
ప్రగాడ నాగేశ్వరరావు(పాత చిత్రం)
వైఎస్సార్‌సీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ నాగేశ్వరరావు నియమితులయ్యారు
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ నాగేశ్వరరావు నియమితులయ్యారు. నాగేశ్వరరావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన వారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగేశ్వరరావును పార్టీ కార్యదర్శిగా నియమించడమైందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిన్న(సోమవారం) ఓ ప్రకటన వెలువడింది.