌కు 80 శాతం, ఏపీ టెట్/సీటెట్కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కు రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని, ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. మార్చి 15 నుంచి 30వతేదీ వరకు రెండు సెషన్స్‌లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. డీఎస్సీ 2024కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ, సందేహాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. అర్హతలు, నియామకాలపై జీవోలు డీఎస్సీ 2024 విద్యార్హతలు, నియామకాలకు సంబంధించి వేర్వేరుగా జీఓలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జీవో నం.11లో ఉపాధ్యాయ నియామక వివరాలు, జీవో నం.12లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచామన్నారు. మార్చి 5వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందిన దరఖాస్తుల ఆధారంగా మిగతా కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామని వెల్లడించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (9505619127, 9705655349) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని, అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాలల మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ కె.భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిత, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ.. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు. నాడు అలా.. నేడు ఇలా.. గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. -
పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్‌కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జడా శ్రవణ్‌కుమార్, ఆర్.వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని జాబ్‌చార్ట్ చెబుతున్నప్పటికీ, వాస్తవరూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి.వి.ఎస్.కిషోర్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు, వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీసు సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడమే వారి ప్రధాన బాధ్యతని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్ వర్గానికి మాత్రమేగాక, అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్‌ను కొట్టేసింది. -
TS: ఎవరికి వారే.. మంత్రి పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్
సాక్షి, ఢిల్లీ: మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. డీకే శివకుమార్‌ను కలిసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంత్రి పదవిని ఇస్తే తీసుకుంటా.. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశా.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శ్రీధర్‌బాబు తెలిపారు. అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలని ఖర్గే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు -
హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్లో ‘ఎత్తు’ విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజా నోటిఫికేషన్ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ‘ఎత్తు’ పరీక్ష నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించిన కొలతలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తాము ప్రతిపాదించిన విధంగా ఎత్తు కొలిచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు.. ఎస్సై నియామక ప్రక్రియలో భాగమైన దేహదారు ఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలి చిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై శుక్రవారం జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఎత్తు కొలిచామని ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్ కిషోర్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఈ పరీక్షలో పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు. అయితే, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. 2018లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాజా నోటిఫికేషన్లో ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ పర్యవేక్షణలో హైకోర్టు ప్రాంగణంలోనే మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
న్యాయమూర్తులపై పోస్టులు.. 26 మందికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పలువురు టీడీపీ నేతలు సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబుకు రిమాండు విధించడంతోపాటు, కేసు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చినందుకు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలువురు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. వీరిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణతో పాటు మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, ఆనంద్, కిషోర్ కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. గూగుల్ ఇండియా, ట్విటర్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించింది. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులు పెట్టిన ప్రతివాదుల ఫేస్బుక్ అకౌంట్ల అసలు యజమానులను గుర్తించాలని, వారికి నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. తమ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కి వాయిదా వేసింది. ఏజీ దృష్టికి దుష్ప్రచారం.. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆ క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, ఇతరులు సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెద్ద ఎత్తున పెట్టారు. వారిని కులం పేరుతో దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది డాక్టర్ వసంత్ కుమార్ లిఖితపూర్వకంగా ఏజీ ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు న్యాయవాది ఎం,సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను కూడా ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు, కామెంట్లు పెట్టిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఈ లేఖలను పరిశీలించిన ఏజీ శ్రీరామ్ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారినీ ప్రతివాదులుగా చేర్చారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేలా.. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయాధికారి ప్రతిష్టను దిగజార్చేలా పలువురు పోస్టింగ్‌లు, కామెంట్లు పెట్టారని తెలిపారు. టీవీ చర్చల్లో కూడా అడ్డగోలుగా మాట్లాడారని వివరించారు. కోర్టు ప్రతిష్టను దిగజార్చాలన్న దురుద్దేశంతోనే వారంతా అలా చేశారన్నారు. ఆ పోస్టులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా న్యాయమూర్తులపై ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు రిజిస్ట్రార్ పంపిన లేఖ మేరకు క్రిమినల్ ధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతినిచ్చారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు సైతం సుమోటోగా విచారణ జరిపిందన్నారు. ఆ తరువాత ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీఐడీకి సైతం అప్పగించిందని తెలిపారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
జీ-20 సమ్మిట్: చెహ్లం ఊరేగింపునకు మతం రంగు..
ఢిల్లీ: జీ-20 వేడుకలకు ముందు జరిగిన చెహ్లం ఊరేగింపునకు మతం రంగు పూస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పుకార్లు అవాస్తవాలని స్పష్టం చేశారు. జీ-20 వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా.. బుధవారం ఢిల్లీలో చెహ్లం ఊరేగింపు జరిగింది. దీనిపై ప్రపంచస్థాయి వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వీటిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెహ్లం ఊరేగింపులో కొన్ని మతపరమైన నినాదాలు వినిపించినట్లు, అభ్యంతకరమైన భాషను వాడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీ-20 వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారా..? అంటూ ప్రచారం కల్పిస్తూ పోస్టులు వెలువడ్డాయి. FALSE NEWS: Some social media handles are wrongly projecting videos of Chehlum procession,as communal protest before G-20 Summit.The Chehlum procession is traditional one and carried out with due permissions from the law enforcing agencies. Please do not Spread rumors.#DPUpdates — Delhi Police (@DelhiPolice) September 7, 2023 దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఢిల్లీ పోలీసులు..' అవన్నీ అవాస్తవాలు. చెహ్లం ఊరేగింపు, జీ-20 ముందు మతపరమైన ఊరేగింపు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చెహ్లం వేడుక సాంప్రదాయంగా, అనుమతుల మేరకు జరుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దు.' అని పేర్కొన్నారు. చెహ్లం పండగను ఢిల్లీలో షియా ముస్లింలు బుధవారం నిర్వహించారు. మొహర్రం పండుగ పూర్తి అయిన 40వ నాడు ఈ ఊరేగింపును చేపడతారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానానికి జ్ఞాపకార్థంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీ20 సదస్సు శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వాహనాలను ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి అనుమతించరు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ట్యాక్సీలు, ఆటోలకు ఇవే ఆంక్షలు వర్తిస్తాయి. ఇదీ చదవండి: జీ20: ఎందుకు.. ఏమిటి! -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విషపూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు జగన్ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 3,295 పోస్టుల భర్తీ ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియామకాలు చేపడుతోంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీరావు ఒప్పంద ఉద్యోగులకు భద్రత కరువైందంటూ ఊహాజనిత వార్తను అచ్చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 20 వర్సిటీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వర్సిటీల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియామకాలన్నీ రెగ్యులర్ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందీ లేదు. వెయిటేజీతో భరోసా వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెయిటేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించేటప్పుడు రిజిర్వేషన్ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు. కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్ పోస్టులకు పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ వ్యత్యాసాన్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిబంధకాలుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తావిస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. -
రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఖాళీ.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే?
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది. ఇక కీలకమైన ఆపరేషనల్ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: టీడీపీ నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు -
గుడ్ న్యూస్: వీఆర్ఏల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు, ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్/చైన్‌మెన్ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై అసభ్యకర పోస్టులు ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు. యూకేలో ఉన్న ఓ మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వారిని సమర్థించడం సరికాదు టీడీపీ కార్యకర్త శ్వేతా చౌదరి దారుణంగా మాట్లాడుతోందని, ఆమెకు చంద్రబాబు మద్దతు తెలపడం సరికాదని హితవుపలికారు. సీఎం ఇంట్లో మహిళలను కించపరిస్తే ప్రతిపక్షనేత ప్రోత్సహిత్సారా? అని మండిపడ్డారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడతం చంద్రబాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు. చదవండి: సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ సోషల్ మీడియా కట్టడి అవసరం సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జులై 5న సెమినార్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఓ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెపుతూ తమ కమిషన్‌కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు, ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. -
ట్రెండీ లుక్‌లో అషు రెడ్డి అందాలు.. పర్వతాల్లో జాన్వీ కపూర్ ఫోజులు!
►అమెరికా వీధుల్లో అషు రెడ్డి అందాలు ►బ్లాక్ డ్రెస్‌లో దసరా బ్యూటీ కీర్తి సురేశ్ లుక్స్ ►పర్వత ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న దేవర భామ జాన్వీ కపూర్ ►శారీలో అందాలు ఒలకబోస్తున్న టిక్ వెడ్స్ షేరు భామ అవనీత్ కౌర్ ►బ్లాక్ డ్రెస్‌లో కాబోయే పెళ్లికూతురు పరిణీతి చోప్రా పోజులు View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) -
కొన్ని కేటగిరీలకు ఉమ్మడి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టింది. పరీక్షలను సులభతరంగా నిర్వహించే క్రమంలో అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 1 నుంచి 22వ వరకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల వారీగా తేదీలను ఖరారు చేస్తూ రూపొందించిన వ్యూహాత్మక టైమ్‌టేబుల్‌ను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఉంచింది. విద్యార్హతలు సమానమైన కేటగిరీ కొలువులకు పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. తద్వారా అభ్యర్థులు ఒక పేపర్లో అర్హత సాధిస్తే సంబంధిత పోస్టులకు అర్హత సాధించినట్లే. పేపర్ వన్, టూల్లోనే ఉమ్మడిగా.. టీఆర్‌ఈఐఆర్‌బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్ కాస్త ఒత్తిడి కలిగించే వి«ధంగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి పరీక్షలతో అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది. సులభతర పరీక్షా విధానం ఉండటంతో రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి సెషన్ కింద ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యా హ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పలు పోస్టులకు పేపర్–1, పేపర్–2లను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. పీజీ అర్హతతో ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీ కొలువులకు పేపర్–1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తున్నా రు. అంటే ఒక అభ్యర్థి ఈ మూడు పరీక్షలకు దరఖాస్తు చేసి.. కేవలం ఒకసారి పేపర్–1 పరీక్ష రాసి అర్హత సాధిస్తే మూడింటికీ పేపర్–1లో అర్హత సాధించినట్టేనన్నమాట. పీజీటీ, జేఎల్ కొలువుల పేపర్–2 పరీక్షలను కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెడగాగి (విద్యాబోధన శాస్త్రం) ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు కేటగిరీలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇక పేపర్–3 పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్ష తేదీలు ఎక్కడా క్లాష్ కాకుండా పక్కా షెడ్యూల్ తయారు చేసినట్లు వివరించారు. పరీక్షలన్నీ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఫలితాలను కేవలం నెలరోజుల్లో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న సెలెబ్రెటీస్
-
మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి కోఠీలో ఉన్న డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. మల్టీ జోన్ –1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మల్టీ జోన్ –2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మల్టీ జోన్ 1, 2 రెండింటిలోని సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అభ్యర్థులందరూ డీఎంఈ వెబ్సైట్లో పేర్కొన్న సూచనలు పాటించాలని, ఆ ప్రకారం సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. జోన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాల షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in లో ఉంచామని తెలిపారు. 1442 పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 స్పెషాలిటీలకు చెందిన 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను మెడికల్ – హెల్త్ సర్వి సెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీన ప్రకటించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని రావాలి. బోర్డుకు అందజేసిన దరఖాస్తు ఫారం కాపీ, బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన నాన్ క్రిమీలేయర్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి. సీట్ మ్యాట్రిక్స్‌ను కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శిస్తారు. ఉదయం పూట కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం సమయం కలిగిన అభ్యర్థులు 1.30 గంటల కల్లా చేరుకోవాలి. ఏ రోజు ఎవరికి కౌన్సిలింగ్? ♦ 15వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాడయాగ్నసిస్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 16వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకే జనరల్ సర్జరీ, ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ విభాగాల్లో నిర్వహిస్తారు. ♦ 17వ తేదీన మల్టీ జోన్–2 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, టీబీసీడీ, జనరల్ సర్జరీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 18వ తేదీన ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ రేడియో డయాగ్నసిస్ విభాగాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ♦ 19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మల్టీ జోన్ –1 అభ్యర్థులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి మల్టీ జోన్–2 అభ్యర్థులకు ఈఎండీ, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ ఎఈడీ, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రైనాలజీ, ఎంఈడీ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
అంగన్వాడీల్లో 243 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా–శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. (చదవండి: ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ) -
మహిళా శిశు సంక్షేమ శాఖలో 12,128 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్పారు. మహిళలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే సీఎం జగన్ ధ్యేయమని తెలిపారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. టీడీపీ హయాంలో మహిళా శిశు సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళా శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 12,128 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 4,018 పోస్టులనే భర్తీ చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం లభించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. జూన్ నాటికి ఉద్ధానం ప్రాజెక్టు పూర్తి: మంత్రి రజిని ఉద్ధానం ప్రాంతంలోని దాదాపు 8 లక్షల మందికి ప్రాణాధారమైన ఉద్ధానం మంచి నీటి ప్రాజెక్టు జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సమయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీడీపీ హయాంలో ఉద్ధానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధలు పడినా పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాంత ప్రజల కష్టాలను కళ్లారా చూసిన సీఎం జగన్ దానిపై బాగా ఆలోచించి మూల కారణమైన మంచి నీటి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. 100 కి.మీ.దూరం నుంచి మంచి నీటిని తరలించేందుకు రూ.750కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ కిడ్నీ రోగుల వైద్యం కోసం 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు రీసెర్చి సెంటర్‌ను నిరి్మస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు: మంత్రి జోగి రమేష్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 21,25,778 ఇళ్లలో 4,40,756 ఇళ్లు పూర్తయి లబ్దిదారులు ఆనందంగా గృహప్రవేశాలు కూడా చేశారన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.42,973 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గ స్థాయిలో సమీక్షిస్తూ పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరిగేలా మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ఓటీఎస్ కింద డబ్బులు కట్టిన వారికి వెంటనే ఇళ్ల పత్రాలు అందిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకంగా ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న పేదలకు ఇళ్ల కోసం త్వరితంగా భూసేకరణ చేస్తామన్నారు. -
TS: హైకోర్టులో 176 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సబార్డినేట్–50, సిస్టమ్ అసిస్టెంట్–45, ఎగ్జామినర్–17, అసిస్టెంట్–10, స్టెనో–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–2, కంప్యూటర్ ఆపరేటర్–20, ట్రాన్స్‌లేటర్–10, కోర్టు మాస్టర్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు–20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 21 నుంచి ఆన్లైన్లో వీటికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హత, వయసు, రిజర్వేషన్, భర్తీ విధానం, పరీక్ష ఫీజు తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్సైట్లో చూడొవచ్చని రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) తెలిపారు. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతల అరెస్టు
గుడివాడ రూరల్(కృష్ణా జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఫొటోలతో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతలను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ గోవిందరాజు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రభోద రాణి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ నాయకురాలు అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, మాదాల సునీత, బంటు రోజాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిపై నాన్‌బెయిల్ సెక్షన్ 505–2 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇలా ఉన్నాయి.. చదవండి: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే.. -
ఏపీ: వైద్యశాఖ నియామకాల్లో ఉమ్మడి విధానం
సాక్షి, అమరావతి: వైద్య విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. బయో మెడికల్ ఇంజినీర్, డైటీషియన్ తదితర 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్ పోస్టులను ఈ నెలలోనే భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో పబ్లిక్ హెల్త్ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాలు, పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడిగా నియామక ప్రక్రియను చేపట్టాలని జిల్లాల ఎంపిక కమిటీల (డీఎస్సీ)కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి ఈ నెలాఖరులోగా స్రూ్కటినీ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేకుండా, ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల మెరిట్ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు. ఉమ్మడి నోటిఫికేషన్‌తో అభ్యర్థులకు మేలు గతంలో డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులకు అర్హతలు ఒక్కటే అయినప్పటికీ భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవి. అభ్యర్థులు కూడా మూడు విభాగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అందుకు అప్లికేషన్ నుంచి మొదలు అన్ని దశల్లోనూ మూడుసార్లు అదనపు భారం, ప్రయాస పడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల్లోను ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులు మూడు విభాగాలకు ఒక్క దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లో ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆ విభాగాన్ని ఎంచుకునే అవకాశం వారికే కల్పించింది. ఉమ్మడి ఎంపికవిధానం ద్వారా ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు రుసుం రూ.500 కలిసి రావడంతో పాటు ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుంది. ఉమ్మడి భర్తీ ప్రక్రియ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి జిల్లా ఎంపిక కమిటీలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండే ఎంపిక కమిటీలో వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ, డీఎంఈ విభాగాలకు చెందిన అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను వీరు పరిశీలించి, రిజర్వేషన్లు పాటించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: గ్రూప్ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 110 గ్రూప్-1.. 182 గ్రూప్-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. -
హిందూ దేవుళ్ల విషయంలో అది సాధ్యం కాదా?: ట్విటర్‌కు చురకలు
సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లపై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్ సైట్‌కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్ పేజీలో కాళి మాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్ ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విటర్ అనుసరించిన తీరును ఈ సందర్భంగా ట్విటర్‌కు గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇలా హిందూ దేవుళ్లపై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్లాట్‌ఫారమ్‌లో కొంతమంది వ్యక్తులను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. అసలు ఖాతాల బ్లాక్‌ను ఎలా చేపడతారో వివరించాల’ని ట్విట్టర్‌ను ఆదేశించింది. అందరి అకౌంట్లు అలా బ్లాక్ చేయలేమని ట్విటర్ వివరణ ఇవ్వగా.. మరి ట్రంప్ అకౌంట్ ఎలా చేశారని నిలదీసింది. కంటెంట్ సున్నితమైందని, వ్యక్తులు సున్నితమైన వాళ్లని భావించినప్పుడు వాళ్లను బ్లాక్ చేశారు కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా సున్నితమైన అంశాలపై పట్టించుకోరా? ఈ తీరు సరైందేనా? అని నిలదీసింది. అభ్యంతకర కంటెంట్ విషయంలో కేసు, ఎఫ్ఆర్లు నమోదు అవుతున్నాయని ట్విటర్ తరపున సీనియర్ అడ్వొకేట్ సిదార్థ్ లుథ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఐటీ యాక్ట్ ప్రకారం.. ప్రస్తుత సందర్భంలో(కేసు విషయంలో) అకౌంట్ బ్లాక్ చేయడం సబబేనా పరిశీలించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తర్వాతి వాదనలను సెప్టెంబర్ 6వ తేదీన విననుంది ఢిల్లీ హైకోర్టు. -
East Godavari: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగవకాశాలు
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ పోస్టులకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు. చదవండి: పార్క్ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే.. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి ఇంటర్మీడియెట్, స్టెనోగ్రాఫీ లోయర్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. టైపిస్ట్ పోస్టుకి ఇంటర్మీడియట్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్మీడియెట్, టైపు, హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల కమిషన్, కోర్టు కాంపౌండ్, కాకినాడలో అందజేయాలన్నారు. -
AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత అన్న మాటకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీగా నియామకాలు చేపట్టిన, చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన పరిషత్‌లో మరో 2,588 పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ పోస్టులు సృష్టించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు కొత్తగా సృష్టించిన పోస్టుల్లో 485 డాక్టర్, 60 నర్సింగ్, 78 ఫార్మసీ, 644 పారామెడికల్ క్లాస్–4, 279 ల్యాబ్ టెక్నీషియన్, పోస్ట్‌మార్టమ్ సహాయకుల పోస్టులు 39, ఆసుపత్రి పరిపాలన విభాగానికి సంబంధించి 54 పోస్టులు ఉండగా, ఇతరత్రా పోస్టులు 949 ఉన్నాయి. వీటిలో పలు పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్సోరి్సం గ్ విధానంలో, మరికొన్ని పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైద్య, ఆరోగ్య శాఖలో 39 వేల పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టుల భర్తీ పూర్తవగా మిగిలిన పోస్టుల భర్తీ ఈ నెలాఖరుతో పూర్తికానుంది. ఇదే తరుణంలో మరో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వడం ప్రజారోగ్యానికి ప్రభుత్వం వేస్తున్న పెద్దపీటకు అద్దం పడుతోంది. -
మహిళపై అసభ్యకర పోస్టులు.. అమ్మకానికి పెడుతున్నట్లు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సులీ డీల్స్ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. -
వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్‌పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!
వాట్సాప్ గ్రూప్స్‌లో చేసే మెసేజ్స్‌పై పూర్తి బాధ్యత గ్రూప్స్ అడ్మిన్‌దేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్ విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాంబే హైకోర్డుతో ఏకీభవిస్తూ..! గతంలో బాంబే హైకోర్టు వాట్సాప్ గ్రూప్ మెసేజ్స్ విషయంలో గ్రూప్ అడ్మిన్‌ను బాద్యుడిని చేయలేమని ఇచ్చిన తీర్పును మరోకసారి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆ తీర్పును పునరుద్ఘాటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. వాట్సాప్ గ్రూప్ సభ్యులు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యులు కాదని వెల్లడించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ బాంబే హైకోర్టు కిషోర్ వర్సెస్ స్టేట్ మహారాష్ట్ర తీర్పును మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది గ్రూప్‌లో మెసేజ్ పెట్టినవారే..! వాట్సాప్ గ్రూప్స్‌లో అడ్మిన్ కాకుండా గ్రూప్ సభ్యులు చేసిన నేరంలో అతను ఎలాంటి పాత్ర పోషించనట్లయితే నిందితుడి జాబితా నుంచి తప్పక తొలగించాలని పేర్కొంది. ఒకవేళ అడ్మిన్ నేరంలో ప్రమేయం ఉన్నట్లు చూపించే సాక్ష్యాలను సేకరించినట్లయితే అతణ్ణి చట్ట ప్రకారం విచారించవచ్చని కోర్టు వెల్లడించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం..! ఆయా వాట్సాప్ గ్రూప్స్‌లోని వ్యక్తులు గ్రూప్ అడ్మిన్‌పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అడ్మిన్‌ను ఆయా సభ్యుల స్వార్థం కోసం ఇరికించే అవకాశం ఉన్నట్లు మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్ కేవలం యాడ్, రిమూవ్ చేసే అధికారాన్నే కల్గి ఉంటారని పేర్కొంది. గ్రూప్ సభ్యులు పంపే సందేశాలకు అడ్మిన్ బాధ్యత వహించలేడని పిటిషన్ పేర్కొంది. గతంలో బాంబే కోర్టు కూడా.. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు చేసే పోస్టులకు అడ్మిన్లను బాధ్యులను చేయలేమని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ పేర్కొంది. సభ్యులు చేసే తప్పిదాలకు అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమని అభిప్రాయపడింది. కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్..! కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఐటీ చట్టాలను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ న్యాయస్థానాలకు ఆశ్రయించాయి. ఈ చట్టాలతో తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. చదవండి : WhatsApp: గూగుల్ మ్యాప్స్‌లోనే కాదు..వాట్సాప్‌లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..? -
సమగ్ర శిక్షా అభియాన్‌లో పోస్టులను భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమగ్ర శిక్షా అభియాన్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏడాదిన్నరగా 704 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని ఈ పోస్టుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. శనివారం స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్షా అభియాన్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐఈఆర్పీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్ నియామకాలకు సంబంధించి 704 పోస్టులను భర్తీ చేసేందుకు 2019 జూన్ 11న నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహించింది. 2020 జనవరి 7న ఫలితాలను కూడా ప్రకటించి మెరిట్ కార్డులు కూడా జారీ చేసింది. అయితే ఫలితాలు ప్రకటించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు నియామక పత్రాలు అందజేయలేదని అభ్యర్థులు సంజయ్‌కు వివరించారు. -
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఏడీ–1 గా ఉన్న శ్రీరాం పురుషోత్తంకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం చిత్తూరు డీవైఈవోగా మరో బాధ్యతలు చేపట్టారు. తాజాగా కార్వేటినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండే శేఖర్ పుత్తూరు డీవైఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పురుషోత్తం కూడా పుత్తూరు డీవైఈవోగా కూడా వ్యవహరించాల్సి ఉంది. దీంతో మొత్తం ఒక అధికారి 5 పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం -
ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో ఇదీ పరిస్థితి: 155 పోస్టులు .. 102 ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, డాక్యుమెంట్ల ఫోర్జరీ.. ఇలా ఏవిధమై న నేరాల్లోనైనా నిందితుల గుర్తింపునకు తొలి ఆయుధంగా ఉపకరించేది వేలిముద్రలే. ఆయా కేసుల్లో దర్యాప్తు అధికారులు ముందుకు సాగేందుకు నేరం జరిగిన ప్రదేశం (సీన్ ఆఫ్ అఫెన్స్) లో, ఇతర చోట్ల వేలిముద్రల (ఫింగర్ ప్రింట్స్) సేకరణే కీలకం. ఇంత ప్రాధాన్యత ఉన్న ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఒక్క ఇన్స్పెక్టర్ కూడా లేరు రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో పనిచేసే స్టేట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (ఎస్‌ఎఫ్‌పీబీ)లో మొత్తం మంజూరు పోస్టులు 155 కాగా, ఇందులో 102 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (సీఎఫ్‌పీబీ) తాజాగా వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సంస్థ డైరెక్టర్ పోస్టుతో పాటు ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుల్లో మూడు, 39 ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను 39 ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా మంజూరైన 77 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 26 భర్తీ కాగా, 51 ఖాళీగా ఉండగా, 33 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 8 ఖాళీగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ పేర్కొంది. భర్తీ చేస్తే మరింత జోష్‌తో... తక్కువ సిబ్బందితో ఒత్తిడికి గురవుతూ ఎలాగో నెట్టుకొస్తున్న రాష్ట్ర సంస్థ.. 2020 ఏడాదికి పెం డింగ్ కేసులు లేకుండా చేయడంతో పాటు అనేక కేసుల్లో సేకరించిన వేలిముద్రలను భద్రపరిచే పని కూడా చేస్తోంది. కేంద్ర బ్యూరో కలిసి డేటా అప్డేట్ నిర్వహిస్తోంది. ఇంతటి కీలకమైన సంస్థ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే నిందితుల గుర్తింపు మరింత త్వరగా జరుగుతుందని, కేసులను మరింత త్వరగా పరిష్కరించవచ్చని సంస్థ ఉన్నతాధికారులు అంటున్నారు. వరుసగా జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. అద్భుత పనితీరుతో కేసుల పరిష్కారం సిబ్బంది తక్కువగా ఉన్నా వేలిముద్రల సేకరణ, వాటి విశ్లేషణలో మాత్రం తెలంగాణ ఎస్‌ఎఫ్‌పీబీ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ రిపోర్టు స్పష్టం చేస్తోంది. గత 2020 ఏడాదికి సంబంధించి అద్బుతమైన రీతిలో కేసులు పరిష్కరించేందుకు దోహదపడినట్లు పేర్కొంది. నల్లగొండ జిల్లా రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును నాలుగు రోజుల్లోనే ఎస్‌ఎఫ్‌పీబీ సహాయంతో పోలీసులు ఛేదించినట్లు తెలిపింది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచలో జరిగిన ఓ దొంగతనం కేసులో కూడా రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర బ్యూరో దోహదపడింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఇంటి దొంతనం కేసులోనూ ప్రతిభ చూపి వారంలోనే నిందితులను అరెస్ట్ చేసేలా తోడ్పాటు అందించింది. ఇలా ఎన్నో కేసులు ఛేదించడంలో ఎస్‌ఎఫ్‌పీబీ చురుకైన పాత్ర పోషించింది. -
పశ్చిమ గోదావరి: ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తరఫున గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ కోసం ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిస్కం పరిధిలో 398 పోస్టులను భర్తీ చేయనుండగా, వాటిలో ఏలూరు ఆపరేషన సర్కిల్ పరిధిలో 43 పోస్టులు ఉన్నాయి. వీటిలో 13 బ్యాక్లాగ్, 30 జనరల్ పోస్టులు. రెండేళ్ల కాలపరిమితికి ఎంపిక చేసే అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు వేతనంగా చెల్లించనున్నారు. అభ్యర్థులు పదోతరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్‌మెన్ ట్రేడ్‌తో ఐటీఐ లేదా రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియట్లో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్ కోర్సును పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 24లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని, అదే నెల 26 నుంచి 28 వరకు ఆన్లైన్ దరఖాస్తుల వివరాల్లో తేడాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాత పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని, అక్టోబర్ 10న ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇవీ చదవండి: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం మహిళా పూజారి దారుణ హత్య. 38 రోజుల్లో నాలుగు హత్యలు -
గూగుల్‌కు మరోసారి భారీ షాక్...!
మాస్కో: రష్యాలో విదేశీ టెక్ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్ తగిలింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు మాస్కో కోర్టు గురువారం (ఆగస్టు 19)న గూగుల్‌కు మరో జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో రష్యా విదేశీ టెక్ కంపెనీలపై నిషేధించిన కంటెంట్‌ను తొలగించనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంది.రష్యాలో నిషేధిత కంటెంట్‌లో భాగంగా అశ్లీల అంశాలు, తీవ్రవాది భావజాల పోస్ట్‌లు, డ్రగ్స్‌కు సంబంధించిన కంటెంట్ నిషేధిత జాబితాలో ఉన్నాయి. (చదవండి: Afghanistan: తాలిబన్ల నుంచి పొంచి ఉన్న మరో పెనుముప్పు..! అదే జరిగితే..అంతే సంగతులు..!) నిషేధిత కంటెంట్‌ను ప్రదర్శించినందుకు గాను గూగుల్‌పై స్థానిక కోర్టు ఆరు మిలియన్ రూబీళ్లను (సుమారు రూ. 60 లక్షలు) జరిమానా విధించింది. కాగా ఈ వారం ప్రారంభంలో ఇదే విషయంపై వేరువేరు కేసుల్లో మొత్తంగా రూ. 14 మిలియన్ రూబిళ్ల (సుమారు రూ. 1.4 కోట్లు) జరిమానాలు విధించబడ్డాయి. గతనెల డేటానిల్వ చట్టాలను ఉల్లంఘించినందుకు గత నెల గూగుల్ సుమారు 3 మిలియన్ రూబిళ్లు (సుమారు రూ. 30 లక్షలు) జరిమానా కట్టింది. ఆర్ఐఏ నోవోస్టి న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. రష్యా గూగుల్‌కు ఇప్పటివరకు 32.5 మిలియన్ రూబిళ్లు (సుమారు రూ. 3.2 కోట్లు) జరిమానాను విధించింది. రష్యన్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను రష్యాలోని సర్వర్లలో నిల్వ చేయాల్సిన వివాదాస్పద చట్టం కింద కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఇటీవల విదేశీ టెక్ కంపెనీలపై, ప్రత్యేకించి సోషల్ నెట్‌వర్క్‌లపై రష్యా ఒత్తిడి పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో క్రెమ్లిన్ క్రిటిక్ అలెక్సీ నవాల్నీను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్టుగా వ్యతిరేకంగా చేయాదల్చినా నిరసన కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా ఇచ్చిన పోస్ట్‌ను తొలగించడంలో గూగుల్ విఫలమవ్వడంతో రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో తీవ్రవాదంపై పోరాటం, ఇతర విషయాలపై రష్యా ప్రభుత్వం ఇంటర్నెట్పై నియంత్రణను కఠినతరం చేస్తోంది. (చదవండి: WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!) -
టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. 18 మందిపై కేసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న 18 మందిపై కేసులను నమోదు చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. కాగా, టీటీడీ దేవస్థానానికి చెందిన 1500 కేజీల బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పుతీసుకున్నట్లు కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం పట్ల పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే, 18 మంది నిందితులపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ: 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
-
50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండోదశలో భర్తీ చేయాలన్నారు. శుక్రవారం రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. నూతన జోన్ల ఏర్పాటుకు ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొల గి పోయాయి. నే రుగా నింపే అవకాశాలున్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయ’’ని అన్నారు. -
ఫేస్బుక్ 3 కోట్ల యూజర్లకు షాక్: ఏం చేసిందంటే..
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌పై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తమ తదుపరి నివేదికను జూలై 15న ప్రచురిస్తామని, అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలుంటాయని పేర్కొంది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 - జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో తొమ్మిది వర్గాలలోని రెండు మిలియన్ల యూజర్ల కంటెంట్‌పై ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. ఇందులో స్పామ్ (25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ (2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ఉంది. ఉగ్రవాద ప్రచారానికి సంబంధించి 106,000 పోస్ట్‌లు, విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000, వేధింపులకు సంబంధించిన కంటెంట్ 118,000 పోస్ట్‌లున్నట్టు తెలిపింది. కొత్త కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (5 మిలియన్లకు పైగావినియోగదారులతో) ప్రతి నెలా కంప్లయిన్స్ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతోపాటు, ఆన్లైన్ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను గుర్తిస్తామని తెలిపింది. -
7 కొత్త వైద్య కళాశాలల్లో 7,007 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం 7,007 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి–కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మాకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ, డీవీఎల్, సీటీ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, గాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సైకియాట్రి, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్తల్, ఓబీసీ, రేడియో డయాగ్నసిస్, అనస్తీషియా, డెంటల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫ్యూజియన్ మెడిసిన్(బ్లడ్ బ్యాంక్) స్పెషాలిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్, ల్యాబ్ టెక్నిషియన్స్/టెక్నీషియన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. తమ శాఖ నుంచి అనుమతి తీసుకుని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆర్థిక శాఖ సూచించింది. 15 నర్సింగ్ కళాశాలలకు 720 పోస్టులు రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచి ర్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, గద్వాలలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 ప్రభుత్వ నర్సింగ్ కళా శాలలతో పాటు జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గాంధీ ఆస్పత్రి నర్సింగ్ కళాశాలల కోసం 720 పోస్టులను సృష్టిస్తూ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో 15 ప్రిన్సిపల్, 15 వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 15 ఆఫీస్ సూపరింటెండెంట్, 30 సీనియర్ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. -
విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: ఆదిమూలపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021-22కు విడుదల చేసిన మొత్తం 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక, ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటికి విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మంత్రి తెలిపారు. ఇప్పుడు 2021-22 లో మొత్తం 1238 బ్యాక్ లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు ఉన్నాయి. అందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి. మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరికి చెందినవని మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు జూలై 2021లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనుండగా జనవరి 2022లో వీటికి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అవకాశాలు కల్పించటం జరుగుతుందని, దళారులు, లంచగొండితనం లేకుండా మెరిట్ మీదనే ఉద్యోగాలు దక్కటంతో అందరూ జగనన్నను అభినందిస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. చదవండి: ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు -
Andhra Pradesh: ఆరోగ్య శాఖలో మరో 7,000 పోస్టుల భర్తీ!
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7,000 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్‌ప్రొవైడర్స్) నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే 2,920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్యమిషన్ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ప్రాతిపదికన మిగతా నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ గత రెండేళ్లుగా 9,500కిపైగా శాశ్వత నియామకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉండేలా నియామకాలు పూర్తి చేశారు. వేలాది మంది స్టాఫ్ నర్సులను నియమించారు. గత ఏడాది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం ఇలా జిల్లా సంఖ్య శ్రీకాకుళం 173 విజయనగరం 187 విశాఖపట్నం 247 తూ.గోదావరి 274 ప.గోదావరి 248 కష్ణా 237 గుంటూరు 284 ప్రకాశం 204 నెల్లూరు 166 చిత్తూరు 268 కడప 172 అనంతపురం 241 కర్నూలు 219 ప్రతి క్లినిక్‌లో సిబ్బంది, మందులు ‘ఈ ఏడాది చివరి నాటికి 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎఎన్‌ఎం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి క్లినిక్‌లో మందులు అందుబాబులో ఉంటాయి. ప్రాథమిక వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతాం’ –కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో 12 రకాల సేవలు ఇవీ.. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ నవజాత, ఏడాది లోపు శిశువుల సంరక్షణ ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు యుక్తవయసు వారికి ఆరోగ్య సేవలు కుటుంబ నియంత్రణ, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా ఆయా పద్ధతులపై అవగాహన సాంక్రమిక వ్యాధులపై అవగాహన సాధారణ జ్వరాలు, తదితరాలపై ప్రజలకు వైద్య సేవలు మధుమేహం, బీపీ లాంటివి ప్రాథమిక దశలో గుర్తించేలా స్క్రీనింగ్ కన్ను, చెవి ముక్కు గొంతుæ సమస్యలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం దంత సమస్యలకు సేవలు అందించడం 60 ఏళ్లు దాటిన వారికి పాలియేటివ్ కేర్ (నొప్పి నివారణ) మందులు ఇవ్వడం అత్యవసర చికిత్సల్లో భాగంగా మెడికల్ కేర్‌పై జాగ్రత్తలు మానసిక జబ్బు లక్షణాలుంటే గుర్తించి పీహెచ్సీ, సీహెచ్‌సీలకు రిఫర్ చేయడం -
సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరు అరెస్టు
రాజుపాలెం(సత్తెనపల్లి)/గుంటూరు జిల్లా: నకరికల్లు మండలంలోని కుంకలగుంటకు చెందిన పి.అశోక్, జి.నిరీక్షణరావును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వీరిద్దరూ ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉదయ్‌బాబు బుధవారం కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. -
పోస్ట్‌మ్యాన్ నిర్వాకం.. రెండేళ్లుగా
సాక్షి, బాన్సువాడ: సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. అయితే, బట్వాడా చేయకుండా రెండేళ్లుగా 7 వేల ఉత్తరాలను మూలన పడేశాడో పోస్ట్‌మ్యాన్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ సమీపంలోని తన బంధువులకు చెందిన ఓ హోటల్ గదిలో 12 సంచుల్లో పోస్ట్‌మ్యాన్ బాలకృష్ణ ఉత్తరాలను పడేశాడు. తమకందిన సమాచారంతో ఈ బాగోతం బయటపడిందని, శనివారం ఆ ఉత్తరాలను స్వాధీ నం చేసుకున్నామని, ఇందుకు బాధ్యుడైన బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు ఏఎస్పీ రాజనర్సాగౌడ్ తెలిపారు. చదవండి: పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు.. -
12 వేల వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయ్యాయి. దీంతో వాటన్ని టినీ భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఖాళీలను ప్రతి 6నెలలు లేదా ఏడాదికో సారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే, మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ‘6 నెలలుగా వైద్య, ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేసింది. ప్రజల్లో భరోసా నింపింది. వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కోవిడ్ సందర్భంగా ఏర్పడింది. రానున్న కాలంలో ఆయా సదుపాయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆరేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖ అనేక విజయాలు సాధించింది. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం మొదలు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయి.. వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలకే ముందుగా కరోనా వ్యాక్సిన్: ఈటల వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈటల మాట్లాడారు. వైద్యశాఖపై ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ‘సబ్ సెంటర్ల స్థానంలో వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేస్తాం. ఆరోగ్య శ్రీ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఖర్చు చేస్తుంది. ఆరోగ్యశ్రీలోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స కోసం రూ.30 లక్షల ఖర్చవుతుంది. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికీ రూ.40 కోట్లు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించాం. కేన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీపైనా సీఎంకు ఉపసంఘం ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది. తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తాం. నవజాత శిశువుల మరణాల రేటు 39 నుంచి 27కి తగ్గింది. మాతృత్వపు మరణాల రేటు 92 నుంచి 63కు తగ్గింది. ఇది దేశంలోనే రికార్డు.. సీజనల్ వ్యాధులు తగ్గడం మిషన్ భగీరథ పథకం సాధించిన విజయం. మలేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది’అని ఈటల వెల్లడించారు. త్వరలో ప్రభుత్వ మెడికల్ షాపులు.. త్వరలో ప్రభుత్వ మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించాలని యోచిస్తున్నట్లు ఈటల తెలిపారు. ‘వైద్యం కోసం ఖర్చు చేయకుండా ప్రజావైద్యం అందించేందుకు పలు సూచనలను మంత్రివర్గ ఉపసంఘం చేసింది. ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలు ఉండగా, మరో 100 దవాఖానాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌ను ఏదైనా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో రోజుకు 10 వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 60 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 8 డయాగ్నస్టిక్ హబ్స్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న వాటితో అనుసంధానం చేస్తాం. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం మండలానికో అంబులెన్స్ సౌకర్యం ఉంది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద 118, అలాగే ప్రభుత్వం 100 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాం. మరో 20 అంబులెన్స్‌లను సీఎస్ఆర్ కింద ప్రభుత్వానికి అందాయి. మొత్తంగా 238 వాహనాలు కొత్తగా 108 సేవలను అందించనున్నాయి. పట్టణ ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. పాలియేటివ్ కేర్ సెంటర్లు ఇప్పటివరకు 8 ఉన్నాయి. మరో 2 ఏర్పాటు చేస్తాం..’అని ఈటల చెప్పారు. -
జిల్లా ఎంపిక కమిటీలో ప్రభుత్వం మార్పులు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలను పర్యవేక్షించే జిల్లా ఎంపిక కమిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ శాఖల ఉన్నతాధికారులను జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నూతనంగా బాధ్యతలు అప్పగించిన జాయింట్ కలెక్టర్లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ,వార్డు సచివాలయ జేసీలతో పాటు రైతు భరోసా, రెవెన్యూ జేసీలను కూడా జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తున్నట్లు పేర్కొంది. సంక్షేమ బాధ్యతలు చూసే మరో జేసీని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించింది. (చదవండి: సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ) (చదవండి: ‘చేయూత’తో స్వయం సమృద్ధి) -
వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ
సాక్షి, విజయవాడ: సెప్టెంబర్ 20నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సుమారు 10లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు. Village/Ward Secretariat Exams. 2020 in A. P. - It is informed to all the Applicants and others concerned, that Exams. will start from 20th September 2020. Detailed schedule will be released soon. — Gopal Krishna Dwivedi (@gkd600) August 12, 2020 -
ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ
కోయంబత్తూరు : తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్సీ, ఎంఎస్సీ,ఎంకామ్,)వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం నిన్న(బుధవారం) ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా, వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున పర్మినెంట్ జాబ్ కోసం చూస్తున్నానని చెప్పారు. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్లో 2,000 మంది పర్మినెంట్, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. -
ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్, సభ్యుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. హెచ్ఆర్సీ, లోకాయు క్తల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలతోపాటు లోకాయుక్త, ఉప లోకాయుక్త పోస్టులను భర్తీ చేసి తీరాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వాని కి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా, లెనిన్ నగర్‌కు చెందిన వెంకన్న ఈ పిల్ దాఖలు చేశారు. -
వార్డు సచివాలయ అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్
సాక్షి, అమరావతి: వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ నూతన వ్యవస్థల్లో పని చేయడానికి ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌలభ్యం కోసం గుంటూరులోని మున్సిపల్ శాఖ కమిషనర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు మొబైల్ నంబర్ 7997006763కు ఫోన్ చేయవచ్చు. మంగళవారం నుంచి ఇది పని చేస్తుందని, ప్రతీరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు దీన్ని గమనించగలరని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అంగన్వాడీలో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. స్త్రీ శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, సహాయకుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు http://wdcw.tg.nic.in/ వెబ్సైట్లో ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు గురువారం పేర్కొన్నారు. పోస్టులు ఇలా... నగరంలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 158 పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో 42 అంగన్వాడీ టీచర్లు. ఒక మినీ టీచర్, 115 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే చార్మినార్ పరిధిలో 30 పోస్టులుండగా... అందులో 5 అంగన్వాడీ టీచర్లు, 25 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. గొల్కొండ పరిధిలో 20 పోస్టులకు గాను 5 టీచర్, 15 సహాయకురాళ్లు, ఖైరతాబాద్‌లో 38 పోస్టులకు గాను 13 టీచర్లు, 25 సహాయకురాళ్లు, నాంపల్లిలో 42 పోస్టులకు గాను 13 టీచర్లు, 29 సహాయకురాళ్లు, సికింద్రాబాద్ ప్రాజెక్టులో 28 పోస్టులకు గాను 6 అంగన్వాడీ టీచర్లు, ఒకటి మినీ టీచర్, 21 సహాయకురాళ్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. 914 కేంద్రాలు.. హైదరాబాద్ జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులìæ పరిధిలో 914 కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో నాలుగైదు మండలాలు ఉన్నాయి. చార్మినార్ ప్రాజెక్టు పరిధిలో సైదాబాద్, అంబర్‌పేట, చార్మినార్, బండ్లగూడ మండలాల్లో కలిపి 257 కేంద్రాలు, ఖైరతాబాద్ ప్రాజెక్టు పరిధిలోని అంబర్‌పేట, ఖైరతాబాద్, షేక్‌పేట, బాలానగర్ మండలాల్లో కలిపి 141 కేంద్రాలు, గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని ఆసీఫ్‌నగర్, గొల్కోండ మండలాల్లో కలిపి 154 కేంద్రాలు, నాంపల్లి ప్రాజెక్టు పరిధిలోని హిమాయత్‌నగర్, బహదూర్‌పురా, నాంపల్లి మండలాల్లో కలిపి 191 కేంద్రాలు, సికింద్రాబాద్ ప్రాజెక్టు పరిధిలోని సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, ముషీరాబాద్ మండలాల్లో కలిపి 171 కేంద్రాలు ఉన్నాయి. -
పోస్టులు పెంచమంటే కొట్టిస్తారా?
గుంటూరు, అవనిగడ్డ : ‘గతంలో 23 వేలు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం.. అయినా పాలకుల్లో స్పందన లేదు. పోస్టులు పెంచమని బుధవారం సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి స్పందించకపోగా, పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారా..’ అని డీఎస్సీ అభ్యర్థులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. 2016లో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2017లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో 23 వేల పోస్టులు చూపించారు. అదే ఏడాది డిసెంబర్లో 17 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఈ ఏడాదిలో రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఇప్పుడేమో టెట్ అవసరం లేదంటున్నారని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే స్పందించకపోతే ఎవరికి చెప్పుకోవాలి.. గతంలో ప్రకటించిన విధంగా 23 వేల డీఎస్సీ పోస్టులు ఇవ్వాలని చల్లపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో శాంతియుతంగా ప్లకార్డుల ప్రదర్శన చేసినా సీఎం స్పందింకపోవడం దారుణమన్నారు. పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రే ఇలా వ్యవహరిస్తే మేమెవరికి చెప్పుకోవాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సీఎం స్పందించకపోగా రౌడీలు, గూండాల వలె తమను పలు పోలీస్ స్టేషన్లకు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోస్టులు తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 23వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రయివేట్ ఉద్యోగాలు మానుకుని వచ్చాం.. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెబితే ప్రయివేటు ఉద్యోగాలు, పనులు అన్నీ మానుకుని డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం. రెండుసార్లు టెట్ పెట్టారు. ఇప్పుడేమో అవసరం లేదంటున్నారు. అప్పులు తెచ్చి డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే ఏడు వేల పోస్టులు వేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. గతంలో ప్రకటించిన విధంగా డీఎస్సీ పోస్టులు పెంచాలి. – సీహెచ్ కిశోర్, రెడ్డిగూడెం, కృష్ణా జిల్లా -
ఐటీడీఏలో సగం పోస్టులు ఖాళీ
విశాఖపట్నం, పాడేరు: ఏజెన్సీలో గిరిజనాభివృద్ధికి మూలస్తంభంగా ఉన్న పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో సగానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గిరిజనాభివృద్ధికి కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన శాఖల్లో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1975లో ఐటీడీఏ ఏర్పడిన తరువాత ప్రధాన కార్యాలయ పరిపాలన విభాగానికి, వ్యవసాయ, ఉద్యాన వన విభాగాలకు మంజూరైన 86 పోస్టుల్లో ప్రస్తుతం 47 ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఐటీడీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో), స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎస్వో) పోస్టు ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఒకటి, డేటా ప్రాసెసింగ్ ఆపీసర్(డీపీవో పోస్టు) ఒకటి, సీనియర్ అకౌంటెంట్ల పోస్టులు– 2, సీనియర్ అసిస్టెంటు పోస్టులు–6, వ్యవసాయ అధికారి (ఏవో) పోస్టు–1, ఉద్యానవన అధికారులు(హెచ్‌వో పోస్టులు)–8, వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో పోస్టులు)–6, ఏఈవో పోస్టులు(కాఫీ)–2, టైపిస్టు పోస్టులు–4, డ్రైవర్ పోస్టులు–4, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు–4, వాచ్మెన్ పోస్టులు–2, స్టెనో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, మాలీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో అర్హులైన గిరిజన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదు. గిరిజన సంక్షేమశాఖ(విద్య)లోని పోస్టుల ఖాళీల భర్తీలోను ఏళ్ల తరబడి తాత్సారం జరుగుతోంది. ఏజెన్సీ 11 మండలాల్లో 122 ఆశ్రమ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో మంజూరైన 1997 టీచర్ పోస్టులకు గాను 181 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా 233 జీవో ప్రకారం ఈ పాఠశాలలకు కొత్తగా మంజూరైన 640 పోస్టులు భర్తీ చేయడానికి గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏజెన్సీ ఆశ్రమాల్లో 821 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, ఏటా ప్రభుత్వం 534 మంది సీఆర్టీలను నియమిస్తూ పాఠశాలలను నిర్వహిస్తోంది. 87 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు 36 ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్లుగా కొనసాగుతున్నారు. ఏజెన్సీలో కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులను కూడా అదనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఆశ్రమ వసతిగృహాల్లో కూడా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. 545 నాల్గోతరగతి ఉద్యోగుల పోస్టులకు గాను 338 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఔట్ సోర్సింగ్‌పై 248 మంది వర్కర్లను నియమించి వసతిగృహాలను నిర్వహిస్తున్నారు. 122 ఆశ్రమ వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 743 క్లాస్–4 ఉద్యోగులుండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెగ్యులర్, ఔట్సోర్సింగ్ కలిపి 455 మంది మాత్రమే. గిరిజన సంక్షేమశాఖలో వివిధ కేటగిరీల్లోకొత్తగా ఈ పోస్టులు మంజూరులోనూ తాత్సారం నెలకొంది. ఏజెన్సీలో వైద్య,ఆరోగ్యశాఖలోనూ 7,082 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్ఏ–మేల్), సెకండ్ ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, పోస్టుల్లోనూ అధికశాతం మంది గిరిజన అభ్యర్థులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. ఏజెన్సీలో ప్రధానమైన ఈ శాఖల్లో పోస్టులు భర్తీకాక ఉద్యోగావకాశాలు లభించక గిరిజన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. -
అటు అణచివేస్తూ.. ఇటు ఆర్భాటం
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ వైపు సోషల్ మీడియాపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కత్తికడుతూ వస్తోంది. అక్రమ కేసులు బనాయిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డుల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారార్భాటానికి తెరలేపింది. అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. ప్రతిపక్షానికి చెందిన సానుభూతిపరులపై ఫిర్యాదులొస్తే ఆగమేఘాల మీద స్పందించి అరెస్ట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేతపై నెటిజన్లు మండిపడుతున్నారు. అడుగడుగునా ఉక్కుపాదం: వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ని విమర్శిస్తూ నెల్లూరుకు చెందిన జెడ్ల అశోక్‌గౌడ్, అలీ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదుచేయడంతో ఉయ్యూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదుచేసి గురువారం అరెస్ట్ చేశారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు: ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఫిర్యాదు మేరకు పామర్రు పట్టణం యాదవపురానికి చెందిన గొరిపర్తి నాగబాబును అక్టోబర్ 4న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. వాళ్లే టార్గెట్: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి.శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎండగడుతుంటారు. దీంతో టీడీపీ నేతలు.. తమ కార్యకర్త ద్వారా అతనిపై గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. శ్రీనివాసరెడ్డి ఓ జాతిని కించపరిచేలా పోస్ట్ చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుడివాడ పోలీసులు శ్రీనివాసరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదుచేశారు. నెల్లూరుకు చెందిన నవీన్‌కుమార్‌పై గుంటూరులో కేసు నమోదు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన నవీన్‌కుమార్‌పై టీడీపీ నేత ఆర్.సాయికృష్ణ ఫిర్యాదు చేయడంతో మే 19న గుంటూరు అరండల్‌పేట పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరలో వందల సంఖ్యలో అరెస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఇంటూరు రవికిరణ్ అరెస్ట్‌తో ప్రారంభం: గతేడాది ఏప్రిల్‌లో ఇంటూరు రవికిరణ్ తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫేస్బుక్లో పొలిటికల్ పంచ్ పేరుతో రవికిరణ్ ఓ పేజీని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను సెటైరికల్‌గా ఆయన ఎత్తిచూపారు. దీన్ని ఓర్చుకోలేని టీడీపీ ప్రభుత్వం రవికిరణ్‌పై సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేసింది. అవార్డుల పేరుతో ప్రచారార్భాటం: ఒకవైపు సామాజిక మాధ్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు అదే సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నటీనటులకు అవార్డుల ప్రదానం పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రచారార్భాటాన్ని గతేడాది నుంచి ప్రారంభించింది. సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ పేరుతో అవార్డులు అందిస్తూ వస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అవార్డులను అందజేయడం లేదు. టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల తెరపై నోటిఫికేషన్ల డ్రామా
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ఖాళీల భర్తీపై దృష్టి పెట్టకుండా నిరుద్యోగులను నిలువునా వంచించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని మభ్యపెడుతోంది. 2 లక్షలకు పైగా ఖాళీలుండగా, కేవలం 18,450 పోస్టులనే భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. వచ్చే ఎన్నికలోలబ్ధి కోసమే ప్రభుత్వం ఆరాట పడుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూల్–7 రద్దుతో నిరుద్యోగులకు షాక్ తాము అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల దాకా ఖాళీల భర్తీ ఊసే ఎత్తలేదు. 2016 జూన్ 17న జీఓ నెంబర్ 110ను విడుదల చేసి, 10 వేల పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. అందులో 4,009 పోస్టులను ఏపీపీఎస్సీతో, 5,991 పోస్టులను పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. జీఓ 110కు సవరణల పేరిట కాలయాపన చేశారు. డిసెంబరు ఆఖరు నాటికి కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీకి అప్పగించిన వాటిలో కేవలం 2 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందుకు కారణం ఏపీపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అనుకూలంగా ఉన్న రూల్–7ను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలగించడమే. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరకపోయినా, వేరే కొలువు వచ్చి రిజైన్ చేసినా ఖాళీ అయ్యే ఆయా పోస్టులు రూల్–7తో మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు వచ్చేవి. చంద్రబాబు ఈ రూల్–7ను రద్దు చేశారు. మిగిలిపోయిన పోస్టులనే మళ్లీ కొత్త నోటిఫికేషన్లలో కలిపేస్తున్నారు. 18,450 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూల్–7ను రద్దు చేయడంతో ఈ పోస్టుల్లోనూ భర్తీ చేసేవి తక్కువే కానున్నాయి. ఎన్ని పోస్టులను కుదిస్తారో! 2016 తరువాత మళ్లీ ఒక్క నోటిఫికేషన్‌కు కూడా చంద్రబాబు అనుమతివ్వలేదు. 2 లక్షలకు పైగా ఖాళీలు ఉండగా, 70 వేలు మాత్రమే ఉన్నాయని, అందులో కేవలం 20 వేలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలంటూ ఆయా శాఖాధిపతులు పంపించిన నివేదికలను బుట్టదాఖలు చేశారు. విద్యాశాఖలో 30 వేలకు పైగా ఖాళీలుండగా, అందులో 14 వేల పోస్టుల భరీకి అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపితే తిరస్కరించారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లంటూ సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారు. కేవలం 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా అనుమతిచ్చారు. ఇందులో కూడా నోటిఫికేషన్ల నాటికి ఎన్ని పోస్టులను కుదిస్తారోనన్న అనుమానాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ ఆఖరు నాటికి గానీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం లేదు. 2019లో మాత్రమే ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది. అప్పటికింకా ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిర్దాక్షిణ్యంగా ఊస్టింగ్‌లు రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగులనే నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తప్పించింది. ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు.. ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న 1.50 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించింది.