filled
-
త్వరలో జెన్కోలో 350 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) త్వరలో దాదాపు 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభా గాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి -
ఏం చేసేది? ఎఫ్‌సీఐకి తలనొప్పిగా మారిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలకు చోటు కరువైంది. బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉత్పత్తి పెంచడం, దీనికితోడు రా రైస్ (పచ్చి బియ్యం) వినియోగం వైపు అధికంగా మొగ్గుచూపుతుండటంతో ఇక్కడి గోదాముల నుంచి సరఫరా తగ్గి నిల్వలు పెరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా గత ఖరీఫ్‌కు సంబంధించి మరో ఐదున్నర లక్షల టన్నుల మేర బాయిల్డ్ రైస్ రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి కూడా భారీగా వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన అనంతరం ఎఫ్‌సీఐ దాన్ని సేకరించి తన పరిధిలోని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పరిధిలో 15.8 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములున్నాయి. ప్రతి యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పడిపోయింది. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 40 లక్షల బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐకి చేరగా, ఇందులో 27 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇందులో మరో 13 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉన్నాయి. దీనికితోడు 2020–21 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇది వస్తే నిల్వలు మరింత పెరగనున్నాయి. ఇది పోనూ ప్రస్తుత యాసంగిలోనూ 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే దాదాపు ఈ సీజన్లో 50 లక్షల టన్నులకు పైగా బాయిల్డ్ రైస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో నిల్వలు చేసే పరిస్థితి ఎఫ్‌సీఐ వద్ద లేదు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నెలకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల టన్నుల మేర పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ లెక్కన ఏడాదంతా సరఫరా చేసిన 36 లక్షల టన్నులకు మించి సరఫరా చేయలేదు. అలాంటప్పుడు మిగతా బియ్యాన్ని నిల్వ చేయడం ఎఫ్‌సీఐకి ‘కత్తిమీద సాము’లా మారనుంది. బాయిల్డ్ వద్దంటున్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడుకు ప్రతి నెలా 3.50 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళకు ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ అవసరాలుండేవి. దీనికి తగ్గట్లుగా తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం సరఫరా అయ్యేది. ప్రస్తుతం తమిళనాడులో 3 లక్షల టన్నులకు అవసరాలు తగ్గాయి. తన అవసరాలకు సరిపోనూ బాయిల్డ్ రైస్ ఉత్పత్తిని స్వతహాగా పెంచుకుంటోంది. దీంతో తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేదు. ఇక కేరళలోనూ బాయిల్డ్ రైస్ వినియోగం 30 శాతం తగ్గి రా రైస్ వినియోగం పెరిగింది. దీంతో ఆ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ డిమాండ్ తగ్గింది. కర్ణాటకలో పూర్తిగా రా రైస్ వినియోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ రాష్ట్రాన్ని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరింది. దీనిపై ఎఫ్‌సీఐ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
నిండు కుండల్లా మారిన జలశయాలు
-
నో అడ్మిషన్స్
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి విద్యార్ధి ఉన్నత విద్యనభ్యసించాలన్న సంకల్పంతో రూపొందించిన కొత్త విద్యా విధానానికి విద్యార్థి లోకం ఆకర్షితులవుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ విద్య అంటే చిన్న చూపు చూసేవారు సైతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతున్నారు. ఇదే తరహాలో పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు 2019–20 విద్యా సంవత్సరంలో విపరీతమైన పోటీ నెలకొంది. ప్రభుత్వం కేటాయించిన సీట్లకు మూడింతల సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించినప్పటికీ, కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కళాశాలలో సీట్లు నిండిపోయాయని ప్రిన్సిపల్ చెప్పాల్సి వస్తోంది. 2008లో కోలగట్ల హయాంలో ప్రారంభం విజయనగరం జిల్లా కేంద్రం 1979లో ఆవిర్భవించినప్పటి నుంచి 2008 వరకు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవటం గమనార్హం. దీంతో వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో విద్యనభ్యసించలేని నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యేవారు. ఈ నేపధ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి 2008లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో ప్రత్యేక భవనం లేకపోవటంతో మున్సిపల్ కస్పా ఉన్నత పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహించేవారు. రెండేళ్ల క్రితం నుంచి నూతన భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రవేశాలకు పోటీ పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు విద్యా సంవత్సరంలో పోటీ పెరిగింది. సీట్లు నిండుకున్నాయని చెబుతున్నా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో ప్రవేశాలు కల్పించాం. కళాశాలలోని భవనాల సామర్థ్యానికి అనుగుణంగా చేర్పించుకున్నాం. కొత్తగా చేరదలచుకున్న వారికి సీట్లు లేవు. – వీకేవీ కృష్ణారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయనగరం. -
పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్’ అలుగు
ఎట్టకేలకు కరువుదీరా వర్షాలు కురిశాయి. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.. జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతోంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండుకుండలా మారింది. కాగా శనివారం రాత్రి కురిసిన వర్షానికి అలుగు పారుతోంది. దీంతో సందర్శకులు లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు అందాలు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. - పరిగి -
జైళ్లశాఖలో ఖాళీల భర్తీ
డీఐజీ చంద్రశేఖర్ వెల్లడి అవనిగడ్డ : జైళ్లశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు. స్ధానిక సబ్‌జైలును ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఇప్పటికే 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. మరో 150 పోస్టులు ఖాళీలున్నాయని వీటిని వీలైనంత త్వరగా భర్తీకి చర్యలు చేపడతామన్నారు. స్థానిక సబ్‌జైలులో ఖైదీల సంఖ్య తగ్గడం చూస్తుంటే ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ జిల్లా సూపరింటెండెంట్ నభీఖాన్, విజయవాడ సూపరింటెండెంట్ గుణశేఖరరెడ్డి, సబ్‌జైలర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు!
వెలవెలబోతున్న,ఇంజనీరింగ్, కళాశాలలు రెండో దశలోనూ పూర్తిస్థాయిలో భర్తీ కాని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్న 38 శాతం సీట్లు కొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మందే.. మరికొన్నింటిలో బోణీ కొట్టని బ్రాంచ్‌లు బాలాజీచెరువు (కాకినాడ) : ఒకప్పుడు ఇంజినీరింగ్ సీటు సంపాదించడం ఎంతో అరుదైన ఘనతగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కళాశాలలు రా...రమ్మని పిలుస్తున్నా.. విద్యార్థులు పో...పొమ్మంటున్నారు. కళాశాలలు ఎక్కువ కావడమే దీనికి కారణం. ఉన్న కళాశాలల్లో మంచివాటిని గుర్తించి అటువైపే విద్యార్థులు అడుగులు వేయడంతో స్థాయి లేని కళాశాలలు వెలవెలబోతున్నాయి. జేఎన్‌టీయూకేకి అనుబంధంగా జిల్లాలో 33 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, వీటిలో 12 వేలకు పైగా సీట్లున్నాయి. ఎంసెట్–2016 ఇంజినీరింగ్ విభాగానికి జిల్లావ్యాప్తంగా 16,535 మంది హాజరవగా వీరిలో 11,067 మంది అర్హత సాధించారు. కానీ ఉన్న సీట్లలో 7,400 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే జిల్లా మొత్తంలో ఉన్న సీట్లలో 62 శాతం మాత్రమే భర్తీ కాగా, మిగిలిన 38 శాతం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఫలితంగా కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. మరికొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మంది చొప్పున చేరడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఆయా యాజమాన్యాల్లో నెలకొంది. ఇక బ్రాంచ్‌కు 30 శాతం చొప్పున నిండిన కళాశాలలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. కేవలం గుర్తింపు పొందిన ఆరు కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరికొన్ని కళాశాలల్లో టాప్ బ్రాంచ్‌గా ఉన్న ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ తప్ప మిగిలిన బ్రాంచ్‌లు బోణీ కొట్టలేదు. దీంతో రెండో దశపై ఆశలు పెట్టుకున్న కళాశాలలకు నిరాశే మిగిలింది. కళాశాలల పెరుగుదలే కారణం జిల్లాలో 1989 వరకూ ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరో రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండేవి. సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1998 నుంచి 2006 వరకూ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. దీంతో జిల్లాలో అదనంగా దాదాపు 20 కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో అప్పటివరకూ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వందల్లో ఉన్న సీట్ల సంఖ్య వేలకు చేరింది. ప్రస్తుతం దాదాపు ప్రతి రెండు మండలాలకు ఒక ఇంజినీరింగ్ కళాశాల చొప్పున ఉన్న పరిస్థితి. వసతుల లేమి ఒకపక్క కళాశాలలు పెరిగినా వాటిలో పూర్తిస్థాయిలో వసతులుండటం లేదు. అయినా సరే విద్యార్థులను తమవైపు తిప్పుకోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతనంతా ఉపయోగించినా ఫలితం లేకపోయింది. డొనేషన్లు తీసుకునే విధానం పోయి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉపకార వేతనాల ఆఫర్లతో అడ్మిషన్లు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన ప్రమాణాలతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులు లేకపోవడమే దీనికి కారణం. కేవలం బీటెక్ అర్హత కలిగినవారితో తరగతులు నిర్వహించేస్తున్నారు. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం 1.15 నిష్పత్తిలో అధ్యాపకులతోపాటు నాన్‌టీచింగ్, నాన్ టెక్నికల్ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉండాలని నిబంధన ఉన్నా అవేమీ పాటించకపోవడం మరో కారణం. మూసివేయాలన్నా ఇబ్బందే.. ఏదైనా కళాశాలను మూసివేయాలి వస్తే ఏఐసీటీఈ బోర్డుకు సంబంధిత యాజమాన్యం రూ.3 లక్షలు చెల్లించాలి. ముందుగా ఆ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. తన విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ, అధ్యాపక, అధ్యేపకేతర సిబ్బంది వివరాలను యూనివర్సిటీకి తెలియజేయాలి. కళాశాల మూసివేతకు తమకేమీ అభ్యంతరం లేదని విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. కొలువుల ఎంపిక మాటేమిటి? ప్రస్తుతం జిల్లాలో ఉన్న 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో కేవలం జేఎన్టీయూకేతోపాటు పేరొందిన ఏడెనిమిది కళాశాలల్లో మాత్రమే ఏటా క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో ఆ ఊసే లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. -
డీజిల్ కొంటే..వాటర్ ఫ్రీ..