cess
-
కస్టమ్స్ టారిఫ్‌లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్‌లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్‌ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్‌లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్‌లను 70 శాతం టారిఫ్‌లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్‌కు ఇది అమలవుతుందన్నారు. -
AP: మందుబాబులకు ప్రభుత్వం షాక్ !
సాక్షి,విజయవాడ: మందుబాబులకు ఏపీ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్ విధిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం(అక్టోబర్ 15) ఉత్తర్వులిచ్చింది.ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా అన్ని రకాల మద్యంపై రౌండప్ చార్జీల పేరుతో బాదిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు నిర్ణయించింది. ఈ బాదుడును తక్షణమే అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. కాగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్‌షాపులను ప్రైవేటు రిటైలర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వారి నుంచి షాపులకు దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ పద్ధతిన షాపులు కేటాయించింది.ఈ విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో ఓ పక్క మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల నుంచి అటు ప్రభుత్వం ఇటు పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకోనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇదీ చదవండి: తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు -
పొలిటీషియన్ కాదు..పొలిటికల్ లీడరే ముఖ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.... దృక్కోణంలో మార్పు కావాలి పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది. రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి. యువశక్తిలో ఉద్వేగమెందుకు? రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి. వలసలు తగ్గాయి.. జీవనం మారింది ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్‌నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్‌గా మారింది. దీంతో అన్‌స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్‌లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్‌లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. -వనం దుర్గాప్రసాద్ -
గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు..
వంట కోసం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో మంత్రి వివరించారు. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు’ మంత్రి వివరించారు. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్ 4 శాతానికి మాత్రమే పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని మంత్రి వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు న్యూఢిల్లీ: సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద 590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు 244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు 91.24 కోట్లు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు 54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు 200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును ప్రారంభించాల్సి ఉందని అన్నారు. సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు 16400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి అన్నారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు 25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు 20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రిపేర్కొన్నారు. -
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే?
తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అలాగే భారత్‌లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు. చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..! -
అయోధ్య తప్ప సయోధ్య ఎక్కడుంది.. ‘సెస్’ ఫుల్‌ఫామ్ చెబితే రాజీనామా!
సాక్షి, సిరిసిల్ల: ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ‘సెస్’ ఎన్నికల్లో మా సీట్లు లాక్కున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అంటున్నారు. ఆయన ‘సెస్’ఫుల్‌ఫామ్ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు, ‘సెస్’ గురించి ఆయనకు ఏం తెలుసని, అయోధ్య తప్ప రైతులతో ఆ పార్టీకి సయోధ్య ఎక్కడుందని ప్రశ్నించారు. పోరగాళ్లకు మతం మందు కలిపి తాగిస్తున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్పై వాళ్లతో తప్పు డు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చదవండి: ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సొసైటీ (సెస్) ఎన్నికల్లో బీజేపీని ప్రజలు మళ్లీ తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అడ్డదారిలో గెలుపుకోసం బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారన్నారు. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయ త్నాలకు ఇది చెంపపెట్టులాంటిందన్నారు. వ్యవ సాయ మోటార్లకు మీటర్లు, ఉచిత విద్యుత్ రద్దు, సబ్సిడీ విద్యుత్ ఉండదని ప్రజలు భావించినందునే బీజే పీని తిరస్కరించారని పేర్కొ న్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ పట్ల వ్యతిరే కత ఉందనేందుకు సెస్ ఎన్ని కల ఫలితాలే నిదర్శనమన్నారు. సెస్ ఎన్నికల్లో విజయంతో బీఆర్ఎస్ నాయ కత్వం, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల కల్పన.. తదితరాలపై దృష్టి సారిస్తామన్నారు. రైతులు, కుల వృత్తుల వారికి, దళిత, గిరిజనులకు రాయితీలు ఇస్తూ, మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘సెస్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
సిరిసిల్ల: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘ (సెస్) పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం వేములవాడలో లెక్కింపు చేపట్టగా.. మొత్తం 15 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అయితే వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బి.మమత తొలుత ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ అడ్డదారులు: సంజయ్ ‘సెస్’ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ రూరల్, చందుర్తిల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ మేరకు ఫలితాలు వెల్లడించకుండా చేశారని ఆరోపించారు. ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘సెస్’ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీ నేతలకు చెంచాల్లా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమాదేవి ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా జిల్లాలో బలపడిన బీజేపీని ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని పేర్కొన్నారు. -
కిలోల కొద్ది బంగారం కొంటున్నా.. కానీ రాజయోగం లేదు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరాఫరా సంఘం(సెస్) ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండలం నుంచి సెస్ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఓ పార్టీ నాయకుడు రాజయోగం కోసం అదృష్ట ఉంగరం కొనేందుకు వెళ్లిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 15 ఏళ్ల క్రితం సదరు నాయకుడు బంగారం, అదృష్ట ఉంగరాల వ్యాపారి వద్ద అరతులం, తులం కొనేవాడని.. అదృష్ట ఉంగరం తీసుకున్న తర్వాత కిలోల కొద్దీ బంగారం కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. తాను అదృష్ట ఉంగరం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా బలంగా పడ్డానని, కానీ రాజయోగం మాత్రం రావడం లేదని అనడం కొసమెరపు. ఇదంతా సదరు వ్యాపారికి చెందిన యూట్యూబ్ ఛానల్లో 8 నెలల కిత్రం పోస్టు చేయగా.. సెస్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైరల్ గామరింది. చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత -
మార్కెట్ కమిటీలకు లక్ష్మీకళ
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీలు సెస్సు వసూళ్లతో కళకళ లాడుతున్నాయి. ఈ ఏడాది రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా అక్టోబర్ చివరి నాటికి రూ. 601.52 లక్షలు వసులయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్ చివరి నాటికి రూ. 496.95 లక్షలు వసూలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ. 104.57 లక్షలు అధికంగా సెస్సు వసూలు కావడం గమనార్హం. జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. జమ్మలమడుగు, కమలాపురం మార్కెట్ కమిటిలీలు తప్ప మిగిలినవి గతేడాది కంటే ఈ సంవత్సరం అక్టోబర్ చివరినాటికి లక్ష్యానికంటే అధికంగా సెస్స్ వసూలు చేశాయి. కడప మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 200 లక్షలకుగాను గతేడాది అక్టోబర్ చివరి నాటికి రూ.91.99 లక్షలు వసులు చేయగా ఈ సంవత్సరం రూ.98.45 లక్షలు వసూలు చేసింది పొద్దుటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలుకాగా గతేడాది అక్టోబర్ చివరి నాటికి రూ.73.83 లక్షలు, ఈ ఏడాది రూ. 79.92 లక్షలు వసులయ్యాయి. బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 145 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 78.49లక్షలు, ఈ ఏడాది రూ. 113.09 లక్షలు, పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 92 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ.39.42 లక్షలు, ఈ ఏడాది రూ. 47.80 లక్షలు, మైదుకూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 165 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 85.98 లక్షలు, ఈ ఏడాది రూ.119.67 లక్షలు, సిద్దవటం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 10.09 లక్షలు, ఈ ఏడాది రూ.10.66 లక్షలు, ఎర్రగుంట్ల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 70 లక్షలుకాగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి రూ. 27.30 లక్షలు, ఈ ఏడాది రూ. 31.91 లక్షలు, నూతనంగా ఏర్పాటు చేసిన సింహాద్రిపురం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా ఇప్పటి వరకు రూ. 17.18 లక్షలు వసూలు చేసింది. జిల్లాలో మార్కెట్ కమిటీ వివరాలు.... జిల్లాలో కడప, పొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల,మైదుకూరు, కమలాపురం, ఎల్‌ఆర్‌పల్లె, సిద్దవటం, ఎర్రగుంట్లలో మార్కెటింగ్ కమిటిలు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగకు సంబంధించిన క్రయవిక్రయాలు జరగ్గా మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు, ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి. జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ వంటివి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. జిల్లాలో కడప మార్కెట్ కమిటీ నుంచే ఎక్కువగా చెస్ వసూలు అవుతుంది. మిగతా 9 మార్కెట్ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయి. పులివెందుల మార్కెట్ కమిటీ నుంచి బత్తాయి, అరటి, నిమ్మ వంటివి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్సు చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ ఉత్పత్తుల ధరతో ఒక శాతం సెస్సుగా వసూలు చేసేవారు. ఈ ఏడాది ధాన్యంపై సెస్సును 2 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు జిల్లాలో 2022–23 ఏడాదికి 10 మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. అయా చెక్ పోస్టుల ద్వారా వార్షికాదాయం ఏడాదికి రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెస్సు వసూలు అశాజనకంగా ఉంది. ఇచ్చిన టార్గెట్‌లో ఇప్పటి వరకు రూ. 601.52 లక్షలు వసూలు చేసి 51.38 శాతం సాధించాం. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని అధిగమిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –హిమశైల, మార్కెటింగ్‌శాఖ ఏడీ, వైస్సార్‌జిల్లా -
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్‌పై సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అడ్డగోలు సెస్‌లతో రాష్ట్రాలకు అన్యాయం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రోజు రోజుకూ పెరుగుతున్న సెస్‌లతో ‘డివిజబుల్ పూల్’ (విభజించదగిన మొత్తం)మరింతగా కుంచించుకుపోతోంది. 1980లో కేంద్రం పన్ను రాబడిలో 2.3 శాతం మాత్రమే ఉన్న సెస్‌లు 2021లో 20 శాతానికి చేరుకున్నాయి. కొన్నిసార్లు ప్రాథమిక ధరలకంటే సెస్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విపరీత పోకడలను హేతుబద్ధీకరిస్తే, రాష్ట్రాలు పన్నుల పంపిణీ ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోగలుగుతాయి..’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించే విధానాల అమలు బాధ్యత రాష్టట్రాలదేనని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. పన్ను పంపిణీ ద్వారా రాష్ట్రాలకు మరింత డబ్బు అందించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం జరిపారు. రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచేందుకు వీలుగా ఈ నెల 22న మొత్తం రూ.95,082 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మూలధన వ్యయాన్ని పెంచాలని కొందరు ముఖ్యమంత్రులు కోరినట్లు చెప్పారు. కాగా ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని స్పష్టం చేశారు. రూ.900 కోట్లు వెంటనే ఇవ్వాలి ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాలి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రెండు విడతలుగా చెల్లించాల్సిన రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రత్యేక గ్రాంట్లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫారసులు వెంటనే అమలు చేయాలి..’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంచాలి... ‘కోవిడ్‌కు ముందు 2018 మొదటి త్రైమాసికం నుండి సుమారు 8 వరుస త్రైమాసికాల పాటు ఆర్థికాభివృద్ధి మందగించింది. 2011–12 లో జీడీపీలో పెట్టుబడి శాతం 39 శాతంగా ఉండగా, 2021–22 నాటికి 29.3 శాతానికి తగ్గి దేశ ఆర్థిక స్థితిని కుంగదీస్తోంది. పెట్టుబడి శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. మూలధన వ్యయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలు జీఎస్డీపీలో 0.5 శాతం రుణాలను తీసుకోవచ్చుననే నిర్ణయం స్వాగతించదగ్గది. మూలధన ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి మాత్రమే రుణం తీసుకోవాలన్న నిబంధనను అనుసరిస్తాం. అందుకు ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 2 శాతానికి పెంచాలి..’ అని కోరారు. పెట్టుబడి రాయితీలివ్వాలి ‘వస్త్ర పరిశ్రమ, దుస్తులు, బొమ్మలు, తోలు వస్తువులు, లైట్ ఇంజనీరింగ్ వస్తువులు, పాదరక్షలు వంటి రంగాల్లో పెట్టుబడి రాయితీలిస్తే, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. జీడీపీకి 30 శాతం చేయూత ఎంఎస్ఎంఈలే ఇస్తున్నాయి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను వీటికి కూడా వర్తింపజేయాలి. చిన్నస్థాయి నుండి మధ్యస్థానికి, మధ్యస్థం నుండి భారీ స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందే సంస్థలకు వడ్డీ రాయితీని విస్తరించాలి..’ అని కేటీఆర్ సూచించారు. కాగితాలపైనే హామీలు ‘ఆరు పారిశ్రామిక కారిడార్లను పదే పదే అడిగినా మంజూరు చేయలేదు. రక్షణ, ఎలక్ట్రానిక్స్, వస్త్ర, ఫార్మాస్యూటికల్స్ రంగాల ‘ఎకో సిస్టమ్’ తెలంగాణలో ఉన్నందున ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలి. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పేపర్లకే పరిమితమయ్యాయి. తెలంగాణకు సముద్రతీరం లేదు. డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశాలివ్వాలి. వచ్చే పదేళ్లలో అత్యధిక ఉద్యోగావకాశాలు సృష్టించనున్న వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఔషధ రంగాలను ప్రోత్సహించాలి. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ను మూలధన పెట్టుబడిగా వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలి..’ అని కోరారు. -
బడ్జెట్ 2021: మందుబాబులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న అంశం సెస్. ఇక మీదట క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల కళ్లు బైర్లు కమ్మెలా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ) ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యవసాయ సెస్‌ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ సెస్సు విధింపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ చేసింది. ఇప్పుడు సెస్ విధింపుతో ఇంధనం ధర మరింత ఎగబాకనుంది. లీటర్ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. ఒక్కసారిగా ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఇక ఈ వ్యవసాయ సెస్సు విధుంపుతో.. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం.. అన్ని అంశాలపై ఉంటుంది. ఇక అప్పుడు సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టు లేదు ధరలిట్టా మండిపోతే’ అని పాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. (చదవండి: బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు) ఇక వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) -
బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సగటు వేతన జీవిని నిరాశ పరిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ‘‘విశ్వాసం పక్షిలాంటిది. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న సమయంలో కూడా అది వెలుతురును అనుభవిస్తూ.. పాడుతుంది’’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు గంట 51 నిమిషాలు సాగిన నిర్మల బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. దాంతో పాత శ్లాబులే కొనసాగుతాయని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్యానికి, మౌలిక సదుపాయల అభివృద్ధికి, రైల్వేలకు, వ్యవసాయనికి పెద్ద పీట వేశారు. పెట్రో బాదుడు.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబెలేత్తుతుండగా.. బడ్జెట్ తర్వాత వాటి ధరలు మరింత పెరగనున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధించనున్నారు. దాంతో పెట్రో మంట ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. -
50 వసంతాల ‘సెస్’
అనేక సంక్షోభాలను సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలను పొందిన సంస్థ సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సిరిసిల్ల(కో–ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై లిమిటెడ్, సిరిసిల్ల). సంస్థను ప్రారంభించి ఈ నవంబర్ 1 నాటికి 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుం టోంది. ఈ సంస్థను సంక్షిప్తంగా సెస్ అని వాడుకలో పిలుస్తారు. సహకార రంగంలో విద్యుత్తును తన వినియోగదారులకు సరఫరా చేయడంలోనూ, ఉత్తమ సేవలను అందించడంలోనూ దేశంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుకున్న సెస్ స్వర్ణోత్సవాల వైపు పరిగెడుతున్నది. సహకార శాఖ చట్టం పరిధిలో అక్టోబర్ 1969న రిజిస్ట్రేషన్ చేసుకొని, 1970 నవంబర్ 1 నుంచి ఆచరణాత్మకంగా ‘సెస్’ ఉనికిలోకి వచ్చింది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది అన్న మహాత్మా గాంధీ.. అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలని కూడా చెప్పారు. ఈ స్ఫూర్తితో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల ఉన్నతి, ప్రజల వికాసం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్.ఇ.సి)ను 1969లో ప్రారంభించింది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 5 గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలు ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని సంస్థల అభివృద్ధి ప్రణాళికలకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఏర్పాటు అయినది. ఇది అప్పటి సిరిసిల్ల పాత తాలూకా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దీని సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు పట్టుదల ఎన్నదగినది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఏకైక సంస్థను తీసుకురావడం అంటే మాటలు కావు. అనంతరం సంస్థ మనుగడలో అప్పటి శాసనసభ్యులు జే నర్సింగరావు, గొట్టె భూపతిల పాలనా సామర్థ్యాలు, అప్పటి ఉన్నత అధికారులు, ఉద్యోగులు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన సంస్థ ఉద్యోగుల త్యాగాలు, నిస్వార్థ సేవలు కీలక భూమిక వహించాయి. 50 ఏళ్లుగా సంస్థ ఎదురులేకుండా నిలబడడానికి కారణం వారి పటిష్ట ప్రణాళికల పునాది ఫలితమేనని చెప్పాలి. దీనికి నిదర్శనమే నాటి రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కేవలం 4,720 సర్వీసులు సంస్థకు దఖలు పడగా, నేడు 2 లక్షల 55 వేల 830 కనెక్షన్లు వివిధ కేట గిరీలలో కలిగి, సంస్థ ఎన్నో వందల రెట్లు పురోగతి సాధించింది. నాడు కేవలం 2,299 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా నేడు 76 వేల 306 వ్యవసాయ సర్వీసులున్నాయి. సంస్థ అయిదు దశాబ్దాల విజయగాథలో సభ్యులు, వినియోగదారులు, అత్యంత క్రియాత్మకంగా బాధ్యత వహించారు. నేడు సభ్యుల సంఖ్య 2 లక్షల 97 వేల 708 కలదు. వీరి వాటా ధనం 6 కోట్ల 14 లక్షల 81 వేల 587 రూపాయలు కలవు. అంటే సంస్థ ఆర్థిక హార్దిక పురోగతిలో వీరి సహాయ సహకారాలు ఎంత అమోఘంగా పని చేశాయో తెలుస్తుంది. ప్రారంభంలో విద్యుత్ లైన్ల నిర్మా ణంలో, ట్రాన్స్ఫార్మర్ల స్థాపనలో, పని ప్రదేశాలకు సామాగ్రి రవాణా చేయడంలో వీరి స్వచ్ఛంద శ్రమదానం ఇమిడి ఉంది. శ్రమదానం విలువ సుమారు ఒక కోటి 50 లక్షలు ఉంటుంది. వినియోగదారుల శ్రమదానం సంస్థలో 1995 వరకు సాగింది. ఇకపోతే సహకార రంగంలో సెస్ పురోగతి గణాంకాలను పరిశీలిస్తే సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,600 విద్యుత్ యూనిట్ల వరకు ఉంది. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ విని యోగం 1,268 యూనిట్లుగా ఉన్నది. ఉద్యోగుల విషయానికి వస్తే సంస్థలో 666 సర్వీసులకు ఒక ఉద్యోగి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. ఎన్పీడీసీఎల్లో 586.45 సర్వీసులకు ఒక ఉద్యోగి తన సేవలను అందిస్తున్నాడు. సెస్ సహకార రంగంలో విద్యుత్ పంపిణీ నిర్మాణ సంస్థ కాబట్టి, గతంలో ఇప్పుడు కూడా విద్యుత్తును అప్పటి విద్యుత్ బోర్డు నుంచి ,ఇప్పటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కొనుగోలు చేసి తన వినియోగదారులకు ప్రభుత్వ ఆదేశాల రేట్ల ప్రకారం వివిధ కేటగిరీల్లో నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నది. విద్యుత్ సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) నిబంధనలు ఆదేశాలకు లోబడి సంస్థ పనిచేస్తుంది. 1970లో స్థాపించిన సెస్ పని విధానం, నిర్వహణ తీరు తెన్నులను చూసి, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో 13 సహకార విద్యుత్ సరఫరా సంఘాలను స్థాపించాయి. కానీ అందులో ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక్క సెస్ సంస్థ మిగిలిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. 8 సంస్థల నష్టాలను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వం సంబంధిత విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో విలీనం చేసింది. ఉద్యోగవర్గాలకు, పాలకవర్గాలకు విని యోగదారులకు మధ్యనగల అవినాభావ సంబంధ బాంధవ్యాలు, సహకార మమకారాల వలననే సంస్థ గత 50 ఏళ్లుగా తన విజయయాత్రను అవి చ్ఛిన్నంగా కొనసాగిస్తున్నది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా వినియోగదారుల సహకారంతో దిగ్విజయంగా సాగిపోతున్నది. ముఖ్యంగా సంస్థ ప్రారంభమైన ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధినీ సాధించడమేకాక గణనీయమైన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించింది. తద్వారా రైతాంగం రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అంతేగాక సిరిసిల్ల నేత రంగం, అనుబంధ రంగాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న చేనేత పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వలన చేనేత కుటుంబాల బతుకులు మరింత సుభిక్షంగా ఉన్నాయి. అంతేకాక ఈ సంస్థ పరిధిలో సిరిసిల్ల టెక్సటైల్ పార్క్ కూడా కొనసాగుతున్నది. దీనితో ప్రభుత్వ సంక్షేమ చేయూతతో అనేక మంది నేత కార్మికులు వలసలకు విరామం చెప్పి సిరిసిల్లలోనే తమ వృత్తిని కొనసాగిస్తూ సరిపోయే జీవన భృతిని పొందుతున్నారు. సంస్థ స్వర్ణోత్సవాలు నిర్వహించుకోనున్న సంవత్సరంలో ఉత్తమ వినియోగదారులకు, ఉద్యోగులకు, గ్రామ ప్రతినిధులకు మధ్య మరింత సత్సంబంధాలను ఆదానప్రదానాలుగా కొనసాగాలి. మరో శతాబ్దం వరకు సంస్థ మనుగడ ఇంకా అద్వితీయంగా కొనసాగాలి. -జూకంటి జగన్నాథం వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94410 78095 -
16 దారుల్లో..ప్రగతి చక్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పదహారు అంశాల ప్రాతిపదికన జరుగుతోందని, ప్రగతి చక్రం పయనిస్తున్న తీరు కూడా మంచి ఫలితాలే ఇస్తోందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) వెల్లడించింది. వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి ఫలితాలపై సెస్ ఇటీవలే ‘తెలంగాణ డెవలప్మెంట్ సిరీస్’పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల తదితర రంగాల పనితీరు, ఫలితాలను విశ్లేషించింది. అలాగే కొన్ని పథకాల అమల్లో జరుగుతున్న లోటు పాట్లను కూడా సవరించాలని సూచించింది. ఈ నివేదికపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి.. ప్రణాళిక, గణాంక, తదితర శాఖల అధికారులతో చర్చించారు. సెస్ తయారు చేసిన ఈ నివేదిక ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ►రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర స్థూల అభివృద్ధి (జీఎస్డీపీ)లో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం. ఏటా అభివృద్ధి సగటున 9 శాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే స్థూల అభివృద్ధిలో వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ అభివృద్ధి బాగా కనిపిస్తుండగా, జనగామ, సిరిసిల్ల, కుమ్రం భీం, వనపర్తి వెనుకబడ్డాయి. ►రాష్ట్రం దీర్ఘకాలంగా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడి ఉండటంతో అప్పుల రూపం లో నిధులు తెచ్చి ఆస్తుల కల్పనకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర నికర అప్పు రూ.1.41 కోట్లుగా ఉంది. ఆర్థిక చట్టాల నిబంధనలకు అనుగుణంగా వడ్డీలు చెల్లిస్తున్నారు. ►సాగునీటి రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని 46,531 చెరువుల్లో 60 శాతం చెరువులను రూ.2,500 కోట్లకు పైగా వెచ్చించి మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించారు. తద్వారా మొత్తం 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ►వ్యవసాయ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి వాటితో రైతుల ఆదాయం పెరగాల్సి ఉంది. ►గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రాన్ని మాంసం ఉత్పత్తి హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాంసం ఎగుమతి చేసే స్థాయికి వెళ్లడంతో పాటు రూ.25 వేల కోట్ల మార్కెట్ సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ►చేపపిల్లల పెంపకం ద్వారా చేపల ఉత్పత్తి 3.2 లక్షల టన్నులకు చేరింది. చేపల ఉత్పత్తిలో కేరళను చేరుకోగలిగాం. ఇప్పటివరకు గుర్తించిన 4,530 చెరువుల్లో 50 కోట్ల వరకు చేపపిల్లలను వదిలారు. ►రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ తరహాలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉద్యానపంటలు, చేపల పెంపకం వైపు రైతులను మళ్లించాలి. తెలంగాణ డెవలప్మెంట్ సిరీస్‌లోని 16 అంశాలివే.. 1) ఆర్థికాభివృద్ధి, 2) ఆర్థిక నిర్వహణ, వనరుల సమీకరణ, 3) వ్యవసాయ రంగం, 4) నీటిపారుదల, 5) పశుసంపద, మత్స్య సంపద, 6) భూ అంశాలు, 7) పారిశ్రామిక రంగం, 8) సేవారంగం, 9) నైపుణ్యాభివృద్ధి, 10) సామాజిక రంగాలు, 11) సామాజిక భద్రత, 12) సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలు, 13) పట్టణ ప్రాంతాలు,14) పంచాయతీరాజ్ సంస్థలు, 15) పాలనా వికేంద్రీకరణ, 16) మహిళా, శిశు సంక్షేమం. -
అమల్లోకి వచ్చిన ‘వరద పన్ను’
తిరువనంతపురం: గత ఏడాది ఆగస్టు నెలలో భారీ వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణానికి అదనపు ఆదాయాన్ని సమీకరించడానికి ప్రజలపై వరద పన్ను విధించేందుకు 2019–20 బడ్జెట్లో కేరళ ప్రభుత్వం తీర్మానించింది. ఈ నిర్ణయంతో గురువారం నుంచి వస్తు సేవలపై ఒక శాతం పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. రాబోయే రెండేళ్ల కాలానికి అమల్లోకి వచ్చే ‘కేరళ ఫ్లడ్ సెస్’ ద్వారా ఏటా రూ. 600 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం దృష్టి సారించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పన్ను ద్వారా సమీకరించిన మొత్తం రాష్ట్ర పునర్నిర్మాణం, వరద బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తారు. వరద పన్నుతో కేరళలో 900 రకాల నిత్యవసర సరుకుల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరల వర్తకుల సంఘం నిన్న ‘బ్లాక్‌డే’ పాటించింది. ద్రవ్యోల్బణం, వరద పన్నుతో రాష్ట్ర ప్రజలపై రూ. 1200 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల అన్నారు. వరద బాధితుల కోసం మిగతా వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వరద పన్నును సాకుగా చూపించి ఇష్టమొచ్చినట్టు ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హెచ్చరించారు. -
వాహనదారులకు పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతుండగా బడ్జెట్లో ఇంధన ధరలపై సెస్ విధించడంతో ఇవి మరింత భారం కానున్నాయి. ప్రతి లీటర్‌పై రూ 1 అదనంగా బడ్జెట్లో సెస్ విధించారు. అదనపు సెస్‌తో పెట్రో ధరలు సామాన్యుడికి సెగలు పుట్టించనున్నాయి. మరోవైపు పెట్రో సెస్ ద్వారా కేంద్రానికి రోజూ దాదాపు రూ 200 కోట్ల రాబడి సమకూరుతుందని అంచనా. పెట్రో ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు భారమై నిత్యావసరాల ధరలూ ఎగబాకే అవకాశం ఉంది. -
‘రిచ్ ట్యాక్స్’ వచ్చేస్తోంది....
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్ట్‌లతో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ తీవ్ర వ్యూహారచన చేస్తోంది. దీనిలో భాగంగానే పేద ప్రజలను ఆకట్టుకోవడానికి అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నట్టు వెల్లడించింది. ‘రిచ్ ట్యాక్స్’ పేరుతో ఈ సెస్‌ను విధించబోతోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ 84వ ప్లీనరీలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ‘జాతీయ దారిద్య్ర నిర్మూలన ఫండ్’ ను తాము ఏర్పాటుచేయనున్నామని, తాము అధికారంలోకి వచ్చాక 1 శాతం అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నామని పేర్కొంది. ఈ ఫండ్‌ను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు, ఇతర దారిద్య్ర దిగువనున్న కుటుంబాలకు విద్యా స్కాలర్షిప్లను అందించనున్నామని తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఓ రెజుల్యూషన్‌ను తమ ప్లీనరీలో ప్రవేశపెట్టారు.దేశంలో పేరుకుపోయిన అసమానతలను గుర్తించాల్సినవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తగ్గుతున్న సామాజిక సంక్షేమ పథకాల ప్రాముఖ్యంపై విమర్శలు గుప్పించింది. పెరుగుతున్న ఆదాయ అసమానతలపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని బీజేపీ వాగ్ధానం చేసిందని, కానీ దానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ పాలనలో 1 శాతం ధనికుల సంపద 73 శాతం పెరిగిందని, కిందనున్న జనాభా సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న డిమానిటైజేషన్ ప్రక్రియతో, ప్రజలు తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక, గంటల పాటు క్యూలైన్లో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంది. పెద్ద నోట్లను మార్చుకోవడానికి క్యూలైన్లో నిల్చుని 100కి పైగా ప్రజలు మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. -
సెస్’ అధ్యయనం వాయిదా: తలసాని
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంపై ఏర్పాటు చేసిన ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్) అధ్యయనాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా గొల్ల, కురుమలకు కలిగిన ఆర్థికలాభం, పెరిగిన మాంసం ఉత్పత్తిని అంచనా వేసేందుకు సెస్ ద్వారా అధ్యయనం చేయించాలని తొలుత భావించామని, అయితే అందుకు కనీసం ఏడాదైనా వేచి చూడాల్సి ఉన్నందున వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. గొర్రెల రీసైక్లింగ్‌ను నిరోధించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌లతో పాటు ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, పశుసంవర్థక శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గొర్రెలు కొనుగోలు చేస్తున్న దళారులపై 85 కేసులు నమోదు చేశామన్నారు. -
ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
-
ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖాదీకి శుభవార్త చెప్పిన జీఎస్టీ కౌన్సిల్... మరోవైపు కార్లపై పన్ను రేట్లను బాదేసింది. ఖాదీ వస్తువులను పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ... పెద్ద కార్లపై పన్నులను 43 శాతం నుంచి 48 శాతం పెంచారు. మధ్యస్థాయి కార్లపై 2 శాతం, పెద్ద కార్లపై 5 శాతం, ఎస్‌యూవీలపై 7 శాతం సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో ఎస్‌యూవీలపై మొత్తం పన్ను 43 శాతానికి బదులు, 50 శాతం మోతక్కనుంది. చిన్నకార్లు, 13 సీట్లు, హైబ్రిడ్ వాహనాలపై మాత్రం జీఎస్టీ కౌన్సిల్ స్టేటస్ క్వోను పాటించినట్టు చెప్పారు. ఈ పండుగ సీజన్లో చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రకటన ఊరటగా మారింది. మరోవైపు మధ్యరకం కార్ల విడిభాగాలపై పన్ను రేట్లను 5 శాతం తగ్గించారు. ఈ పన్ను రేట్లు 48 శాతం నుంచి 43 శాతానికి దిగొచ్చాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ 21వ కౌన్సిల్ భేటీ ముగిసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ట్రేడ్‌మార్కు, బ్రాండెడ్ ఆహారపదార్థాలపై 5 శాతం పన్నును విధించినున్నట్టు చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండోసారి భేటీ అయ్యామని, జీఎస్టీ పురోగతిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. నేడు జరిగిన సమావేశంలో 30 వస్తువుల పన్నురేట్లపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అర్హులైన వారిలో 70 శాతానికిపైగా జీఎస్టీలోకి మారినట్టు చెప్పారు. జీఎస్టీ ఫైల్చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సులభతరమైన ప్రక్రియ కోసం కమిటీని కూడా ఏర్పాటుచేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలిపారు. సాంకేతిక కారణాల సమస్యతో జీఎస్టీఆర్-1 ఫైల్చేయడానికి గడువును కూడా అక్టోబర్10 వరకు జీఎస్టీ కౌన్సిల్ పొడిగించింది. -
పన్ను బాదుడుకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దకార్లు, లగ్జరీ కార్లపై జీఎస్టీ పెంపునకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. మిడ్-సైజ్ నుండి హైబ్రీడ్ వేరియంట్లపై గరిష్టంగా 25 శాతం వరకు సెస్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. లగ్జరీ కార్ల ధరలు మోత మోగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) ఆర్డినెన్స్, 2017 సవరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబరు 2వతేదీ నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది. దీనికి పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది. అయితే ఏయే కార్లపై గరిష్టంగా ఎంతపన్ను బాదుడు ఉంటుంది అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈనెల (సెప్టెంబరు) 9న హైదరాబాద్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తేలనుంది. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల మధ్య తగ్గించాయి. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15 నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. పెద్ద మోటార్ వాహనాలు, ఎస్‌యూవీలు, మిడ్ సెగ్మెంట్ కార్లు, పెద్ద కార్లు, హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ మోటార్ వాహనాలపై సెజ్ 25 శాతంగా ఉండనుంది. గతంలో ఇది 15శాతం. జీఎస్టీ పరిధిలో లగ్జరీ, ఎస్యూవీ, మరియు ఇతర వాహనాలపై పన్ను పెంపు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
ఆ కార్లు ఇక కొనలేరు...
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ, ఎస్యూవీ కార్లు ఇక భారం కానున్నాయి. వీటిపై ఇప్పుడు విధిస్తున్న 15 శాతం సెస్‌ను జీఎస్టీ కింద 25 శాతానికి పెంచనున్నారు. సెస్‌ను పెంచేందుకు ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిచడంతో పెంపు ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేయనుంది.ఈ దిశగా ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణను చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టంలో మార్పులకు మొగ్గుచూపింది. జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించేలా లగ్జరీ వస్తువులపై సెస్ విధించేందుకు కేంద్రం జీఎస్టీ (ఆదాయ నష్టం జరిగే రాష్ట్రాలకు పరిహారం) ప్రత్యేక బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే సెస్ పెంపుపై ఆటోమొబైల్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సెస్ పెంచితే తాము వాహనాల ధరలను పెంచాల్సివస్తుందని ఇది కస్టమర్లపై భారం మోపినట్టవుతుందని వాపోతున్నాయి. సెస్ పెరిగితే లగ్జరీ వాహనాల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. -
రిలాక్స్: బడ్జెట్లోనే పెద్ద కార్ల ధరలు!
న్యూఢిల్లీ : పెద్ద కార్లకు రెక్కలు రాబోతున్నాయని, త్వరలోనే ఎస్యూవీ, లగ్జరీ కార్లపై ప్రభుత్వం సెస్‌ను మరింత పెంచనుందని గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 15శాతంగా ఉన్న సెస్‌ను 25 శాతం మేర పెంచుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే మీ బడ్జెట్‌కు మించి కార్లపై పన్ను రేట్లను పెంచదని టాప్ అధికారి చెప్పారు. మిడ్‌సైజ్, పెద్ద కార్లపై, ఎస్‌యూవీలపై 50 శాతానికి మించి జీఎస్టీ పెంచరని, అంటే 25 శాతం కంటే తక్కువగానే సెస్‌ను ప్రభుత్వం విధిస్తుందని తెలిపారు. ఒక్కసారిగా సెస్ పెంచబోతున్నారంటూ వార్తలు రావడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్టీ అమలు తర్వాత పన్ను రేట్లు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించామని, గరిష్టంగా రూ.3 లక్షల వరకు ధరలు తగ్గించినట్టు కార్ల సంస్థలు చెప్పాయి. కానీ తాజాగా ఎక్కువ సెస్ విధింపుతో పన్ను రేట్లను పెంచుతుండటంతో, మళ్లీ కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోయాయి. అయితే జీఎస్టీ నష్టపరిహారాల చట్టంలో తీసుకురాబోతున్న సవరణలలో మొత్తం పన్ను రేట్లు 50 శాతం కంటే తక్కువగానే ఉంచేలా చేస్తారని టాప్ అధికారి చెప్పారు. సెస్ పెంపు కూడా ఒకేసారి ఉండదని ఆ అధికారి తెలిపారు. అంతేకాక ఆగస్టు 12తో ముగుస్తున్న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీనికి ఆమోదం లభించకపోతే, ప్రభుత్వం ఈ సెస్ పెంపుపై ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. జీఎస్టీకి ముందు మిడ్ సైజు సెడాన్లపై 47 శాతం, ఎస్‌యూవీలపై 55 శాతానికి పైగా పన్ను రేట్లు ఉన్నాయి. కానీ జీఎస్టీ రావడంతో ఈ పన్ను రేట్లు 43 శాతానికి తగ్గాయి. -
ఎస్యూవీ, లగ్జరీ కార్లపై సెస్ బాదుడు
న్యూఢిల్లీ : స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు(ఎస్‌యూవీలు), టాప్-ఎండ్ లగ్జరీ కార్లను కొనుక్కోవాలని యోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి. మరికొంతకాలం ఆగితే ఈ కార్లపై సెస్ మోతెక్కనుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ వాహనాలపై సెస్‌ను మరింత పెంచాలని నిర్ణయిస్తోంది. ప్రస్తుతమున్న 15 శాతం సెస్‌ను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఎస్‌యూవీలు, హై-ఎండ్ కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. అన్ని సెస్‌లను కలుపుకుని మొత్తంగా 43 శాతం పన్నులను కార్ల తయారీసంస్థలు భరిస్తున్నాయి. కానీ చట్టాని సవరణ చేసి దీన్ని 53 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కస్టర్డ్ ఫౌడర్ , ఇడ్లి, దోష నుంచి విగ్రహాలు, ప్రార్థన పూసల వరకు స్థానికుడు ఎక్కువగా వాడే ఉత్పత్తుల రేట్లను తగ్గించడానికి, ఎస్యూవీ, లగ్జరీ కార్లపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చాలా ఉత్పత్తులకు తక్కువ లెవీలను విధిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ముందజలో ఉంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ హైదరాబాద్‌లో సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో వీటిపై నిర్ణయాలు తీసుకోనుంది. సిగరెట్ల మాదిరిగానే హై-ఎండ్ కార్లపైనా కూడా సెస్‌ను పెంచాలని ప్రభుత్వం చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ మార్పులు వెంటనే చోటుచేసుకోవని, సెస్‌ను పెంచాలంటే శాసన సవరణలు అవసరం పడతాయని పేర్కొంటున్నాయి. కార్లపై విధించే ఎక్కువ లెవీతో, జీఎస్టీ అమలుతో భారీగా రెవెన్యూలు కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారాల ఫండ్ చెల్లించడానికి ఉపయోగించాలని ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయి. ప్రస్తుతం చిన్న కార్లపై 28 శాతం పన్ను, 1 శాతం సెస్ ఉంది. వాటిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవు. 350-500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న బైకులపై 3 శాతం సెస్‌ను విధిస్తున్నారు. కాగ, తదుపరి రివ్యూ మీటింగ్‌లో లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. -
మార్కెట్‌కు ‘పొగ’..!
♦ సిగరెట్లపై సెస్ విధింపుతో ఐటీసీ 15 శాతం క్రాష్ ♦ సెన్సెక్స్ 364 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు డౌన్ ♦ ఈ ఏడాది ఇదే అతిపెద్ద క్షీణత... ముంబై: త్వరలో ఎన్ఎస్ఈ నిఫ్టీ చరిత్రలో మొదటిసారిగా 10,000 మార్కును చేరవచ్చన్న ఇన్వెస్టర్ల ఆశల్ని తలకిందులు చేస్తూ మంగళవారం స్టాక్ మార్కెట్ నిలువునా పతనమయ్యింది. ప్రభుత్వం సిగరెట్లపై గతంలో ఎత్తివేసిన సెస్‌ను తిరిగి విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హెవీవెయిట్ షేరు ఐటీసీ మంగళవారం దాదాపు 13 శాతం పతనంకావడంతో ప్రధాన సూచీలు పడిపోయాయి. రెండురోజులుగా పాగావేసిన 32,000 పాయింట్ల శిఖరాన్ని కోల్పోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 364 పాయింట్లు (1.13 శాతం) పతనమై 31,711 పాయింట్ల వద్ద ముగిసింది. 2017వ సంవత్సరంలో సెన్సెక్స్ ఇంతగా పతనం కావడం ఇదే ప్రథమం. గతేడాది నవంబర్ 21న జరిగిన 385 పాయింట్ల పతనం తర్వాత ఇదే పెద్ద క్షీణత. ఈ సూచీ ఇంట్రాడేలో 400 పాయింట్లకుపైగా తగ్గి 31,626 పాయింట్ల కనిష్టస్థాయిని కూడా తాకింది. ఇక క్రితం రోజే 9,940 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ వెళ్లిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 9,900, 9,800 పాయింట్ల స్థాయిల్ని సైతం వదులుకుంది. 9,792 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన తర్వాత చివరకు 89 పాయింట్ల నష్టంతో (0.90 శాతం) 9,827 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జీఎస్టీ సెస్‌తోనే తంటా... జీఎస్టీ అమలు నేపథ్యంలో సిగరెట్ తయారీ సంస్థలకు గతంలో వున్న అదనపు సెస్‌ను ఇంతకుమునుపు ప్రభుత్వం తొలగించింది. అయితే సెస్ తొలగింపుతో కంపెనీలు అధికంగా లబ్దిపొందుతున్నాయన్న కారణంగా సెస్‌ను తిరిగి విధించాలని జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. సిగరెట్లపై జీఎస్టీకి తోడు అదనంగా సెస్ విధింపుతో నిఫ్టీ అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. కార్పొరేట్ ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగురూకతతో వ్యవహరించడంతో మార్కెట్ క్షీణత అధికంగా వుందని ఆయన వివరించారు. అయితే రూపాయి బలంగా ట్రేడవుతుండటం, ఎన్పీఏలు పరిష్కారమవుతాయన్న అంచనాలతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు మంగళవారం రికవరీ కావడంతో నిఫ్టీ 10,000 పాయింట్లస్థాయిని చేరుతుందన్న ఆశలు సజీవంగా వున్నట్లేనని ఆయన అన్నారు. రూ. 50,000 కోట్ల విలువ కోల్పోయిన ఐటీసీ దేశంలో సిగరెట్ తయారీ దిగ్గజం ఐటీసీ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 12.6 శాతం పతనమై రూ. 284.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 15 శాతంపైగా పతనమై రూ. 277 స్థాయిని తాకింది. గత 25 సంవత్సరాల్లో ఐటీసీ షేరు ఒక్కరోజే ఇంతిలా పతనంకావడం ఇదే ప్రధమం. ఈ షేరుకు ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల్లో 10 శాతం వరకూ వెయిటేజీ వున్న ఫలితంగా ఆయా సూచీలు కూడా బాగా తగ్గాయి. ఎన్ఎస్ఈలో దాదాపు 15 కోట్ల ఐటీసీ షేర్లు చేతులు మారాయి. ఈ ఒక్కరోజే ఐటీసీ మార్కెట్ విలువ రూ. 50,000 కోట్ల మేర హరించుకుపోయింది. దీని మార్కెట్ విలువ రూ. 3.96 లక్షల కోట్ల నుంచి రూ. 3.46 లక్షల కోట్లకు పడిపోయింది. ఇతర సిగరెట్ తయారీ కంపెనీలు గాడ్ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్ షేర్లు 7 శాతం వరకూ క్షీణించాయి. రిలయన్స్ కూడా.. సూచీల తగ్గుదలకు మరో కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు క్షీణత. పన్నాతపతి చమురు క్షేత్రానికి సంబంధించి రూ. 18,000 కోట్ల రాయల్టీని పెనాల్టీగా చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆ క్షేత్రంలో 30 శాతం వాటా కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతంమేర క్షీణించి రూ. 1,520 వద్ద ముగిసింది. తగ్గిన షేర్లలో ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా వున్నాయి. మరోవైపు సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్‌లు 2 శాతం వరకూ పెరిగాయి. -
గుప్పుమనాలంటే.. జేబుకు చిల్లే!
న్యూఢిల్లీ: సిగరెట్లపై విధించే సెస్‌ను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పొగరాయుళ్ల జేబులు గుల్లకానున్నాయి. ఇప్పటికే జీఎస్టీ శ్లాబులో 28 శాతం పన్ను సిగరెట్లపై ఉండగా.. మరో 5 శాతం సెస్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీంతో ప్రతి వెయ్యి సిగరెట్లకు అదనంగా రూ.485/- నుంచి రూ.792/-ల పన్ను భారం పెరగనుంది. సిగరెట్లపై అదనంగా సెస్ విధించడం ద్వారా కేంద్రానికి రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. -
జీఎస్టీపై 15% వరకు సెస్సు
⇒ హానికారక ఉత్పత్తులపై 12–15 శాతం వరకు పెంచే అవకాశం ⇒ పరిహార నిధిని పెంచుకునేందుకేనన్న కేంద్రం న్యూఢిల్లీ: లగ్జరీ వస్తువులు, శీతల పానీయాలపై అత్యధికంగా 28శాతం జీఎస్టీని వసూలు చేయనున్న ప్రభుత్వం.. వీటిపై అదనంగా విధించే సెస్సు పరిమితిని 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయానికి గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమలు ద్వారా ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు తొలి ఐదేళ్ల వరకు పరిహారం ఇచ్చే నిధిని సమకూర్చుకునేందుకు ఈ సెస్సును వినియోగిస్తారు. అయితే.. భవిష్యత్తులో ఈ నిధిని పెంచుకోవాల్సిన అవసరమున్నందున సెస్‌ను పెంచుకునేందుకు వీలుగానే పరిమితిని 12 నుంచి 15 శాతానికి పెంచినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కాగా, జీఎస్టీని ఈ ఏడాది జూలై 1నుంచి అమల్లోకి తెచ్చే దిశగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్–జీఎస్టీ), కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ (యూటీ–జీఎస్టీ)లకు కూడా జీఎస్టీ కౌన్సిల్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త పన్నుల విధానమైన జీఎస్టీలోని తొమ్మిది నిబంధనల్లో ఇప్పటికే ఐదింటికి (రిజిస్ట్రేషన్, పేమెంట్స్, రీఫండ్లు, ఇన్వాయిసెస్, రిటర్న్స్) కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మిగిలిన నాలుగింటికి (కాంపోజిషన్, వాల్యుయేషన్, ఇన్పుట్ టాక్స్, క్రెడిట్ ట్రాన్సిషన్స్) మార్చి 31న జరిగే సమావేశంలో కౌన్సిల్ చర్చించనుంది. ఆ తర్వాత వివిధ వస్తువులపై జీఎస్టీ టాక్స్ శ్లాబుల (5%, 12%, 15%, 28%)పై నిర్ణయం తీసుకోనుంది. ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ.4,170 లేదా 290శాతం పన్ను పరిమితి, టన్ను బొగ్గుపై 400శాతం సెస్సు విధించినట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. బీడీలపై సెస్సు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. -
‘సెస్’ అద్దంలో బాబు బండారం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి - ఏపీలో వ్యవసాయం పరిస్థితి దారుణమని తేల్చింది - అప్పుల ఊబిలో 93 శాతం మంది రైతులు - సగటున ఒక్కోరైతుకు రూ.1.23 లక్షల అప్పు - రుణమాఫీ అంకెల గారడీకే పరిమితం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి అది చేశాం.. ఇది చేశామని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ బడాయి మాటలేనని సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) నివేదిక బయట పెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నియమించిన సెస్ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. రైతుల దుస్థితిపై అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసిన చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా 93 శాతం మంది రైతులు అప్పుల్లో మునిగిపోయారని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సగటు రైతు అప్పు లక్షా 23 వేల రూపాయలు ఉందని సెస్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఏపీలో రెండంకెల వృద్ధి రేటు అని, వ్యవసాయ మిషన్ అని చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని ఈ నివేదికతో తేలిపోయిందన్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి వ్యవసాయం దండగనే అభిప్రాయం ఉందని విమర్శించారు. అప్పుల్లో రైతులు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రైతులు 93 శాతం అప్పుల్లో మునిగిపోవడానికి ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానమే కారణమని విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. హామీ నెరవేర్చకుండా చంద్రబాబు కాలయాపన చేయడంతో రైతులు అప్పులు చెల్లించలేకపోతున్నారని, రుణా లు రీ షెడ్యూల్ కావడం లేదని తెలిపారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొని రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానాన్ని పక్కనపెట్టి రైతులకు రుణాలు ఇవ్వాలని సెస్ కమిటీ సూచించిందని తెలిపారు. అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానాన్ని అనుసరిస్తూ రైతులకు బంగారంపై బ్యాంకు రుణాలు ఇవ్వొద్దని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు వరాలు ఇస్తూ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లుగా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతే.. 4 రెయిన్గన్లతో హడావిడి చేసి కరువును పోగొట్టామని ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు. కరువుకాట కాల సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందలేదని సెస్ నివేదికలో నిపుణులు చెప్పారని తెలిపారు. ఎదురుదాడితో.. రాధాకృష్ణ కమిషన్ చేసిన 114 సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తుందో లేదోనని విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జయతిఘోష్ కమిటీ, చెన్నారెడ్డి కమిటీ, స్వామినాథన్ నివేదికలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు వాటి గురించి మాట్లాడటం మానేశారని గుర్తుచేశారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. కేంద్రం నియమించిన భూపేంద్ర హుడా కమిటీ కూడా ఎకరానికి రూ.10 వేలు, వాణిజ్యపంటలైతే ఎకరానికి రూ.25 వేలు ఇవ్వమని చెప్పిందని, దీన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో అట్టహాసంగా ప్రకటించి అమలులో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. సెస్ నివేదికతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, ఈ నివేదికలను అమలు చేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అవును ఆయన మారలేదు...
-
అవును ఆయన మారలేదు...
ఒంగోలు: ఆయన మారలేదు..అవును ఆయన ఏ మాత్రం మారలేదు. అందరి సాక్షిగా మళ్లీ అదే బడాయిలు. అవే అబద్ధాలు. అదే తీరు...అవును ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మరోసారి మాటలతో కోటలు కట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం చంద్రబాబు జనచైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలను ఏకరవు పెట్టారు. ఓ పక్క రుణమాఫీ కాక రైతులు, డ్వాక్రా మహిళలు అల్లాడుతుంటే.... ఇంకోపక్క మాఫీ అద్భుతంగా చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లక్షలాది పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గతంలో దెయ్యాలు కూడా పెన్షన్స్ తీసుకునేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే... సీఎం మాత్రం తాము అధికారంలోకి వచ్చాక రైతుల ఆర్థిక స్థితి బాగుపడిందని బడాయిలు చెప్పారు. జన చైతన్య యాత్రలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు అక్కడే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ 1 కన్వెన్షన్ హాలులో పార్టీ ముఖ్యనాయకుల సమావేశం అయ్యారు. చివరగా అంగన్వాడీ, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. -
చంద్రబాబువన్నీ బడాయి మాటలే
-
’సిరిసిల్ల సెస్‌లో నకి‘లీలలు’
ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కక్కుర్తి నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ముష్టిపల్లి ఏఎల్ఎం చంద్రయ్య సస్పెనషన్ మరికొందరిపై అనుమానం సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల సెస్‌లో మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. టెండర్లు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు కొనుగోలులో తలెత్తిన వివాదం సమసిపోకముందే..ఉద్యోగులు అక్రమ బాట్టారు. తప్పుడు పత్రాలు సమర్పించి ప్రమోషన్లు పొందారు. ఈ వ్యవహారం విచారణలో తేలడంతో ఎండీ నాంపెల్లిగుట్ట సిరిసిల్ల మండలం ముష్టిపల్లిలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న ఏ.చంద్రయ్యను శనివారం సస్పెండ్ చేశారు. గతేడాది హెల్పర్ నుంచి అసిస్టెంట్ లైన్మెన్గా ప్రమోషన్ పొందిన చంద్రయ్య నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడు. తేలింది ఒకటి..తేలాల్సినవి ఎన్నో..? సెస్‌లో హెల్పర్లు, అసిస్టెంట్ హెల్పర్లు, పదోన్నతుల కోసం అక్రమ మార్గాలను అనుసరించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రమోషన్ కోసం ఐటీఐ తత్సమాన కోర్సుల సర్టిఫికెట్లు అవసరంకాగా ఆయా అర్హతలు లేనివారు అక్రమబాట పడుతున్నారు. ఇటీవల సుమారు 160 మంది వరకు అసిస్టెంట్ హెల్పర్లు, హెల్పర్లు పదోన్నతులు పొందారు. కొంతమంది అర్హత లేకున్నా..ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చి 12న 37 మంది హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తూ..సెస్ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో చంద్రయ్య ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు పొందిన మరో ఆరుగురు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. ఉద్యోగాలు సమర్పించిన పత్రాలపై ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ. నాంపెల్లిగుట్ట తెలిపారు. -
‘సెస్’ అంతర్గత కలహాలు
పాలకవర్గ సమావేశానికి మెజారిటీ సభ్యుల డుమ్మా కొను‘గోల్మాల్’పై గుర్రు ఒక్క డైరెక్టర్‌ను రప్పించేందుకు విఫలయత్నం చివరకు కోరమ్ లేక 16వ తేదీకి వాయిదా ‘సాక్షి’ కథనాలపై చర్చ సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పాలకవర్గ సమావేశం శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మెజారిటీ డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల ఆఫీస్‌లో పాలకవర్గ సమావేశం ప్రారంభమైంది. 11 మంది డైరెక్టర్లున్న ‘సెస్’లో ఆరుగురు డైరెక్టర్లు ఉంటేనే పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశానికి ఐదుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో కోరమ్ లేక సమావేశం వాయిదా పడింది. ఆగస్ట్ 16న మళ్లీ నిర్వహించాలని చైర్మన్ లక్ష్మారెడ్డి నిర్ణయించారు. కొను‘గోల్మాల్’పై అసంతృప్తి.. సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో 70 ట్రాన్స్ఫార్మర్లు, 1500 విద్యుత్ స్తంభాలు టెండర్లు లేకుండానే ఇటీవల కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు తీసుకుని కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. సంస్థ కొనుగోలు వ్యవహారాలపై ‘సాక్షి’లో వరస కథనాలు వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించకుండా కొనుగోలు చేయవద్దని కోరుతూ మెజారిటీ డైరెక్టర్లు ఇదివరకే ‘సెస్’ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందించారు. అయినా వాని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పర్చేజ్ కమిటీ ఆమోదంతో కొనుగోళ్లు చేయడంపై డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి ఆరుగురు డైరెక్టర్లు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ‘సాక్షి’ కథనాలపై చర్చ.. ‘సెస్’లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోళ్లపై ‘సాక్షి’లో వరస కథనాలు వచ్చాయి. దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో పాలకవర్గ సభ్యులు చర్చించారు. సమావేశానికి హాజరైన వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, పర్చేజ్ కమిటీ సభ్యులు కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, ఏనుగు విజయరామారావు ‘సాక్షి’ కథనాలపై చర్చించారు. ఒక్క డైరెక్టర్ సమావేశానికి వస్తే.. కోరమ్ నిండేది. ఆ ఒక్క డైరెక్టర్‌ను సమావేశానికి రప్పించేందుకు వైస్ చైర్మన్ శ్రీనివాస్ విఫలయత్నం చేసినట్లు తెలిసింది. కాగా, ఆరుగురు డైరెక్టర్లు సమావేశానికి రాక పోవడం చర్చనీయాంశమైంది. ‘సెస్’ డైరెక్టర్లు జడల శ్రీనివాస్, కొక్కు దేవేందర్‌యాదవ్, అల్లాడి రమేశ్, ఎ.లక్ష్మి, రామతీర్థపు రాజు, వెంకటరమణారెడ్డి పాలకవర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంలో ‘సాక్షి’కి లీకేజీ ఇస్తున్నది ఎవరనే విషయమై కూడా సమావేశంలో చర్చించారు. మరోవైపు ‘సెస్’ వ్యవహరాలు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఎలా తెలుస్తున్నాయని పాలకవర్గ సభ్యులు ఆరా తీశారు. ఇకపై టెండర్లు లేకుండా ఏ వస్తువు కొనుగోలు చేయొద్దని సమావేశానికి హాజరైన డైరెక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. టెండర్లు లేకుండా కొనుగోలు చేయడంపై పాలకవర్గం బద్నాం అయినట్లు అంగీకరించడం విశేషం. సిరిసిల్ల ప్రాంతంలో ‘సాక్షి’ వరస కథనాలు, పాలకవర్గ సమావేశానికి కోరమ్ లేక పోవడంతో వారి మధ్య ఉన్న అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీ డైరెక్టర్ల మధ్య కలహాలు చర్చనీయాంశమయ్యాయి. -
సెస్‌లో స్తంభాల కొనుగోల్‌మాల్
రూ.24.33 లక్షలతో 1500 స్తంభాలు మరో 70 స్తంభాలకు పర్ఛేజ్ కమిటీ ఆమోదం కొనుగోళ్లపై సెస్ డైరెక్టర్ల గుర్రు ‘గోల్మాల్’పై మంత్రి పేషీ ఆరా.. ‘సాక్షి’ కథనంపై చర్చ సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో టెండర్లు లేకుండానే విద్యుత్ స్తంభాలను భారీగా కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి తక్కువ రేట్ కోట్ చేసిన వారితో ఒప్పందం చేసుకుని స్తంభాలను కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ నిబంధనలు ఏమీ పాటించకుండానే అత్యవసరం పేరుతో 1500 విద్యుత్ స్తంభాలను రూ. 24.33 లక్షలు వెచ్చించి అత్యవసరం పేరుతో కొనుగోలు చేసింది. 8 మీటర్ల పొడువుండే స్తంభానికి రూ.1595, 9.1 మీటర్లు పొడువుండే స్తంభానికి రూ.3100 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. ఇవన్నీ గత నాలుగు నెలల్లో కొత్తగా సెస్ పాలకవర్గం వచ్చిన తరువాతనే కొనుగోలు చేశారు. స్తంభాలను అత్యవసరంగా కొనుగోలు చేయడానికి సెస్ బైలాలో అవకాశం ఉన్నా... టెండర్లు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇటీవల కాలంలో సిమెంట్, ఐరన్ రేట్లు తగ్గినా పాత రేట్ల ప్రకారమే కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సిరిసిల్ల మండలం మండెపల్లి, వేములవాడ మండలం అగ్రహారం వద్ద ప్రై వేటు వ్యక్తులు స్తంభాల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే 1500 స్తంభాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మరో 70 స్తంభాలకు ఆర్డర్లు ఇప్పటికే కొనుగోలు చేసిన 1500 స్తంభాలకు తోడు కొత్తగా మరో 70 స్తంభాలు కొనుగోలు చేసేందుకు సెస్ పర్ఛేజ్ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు డి.తిరుపతి, కె.మల్లారెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టెండర్లు లేకుండా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడంపై మెజార్టీ డైరెక్టర్లు అభ్యంతరం చెప్పగా, కొత్తగా కొనుగోలుకు పర్ఛేజ్ కమిటీ ఆమోదం తెలుపడం మరో వివాదానికి తెరలేపింది. గాలివానల కారణంగా సెస్ పరిధిలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం సహజం. నాణ్యమైన స్తంభాలు కొనుగోలు చేయడంలో సెస్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. స్తంభాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతుందని సెస్లోని ఉద్యోగులే పేర్కొంటున్నారు. నాసిరకం కొనుగోళ్లలో కమీషన్లు దండుకోవడం ఎలా ఉన్నా.. దీర్ఘకాలికంగా ఉండాల్సిన స్తంభాలు కూలిపోతే వినియోగదారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందనే వాదన ఉంది. మంత్రి కేటీఆర్ దష్టికి కొనుగోళ్లు.. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు దష్టికి ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ డైరెక్టర్ తీసుకెళ్లినట్లు సమాచారం. అవినీతిరహితంగా, పారదర్శకంగా సెస్ సేవలందించాలని మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతుంటారు. అందుకు భిన్నంగా టెండర్లు లేకుండానే భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు కొనుగోలు చేయడంపై సెస్ డైరెక్టర్ మంత్రికి వివరించినట్లు సమాచారం. సెస్‌లో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై మంత్రి పేషీ నుంచి ఆరా తీసినట్లు సమాచారం. దీనికి సెస్ కీలక అధికారులు సంబంధిత పత్రాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయమై సెస్ ఎండీ కె.నాంపల్లిగుట్టను బుధవారం సాయంత్రం ఫోన్లో వివరణ కోరగా.. సంస్థ పెద్దలనే ఆ విషయం అడగండి అంటూ ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం రూ.కోటి
శ్రీకాకుళం కల్చరల్ : గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం కోటి రూపాయలుగా నిర్ణయించమని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరికట్ల విఠల్‌రావు అన్నారు. పట్టణంలోని గ్రంథాలయ సంస్థలో కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాల్డుతూ ఈ ఏడాది రూ.40 లక్షల మేర గ్రంథాలయ సెస్సు వసూలైందన్నారు. గత ఏడాది రూ.60లక్షలు వసూలైందని చెప్పారు. ఈ ఏడాది కోటి రూపాయలు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందడుగువేస్తున్నామని అన్నారు. గార, కోటబొమ్మాళి, కొత్తూరు గ్రంథాలయాలకు నూతన భవనాలు కోసం రూ.20లక్షలతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో పనిచేయని 14 బుక్ డిపాజిట్ కేంద్రాలను రద్దు చేసి, అవసరం ఉన్న చోట వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజాం శాఖా గ్రంథాలయం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయినందున త్వరలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ నిర్వాహకులు విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వజ్రపుకొత్తురు గ్రంథాలయాధికారి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో సస్పెన్షన్ విధించామన్నారు. ఈ సందర్భంగా 2016–17 ఏడాదికి గాను పౌరగ్రంథాలయ సంచాలకుల ఆమోదంతో వచ్చిన బడ్జెట్లోని అంచనాలను, వివిధ పద్దుల కింద కేటాయింపులను సభ ఆమోదించింది. సమావేశంలో సంస్థ కార్యదర్శి కె.కుమారరాజా, బోర్డు డైరెక్టర్ తెలుగు నాగేశ్వరరావు, డీపీఆర్వో ఎల్.రమేష్, డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి నారాయణరావు, వయోజన విద్య సహాయ ప్రాజెక్టు అధికారి కె.డొంబు, డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్ ఏ.వి.ప్రసాద్ పాల్గొన్నారు. -
సేవలపై కొత్తగా 0.5 శాతం వ్యవసాయ సెస్
పన్ను పరిధిలోని అన్ని సేవలపై ఈ ఏడాది జూన్ 1 నుంచి 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగానికి నిధులు సమకూర్చేందుకు ఈ సెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయ పంపులు, ఎరువులపై ఎక్సైజ్ డ్యూటీని త గ్గిస్తామని, శీతల గిడ్డంగుల పరికరాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించివేస్తామని తెలిపారు. మొత్తంగా ఈ బడ్జెట్ రైతుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. సాగులో ఆదాయం పెంచే దిశగా ఆలోచనలు చేయడం బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం. సాగులో మార్పు తేవడం కోసం విత్తు నాటారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. వీటి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించడం సబబుగా ఉంది. అలాగే కొత్తగా విధించిన వ్యవసాయ సెస్ ఆహ్వానించదగ్గది. స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త -
'స్వచ్ఛ' బాదుడు!
పప్పులు, కూరగాయలు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ భగ్గునమండుతున్నాయి. దీన్నుంచి తమను రక్షించగలవారెవరో అర్ధంకాక సామాన్య పౌరులు విలవిల్లాడుతున్నారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహిస్తున్నారు. సరిగ్గా తమ వంతు బాదుడుకూ ఇదే సమయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భావించినట్టున్నారు. అన్ని రకాల సేవలపైనా 'స్వచ్ఛ భారత్' సెస్ పేరిట 0.5 శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది ఆదివారంనుంచి అమల్లోకొచ్చింది. 14 శాతంగా ఉండే సర్వీస్ టాక్స్ కాస్తా 14.5 శాతం అయింది. ఫలితంగా పన్ను పరిధిలోకొచ్చే అన్ని సేవలూ మరింత ప్రియమయ్యాయి. ఫోన్ చార్జీలు మొదలుకొని రెస్టరెంట్లలో తినుబండారాల వరకూ ప్రతి దానిపైనా ఈ సెస్ మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా 'స్వచ్ఛభారత్' సెస్ ద్వారా రూ. 3,800 కోట్ల ఆదాయం లభిస్తుందని, ఏటా ఇది రూ.10,000 కోట్ల వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రకటించి, మహాత్ముడి జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని స్వాగతించనివారంటూ లేరు. పరిశుభ్రత లోపించడంవల్ల ఏటా భారత్ 2 లక్షల 44 వేల కోట్లు నష్టపోతున్నదని ప్రపంచబ్యాంకు అంతటి సంస్థ చెప్పాక ఇలాంటి కార్యక్రమాన్ని కాదనేదెవరు? 2019లో రాబోయే మహాత్ముడి 150వ జయంతినాటికల్లా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికల్లా మరుగుదొడ్డి లేని ఇల్లుకానీ, విద్యా సంస్థకానీ, కార్యాలయంకానీ ఉండరాదని...బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పేలా ప్రజానీకంలో చైతన్యం పెంచాలని సంకల్పించారు. సకల రంగాలవారూ ఈ కార్యక్రమంలో భాగస్తులయ్యారు. 'స్వచ్ఛ భారత్' అంటే సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వరకూ అందరూ రోడ్ల మీదికొచ్చి ఊడ్వడమేనన్నంతగా ఆ కార్యక్రమం సాగింది. అది తీసుకొచ్చిన మార్పేమిటో ఎవరి కంటా పడకుండానే ఆ కార్యక్రమం పేరిట ఇప్పుడు సెస్ వసూళ్లు కూడా మొదలయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశ పౌరులందరి ప్రమేయం ఉండేలా చూడటం కోసమే సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అపరిశుభ్రత వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్నాయని, వీటి బారినుంచి ప్రజలను కాపాడటానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సెస్ అవసరమని వివరించింది. దీన్ని మరో పన్నుగా భావించవద్దని కూడా విన్నవించింది. పన్నులకూ, సెస్కూ తేడా ఉంటుంది. సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టదల్చుకుని విధించేది. సామాన్య పౌరులకు సంబంధించినంతవరకూ పేర్లలో తేడా తప్ప ఆచరణలో రెండూ ఒకటే...తమనుంచి అదనంగా గుంజడం. కేంద్ర ప్రభుత్వానికొచ్చే లాభం వేరు. పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుని తీరాలి. సెస్‌కు అలాంటి బెడద ఉండదు. సంపాదనంతా తనదే. తాజా సెస్‌పై విపక్షాల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన అభ్యంతరం కూడా ఇదే. ఒకపక్క పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం గణనీయంగా తగ్గిస్తూ వాటిని బికారులుగా మారుస్తున్నదనీ...కొత్తగా వచ్చే ఆదాయానికి సెస్ పేరుపెట్టి అసలుకే వాటా ఇవ్వనవసరం లేని స్థితి కల్పించుకుంటున్నదని అవి ఆరోపిస్తున్నాయి. పైగా ఇప్పుడు విధించిన స్వచ్ఛ భారత్ సెస్ ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్రం ఎలా ఖర్చు చేయదల్చుకున్నదన్న అంశంలో స్పష్టత లేదు. ఎందుకంటే మౌలికంగా మరుగుదొడ్లు నిర్మించడంతోసహా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కేంద్రం వసూలు చేయడం మొదలుపెట్టిన సెస్ ద్వారా లభించే మొత్తాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుందా...బదలాయిస్తే అది ఏమేరకు అన్న అంశాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మనకు సెస్‌లు బోలెడున్నాయి. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్, జాతీయ రహదార్ల సెస్, స్వచ్ఛ ఇంధనం సెస్...ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఏటా ఈ సెస్‌ల ద్వారా లక్షా 16 వేల కోట్ల రూపాయల మొత్తం కేంద్రానికి లభిస్తున్నది. ప్రధానమైన రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ సెస్ అనేది కేంద్రానికి కీలక ఆదాయ వనరుగా మారిందన్నది నిజం. సర్చార్జిలు కూడా రాష్ట్రాలతో పంచుకోనవసరంలేని మరో ఆదాయ వనరు. ఇలా సెస్‌లు, సర్‌చార్జిల ద్వారా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ అందులో తమకు వాటా దక్కనీయడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి తాము అమలు చేయబోయే సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ)వల్ల అలాంటి సమస్యలు చాలావరకూ తీరతాయని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. అందుకోసమే పరోక్ష పన్నుల సంస్కరణలకు తోడ్పడే ఈ విధానానికి అందరూ సహకరించాలంటున్నది. ఇలాంటి సమయంలో స్వచ్ఛ భారత్ సెస్ తీసుకురావడం సరైందే అవుతుందా? విధించదల్చుకున్న పన్నులు, సెస్‌లు, సర్చార్జిలవంటి వాటిని బడ్జెట్ సమర్పించేటపుడు వెల్లడించే ఆనవాయితీ నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో తప్పుకున్నాయి. బడ్జెట్‌కు ముందో, తర్వాతో వాటిని విపరీతంగా పెంచడం...బడ్జెట్లో మాత్రం ఎలాంటి పన్నులూ, ఇతర బాదుళ్లూ లేవని ప్రకటించుకోవడం రివాజుగా మారింది. వాస్తవానికి మరో నాలుగు నెలల్లో ఎటూ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈలోగా అందరితో చర్చించి, ఈ సెస్ ద్వారా సమకూర్చదల్చుకున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారో చెప్పి...అందులో రాష్ట్రాల ప్రమేయం ఏమిటో వివరించి ఆ బడ్జెట్లో దాన్ని చూపవచ్చు. ప్రభుత్వం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. వాస్తవానికి మన దేశంలో పారిశుద్ధ్యాన్ని జీవనాధారంగా చేసుకున్నది అట్టడుగు వర్గాలవారే. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అయితేనేమి... రీసైక్లింగ్‌కు ఉపయోగపడేవాటిని సేకరించి అమ్ముకోవడంలో అయితేనేమి అలాంటివారు ఎన్నో అనారోగ్య సమస్యలను, ఇతర రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వసూలు చేయడం ప్రారంభించిన సెస్ ద్వారా సమకూరే నిధుల్ని అలాంటివారి సాంఘిక భద్రతకూ, ఆరోగ్యానికీ, వారి పనిలో ఉపయోగపడే ట్రైసైకిళ్ల కొనుగోలుకూ, వారి అవసరాలకు ఉపయోగపడేలా చిన్న చిన్న రుణాలిచ్చేందుకూ, చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులకూ వినియోగిస్తే అర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. -
పెట్రోల్, టెలికంలపై సెస్!
స్వచ్ఛభారత్ కోసం ప్రత్యేక పన్ను సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ అభియాన్ కోసం టెలికం, పెట్రోల్‌పై పన్ను విధించాలని కేంద్రానికి సిఫారసు చేయాలని నీతీ ఆయోగ్ ముఖ్యమంత్రుల ఉపకమిటీ బుధవారం నిర్ణయించింది. వీటితో పాటు బొగ్గు, ఉక్కు వంటి ఖనిజాలపై కూడా పన్ను విధించటం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని అభిప్రాయపడింది. స్వచ్ఛభారత్ అవసరమైన కోసం ఆర్థిక భారాన్ని 75% కేంద్రం భరించేలా, 25% రాష్ట్రాలు భరించేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. కమిటీ కన్వీనర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఉపకమిటీ, స్వచ్ఛభారత్ అభియాన్ కోసం పలు సూచనలు చేసింది. తాము చేసిన సిఫార్సులతో పది రోజుల్లోగా నివేదికను రూపొందించి ప్రధానికి అందజేస్తామని బాబు ఆ తరువాత మీడియాకు వివరించారు. పొడి, తడి చెత్త... వ్యర్థాలు, మురుగునీరు పునర్నినియోగానికి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15,000లు చెల్లించాలని సిఫార్సు చేశామన్నారు. -
‘సెస్’ వినియోగంపై ఆర్టీసీ దృష్టి
ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల నుంచి ప్రతి టికెట్‌పై వసూలు చేసే సెస్‌ను నిర్దేశిత లక్ష్యం కోసం ఖర్చు పెట్టే విషయంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్టాండ్ల వారీగా అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి తక్షణ పరిష్కారం కోసం ఆ నిధులు విడుదల చేస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల తక్షణ పరిష్కారం కోసం పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున వసూలు చేసే సెస్ దారిమళ్లుతున్న తీరుపై మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి ఆర్టీసీ జేఎండీ రమణారావు మంగళవారం వివరణ ఇచ్చారు. సెస్ మొత్తాన్ని ప్రయాణికులకు వసతులు కల్పించటం, సమస్యలు పరిష్కరించేందుకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెస్ రూపంలో వసూలయ్యే మొత్తంలో రూ.21 కోట్లను తక్షణ సమస్యల పరిష్కారానికి కేటాయించినట్టు చెప్పారు. ఇందులో రూ.7 కోట్లు మరమ్మతులకు, పారిశుధ్య పనుల నిర్వహణకు, తాగునీటి వసతి మెరుగుకు, రూ.14 కోట్లను బస్సు స్టేషన్ల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్స్‌కు కేటాయించినట్టు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాలు పెరగడం, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా అభివృద్ధి పనులు, వారి అవసరాలకు నిధులు కేటాయించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. దీంతోనే సెస్‌ను అమల్లోకి తెచ్చినట్టు వివరించారు. -
సెస్సు.. లెస్సు!
బి.కొత్తకోట: జిల్లాలో సెస్సు సొమ్ము గ్రంథాలయ సంస్థకు చేరడం లేదు. స్థానిక సంస్థలు రూ.3.50 కోట్ల వరకు బకాయిపడ్డాయి. ఇందులో చిత్తూరు మున్సిపాలిటీ అత్యధికంగా రూ.1.19 కోట్లు చెల్లించాలి. వసూలు కాకపోవడంతో అధికారులు ఆయా సంస్థలు, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 1,363 మైనర్, మేజర్ పంచాయతీలు, ఆరు మున్సి పాలిటీలు, రెండు కార్పొరేషన్లున్నాయి. ఇందులో మొత్తం 71 గ్రంథాలయాలు నడుస్తున్నాయి. వీటిలో 12 గ్రంథాలయాలు మున్సిపాలిటీల్లో ఉండగా, మిగిలినవి మండల కేంద్రాల్లో ఉన్నాయి. 7 మండలాల్లో గ్రంథాయాలులేవు. పంచాయతీలు 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు సెస్సు రూపంలో కోట్ల సొమ్ము బకాయిపడ్డాయి. స్థానిక సంస్థలు ఇంటి పన్ను, కొళాయి పన్నులతో వసూలయ్యే సొమ్ములో 8 శాతం నిధులు గ్రంథాలయ సంస్థకు చెల్లించాలి. ఇది ఏ ఏడాదికి ఆ ఏడాది చెల్లింపులు చేయడంలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. గ్రంథాలయ సంస్థ అధికారుల సమాచారం మేరకు పంచాయతీల నుంచి రూ.1.22 కోట్ల సెస్సు అందాల్సి ఉంది. ఇది గతంలోనిది. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల పన్నుల డిమాండ్ రూ.17,07,80, 000. ఇందులో 8 శాతం సెస్సుగా రూ.1.36 కోట్లు చెల్లించాలి. పన్నులు ప్రస్తుతానికి రూ.8,94,23,000 వసూలు చేశారు. ఇందులో సెస్సుగా రూ.72 లక్షలు చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరాల్లో వసూలుచేసిన పన్నుల్లో 8 శాతం చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శుల నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేస్తున్నారు. వసూలైన సొమ్ములో సెస్సును చెల్లించాలని కోరుతున్నారు. పంచాయతీల పరిస్థితి ఇలావుంటే మున్సిపాలిటీలు దీనికి మరింత భిన్నంగా ఉన్నాయి. చిత్తూరు, పుత్తూరు, నగిరి, మదనపల్లె మున్సిపాలిటీలు రూ.2.04 కోట్లు చెల్లించాలి. ఇందులో చి త్తూరు మున్సిపాలిటీ రూ.1.19 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం సొమ్ము వసూలుగాక గ్రంథాలయ సంస్థ అధికారులు తంటాలు పడుతున్నారు. సెస్సుతో ఏం చేస్తారంటే సెస్సు సొమ్ముతో గ్రంథాలయాలకు వసతులు సమకూర్చాలి. పాఠకులకు పుస్తకాలు, దినపత్రికలు ఇలా అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలి. భవనాలకు అద్దె, కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలి. అయితే నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. నోటీసులిస్తున్నాం సంస్థకు రావాల్సిన సెస్సు కోసం పంచాయతీలకు నోటీసులిస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి విన్నవించాం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు తమకు సంబంధంలేదని అంటున్నారు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు అందితే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి. -పీ.రమ, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి, చిత్తూరు సగం ఇచ్చాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.8.94 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇందులో 8 శాతం గా చెల్లించాల్సిన రూ.72 లక్షల్లో రూ.35 లక్షలు చెల్లించాం. పాత బకాయిలు రూ.90 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా చర్యలు తీసుకొంటాం. -ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి -
తలసరి వ్యయంలో తెలంగాణ భేష్
* ‘సెస్’ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తలసరి వ్యయం, విజ్ఞానం, జీవితకాల పెరుగుదల గతంలో కంటే మెరుగుపడింది. తెలంగాణలో మానవ వనరుల అభివృద్ధి సూచికను రూపొందిస్తున్న ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’(సెస్) ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక, గణాంక నిపుణు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహోనిలోబస్ జయంతిని జాతీయ గణాంక దినోత్సవంగా జరుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ‘సెస్’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ‘సెస్’ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం పైమూడు రంగాల్లో తెలంగాణ గతంలో కంటే కొంత ముందంజలో ఉంది. అయితే ర్యాంకుతో పోల్చితే పెద్దగా మార్పు రాలేదు. పై విషయాల్లో ఏపీ పదో స్థానం, తెలంగాణ రాష్ట్రం పన్నెండో స్థానంలో ఉన్నట్లు వివరించారు. తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సూచిక మరో పక్షం రోజుల్లో పూర్తిస్థాయిలో సెస్ రూపొందించి ప్రభుత్వానికి అందచేయనుంది. -
సింగరేణికి కార్మికశాఖ షాక్!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కి కార్మికశాఖ షాక్ ఇచ్చింది. భవన నిర్మాణం ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం 1996 ప్రకారం సెస్ చెల్లించాలంటూ సింగరేణికి నోటీసులు జారీ చేసింది. నిర్మాణ వ్యయంలో 2 శాతానికి మించకుండా ఒక శాతానికి తక్కువ కాకుండా సెస్సు చెల్లించాలి. సింగరేణి చేపడుతున్న మైనింగ్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నేపథ్యంలో కార్మికశాఖ ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే తాము ఈ చట్టం కిందకు రామని సింగరేణి వాదిస్తోంది. తమకు కేవలం మైనింగ్ చట్టం మాత్రమే వర్తిస్తుందని అంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్ వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంటుకు కూడా ఈ చట్టం వర్తించదని ఫ్యాక్టరీల చట్టం వర్తిస్తుందని సింగరేణి పేర్కొంటోంది. మరోవైపు సెస్సు చెల్లించాల్సిందేనని కార్మికశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెస్ రూపంలో కోట్ల రూపాయల మొత్తాన్ని సింగరేణి చెల్లించాల్సిరానుందని సమాచారం. ఇదే జరిగితే కొద్దిగా లాభాల్లో ఉన్న సింగరేణికి భారీ షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెస్ మొత్తాన్ని బొగ్గు ధరలు పెంచడం ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే అంతిమంగా బొగ్గు ధరలు పెరిగి ఆ భారం విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపైనే పడనుంది!