కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల్లో మరికొందరు నేతలకు స్థానం కల్పించారు. ఈ మేరకు ఆయా పదవుల్లో నియామకానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యా
వైఎస్సార్‌సీపీ పదవుల్లో నియామకం
Published Wed, Dec 21 2016 11:35 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
రాష్ట్ర, జిల్లా కమిటీల్లో పదవులు
కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల్లో మరికొందరు నేతలకు స్థానం కల్పించారు. ఈ మేరకు ఆయా పదవుల్లో నియామకానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ వివరాలను బుధవారం రాత్రి ప్రకటించింది. కాకినాడకు చెందిన మచ్చా లోకేష్‌వర్మను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన కాకినాడకు చెందిన మత్స్యకార నాయకుడు మచ్చా గంగాధరరావును పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమించారు. రాజమహేంద్రవరం మహిళా విభాగం అధ్యక్షురాలిగా మర్తిలక్ష్మిని నియమించారు. కాగా జిల్లాలోని ముమ్మిడివరం మండలానికి సంబంధించి మరికొంతమందికి కూడా పదవుల్లో నియమించారు. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన అధ్యక్షులుగా మల్లాడి భైరవమూర్తి, పిన్నమరాజు వెంకటపతిరాజు, నల్లా నరసింహమూర్తి నియమితులయ్యారు. ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షుడిగా బొంతు సత్యశ్రీనివాస్‌ను నియమించారు.
Advertisement
Advertisement