సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్‌ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్/చైన్‌మెన్ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!
Comments
Please login to add a commentAdd a comment