అవును ఆయన మారలేదు... | andhra pradesh cm chandrababu naidu a bundle of lies again | Sakshi
Sakshi News home page

అవును ఆయన మారలేదు...

Published Tue, Nov 1 2016 4:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అవును ఆయన మారలేదు... - Sakshi

అవును ఆయన మారలేదు...

ఒంగోలు:  ఆయన మారలేదు..అవును ఆయన ఏ మాత్రం మారలేదు. అందరి సాక్షిగా మళ్లీ అదే బడాయిలు. అవే  అబద్ధాలు. అదే తీరు...అవును ఆయనే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మరోసారి మాటలతో కోటలు కట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం చంద్రబాబు జనచైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలను ఏకరవు పెట్టారు.

ఓ పక్క రుణమాఫీ కాక రైతులు, డ్వాక్రా మహిళలు అల్లాడుతుంటే.... ఇంకోపక్క మాఫీ అద్భుతంగా చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లక్షలాది  పెన్షన్స్‌ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గతంలో దెయ్యాలు కూడా పెన్షన్స్‌ తీసుకునేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే... సీఎం మాత్రం తాము అధికారంలోకి వచ్చాక రైతుల ఆర్థిక స్థితి బాగుపడిందని బడాయిలు చెప్పారు.

జన చైతన్య యాత్రలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు అక్కడే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ 1 కన్వెన్షన్‌ హాలులో  పార్టీ ముఖ్యనాయకుల సమావేశం అయ్యారు. చివరగా అంగన్‌వాడీ, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement