గందరగోళానికి తెర
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్‌లో మొత్తం మీద ఏడు టారిఫ్‌లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్‌లను ఎత్తివేశారు.
దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్‌ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్‌లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్‌లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్‌లను 70 శాతం టారిఫ్‌లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్‌కు ఇది అమలవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment