నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు
ఓర్వకల్లు : సోలార్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ ద్వారా నిరుద్యోగులకు ఎరవేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మధుసూదన్‌రావు వివరాలు వెల్లడించారు. బనగానపల్లెకు చెందిన పరమేష్, కోవెలకుంట్లకు చెందిన మమబూబ్ ఉశేని, అదే మండలం, బిజినివేములకు చెందిన రాజశేఖరచౌదరి, ఆళ్లగడ్డకు చెందిన రామోజీరావు, చాగలమర్రికి చెందిన ప్రసాద్ ముఠాగా ఏర్పడి శకునాల వద్దనున్న సోలార్ పరిశ్రమలోని గ్రీన్‌కో కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్సప్ ద్వారా ఈ నెల 17న నిరుద్యోగులకు సందేశాలు పంపారు. ఈక్రమంలో గ్రీన్‌కో కంపెనీ సెక్యూరిటీ సూపర్‌వైజర్ కోటేశ్వరరావు తన తమ్ముడికి ఉద్యోగం కావాలని సదరు యువకులను ఫోన్‌లో సంప్రదించాడు.
అందుకు మొదట రూ.10 వేలు డిపాజిట్, మరో రూ.2 వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆయన విషయాన్ని గ్రీన్‌కో కంపెనీ డిప్యూటీ మేనేజర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం హుశేనాపురంలోని గడివేముల బస్టాండ్ వద్ద ముగ్గురు నిందితులు ఉండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment