జైళ్లశాఖలో ఖాళీల భర్తీ
డీఐజీ చంద్రశేఖర్ వెల్లడి
అవనిగడ్డ :
జైళ్లశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు. స్ధానిక సబ్‌జైలును ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఇప్పటికే 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. మరో 150 పోస్టులు ఖాళీలున్నాయని వీటిని వీలైనంత త్వరగా భర్తీకి చర్యలు చేపడతామన్నారు. స్థానిక సబ్‌జైలులో ఖైదీల సంఖ్య తగ్గడం చూస్తుంటే ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ జిల్లా సూపరింటెండెంట్ నభీఖాన్, విజయవాడ సూపరింటెండెంట్ గుణశేఖరరెడ్డి, సబ్‌జైలర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.