Lies
-
చంద్రబాబు మరో అబద్ధం.. వైఎస్ జగన్ కౌంటర్
సాక్షి, అమరావతి: గోబెల్స్ ప్రచారాల్లో చంద్రబాబును మించిన వాళ్లు మరెవరూ లేరనే విషయం.. మరోసారి రుజువైంది. అబద్ధాల్ని సృష్టించడం.. వాటిని అంతే అందంగా అమ్ముకోవడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిలాంటి ఉన్నతస్థానంలో ఉండి.. అదీ మీడియా ముందుకు వచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది కూడా. తాజాగా.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంతో నిన్నంతా నడిచిన నాటకీయ పరిణామాలు తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్‌గా చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.‘‘జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు. ఆయన్నేదో(జగన్‌ను ఉద్దేశిస్తూ..) ఆపేశారని.. నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. సూటిగా అడుగుతున్నా.. నిన్ను వెళ్లవద్దని ఎవరైనా ఆపారా?. నోటీసులు ఉంటే మీడియాకు చూపించండి. ప్రజా జీవితంలో ఉండే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది’’ అని చంద్రబాబు మాట్లాడారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తాను అంటే.. పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమంలో ఎవరూ పాలు పంచుకున్నా.. అందరినీ అరెస్ట్ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నారు. ఆలయానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటో? అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నోటీసుల్లోని విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. దీంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం.. బయటపడింది. ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే! -
బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కులను ప్రశ్నించారు. ఎలాంటి భయాలు లేకుండా ప్రతీ ఒక్క భారతీయుడు నచి్చన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ భారత్‌లో ఉండకూడదా? అని రాహుల్ అన్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీ తన నోరు మూయించేందుకు విఫలయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటిలాగే బీజేపీ అబద్ధాలను ఆశ్రయిస్తోంది. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిరాశతో నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌ను నిర్వచించే విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ.. గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను’ అని రాహల్ పేర్కొన్నారు. అమెరికాలో సిక్కును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. -
పల్లెలపై బాబు విషం..
-
ఆఖరికి.. ఏపీ అసెంబ్లీలోనూ అబద్ధాలు!
అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు. వాస్తవానికి.. జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్ పాలన కొనసాగింది. సంబంధిత వార్త: జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!. సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే. సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగుఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి. -
అబద్ధాలు, అర్ధసత్యాలు.. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
సాక్షి, విజయవాడ: అబద్ధాలు, అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు.చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్‌ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే అంశాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. సీడబ్ల్యూసీ డిజైన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. వైఎస్ జగన్‌పై నిందమోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.భజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పనుల్లో జాప్యం
-
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి. -
కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలే: బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక అబద్ధాల పుట్ట అని బీజేపీ విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది శుక్రవారం(ఏప్రిల్ 5) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదని గుర్తు చేశారు. ‘ప్రతిపక్ష పార్టీ నిజంగానే అత్యంత పురాతన పార్టీ. ప్రస్తుతం తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతోంది. ‘ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసింది. కాంగ్రెస్ హయాంలో దవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి తక్కువగా ఉంటుంది. మహిళలకు నగదు విషయంలో రాహుల్ గాంధీది ఒక మాట. ఖర్గేది ఒక మాట. ఇవన్నీ తప్పుడు హామీలే. మేనిఫెస్టోలో విదేశాల్లోని పలు ప్రాంతాల ఫొటోలు వాడుతున్నారు. న్యూయార్క్‌లోని బఫెలో రివర్, థాయ్‌లాండ్ చిత్రాలు ఎందుకు వాడారు’అని త్రివేది ఫైర్ అయ్యారు. కాగా, శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలిసి రిలీజ్ చేశారు. ఇదీ చదవండి.. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ -
Lok Sabha Elections 2024: అబద్ధాల సర్దార్ మోదీ: ఖర్గే
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముమ్మాటికీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మన దేశ భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. దేశ క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రధానమంత్రి.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో తీరిక లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటున్న మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఖర్గే ఆరోపించారు. మోదీ గ్యారంటీల డ్రామా సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. -
మోదీవి పచ్చి అబద్ధాలు: ఖర్గే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు. ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్‌కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు. -
AP: ఇవన్నీ కౌరవసేన పన్నాగాలు కావా?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా మాట్లాడడంలో తనకు తానే సాటి. ఏపీలో కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అయిందని ఆయన చెబుతున్నారు. కనిగిరి, తదితర చోట్ల జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ ఏవేవో అబద్దాలు వల్లె వేశారు. 2024 ఎన్నికలలో పాండవులదే గెలుపు అని అన్నారు. ఆయన తనకు తెలియకుండానే ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారన్నమాట. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు గెలిచారు కాబట్టి వారిని పాండవులు అనవచ్చా! ఇప్పుడు కూడా ఆయన కనిపించిన వారినందరిని బతిమలాడుకుని పొత్తులు పెట్టుకుని కౌరవ సేనను తయారు చేస్తున్నారు. ✍️వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి జగన్ భారతంలో అర్జునుడు మాదిరి ఒక్కడే పోరాడుతున్నారు. కాని అదే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీని కలుపుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు శకుని మామ మాదిరి కాంగ్రెస్‌తో కూడా రహస్య సంబంధాలు నెరపుతున్నారు. ఇవన్ని కౌరవసేన పన్నాగాలు కావా! తన దిక్కుమాలిన రాజకీయం కోసం భార్య పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటివి నిజంగా జరిగినా పదే, పదే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అన్యాయంగా తన భార్యపై నిందలు మోపుతారా అని బాధపడతారు. కాని చంద్రబాబుకుమాత్రం ఇది కూడా రాజకీయ వ్యూహమే. ✍️నిజానికి శాసనసభలో ఆయన భార్యను ఎవరూ ఏమీ అనేలేదు. టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, లోకేష్‌కు మధ్య వివాదంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఒకవైపు లోకేష్ తన సోషల్ మీడియా టీమ్ ద్వారా వంశి భార్యను, కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయించారట. దాంతో ఆయనకు మండి ఏవో వ్యాఖ్యలు చేశారు. అసలు ముందుగా తన కుమారుడికి ఇలా వ్యాఖ్యలు చేయవద్దని సలహా ఇవ్వవలసింది పోయి తాను కూడా ఆ గొడవలోకి రావడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించడం శోచనీయం. ✍️చంద్రబాబు అధికార రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతారని అంటారు. కాని ఇందులో కూడా ఆయన కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారనుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ఒక్క శ్రీకృష్ణుడి సాయం మాత్రమే తీసుకుంటారు. కౌరవులు మాత్రం పద్దెనిమిది అక్షోహినిల సేనలతో యుద్దానికి వెళతారు. ఆ విషయం తెలియదో, ఏమో కాని చంద్రబాబు తనను పాండవులతో పోల్చుకోవడం చిత్రంగా ఉంటుంది. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని నేరుగాను, సీపీఐ, సీపీఎం వంటి పక్షాలను పరోక్షంగాను మేనేజ్ చేస్తూ, బీజేపీలోని టీడీపీ నేతలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అంటే వీరంతా కౌరవులమాదిరి తయారై పాండవులుగా ఉన్న జగన్‌పై యుద్దానికి దిగుతున్నారన్నమాట. ✍️తెలుగుజాతికి స్వర్ణయుగం తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారట. పేదవారిని ఆర్ధికంగా అభివృద్ది చేస్తారట. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన ఇప్పుడు పేదలనుపైకి తీసుకువస్తానంటే నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలుపెట్టుకున్నారా?. రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆయన అంటున్నారు.అసలు ఏమైంది రాష్ట్రానికి? కేవలం ఆయనకు, ఆయన కుమారుడికి అధికారం లేకపోతే తెలుగు జాతి అంతా కష్టాలలో ఉన్నట్లుగా ప్రచారం చేస్తుంటారు. దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు డప్పు కొడుతుంటాయి. రాష్ట్ర చరిత్రలో పేదలను ఇంతగా ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒకప్పుడు చంద్రబాబు ఏది ఫ్రీగా దొరకదు అని అనేవారు.ఇప్పుడేమో అన్నీ ఫ్రీ అంటున్నారు. తద్వారా రాష్ట్రాన్ని బాగు చేస్తారట. ✍️అధికారంలోకి వచ్చాక సొంత తల్లిని, చెల్లిని గెంటేశారని చంద్రబాబు అనడం ఏమిటి? జగన్ ఎక్కడా వారిపట్ల అనుచితంగా వ్యవహరించలేదు. తల్లి కొద్ది రోజుల క్రితం కూడా ఇడుపులపాయలో జగన్‌తో కలిసి ముద్దుపెట్టుకున్న సంగతి చంద్రబాబుకు తెలియదా! కాని అదే చంద్రబాబు నాయుడు తన సొంత మామ ఎన్.టి.రామారావు నుంచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి అన్నిటిని లాగేసుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారు. చంద్రబాబులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన ఎంత చండాలపు పనిచేసినా, దానిని ఒక మహోన్నతమైన విషయంగా ప్రచారం చేసుకుంటారు. ఎదుటివారి మీద తట్టెడు బురద వేస్తుంటారు.. ✍️జగన్ పిడి గుద్దులు గుద్దుతున్నారట. పేదలకు నేరుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా స్కీములు అమలు చేయడం పిడిగుద్దులు ఎలా అవుతాయో ఆయనకే తెలియాలి. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను మార్చుతున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి టీడీపీలో ఆయన చేసిన మార్పులు, చేర్పుల గురించి ఏమంటారు. ఓటమి భయంతోనే తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పంకు ఆయన వెళ్లారని ఒప్పుకుంటున్నారా? వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పుపై అక్కడ పనికిరాని చెత్త మరోచోట పనికి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అదే సిద్దాంతం టీడీపీకి కూడా వర్తిస్తుంది కదా! ✍️చంద్రబాబు చంద్రగిరిలో పనికిరాకపోయినా, కుప్పంలో ఎలా పనికి వచ్చారు? తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలందరికి పదిహేను వేలచొప్పున ఇస్తారట. దీని కోసం ప్రతివారు ముగ్గురు పిల్లలను కనీసం కనాలట. ఏ మాత్రం విజ్ఞత ఉన్న సీనియర్ నేత అయినా ఇంత అసంబద్దంగా మాట్లాడతారా! ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమట. ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచితప్రయాణమట. సూపర్ సిక్స్ అంటూ ఇలా లక్షల కోట్ల వ్యయం అయ్యే స్కీములను ప్రచారం చేస్తున్న తీరును జనం నమ్ముతారా!. ✍️ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీములతోనే రాష్ట్రం నాశనం అయిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు ఒక పక్క ప్రచారం చేస్తుంటారు. కాని చిత్రం ఏమిటంటే, మరో పక్క ఆయా సంక్షేమ స్కీములకు గాను జగన్ వ్యయం చేసేదానికన్నా ఐదురెట్లు డబ్బు ఖర్చు చేస్తానని చంద్రబాబు అంటున్నారు. అంటే అన్ని రెట్లు నాశనం చేస్తానని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారా! నిజానికి చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎన్ని రెట్లు నాశనం అవుతుందో ప్రజలు గమనించవలసిన తరుణం ఆసన్నమైంది. చంద్రబాబు మరోసారి జనాన్ని మోసం చేయడానికి సన్నద్దం అవుతున్నారు. లేదా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి సిద్దమవుతున్నారనుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
అదానీ చేతిలోనే బీజేపీ స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ఆదిలాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పకుండా దాచారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అమిత్ షా తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలవేళ బీజేపీ అబద్ధాలు విని రాష్ట్ర ప్రజలు విసిగి పోయా రని, పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి వాళ్లు మాట్లాడాలన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారన్నారు. ఆదిలాబాద్ సీసీఐని తెరిపిస్తామని ఐదేళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హామీ ఏమైందని, గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినా ఇప్పటిదాకా వర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలనపై మాట్లాడితే నవ్వుకుంటున్నారు కుటుంబ పాలన అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య లపై దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని, క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎవరికి కోచింగ్ ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో పదేపదే తిరిగి ఎన్నికవుతున్న నాయకుల గురించి, కుటుంబ పాలన పేరుతో ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షా లాంటి వారికి లేదన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేకపోవడంతో కేవలం మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. -
ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే
శ్రీకాకుళం (పాత బస్టాండ్): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి :శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేలా 2015లో అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టి, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ రైతుల హక్కుల ప్రయోజనాలను తెలంగాణ సర్కారు కాలరాస్తుంటే నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెత్తలేదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సర్కార్‌కు రాయలసీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై మంగళ, బుధవారాల్లో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలేనని తిప్పికొట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా చెంబుడు గోదావరి జలాలను ఎత్తిపోసి.. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను పది రోజులు కూడా నడిపించలేదని.. అదో వృథా ఎత్తిపోతల అని చెప్పారు. అలాంటి దానికి చంద్రబాబు రూ.2,047 కోట్లు ఖర్చు చేశారన్నారు. దాన్ని గడువులోగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్‌కు బహుమానంగా రూ.257 కోట్లను ఇచ్చినట్లు చూపి గుటకాయ స్వాహా చేశారని ఎత్తిచూపారు. గోదావరి కుడిగట్టుపై పర్యావరణ అనుమతి తీసుకోకుండా రూ.1,697 కోట్లు వ్యయం చేసి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను నిర్మించిన చంద్రబాబు.. దాని ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదని గుర్తు చేశారు. ఆ ఎత్తిపోతలపై కూడా టీడీపీ నేతలు ఎన్జీటీలో కేసులు వేయడంతో పనికి రాకుండా పోయిందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పేరుతో రూ.3,744 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన చంద్రబాబు ప్రజాద్రోహి అని ధ్వజమెత్తారు. మీడియాతో మంత్రి అంబటి ఇంకా ఏం చెప్పారంటే.. రూ.68 వేల కోట్లు తినేశానని చెప్పుకో టచంద్రబాబు, కరవు కవల పిల్లలు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 54. కానీ.. 198 ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసినట్లు చంద్రబాబు చెబుతున్నాడు. 198 ప్రాజెక్టులు కాదు.. ప్యాకేజీలు. ప్రాజెక్టులకూ ప్యాకేజీలకు తేడా తెలియదా బాబూ? దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో సులభంగా ఉండే పనులు చేసి, క్లిష్టమైన పనులు చేయకుండా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దాంతో వాటిని ప్రీక్లోజ్ చేసి, ప్రభుత్వ అనుమతితో వాటికి మళ్లీ టెండర్లు పిలిచి.. పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, వాటిని ఆపేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ♦ ప్రాజెక్టులపై 2014–19 మధ్య రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ సర్కార్.. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగింది. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.27,394 కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించాం. దీన్ని బట్టి ప్రాజెక్టు పనుల పేరుతో చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలను దోచేసినట్లు స్పష్టమవుతోంది. ♦ పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన రూ.10,860 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. నీరు–చెట్టు పేరుతో రూ.12,400 కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచిపెట్టారు. ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లను వ్యయం చేశామని కాకుండా తిన్నామని చంద్రబాబు చెప్పుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టులకూ వెన్నుపోటు ♦ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చెబుతున్నట్లు ఎన్టీఆర్ డిజైన్ చేసిన తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను 1995 నుంచి 2004 వరకు చేపట్టకుండా రాయలసీమ ప్రజలకూ వెన్నుపోటు పొడిచారు. ♦ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా చేపట్టాలని రాయలసీమలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని.. ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా కోరావా చంద్రబాబూ? ♦ 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సముద్రం పాలవుతోన్న నదీ జలాలను మళ్లించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞం కింద ప్రాజెక్టులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీలను సింహభాగం పూర్తి చేశారు. ♦ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా రాయలసీమకు మహానేత వైఎస్ న్యాయం చేస్తుంటే.. దాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లో నాగంతో విజయవాడలో దేవినేని ఉమాతో ధర్నాలు చేయించిన చంద్రబాబును రాయలసీమ ద్రోహి అనక ఇంకేమనాలి? నాలుగేళ్లుగా సువర్ణ అధ్యాయం ♦ మహానేత వైఎస్సార్ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తూ జాతికి అంకితం చేస్తున్నారు. పెన్నా బ్యారేజ్, సంగం బ్యారేజ్‌లను జాతికి అంకితం చేయడం ద్వారా చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ లిఖించారు. ఆ బ్యారేజ్‌లను పూర్తి చేశానని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా చంద్రబాబూ? ♦ గండికోట నిర్వాసితులకు సీఎం వైఎస్ జగన్ పునరావాసం కల్పించడంతో పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నాం. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు నిల్వ చేస్తున్నాం. సోమశిల, కండలేరులలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశాం. తెలుగుగంగ కెనాల్‌ను ఆధునికీకరించడం ద్వారా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి.. వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. బ్రహ్మంసాగర్ మట్టికట్ట, లీకేజీలకు అడ్డు్డకట్ట కూడా వేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం వైఎస్ జగన్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఆ ప్రాజెక్టులో 17.85 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. ♦ గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు 20 వేల క్యూసెక్కులను ఆ కాలువ ద్వారా తరలిస్తాం. వెలిగొండ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30–40 రోజుల్లోనే దాన్ని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా రూ.40,880 కోట్లతో రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద కాలువల సామర్థ్యం పెంచడం, రిజర్వాయర్ల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ♦ శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు కూడా కేటాయింపుల మేరకు రాయలసీమకు జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టి ఆ ప్రాంతానికి న్యాయం చేస్తున్నారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి ఆ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించడం ద్వారా వాటిని అడ్డుకుని రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. బాబూ.. ఈ ప్రశ్నలకు బదులివ్వు ప్రాజెక్టు ప్రొటోకాల్స్‌ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులే చేపట్టి, కమీషన్లు కాజేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అస్తవ్యస్తంగా మార్చి.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పోలవరమే. శుక్రవారం పోలవరంపై మాట్లాడతానని చెప్పిన చంద్రబాబుకు సిగ్గు, లజ్జా, చీము, నెత్తురు ఉంటే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాకే పోలవరంపై మాట్లాడు. 1.విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు తీసుకున్నావు? 2.కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎందుకు నిర్మించావు? 3.పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తానని శాసనసభలో శపథం చేసి.. ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలవా? దాదాపు 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లలేని చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతే లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. నువ్వే డిజైన్ చేసి, టెండర్లు పిలిచి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? మహానేత వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులు చేపట్టి 2009 నాటికే 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తూ.. జాతికి అంకితం చేస్తూ.. రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తుండటం కన్పించడం లేదా చంద్రబాబూ? ఇదీ చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్ -
నువ్వే నా ఫస్ట్ లవ్ అని చెబితే అస్సలు నమ్మకండి.. అంతా అబద్దమట
అబద్దం..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్దాలు చెబితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు. వీళ్లలో మగవాళ్లే, ఆడవాళ్ల కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు పరిశోధకులు తేల్చేశారు. మన దేశంలో ఎక్కువగా ఎవరు ఏఏ సందర్భాల్లో అబద్దాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. ►ఎక్కువగా జీవిత భాగస్వామితో అబద్దాలు చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలతో షాపింగ్ చేసేందుకు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటారని తేలింది. ► సారీ.. పనిలో ఉన్నాను,ఫోన్ చూసుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు అని ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు. ► నువ్వే నా ఫస్ట్ లవ్ అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. చాలామంది మగవాళ్లు ఈ అబద్దాన్ని తమ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా ఈ అబద్దం చెబుతారట. ► కొంతమంది మగవాళ్లు రేపట్నుంచి సిగరెట్ మానేస్తాను అని చెప్పి ప్రతిరోజు అదే రిపీట్ చేస్తారట. ► ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దామని అడిగితే, ఇష్టం లేకపోతే పని ఉందని అబద్దం చెబుతారట. ► చాలామంది తమ దగ్గర చేతులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరట. అప్పు అడిగితే ఇప్పుడు లేవు అని అబద్దాలు చెబుతున్నారట. ► కొంతమంది నోరు తెరిస్తే అబద్దాలు చెబుతుంటారు. అలా దొరికిపోతారు కూడా..అయినా సరే, ఇప్పుట్నుంచి అబద్దాలు చెప్పను అని మళ్లీమళ్లీ చెబుతుంటారు. ► అనుకున్నా టైం కంటే ఆలస్యమైతే, సారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను అని ఈజీగా అబద్దాలు ఆడేస్తారట. ► ఆడవాళ్లలో చాలామందికి పొసెసివ్ ఫీలింగ్ ఎక్కువ. తమకు అటెష్టన్ ఉండాలని ఆరాటపడతారట.వేరే అమ్మాయిలు అందంగా రెడీ అయినా జస్ట్ ఓకే, పర్లేదు, ఈ డ్రెస్ నీకంత నప్పలేదు అని అబద్దాలు చెబుతారట. ► నా బైక్ పంక్చర్ అయ్యింది, లేదా పెట్రోల్ అయిపోయింది అని చెబుతుంటారట ఒకవేళ బైక్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ► అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ఫీట్లు చేసి అబద్దాలు చెబుతుంటారట. ఇందులో 58% మంది తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అబద్దాలు చెబుతారని, 42% మంది తమ సీక్రెట్‌ను రహస్యంగా ఉంచేందుకు అబద్దాలు చెబుతారని తేలింది. 40శాతం మంది తాము నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంగా చూసుకున్నా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా అబద్ధం చెప్పే వారి సంఖ్య మగవారిలోనే అధికంగా ఉంటుందట.కొందరి బాడీ లాంగ్వేజీని బట్టి కూడా అబద్దాలు చెబుతున్నారా లేదో తెలుసుకోవచ్చట. మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభమవుందని చెబుతున్నారు నిపుణులు. -
మిలీనియల్స్ అబద్ధాల్లో మొనగాళ్లు.. ప్లే స్టార్ సర్వేలో ఆసక్తికర విషయాలు
న్యూయార్క్: అబద్ధాలు ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? అనే విషయాలపై జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిగతా వారితో పోలిస్తే మిలీనియల్స్ ఎక్కువ అబద్ధాలు చెబుతారట..! అదేవిధంగా, మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబుతారట! ఆఫీసులో అవమానాల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతా మంటూ ఎక్కువ మంది సమాధానమివ్వడం విశేషం. ఆన్లైన్ కేసినో ‘ప్లే స్టార్’జరిపిన ఓ సర్వేలో ఇవి వెల్లడయ్యాయి. అమెరికాలోని కొలరాడో, ఇలినాయీ, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, విస్కాన్సిన్ రాష్ట్రాలకు చెందిన కొందరిపై ప్లేస్టార్ సర్వే చేపట్టింది. వీరిలో సగం మహిళలు కాగా, మిగతా సగం పురుషులు. పలు వయస్సుల వారు వివిధ సందర్భాల్లో ఎలా అబద్ధాలు చెబుతారో నమోదు చేసింది. ఈ విషయంలో 1981–1996 సంవత్సరాల మధ్య పుట్టిన మిలీనియల్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ వయస్సు వారిలో 13 శాతం మంది రోజులో ఒక్కసారైనా అబద్ధం చెబుతామంటూ ఒప్పుకున్నారు. అదే బేబీ బూమర్స్..1946–1964 సంవత్సరాల మధ్య పుట్టిన వారిలో ఇది రెండు శాతమే ఉంది. ఈ విషయంలో 1997–2021ల మధ్య జన్మించిన జనరేషన్ జెడ్, 1965–1980 మధ్య పుట్టిన జనరేషన్ ఎక్స్ వారి ప్రవర్తన ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రూపుల వారిలో కేవలం 5 శాతం మంది రోజూ కనీసం ఒక్కసారి అబద్ధమాడుతామని చెప్పారు. ఎందుకు అబద్ధం? సర్వేలో పాల్గొన్న మిలీనియల్స్‌లో మూడో వంతు మంది ఈ ఏడాదిలో రెజ్యుమెలో వివరాలను తారుమారు చేసినట్టుగా అంగీకరించారు. పని చేసే ప్రాంతంలో అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో ప్రతి అయిదుగురిలో ఇద్దరు అంగీకరించారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా. ఎదుటి వారి దృష్టిలో పడేందుకు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో 23 శాతం మంది, జెడ్ జనరేషన్లో 21 శాతం మంది అంగీకరించారని ప్లే స్టార్ సర్వేలో తేలింది. మిలీనియల్స్‌లో మెజారిటీ మంది దృష్టంతా డబ్బు, కీర్తి ప్రతిష్టల సంపాదనపైనే ఉంటుందని 2012లో పర్సనా లిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా చెప్పిందని ప్లే స్టార్ గుర్తు చేసింది. అయితే ఇందుకు విరుద్ధంగా, సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది ఆన్లైన్లో ఎన్నడూ మోసం చేయలేదని చెప్పుకున్నారని సర్వే తెలిపింది. మిగతా జనరేషన్స్ వాళ్లు మాత్రం నిజాయతీయే ఉత్తమమని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిజాయతీగా ఉంటామంటూ జనరేషన్ ఎక్స్‌కు చెందిన ప్రతి 10 మందిలో 9 మంది, బేబీ బూమర్స్ జనరేషన్‌కు చెందిన ప్రతి అయిదు గురిలో నలుగురు సమాధానమిచ్చారు. పురుషులు అబద్ధాల్లో ముందు మహిళలతో పోలిస్తే సోషల్ మీడియాలో పురుషులు 10% ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారని సర్వే గుర్తించింది. రోజులో ఒక్క సారైనా అబద్ధం చెబుతామని మహిళల్లో 23 శాతం మంది ఒప్పుకోగా, అదే పురుషుల్లో ఇది 26 శాతంగా ఉండటం విశేషం. ఎదుటి వాళ్లు చెప్పేది అబద్ధమా కాదా అనే విషయాన్ని 97% మంది వరకు గుర్తించలేక పోతున్నారని కూడా సర్వే గుర్తించింది. అదేవిధంగా, చెప్పిన ప్రతి అబద్ధమూ హానికరం కాదన్న విషయం సర్వేలో వెల్లడైంది. అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకంటూ 58 శాతం మంది, గోప్యతను కాపాడుకునేందుకు 42% మంది, ఇతరులకు ఇబ్బంది రాకూడదని 42% మంది అబద్ధమాడుతామని చెప్పడం విశేషం. ఇదీ చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం
బికనేర్: అవినీతి, అక్రమాలకు మరో రూపమే కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణమే కాంగ్రెస్ అన్నారు. ప్రజాగ్రహంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగిపోవడం ఖాయమని చెప్పారు. విద్వేష బజార్లో ప్రేమ దుకాణం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసే వ్యాఖ్యలపై ఆయన ఈ సెటైర్ వేశారు. శనివారం ప్రధాని బికనేర్ జిల్లా నొరంగ్దేశార్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేరుగా మారిందని ఆరోపించారు. ‘మహిళలపై నేరాల్లో, అత్యాచార ఘటనల్లో రాజస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ రక్షకులే వేటగాళ్లుగా మారారు. హత్యలు, అత్యాచార నిందితులను రక్షించుకోవడంలో మొత్తం ప్రభుత్వం నిమగ్నమై ఉంది’అని ప్రధాని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, దేశాన్ని గుల్ల చేస్తుంది. అధికారం నుంచి దిగిపోతే విమర్శలతో దేశం ప్రతిష్టను మంటగలుపుతుంది. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లి దేశం పరువు తీస్తారు’ అని ఆరోపించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే కొందరు మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసి సొంతిళ్లకు మకాం మార్చినట్లు నాకు సమాచారమొచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేతలకు మాత్రమే నమ్మకం కుదిరింది’ అని ఎద్దేవా చేశారు. -
పీకే తప్పుడు లెక్కలు.. హద్దులు దాటిన అబద్దాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకు పూర్తిగా అబద్దాలను, అసత్యాలను వల్లె వేసినట్టు కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ మాట మాట్లాడినా.. దానికి ఆధారాలుంటాయి, గతంలో చేసిన ప్రకటనల రెఫరెన్స్ ఉంటుంది. ఆ విషయాలను మరిచిపోయిన పవన్ కల్యాణ్.. యధాలాపంగా తనకు తోచిన విషయాన్ని నమ్మించేలా చెప్పడానికి ప్రయత్నించి ప్రజలకు దొరికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేనని, దానికి సరిపడా సమీకరణాలే లేవని చెప్పాడు. ఆ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని అభ్యర్థించాడు కూడా. అదేంటో కానీ ఇప్పుడు కొత్తగా "నేనే సీయం" అన్న నినాదం మళ్లీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకొచ్చింది. అంటే మొన్న చెప్పింది ప్రజలు కచ్చితంగా మరిచిపోయి ఉంటారన్నది పవన్ కల్యాణ్ నమ్మకంలా కనిపించింది. ఇప్పటివరకు సొంతంగా పోటీ చేస్తానన్న దానిపై తనకే నమ్మకం లేని పవన్ కల్యాణ్.. ఎలాగోలా పోటీ అయితే చేస్తానని, అసెంబ్లీకి కూడా వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోయానని నిజాయతీగా ఒప్పుకున్నా బాగుండేది కానీ, దీని వెనక ఏదో కుట్ర జరిగిందని సరికొత్తగా ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. పవన్ కళ్యాణ్ : ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా. గత ఎన్నికల సమయంలో అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని, నాపై కక్షగట్టి.. నేను పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారు. ఆ రెండు చోట్లా ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు, వాటికి సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఉంచిన లెక్కలు ఒకసారి పరిశీలించి నిజమేంటో చూద్దాం. ముందుగా భీమవరం విషయానికి వస్తే.. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం భీమవరంలో 246424 మంది ఓటర్లు 2019 నాటికి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 77.94% పోలింగ్ జరిగింది. అంటే 192061 మంది ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 50403 మంది అసలు ఓటే వేయలేదు. అంటే పవన్‌కళ్యాణ్ చెప్పిన ఎక్కువ ఓట్లు లెక్క పూర్తిగా అబద్దమే కదా. ఇక గాజువాక విషయానికి వస్తే.. ఇక్కడ ఏకంగా ఓటేయని వారి సంఖ్య 110727. గాజువాకలో మొత్తం ఓటర్లు 310011. ఇక్కడ 64.28% పోలింగ్ జరిగింది. అంటే 1,99,284 మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 110727 మంది ఓటేయలేదు. అంటే ఇక్కడకూడా పవన్‌కళ్యాణ్ చెప్పింది అసత్యమే అని ఈసీ ఇచ్చిన డాటా నిరూపిస్తోంది. సానుభూతి కోసం చేసే ఇలాంటి ప్రకటనల వల్ల క్రెడిబిలిటీ పెరగకపోగా.. అసలుకే మోసం వచ్చే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నం చేసి ఇబ్బంది పడ్డారని, ఇప్పటికీ అదే ధోరణీ అనుసరిస్తే.. మరింత దెబ్బ తింటారంటున్నారు. ::: పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ ఇదీ చదవండి: జనసేనానివి సొల్లు కబుర్లు -
Karnataka Assembly elections 2023: ‘గరీబీ హఠావో’ అతిపెద్ద కుంభకోణం
శివాజీనగర: కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరించారు. శనివారం కర్ణాటకలోని బెంగళూరు, బాగల్కోటె, బాదామిల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన గరీబీ హఠావో హామీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంతోనే కాంగ్రెస్ దేశవ్యాప్త ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఈ కుంభకోణం నేటికీ కొనసాగుతూనే ఉందన్నారు. ‘కాంగ్రెస్ అబద్ధాలు, వేధింపులపై కర్ణాటకలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నిషేధ విధానాలు, బుజ్జగింపు రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయి. బీజేపీ ఉప్పెనలో కాంగ్రెస్ అబద్ధాలన్నీ కొట్టుకుపోతాయి. భారీ మెజారిటీతో బీజేపీకే మళ్లీ పట్టం కట్టాలని ప్రజలు నిశ్చయానికి వచ్చారు. లభిస్తున్న భారీ స్పందనను చూస్తే.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోరాడుతున్నది ప్రజలే అని నాకు నమ్మకం కలుగుతోంది’అని ప్రధాని అన్నారు. బీజేపీ హయాంలో బీఎస్ యడియూరప్ప, ప్రస్తుతం సీఎం బొమ్మైల డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు తక్కువ కాలమే అయినా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రధాని మోదీ అంతకుముందు బెంగళూరు నగరంలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు రెండు వైపులా నిలబడిన ప్రజలకు చేతులు ఊపుతూ ఆయన ముందుకు కదిలారు. దక్షిణ బెంగళూరులోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరంలోని సాంకే ట్యాంక్ వరకు 26 కిలోమీటర్ల మేర, 17 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన ఈ రోడ్‌షో దాదాపు మూడు గంటలపాటు సాగింది. 85% కమీషన్లు కాంగ్రెస్‌కు అలవాటే ‘కర్ణాటకలో కాంగ్రెస్ పాలన దశాబ్దాలపాటు సాగింది. కానీ, అభివృద్ధే జరగలేదు. కాంగ్రెస్ అంటే.. పూర్తి అవినీతి, కుంభకోణం, 85% కమిషన్, ఉగ్రవాదులకు దాసోహం, బుజ్జగింపు వ్యవహారాలు, విభజన రాజకీయాలు’అని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రూ.1 విడుదలైతే ప్రజలకు 15 పైసలు అందుతుందని అప్పట్లో కాంగ్రెస్ మాజీ ప్ర«ధాని రాజీవ్ గాంధీ చెబుతుండేవారని గుర్తు చేశారు. అప్పటి నుంచే 85 శాతం కమీషన్ కాంగ్రెస్‌కు అలవాటైందని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగానే కర్ణాటకలోనూ అధికారంలోకి వస్తే ప్రజలకిచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ బుట్టదాఖలు చేస్తుంది’అని చెప్పారు. మాజీ సీఎం, బాదామి బరిలో ఉన్న కాంగ్రెస్ నేత సిద్దరామయ్యపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘గాలి ఎటువీస్తోందో సిద్దరామయ్య ఇప్పటికి గ్రహించే ఉంటారు. ఆయన ఇక్కడికి వస్తే.. గతంలో కనీస మౌలిక వసతులను ప్రజలకు ఎందుకు కల్పించలేకపోయారని నిలదీయండని పిలుపునిచ్చారు. ‘బీజేపీకి వస్తున్న ప్రజల ఆదరణ చూసి కాంగ్రెస్‌కు భయం మొదలైంది. అందుకే నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు’అని అన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌వి నీచమైన విధానాలని ఆరోపించారు. బెంగళూరులో రోడ్‌షోలో ప్రజలకు మోదీ అభివాదం -
Fact Check: తప్పులో కాలేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఓ పోస్టు పెట్టి టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పులో కాలేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ ఎదుట సెల్ఫీ దిగి టీడీపీ హయాంలో ఇలాంటివి ఎన్నో అద్భుత భవనాలు నిర్మించాం.. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కటైనా నిర్మించారా అంటూ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ భవన నిర్మాణంలో అసలు వాస్తవాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు బయటపెట్టారు. గంటా చెప్పింది అవాస్తవమని తేల్చిచెప్పారు. ఇదీ వాస్తవం.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌కు 14 ఏళ్ల కిందటే బీజం పడింది. భవిష్యత్ అవసరాల కోసం భారీ సీటింగ్ సామర్ధ్యంతో ఓ అధునాతన కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి (ప్రస్తుత వీసీ) నిర్ణయించారు. బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న వర్సిటీ భూమిలో 2,500 సీటింగ్ సామర్థ్యంతో దాదాపు రూ.10 కోట్లతో కన్వెషన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో నగరంలోనే అతి ఎక్కువ సీటింగ్ సామర్ధ్యంతో చూపరులను ఆకట్టుకొనేలా అత్యాధునిక డిజైన్‌తో దీని నిర్మాణం చేపట్టారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ భవన నిర్మాణం తొలి దశ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత వచ్చిన యూనివర్సిటీ వీసీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని నిర్మాణంలో రాజకీయ పారీ్టలకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా గంటా శ్రీనివాసరావు టీడీపీనే ఈ భవనాన్ని నిర్మించిందంటూ అబద్ధపు ప్రచారం చేయడంపై ఆంధ్ర విశ్వవిద్యాలయ వర్గాలు మండి పడుతున్నాయి. చదవండి: చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు? గంటాకు మతిభ్రమించింది.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మతి భ్రమించిందని వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం రోశయ్య ఈ భవనానికి శంకుస్థాపన చేసిన ఫొటోను ఆమె శనివారం విడుదల చేశారు. -
Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: నాడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్‌కు అవకాశం కల్పించింది తానేనంటూ తరచూ బుకాయించే చంద్రబాబు ఆయన పేరుతో తాజాగా మరోసారి బరి తెగించారు! ఇటీవల విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా బీచ్‌రోడ్డు సీతకొండ సమీపంలోని వ్యూ పాయింట్‌ని సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కలాం వ్యూ పాయింట్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందంటూ చంద్రబాబు ట్వీట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు మహనీయుడైన కలాం పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసైన్యం పేరుతో జనసేనకు చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కొద్దిగా మార్చి ఇంగ్లీష్‌లో చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా కాపీ, పేస్ట్‌లో చంద్రబాబుని మించినవారు లేరంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీతకొండ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానికులు దశాబ్దాలుగా దీన్ని సీతకొండ వ్యూ పాయింట్‌గానే వ్యవహరిస్తున్నారు. తాము 30 ఏళ్లుగా విశాఖలోనే ఉంటున్నామని, వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. రూ.3.29 కోట్లతో వ్యూ పాయింట్ అభివృద్ధి సుందర విశాఖ సాగర తీరంలో సరైన వ్యూ పాయింట్స్ లేకపోవడంతో జీ 20 సదస్సు సందర్భంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు జోడుగుళ్ల పాలెం సమీపంలోని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు. చక్కటి పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. నడక దారితోపాటు మార్బుల్స్‌తో కూర్చునే బెంచీలు, లవ్ వైజాగ్ చిహ్నం తదితరాలతో తీర్చిదిద్ది వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. -
మోసం చేయాలనీ చూసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్
-
లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా?
యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న వాగ్దానాలు చిత్ర, విచిత్రంగా ఉంటున్నాయి. ఆయన పాదయాత్రకు జన స్పందన ఎలా ఉందన్నది పక్కనబెడితే, టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లు లోకేష్‌కు నిత్యం విపరీత ప్రచారం ఇస్తున్నాయి. రోజూ ఆయన చేసిన ఉపన్యాసమో, ప్రకటననో ఈ మీడియాలు చాలా ప్రముఖం ఇస్తున్నాయి. అది వారి కమిట్ మెంట్ కాబట్టి దానిపై ఇంకేమీ వ్యాఖ్యానించజాలం. లోకేష్ మాత్రం అదేదో, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినట్లు, తెలుగుదేశం పార్టీ గతంలో పాలన చేయనట్లు, మాట్లాడుతుండడమే విశేషం. ఉదాహరణకు ఈ మధ్య ఒక పాదయాత్ర సభలో ఆయన ఏపీని ఉద్యోగాంధ్ర ప్రదేశ్ చేస్తానని అన్నారు. అంతగా ఉద్యోగాలు ఇవ్వగలిగితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఎందుకు జాబ్స్ ఇవ్వలేకపోయారు?. పోనీ అప్పుడు ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇంకా లక్షల ఉద్యోగాల అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి కదా! లోకేష్‌కు టీడీపీ చరిత్ర, ముఖ్యంగా తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఏమి చెప్పేవారో తెలిసినట్లు లేదు. ప్రభుత్వాలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత లేదని ఆయన అనేవారు. అంతేకాదు.. విద్య, వైద్యం వంటివాటిని ప్రభుత్వం నడపనవసరం లేదని భావించేవారు. గత టరమ్ లో కూడా ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రైవేటు రంగం చూసుకుంటుందని ఆయన ఒక సందర్భంలో అన్నారు. అనేక కార్పొరేషన్లను చంద్రబాబు మూసివేసి గొప్ప సంస్కరణ వాదిగా ప్రచారం చేసుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా యువతకు ఉద్యోగాలు సమకూర్చుతామని చెప్పారు. ఆయన అదే ప్రకారం ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో యువతకు అవకాశం కల్పించారు. ఇదే టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒకసారి అదంతా వృథా ఖర్చు అని ప్రచారం చేస్తుంటాయి. మరోసారి మాత్రం తాము ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాంధ్రప్రదేశ్ చేస్తామని చెబుతుంటాయి అదెలా సాధ్యమో చెప్పరు. జగన్ ఆరోగ్య రంగంలో సుమారు నలభై వేల ఉద్యోగాలు ఇస్తున్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇస్తున్నా, లోకేష్ మాత్రం ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలకు చెబుతుంటే, అదేదో మహా సత్యం మాదిరి టీడీపీ మీడియా పట్టం కట్టి ప్రచురిస్తున్నాయి. రాష్ట్రం నుంచి వలసలను ఆపుతామని కూడా ఆయన అంటున్నారు. రాష్ట్రం అంతా ఎందుకు తన తండ్రి నియోజకవర్గం అయిన కుప్పంలో ఆ పని చేసి ఉండవచ్చు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని లోకేష్ ఒప్పుకుంటున్నారా?. కుప్పం నుంచి నిత్యం వందలు, వేల మంది బెంగుళూరుకు వెళ్లి పనులు చేసుకుని తిరిగి వస్తుంటారు. ఆ విషయం బహుశా లోకేష్‌కు తెలియదేమో!. టీడీపీ తెచ్చిన కంపెనీలను నిలబెట్టి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేవట. ఇంత పెద్ద అబద్దం చెప్పగలగడం అంటే మామూలు సంగతి కాదు. ఏపీలో అలాంటి అసత్యాలు చెప్పగల నైపుణ్యం ఒక్క చంద్రబాబుకే ఉంటుందని అంతా నమ్ముతారు. ఆయన కుమారుడిగా లోకేష్ ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నారన్నమాట. ఒకవైపు తన నడిచే రోడ్డులో ఉండే పరిశ్రమల ఎదుట సెల్ఫీ దిగి, అవన్ని తమ టైమ్లోనివేనని చెప్పుకుంటారు. ఇంకో వైపు జగన్ ఆ పరిశ్రమలన్నీ పంపించివేశారని అంటారు. అబద్దమాడడానికి అయినా హద్దు ఉండాలి. ఏమి చేస్తాం. ఇదంతా ఎందుకు ఆయన చెబుతున్నారంటే, విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సమ్మిట్ అనూహ్యంగా విజయం చెందడంతో ఏమి చెప్పాలో తెలియక చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ఇలాంటి మాటలు చెబుతున్నారు. దేశంలోనే అత్యంత ప్రముఖమైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వచ్చి సమ్మిట్‌లో జగన్ చెంత మూడు గంటలకు పైగా కూర్చోవడంతో టీడీపీ నేతలకు దిమ్మదిరిగినంత పనైంది. దాంతో ముఖ్యమంత్రి జగన్ విశ్వసనీయత విపరీతంగా పెరిగింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న దుగ్దతో లోకేష్ కాని, ఇతర టీడీపీ నేతలు కాని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మరో వాగ్దానం ఆయన చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు విద్యార్ధులకు ఉచిత బస్ పాస్‌లు ఇస్తారట. గత టరమ్‌లో ఆయన ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలి కదా?. ప్రభుత్వపరంగా విద్యార్ధులకు ఎప్పుడూ బస్ చార్జీలలో రాయితీ ఇచ్చి పాస్‌లు మంజూరు చేస్తుంటారు. జగన్ పాదయాత్రలో చేసే వాగ్దానాలకు ఎంత వ్యయం అవుతుందో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసేది. మరి అదే పని లోకేష్ కాని, చంద్రబాబుకాని ఎందుకు చేయడం లేదు?. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టోని సచివాలయంలోనే పెట్టి, మంత్రులు, అధికారులకు ఇచ్చి దానిని నెరవేర్చాలని మొదటి రోజే ఆదేశించారు. ఆ తర్వాత 98.5 హామీలను అమలు చేసి మరో రికార్డు సృష్టించారు. అదే తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఎన్నికల మానిఫెస్టోని పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించి అందరిని ఆశ్చర్చపరిచింది. సుమారు 400 హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన టీడీపీ ఇప్పుడు లోకేష్ ఇచ్చే హామీలకు ఎలా కట్టుబడి ఉంటుందో ఆయన కాని, చంద్రబాబు కాని చెప్పగలగాలి కదా!. లోకేష్ మరో ప్రశ్న వేశారు. జగన్ ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా అని అంటున్నారు. కొద్ది కాలం క్రితమే వైఎస్సార్ జిల్లాలో 8800 కోట్ల పెట్టుబడి కలిగిన జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సంగతి లోకేష్‌కు తెలియదేమో!. తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారేమో!. చదవండి: అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ! బద్వేల్ వద్ద సెంచురి ప్లైవుడ్, కొప్పర్తి లో పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలు, అచ్యుతాపురం వద్ద టైర్ల ప్యాక్టరీ, రామాయం పోర్టుకు శంకుస్థాపన ఇలా అనేక విధాలుగా జగన్ టైమ్‌లో పారిశ్రామిక అభివృద్దికి బీజం పడితే, అసలేమీ రాలేదని ఎంత ధైర్యంగా లోకేష్ అబద్దం ఆడగలుగుతున్నారు!. ఒకటి మాత్రం వాస్తవం. ఎన్.టి. రామారావు టైమ్ లో టీడీపీని అబద్దాల పార్టీగా జనం అనుకోలేదు. ఆయనను పడదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఏకంగా అబద్దాల ఫ్యాక్టరీని పెట్టేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని లోకేష్ కొనసాగిస్తూ పాదయాత్రను అబద్దాల యాత్రగా మార్చుకున్నట్లుగా ఉంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్రాంతి పండగకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు అక్కడా రాజకీయ ప్రసంగాలే చేశారు. భోగి మంట వేయడానికి అని చెప్పి వేకువజామునే రోడ్డుపైకి వచ్చి జీవో నంబర్ 1 ప్రతులను తగులబెట్టారు. మూడేళ్ల తరువాత స్వగ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన.. శనివారం మీడియా సమావేశంలో అర్థంపర్థం లేకుండా మాట్లాడారు. జీ–20 సదస్సుల్లో ప్రధాని మోదీకి తాను సలహా ఇచ్చానని చెప్పిన చంద్రబాబు.. ఆ సలహా ఏమిటో చెప్పలేదు. ‘అదే 2047.. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం. రాబోయే 2047కు ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్–1గా నిలుపుతాను. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ స్థిరపడడానికి నేనే కారణం...’ అంటూ అర్థంలేకుండా మాట్లాడారు. టెక్నాలజీ శక్తి ఉండడంతో 2047 వరకు యువత మనకు అండగా ఉంటుందని, ఆ తర్వాత మన యువత తగ్గిపోతుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం పిల్లలను కనడం మన ధర్మమని చెప్పుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా జాతీయ రహదారిని తానే ఏర్పాటు చేశానని చెప్పారు. చదవండి: బెజవాడ సైకిల్‌కు టెన్షనెందుకు? -
బాబోయ్.. ఇదేం ఖర్మరా!.. బాబు డొల్ల మాటలు.. ఇవీ వాస్తవాలు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు.. నిస్సిగ్గుగా బుకాయింపు! ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గోబెల్స్‌ను తలదన్నే రీతిలో అంతులేని అబద్ధాలాడారు. యథాప్రకారం హైదరాబాద్‌ను తానే నిర్మించానని.. సెల్‌ఫోన్‌నూ తానే కనిపెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇదేం ఖర్మరా.. అని అంతా అనుకోవాల్సిందే మరి! 1. మేనిఫెస్టో మాయం.. చంద్రబాబు: కేవలం ఆరు పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు చెప్పుకున్న సీఎం జగన్ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. వాస్తవం: అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలోనే 98 శాతం హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సిసలైన నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకూ రూ.1,77,585.51 కోట్లు అందచేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే ప్రథమం. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూర్చారు. ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తోందని సామాజికవేత్తలు ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు రుచించడం లేదు. 2014 ఎన్నికల్లో వందలకొద్దీ హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానంటూ నమ్మబలికారు. అసలు రూ.87 వేలు కోట్లు, వడ్డీ రూ.24 వేలు కోట్లు కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు విదిల్చి (అది కూడా సున్నా వడ్డీని ఎగ్గొట్టి) నయ వంచన చేశారు. రూ.14 వేల కోట్ల రుణాలను మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను దగా 2. ఓ గేటులో 1/4 బిగించి హంగామా చంద్రబాబు: పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో సహా 72 శాతం పనులు నేనే పూర్తి చేశా... వాస్తవం: పోలవరం స్పిల్‌వేకు 25.72 మీటర్ల స్థాయిలో 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి హైడ్రాలిక్ సిలిండర్లు, హాయిస్ట్‌లను అమర్చాలి. చంద్రబాబు హయాంలో పోలవరం స్పిల్‌వే పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్‌వేలో 39, 40 పియర్స్ మాత్రమే 32 మీటర్ల స్థాయి వరకు చేశారు. ఆ స్థాయిలో గేట్లను అమర్చడానికి వీలుకాదు. 2018 డిసెంబర్ 24న రెండు పియర్స్ మధ్య నాలుగు స్కిన్ పేట్లను వెల్డింగ్ చేసి (ఇది ఒక గేటులో నాలుగో వంతు) అడ్డుగా నిలిపారు. దీంతో 48 గేట్లు అమర్చినట్లు, ప్రాజెక్టు పూరై్తనట్లు భ్రమ కల్పించారు. చంద్రబాబు అమర్చిన గేటు అనంతరం గాలి ఉద్ధృతికి రెండు పియర్స్ నుంచి కిందకు పడిపోయింది. ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్రలతో భజన చేయించుకునేందుకు ఏకంగా రూ.వంద కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా తీవ్రతలోనూ, గోదావరి వరద ఉద్ధృతిలోనూ స్పిల్‌వేను పూర్తి చేసి 48 గేట్లను బిగించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరదను అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 12,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంకల్పించారు. మొత్తమ్మీద ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 47.94% పూర్తయ్యాయి. పరిహారం.. ఫలహారం చంద్రబాబు: న్యాయస్థానాల్లో దాఖలు కేసులను ఉపసంహరించుకునేలా రైతులతో చింతమనేని ప్రభాకర్ ద్వారా చర్చించి పోలవరం కుడి కాలువను పూర్తి చేశా.. వాస్తవం: దివంగత వైఎస్సార్ హయాంలోనే పోలవరం కుడి కాలువ 95% పూరై్తంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారితో భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేయించి కుడి కాలువ పనులను చంద్రబాబు అడ్డుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను కేసులు వేయించిన రైతులతో చింతమనేని ద్వారా మంతనాలు జరిపి ఎకరానికి గరిష్టంగా రూ.69 లక్షల చొప్పున రూ.720 కోట్ల మేర పరిహారాన్ని అందించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా ఐదు శాతం పనులు చేశారు. 4. అవగాహనారాహిత్యంతో.. నాడు కమీషన్లు వచ్చే పనులకే చంద్రబాబు పచ్చజెండా ఊపారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే నదీ గర్భంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక మధ్యలోనే వదిలేశారు. 2019 మే 29 నాటికి పరిస్థితి ఇదీ! 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు వచ్చాయి. నదీ గర్భంలో కాఫర్ డ్యామ్‌లు అడ్డంకిగా ఉండటం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత సర్కారు అవగాహనా రాహిత్యం, కమీషన్ల దాహమే పోలవరం పనుల్లో జాప్యానికి మూలకారణం. 5. కళ్లాల వద్దే కొనుగోళ్లు కనపడవా? చంద్రబాబు: ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. దళారులతో కలిసి అధికారపార్టీ నేతలు రైతులను దోచుకుంటున్నారు. వాస్తవం: ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మూడున్నరేళ్లలో రూ.48,974 కోట్లతో రైతుల నుంచి 2.62 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం రైతులను దగా చేస్తుంటే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బీసీల వెన్నెముక విరిచింది మరిచావా బాబూ..? చంద్రబాబు: సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు పదవులివ్వకుండా సామాజిక అన్యాయం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ పథకాలతో ఎంత ప్రయోజనం చేకూర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీకీ బీసీలే వెన్నెముక. వాస్తవం: బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకగా అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని రీతిలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పది మందికి స్థానం కల్పించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం లాంటి అత్యంత కీలకమైన శాఖలు అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో 4 సీట్లు బీసీలకే ఇచ్చారు. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలతో హైకోర్టులో సవాల్ చేయడంతో 24 శాతానికి తగ్గిపోయాయి. చంద్రబాబు కుట్ర వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో, గతంలో ఉన్న 33% కంటే ఎక్కువగా అవకాశం ఇస్తానని మాటిచ్చిన సీఎం జగన్ ఆ మేరకు సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ మేయర్లుగా సింహభాగం బీసీ వర్గాల వారినే నియమించారు. బీసీల కోసం శాశ్వత కమిషన్‌ను నియమించారు. బీసీ సామాజిక వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో ఇప్పటిదాకా రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్లు దక్కాయి. పరిపాలన భాగస్వామ్యం కల్పించడం, ఆర్థికంగా చేయూత, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ వర్గాల సామాజిక సాధికారతకు సీఎం జగన్ బాటలు వేశారు. తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా! 2014లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ బెదిరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హెచ్చరించారు. నాడు చంద్రబాబు 25 మందితో కూడిన తన మంత్రివర్గంలో బీసీలకు ఆరు పదవులు మాత్రమే ఇచ్చారు. 2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. జీవనాడి జాప్యానికి బాబే కారణం చంద్రబాబు: ప్రతి సోమవారాన్ని పోలవారంగా పరిగణించి సమీక్ష చేశా. నెలకు ఒకసారి ప్రాజెక్టు వద్దకే వెళ్లి సమీక్షించా. కేంద్రమే నిధులు ఇస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నేనే కారణమంటున్నారు.. వాస్తవం: విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల దాహం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నాడు చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ఒప్పుకోవడంతో కేంద్రం రూ.20,398 కోట్లకే పరిమితం చేసింది. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు కాగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168 కోట్లు అవుతుంది. ఇదే అంశాన్ని సీఎం జగన్ పలు దఫాలు కేంద్రానికి వివరించి సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు. అరకొరగా ఫీజులు.. ఆపై బడాయిలు చంద్రబాబు: నేను అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చా. సీఎం జగన్ కేవలం 11 లక్షల మందికే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదీ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. విద్యార్థుల తండ్రులు ఆ డబ్బులు తీసుకుని మద్యం తాగుతున్నారు. వాస్తవం: ఇంజనీరింగ్ కళాశాలలో గరిష్టంగా ఫీజు రూ.1.10 లక్షలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. రూ.1,700 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్ డబ్బులను ఎగ్గొట్టడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. సీఎం జగన్ అధికారంలో చేపట్టాక ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ఏటా రెండు వాయిదాలలో రీయింబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లులు కాలేజీలకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని సదుపాయాలు, బోధనలో నాణ్యతను ఆరా తీయాలనే ఉద్దేశంతో వారి ఖాతాల్లో జమ చేస్తుంటే దారుణంగా అవమానించడం చంద్రబాబుకే చెల్లింది. చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా.. -
అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. తనకు తాను గొప్పగా ఊహించుకోవడమే కాకుండా ప్రజలంతా అలాగే ఫీల్ అవుతున్నారని ఆయన భావిస్తుంటారు. అంటే తాను భ్రమపడి, ప్రజలు కూడా అదే విధంగా భ్రమపడుతున్నారని నమ్ముతుంటారు. చదవండి: ఆ మీటింగ్ తర్వాత పవన్‌లో నీరసమెందుకు? గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇరవైమూడు స్థానాలకే పరిమితం అయిపోయినా, అది తన తప్పుల వల్ల కాదని, ప్రజలే తప్పు చేశారని ఆయన అనుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో చేసిన పర్యటనలో ఎన్ని అబద్దాలు చెప్పారో పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాను ఫిట్ గా ఉన్నానని చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వయసు రీత్యా ఆయన ఎలా ఉన్నా అసత్యాలు బొంకడంలో మాత్రం ఫిట్‌గా ఉన్నానని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు, వాటిలోని అబద్దాలు ఏమిటో చూద్దాం. ►బాబు అబద్దం-1 నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ నన్ను అవమానించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నన్ను, నా సతీమణిని అవమానించారు ►అసలు వాస్తవం చంద్రబాబును ఆయన సొంత మామ ఎన్టీ రామారావే దారుణంగా అవమానిస్తూ వీడియోనే విడుదల చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి ఆయనను చంద్రబాబు అవమానిస్తే, తన అల్లుడు నీచమైన వ్యక్తి అని, ఔరంగజేబు కంటే ఘోరమైన వ్యక్తి అని పలురకాలుగా ఎన్టీఆర్ దూషించారు. ఇక తాజా అంశానికి వస్తే.. ఈ టరమ్‌లో చంద్రబాబును, ఆయన భార్యను ఎవరూ అసెంబ్లీలో అవమానించలేదు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కుటుంబాన్ని టీడీపీ నేతలు అవమానిస్తే, దానికి బదులుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిని అసెంబ్లీలో వైసీపీకి ఆపాదించి చంద్రబాబు బయటకు వెళ్లారు. అసెంబ్లీలో కానీ, ఈ ఆరోపణ చేసిన వెంటనే కాని ఆయన రోదించలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన నాలుగు గంటల తర్వాత కెమెరాల ముందు మీడియా సమక్షంలో రోదించినట్లు వ్యవహరించి అభాసుపాలయ్యారు. తన రాజకీయం కోసం భార్యను కూడా రోడ్డుకు ఎక్కించారన్న విమర్శకు గురి అయ్యారు. దీనివల్ల సానుభూతి రావాలన్నది ఆయన ఆశ. ►బాబు అబద్దం-2 రాష్ట్రంలో లక్షల రేషన్ కార్డులు తొలగించారు.. పేదవాళ్ల పొట్టగొట్డడంలో జగన్మోహాన్రెడ్డి దిట్ట ►అసలు వాస్తవం ఏపీలో లక్షల రేషన్ కార్డులు తొలగించింది లేదు. పేదవాళ్ల పొట్టగొట్టింది లేదు. పేదలకోసం అనేక స్కీమ్‌లను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తుంటే ఆయన ఎలా పొట్ట గొట్టినట్లు అవుతుందో చంద్రబాబు చెప్పకుండా తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. బురద జల్లడం, ఆ తర్వాత మీరే కడుక్కోమని చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ►బాబు అబద్దం-3 నేను అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎత్తివేస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలను ఇస్తా ►అసలు వాస్తవం గత మూడున్నర ఏళ్లుగా ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా విమర్శించి, పేదలకు ఆర్థిక సాయం చేయడాన్ని పంచడంగా ప్రచారం చేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం మీడియా వారు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. తాను ఇంకా మెరుగైన సంక్షేమ స్కీములు ఇస్తానని చెబుతున్నారే తప్ప అవేమిటో చెప్పలేకపోతున్నారు. ►బాబు అబద్దం-4 పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇళ్లు పడగొట్టారు ►అసలు వాస్తవం రోడ్డు వెడల్పు చేయడానికి ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకుంటే అక్రమం అంటున్నారు. అసలు అక్కడ ఇళ్లే పడగొట్టలేదు. ప్రహరి గోడలు తొలగిస్తే ఇళ్లను పడగొట్టినట్లు ప్రచారం చేస్తున్నారు ►బాబు అబద్దం-5 పవన్ కల్యాణ్ విశాఖ వెళితే పెద్ద సీన్ చేశారు ►అసలు వాస్తవం జనసేన కార్యకర్తలు కొందరు విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేస్తే, వారిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కల్యాణ్ పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ కూడా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. అసలు విషయాలు చెప్పకుండా జనసేన వారిని అరెస్టు చేశారని, పవన్ కార్యక్రమం తనంతట మానుకుంటే దానిని వైసీపీకి చంద్రబాబు అంటగడుతున్నారు. ►బాబు అబద్దం-6 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శం అని ప్రధాని మోదీ విశాఖలో అన్నారు ►అసలు వాస్తవం ప్రధాని మోదీ ఎక్కడా చంద్రబాబు పేరే ఎత్తలేదు. పైగా డ్వాక్రా సంఘాలు కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవి. ►బాబు అబద్దం-7 ఏపీకి నేను అధికారంలో ఉన్నప్పుడు 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా. వాటిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం ►అసలు వాస్తవం చంద్రబాబు టైమ్‌లో వచ్చిందే ఏభై వేల కోట్ల లోపు పెట్టుబడులు. నిజంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పాలిగా. విశాఖ పారిశ్రామిక సదస్సుల పేరుతో బోగస్ ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేసే యత్నం చేశారు. ►బాబు అబద్దం-8 రాజకీయాలలో నీతి, నిజాయితీకి మారుపేరు విజయభాస్కరరెడ్డి ►అసలు వాస్తవం విజయభాస్కరరెడ్డికి నిజాయితీ పరుడు అన్న పేరు ఉన్న మాట నిజమే. కానీ చంద్రబాబు మాత్రం కోట్ల ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో దారుణమైన అవినీతి ఆరోపణలు చేసేవారు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై కోట్ల భగ్గుమన్నారు. పాణ్యం ఉప ఎన్నిక ప్రచారంలో, కర్నూలు లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలను కోట్ల కుమారుడు సూర్యప్రకాశరెడ్డి, కోడలు సుజాత మర్చి పోయి ఉండవచ్చు కానీ ప్రజలు మర్చిపోతారా! ఇలా రకరకాల అసత్యాలను వల్లె వేస్తూ చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు. వీటిని జనం నమ్మకపోవచ్చు. అది వేరే విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా తన బాధ్యత అని ఆయన అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏ రకంగా అపహాస్యం పాలైంది అందరికి తెలుసు. తన పార్టీని గెలిపించకపోతే తాను అసెంబ్లీకి వెళ్లలేనని ఆయన వాపోతున్నారు. ఇది ఆయన అసలు బాధ. జగన్‌కు పాలన చేతకాదని చెబుతున్న ఆయన ఈ మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో జగన్ తీసుకువచ్చిన కొత్త వ్యవస్థలు, అమలు చేసిన స్కీములను మాత్రం విమర్శించలేకపోతున్నారు. పైగా తాను జగన్‌ను మించి సంక్షేమ స్కీములు అందిస్తానని అన్నారు. దీనిని బట్టే జగన్ పాలనను ఆయన కూడా తనకు తెలియకుండా అభినందించినట్లయింది. ఈ మూడు సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన సంగతిని మర్చిపోయినట్లు నటిస్తూ అధికారం వచ్చేస్తుందని టీడీపీ వారిని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్దాలపై పేటెంట్ హక్కు ఒక్క చంద్రబాబుకే ఉంటుందేమో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ట్విటర్ డీల్: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. తప్పుడు సమాచారాన్ని అవాస్తలను వ్యాప్తి చేస్తున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా, అసత్య ప్రచారాలతో విషాన్ని చిమ్ముతున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అసత్య వార్తలను, విషప్రచారాన్ని చేస్తున్న ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడం విచారకరమన్నారు. ట్విటర్‌కి అసలుఎడిటర్లే (నియంత్రణ) లేరు ఇక ప్రమాదంలో ఉన్నదాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారని ఎలా విశ్వసించాలని బిడెన్ ప్రశ్నించారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురి కీలక ఎగ్జిక్యూవ్ల తొలగింపు, సంస్థలో దాదాపు సగం ఉద్యోగులపై వేటు, డైరెక్టర్ బోర్డును చేసి, ఏకైక డైరెక్టర్‌గా మస్క్ కొనసాగుతున్న నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్ 8న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం చికాగోలో జరిగిన నిధుల సమీకరణ మీట్లో దీని ప్రభావంపై డోనర్లను హెచ్చరిస్తూ బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల మధ్య ఈ ఎ న్నికలు బైడెన్ సర్కార్‌కు పెద్ద సవాల్. (ElonMusk రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం! అయినా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా!) మరోవైపు ట్విటర్ టోకోవర్పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్ట్ ట్రంప్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా బిడెన్‌పై మస్క్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బైడెన్‌ను ఎన్నుకోలేదనీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రామాను తట్టుకోలేకే ఆయన్ను గెలిపించారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
టీడీపీ సోషల్ మీడియాతో జాగ్రత్త: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మీడియాను.. దానికి సంబంధించిన వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, అలాంటి వారితో పోరాటంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు. వైఎస్సార్ సీపీలో వైఎస్ జగన్ తప్ప మిగిలినవారంతా కార్యకర్తలే. పార్టీకి సోషల్ మీడియానే కీలకం ఇప్పుడు. చంద్రబాబు అనే అబధ్దానికి, నిజం అనే వైఎస్ జగన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. మీడియా వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అలాంటి వాళ్లతో పోరాటంలో పార్టీ సోషల్ మీడియా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీడీపీ అనేది తుప్పుపట్టిపోయిన పార్టీ. ఇప్పటికే దాని పని అయిపోయింది. అందుకే దాని సోషల్ మీడియా, వాళ్లకు ఉన్న మీడియాల ద్వారా అబద్దాలను ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి. వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి అని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగానికి సజ్జల దిశానిర్దేశం చేశారు. అలాగే రాజ్యాంగ వ్యవస్దల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, టీడీపీ వాళ్లు రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేసినప్పుడు ట్రాప్‌లో పడొద్దని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావు’ -
బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు
న్యూఢిల్లీ: ఖైబర్ పక్తూంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్‌లో అప్పర్ కోహిస్తాన్ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్‌కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) కారణమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు. -
కాంగ్రెస్ అబద్ధాలకోరు పార్టీ
సాక్షి ప్రతినిధి, చెన్నై/పుదుచ్చేరి: ‘విభజించు, అబద్ధమాడు, పాలించు’ అనేదే కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశంలో కాంగ్రెస్ సంస్కృతి అయిన ఫ్యూడల్, వారసత్వ రాజకీయాలు ముగిసిపోయాయని అన్నారు. దేశమంతటా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీలో బంగారు, వెండి, రజత పతక విజేతలున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో గురువారం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన నుంచి పుదుచ్చేరి స్వేచ్ఛ పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ‘హైకమాండ్’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారని, ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నారాయణస్వామి కాంగ్రెస్ పెద్దల చెప్పులు మోయడంలో సిద్ధహస్తుడని మండిపడ్డారు. పుదుచ్చేరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఎన్డీయే కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిని వ్యాపార, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు విభజించు, పాలించు అనేది వలస పాలకుల సిద్ధాంతమైతే.. విభజించు, అబద్ధాలు చెప్పు, పాలించు అనేది కాంగ్రెస్ విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రాంతాలకు మధ్య, వర్గాలకు మధ్య తగువు పెడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 2019లో మత్స్య శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్లో ఆ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు. పుదుచ్చేరి ప్రజలు 2016లో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, వారి ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు వీస్తున్నాయని చెప్పారు. అన్నదాత బాగుంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ తమిళుల కలలను సాకారం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆయన గురువారం పుదుచ్చేరితోపాటు తమిళనాడులోని కోయంబత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘మోదీ గో బ్యాక్’ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత, నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోయంబత్తూరులో నల్లజెండాలతో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినదించారు. ఇద్దరు యువతులు సహా 77 మందిని విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్‌పేటలో నల్లబెలూన్లు ఎగురవేసిన తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
ప్రధాని పర్యటన అబద్ధాలమయం
వయనాడ్ (కేరళ): గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలన్నీ అబద్ధాలు, విద్వేషం, విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలను విడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ మాత్రం ప్రేమ, నిజం, ఆప్యాయత వైపు నిలిచిందని పేర్కొన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా తనను గెలిపినందుకు గానూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కల్పెట్టా, కంబలకాడు, పనమారమ్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం పలు రోడ్‌షోలలో పాల్గొన్నారు. ‘మోదీ దగ్గర డబ్బు, మీడియా, ధనికులైన స్నేహితులు ఉండవచ్చు. కానీ దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేషం, అసహనంపై కాంగ్రెస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ప్రేమ, ఆపాయ్యతతో వాటిని అధిగమిస్తుంది’అని రాహుల్ అన్నారు. వయనాడ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అందరం కలిసికట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. రాహుల్ రోడ్‌షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. -
ఉత్పత్తే లేదు.. మిగులెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగులు విద్యుత్, ప్రస్తుతం సాగుకు ఇస్తున్న 24 గంటల కరెంట్ సరఫరా కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి ఫలితమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ అయినా ఉత్పత్తి చేశారా అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయకుండానే మిగులు విద్యుత్ ఎలా సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల్లో నేటికీ పనులు కూడా ప్రారంభం కాలేదన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. బుధవారం గాంధీభవన్‌లో విద్యుత్ అంశంపై టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్ అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉత్తమ్ మాట్లాడారు. ఇందులో శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్ విద్యుత్ పరిస్థితిపై సమగ్ర సమాచారమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్ల ద్వారా కోట్లు దండుకునేందుకే జెన్కోను నిర్వీర్యం చేశారు. దీనివల్ల జెన్కో రూ. 13 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ 85 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసిన జెన్కో.. ఇప్పుడు 69 శాతం ఉత్పత్తికే పరిమితమైంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలోనే భూపాలపల్లి ఫేజ్–1, ఫేజ్–2, కొత్తగూడెం, జూరాల, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్, ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను ఇక్కడి ఉత్పత్తి సామర్థ్యంలో కలిపి చూపిస్తున్నారు’’అని విమర్శించారు. 14 వేల మెగావాట్లకు ఎలా చేరింది.. రాష్ట్రంలో 6,500 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి సామర్థ్యం 14 వేల మెగావాట్లకు ఎలా చేరిందని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. వచ్చే ఏడా ది నాటికి 28 వేల మెగావాట్లకు ఎలా చేరుకుంటుందో సీఎం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ప్రజలపై కరెంట్ భారం పడబోతోందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌తో లోపభూయిష్ట ఒప్పందం కుదుర్చుకున్నారని, బహిరంగ మార్కెట్లో యూనిట్ ధర రూ.3.50 నుంచి రూ.4 ఉంటే.. ప్రభు త్వం రూ.6 చెల్లిస్తోందని, దీంతో ప్రజలపై ఏటా 1,200 కోట్ల భారం పడుతుం దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ అన్నారు. కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రేవంత్, దామోదర్‌రెడ్డి, వీహెచ్, పొన్నం, మల్లు రవి, సుదర్శన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోదంరెడ్డి, బండ కార్తీక తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్న అబద్ధాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మొగల్తూరులో ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకున్న ఆనంద ఆక్వా గ్రూప్ సంస్థలపై ప్రభుత్వం అమిత ప్రేమ చూపిస్తోంది. మొగల్తూరు ఘటనపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు పలికారు. ఆక్వా ప్లాంట్‌కు సంబంధించిన పైపులైన్లు తొలగించినట్టు మంత్రి ప్రకటించారు. శనివారం కూడా ఆ ఫ్యాక్టరీ పైపులైన్లు అలానే ఉండటం గమనార్హం. ఐదుగురి మరణానికి కారణమైన ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ప్రాసెస్ చేసేందుకని చెబుతున్న సంప్ (ట్యాంక్) నిర్మించి రెండు నెలలు కూడా కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంప్‌లోకి వచ్చే వ్యర్థాలను, కాలుష్యంతో కూడిన జలాలను పైప్‌లైన్ ద్వారా నేరుగా గొంతేరు కాలువలో కలుపుతున్నారు. ప్లాంట్ నిర్మించిన నాటినుంచి దానినుంచి వచ్చే వ్యర్థాలను గొంతేరులోకి తరలిసూ్తనే ఉన్నారు. తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు తీవ్రం కావడం, మొగల్తూరులోని ప్లాంట్ అదే యాజ మాన్యానికి చెందినది కావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు 2016 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొంతేరు డ్రెయిన్‌లోకి వేసిన పైప్లైన్లను తక్షణం తొలగించాలని, ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యర్థాలను, కాలుష్యాన్ని శుద్ధి చేయాలని ఆదేశించింది. ఆ నీటిని అదే ప్లాంట్‌లో పంటల కో సం వినియోగించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తుందుర్రు ఆక్వా పరిశ్రమకు సంబంధించి ప్రజలు చెబుతున్న విషయాల్లో ఏ మేరకు నిజం ఉందో తెలుసుకునేందుకగత ఏడాది డిసెంబర్లో అప్పటి సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ మొగల్తూరు ఆక్వా ప్లాంట్‌ను తనిఖీ చేయడంతో అసలు బండారం బయటపడింది. అప్పటివరకు రొయ్యలను శుద్ధి చేసిన రసాయనాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లోకి వదిలేవారు. సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రీట్మెంట్ ప్లాంట్, రసాయనాలను శుద్ధిచేసే ట్యాంక్‌ను నిర్మించారు. అయితే, వాటిని ఇప్పటికీ వినియోగించడం లేదు. ఫ్యాక్టరీ పక్కనే రెండు చేపల చెరువులు తవ్వి, దాని పక్కనే ఒక గట్టుపై ఐదుగురి మరణానికి కారణమైన సంప్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రంచేసి, అనంతరం వాటి తలలను తొలగించి ప్రాసెసింగ్ ప్లాంట్స్‌కు పంపించాలి. రొయ్యల తలలు తొలగించే సయమంలో కొంత పసుపు, తెలుపు రంగులో ఉండే జిగురు లాంటి వ్యర్థం బయటకు వస్తుంది. దానిని ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ)లోకి పంపించాలి. ఈపీటీకి ఐరన్ గ్రిల్ వేసి దీనిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. సంపునే ఈటీపీగా చూపిస్తున్న యాజమాన్యం దానిని రేకులతో పూర్తిగా మూసివేసింది. దీనివల్ల ఈపీటీలో నిల్వ వున్న వ్యర్థాలు కుళ్లిపోయి మీథేన్ గ్యాస్‌గా మారుతోంది. నిపుణులు ఏరీ ఈటీపీని శుభ్రం చేయడానికి నైపుణ్యం, అనుభవం గల సిబ్బం దిని వినియోగించాల్సి ఉంటుంది. యాజమాన్యం అందుకు భిన్నంగా అవగాహన లేని దినసరి కూలీలను సంప్‌లోకి దింపింది. అందులోంచి విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇదిలావుంటే.. ఈటీపీగా చెబుతున్న సంపులోని కలుషిత జలాలను పైప్‌లై¯ŒS ద్వారా నేరుగా గొంతేరులోకే వదిలిపెడుతున్నారు. కూలీల మరణించిన రోజున ప్లాంట్‌కు వెళ్లిన కలెక్టర్ కె.భాస్కర్‌కు స్థానికులు గొంతేరులోకి వేసిన పైప్లైన్లను చూపించారు. వాస్తవాలు ఇలా ఉంటే కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్లాంట్‌లోని పైప్లైన్లను తొలగించినట్టు అసెంబ్లీలో శుక్రవారం ప్రకటన చేశారు. ఈ ప్లాంట్ కట్టకముందు గొంతేరులో పీతలు పెద్దఎత్తున ఉండేవని, చేపల సంఖ్య కూడా గణనీయంగా ఉండేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆనంద ఆక్వా ప్లాంట్ కారణంగా అవి అంతరించిపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వాపోతున్నారు. కాలుష్యం ఇక్కడ మామూలే కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఒకసారి భీమవరం వస్తే అన్నీ చూడవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు. యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పాలకోడేరు మండలంలోని పరిశ్రమలు, రొయ్యల ఫ్యాక్టరీలు విడుదల చేస్తున్న విష వ్యర్థాలు, కలుషితమైన నీరు ప్రధాన కాలువలు, డ్రెయిన్లలోకి చేరుతూ వాటిని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. యనమదుర్రును కాలుష్య కాసారంగా మార్చేసిన వేండ్ర డెల్టా పేపర్ మిల్ ప్రస్తుతం నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అధీనంలో ఉంది. ప్రజాప్రతినిధులకు భయపడి కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. గొల్లలకోడేరులో ఖాదర్ రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలన్నీ యనమదుర్రులోకి చేరుతున్నాయి. మోగల్లులోని వశిష్ట రొయ్యల ఫ్యాక్టరీ, పాలకోడేరులోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు గోస్తనీ కాలువ ద్వారా యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తున్నాయి. సమస్య తీవ్రంగా ఉన్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ఈ కలుషిత నీటినే వాడాల్సి వస్తోంది. -
ఆడపిల్ల అబద్ధం ఆడితే?
అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారో? లేదో? తెలీదు కానీ, ఆడపిల్ల అబద్ధం ఆడితే... ఆమె మనసులో ప్రేమ పుట్టిందనే అర్థమంటున్నారు దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక. క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్దాస్, సుపూర, పమేలా ముఖ్య తారలుగా వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మించిన సినిమా ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. కథారచయిత చిన్నికృష్ణ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు చిన్న నటీనటులే తర్వాత పెద్ద స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో నటీనటులకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా. బుల్ గానిన్ సంగీతం, దాము నర్రావుల సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్’’ అన్నారు దర్శకుడు. -
అబద్ధాలకు కేరాఫ్ చంద్రబాబు
- సీమ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలం - ప్రజల కష్టాలు పట్టించుకోని సీఎం - గడపగడపకు వైఎస్సార్‌లో అనంత వెంకట్రామిరెడ్డి మంత్రాలయం/పెద్దకడబూరు: అబద్ధాలకు కేరాఫ్ సీఎం చంద్రబాబునాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఇన్చార్జి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దకడబూరు మండల కేంద్రంలో పర్యటించారు. ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. బైకు ర్యాలీ, పూలమాలలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎస్సీ వాడ నుంచి గడపగడపకు కార్యక్రమం ప్రారంభించారు. చంద్రబాబు పాలన తీరును ప్రజలకు వివరించారు. భారీ జన సందోహం మధ్య ఊరేగింపుగా అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. సభలో అనంతవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో వంద అబద్ధపు హామీలు గుప్పించారన్నారు. రాయలసీమ పేరు చెబుతూనే అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. సీమ ప్రజల కష్టాలను పూర్తిగా విస్మరించారన్నారు. సీమకు పరిశ్రమలు తెస్తామని చెబుతున్నా ఆచరణలో లేకపోయిందన్నారు. సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటులోనూ తంతు మారలేదన్నారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శిఃచారు. పూటకోమాట మార్చుతూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏమి సాధించారని జనచైతన్య యాత్రలు పెట్టారో ఆయన విజ్ఞతకే వదిలేయాలన్నారు. రాయలసీమ పేరు చెప్పుకుని సాగునీటి జలాలను కోస్తాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికే చెల్లిందన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మామ ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలిచామని.. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. విమర్శించే అర్హత నరవకు లేదు : వై.బాలనాగిరెడ్డి పూటకో పార్టీ మార్చే టీడీపీ నాయకుడు నరవ రమాకాంత్‌రెడ్డికి తమను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని రమాకాంత్‌రెడ్డికి విమర్శించే స్థాయి లేదన్నారు. పాలకుర్తి తిక్కారెడ్డి.. మూడేళ్లలో నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కనీసం పులికనుమ ప్రాజెక్టుకు రూ.30 కోట్లు అవసరమైనా తేలేకపోయారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేత వై.సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీ సభ్యుడు మంగమ్మ, లక్ష్మయ్య, ఎంపీపీలు రఘురాముడు, మండల కన్వీనర్లు రామ్మోహన్‌రెడ్డి, భీమిరెడ్డి, మాజీ ఎంపీపీ, సింగిల్ విండో ప్రెసిడెంట్ హనుమంతురెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయేంద్రరెడ్డి, ఎస్సీసెల్ కార్యవర్గ సభ్యుడు తిక్కన్న, నాయకులు బెట్టన గౌడ్, అత్రితనయ గౌడ్, మురళీరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, పంపాపతి, చంద్రశేఖర్‌రెడ్డి, లింగన్న, యల్లప్ప పాల్గొన్నారు. -
అబద్ధాలు చెబితే ఎన్నిక చెల్లదు
విశ్లేషణ డిగ్రీల విషయంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ నేతనుంచి రాబట్టాలి. మనకు నిజం విలువ ఎట్లాగూ తెలియదు, కనీసం అబద్ధం ఖరీదు తెలుసా? డిగ్రీ లేకున్నా ఉన్నట్టు అబద్ధం చెప్పిన ఎంఎల్ఏ (ఎన్సీపీ) మెరియంబం పృథ్వీరాజ్ ఎన్నిక రద్దు చేస్తూ మణిపూర్ హైకోర్టు ప్రకటించింది. మెరి యంబం నామినేషన్లో విద్యా ర్హత గురించి అవాస్తవ ప్రకటన ఉందని ప్రత్యర్థి శరత్ చంద్ర సింగ్ అభ్యంతరం తెలిపినా ఆమోదించారు. పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని గువాహటి హైకోర్టులో శరత్చంద్ర పిటిషన్ వేశారు. ఫారం 26లో మైసూర్ యూనివర్సిటీ తనకు ఎంబీఏ డిగ్రీ ఇచ్చిందని ప్రమాణపత్రంలో చెప్పినా ఆ డిగ్రీ లేదన్నారు. అది క్లరి కల్ తప్పనీ, ఎన్నిక రద్దు చేయాల్సిన అవసరం లేదనీ, చదువు విషయంలో పొరబాటు జరిగినంత మాత్రాన ఎన్నిక గణనీయంగా ప్రభావితం కాబోదని ప్రతివాది ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 100 (1)(డి) ప్రకారం ఎన్నికను గణనీయంగా ప్రభా వితం చేసిన అంశం అవాస్తవ ప్రకటన అయితే ఎన్నిక రద్దు చేయాలని కోరే పిటిషన్ దాఖలు చేయవచ్చు. అవాస్తవ ప్రమాణపత్రంతో కూడిన నామినేషన్‌ను ఆమోదించడమే తప్పని, ఆ తప్పుపై ఆధారపడి జరిగిన ఎన్నిక చెల్లదని హైకోర్టు వివరించింది. నామినేషన్ తప్పుడుదనే కారణంగా ఎన్నిక రద్దు చేయడానికి వీల్లేదని, సెక్షన్ 100 కింద గణనీయంగా ప్రభావితం చేసే తప్పు జరిగిందని రుజువైతేనే ఎన్నిక దెబ్బ తింటుందని మొయింరంబం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ (2002(5)ఎస్సీసీ 294), పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2003(4) ఎస్సీసీ399) కిసాన్ శంకర్ కాథోర్ వర్సెస్ అరుణ్ దత్తాత్రేయ సావంత్ 2014(14)ఎస్సీసీ162, రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014(14) ఎస్సీసీ 189 కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అభ్యర్థి చదువు అర్హతలు తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, ఆ డిగ్రీ లేకపోతే, ఆ తప్పుడు నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. హరికృష్ణ లాల్ వర్సెస్ బాబూ లాల్ మరాండీ 2003(8) ఎస్సీసీ 613 కేసులో కూడా తప్పుడు డిగ్రీ ఆరోపణతో దాఖలైన నామినేషన్‌ను పనికి రాకుండా చేసే గణనీయమైన ఘనలోపమే అని సుప్రీం కోర్టు తేల్చింది. సెక్షన్ 33 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద సరైన నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. 33ఎ నియ మాన్ని 2002లో సవరణ ద్వారా చట్టంలో చేర్చారు. దీని కింద నేర, ధన, చదువు వివరాలు అదనంగా ప్రమాణ పత్రాల్లో ఇవ్వాలి. గణనీయమైన లోపం లేకపోతే నామి నేషన్‌ను తిరస్కరించరాదని సెక్షన్ 36 నిర్ధారిస్తున్నది. సెక్షన్ 100లో ఎన్నిక రద్దు చేసే కారణాలను వివరిం చారు. (ఎ) గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరి టరీస్ చట్టం 1963 కింద లేదా రాజ్యాంగం కింద ఖాళీ అయిన స్థానం నుంచి ఎన్నికయ్యే అర్హత లేకపోతే, (బి) అభ్యర్థిగానీ, ఆయన అనుమతితో మరెవరైనా గానీ, ఏజంట్ గానీ అవినీతి (కరప్ట్ ప్రాక్టీస్)కి పాల్పడితే (సి) ఏదయినా నామినేషన్‌ను అక్రమంగా తిరస్కరిస్తే, లేదా (డి) ఎన్నికయిన అభ్యర్థి నామినేషన్ గణనీయంగా ఈ కింది కారణాలవల్ల ప్రభావితం అయితే (1) నామినే షన్ను అక్రమంగా అంగీకరించడం, (2) ఎన్నికయిన అభ్యర్థి కోసం అక్రమంగా అవినీతికి పాల్పడినందుకు, (3) అక్రమంగా ఏ ఓటునైనా తీసుకున్నా, తిరస్కరిం చినా, పనికిరాని ఓటును తీసుకున్నా, (4) రాజ్యాంగం లోని లేదా ఈ చట్టంలోని ఏ నియమాన్నయినా ఉత్త ర్వునైనా ఉల్లంఘించినా ఎన్నిక రద్దు చేయవచ్చు. అయితే అభ్యర్థి ఏజంటు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి ఉత్తర్వులకు భిన్నంగా ఎవరైనా అవినీతికి పాల్పడి ఉంటే అప్పుడు ఎన్నిక రద్దు కాబోదు. సెక్షన్ 125 ఎ కింద సెక్షన్ 33ఎ ప్రకారం సమర్పించవలసిన ప్రమాణ పత్రంలో తప్పుడు అంశాలు చేర్చినందుకు ఆరునెలల జైలు లేదా జరిమానా వరకు విధించవచ్చు. 33ఎ కింద చెప్పవలసిన వివరాలు చెప్పకపోయినా నామినేషన్ చెల్లదని కిసాన్ శంకర్ కాథోర్ కేసులో చెప్పారు. రీసర్జెన్స్ ఇండియా కేసులో క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తిపాస్తులు, చదువుల వివరాలలో అవాస్త వాలు చెప్పినా లేదా ఫారంలో వివరాలు చెప్పకుండా గడులను ఖాళీగా వదిలినా చెల్లదన్నారు. ఎంబీఏ అర్హత ఉందనడం క్లరికల్ తప్పిదం అన్న వాదాన్ని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ అనిల్ కుమార్ దవేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆ గణనీయమైన తప్పువల్ల నామినే షన్, ఎన్నిక చెల్లబోవని తేల్చింది. కానీ ప్రత్యర్థి ఎన్నికైనట్టు ప్రకటించేందుకు నిరాకరించింది. డిగ్రీల విష యంలో అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదనే ఈ తీర్పు రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక. ఎన్నిక రద్దు చేయడంతో సరిపోదు. అబద్ధం చెప్పిన నేరానికి జైలుకు పంపాలి, ఎన్నిక ఖర్చునంతా ఆ అబద్ధపు నేత నుంచి రాబట్టాలి. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈ–మెయిల్: professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
అవును ఆయన మారలేదు...
ఒంగోలు: ఆయన మారలేదు..అవును ఆయన ఏ మాత్రం మారలేదు. అందరి సాక్షిగా మళ్లీ అదే బడాయిలు. అవే అబద్ధాలు. అదే తీరు...అవును ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మరోసారి మాటలతో కోటలు కట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం చంద్రబాబు జనచైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలను ఏకరవు పెట్టారు. ఓ పక్క రుణమాఫీ కాక రైతులు, డ్వాక్రా మహిళలు అల్లాడుతుంటే.... ఇంకోపక్క మాఫీ అద్భుతంగా చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లక్షలాది పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గతంలో దెయ్యాలు కూడా పెన్షన్స్ తీసుకునేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే... సీఎం మాత్రం తాము అధికారంలోకి వచ్చాక రైతుల ఆర్థిక స్థితి బాగుపడిందని బడాయిలు చెప్పారు. జన చైతన్య యాత్రలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు అక్కడే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ 1 కన్వెన్షన్ హాలులో పార్టీ ముఖ్యనాయకుల సమావేశం అయ్యారు. చివరగా అంగన్వాడీ, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. -
బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు
– చంద్రబాబుకు అబద్ధాలు ఫ్యాషన్ అయిపోయింది.. – బలవంతపు భూసేకరణ వద్దంటే అభివద్ధి నిరోధకులు అంటావు – చంద్రబాబు.. అభివృద్ధి నిరోధకుడివి నువ్వా? మేమా? – ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? – కాలుష్య ఫ్యాక్టరీ వద్దంటే హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెడతారా? – బాబూ డ్రామాలు కట్టిపెట్టి పద్ధతి మార్చుకో.. ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో – గ్రామాల మధ్యలో ఫ్యాక్టరీ తొలగించి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా – అలా కాదని చంద్రబాబు మాట వింటే ఆయనతోపాటే బంగాళాఖాతంలో కలిసిపోతారు – ప్రజల కోసం అవసరమైతే ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కోర్టుకు వెళతాం – అక్వా ఫుడ్ పార్క్ బాధితుల సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, భీమవరం : ‘అయ్యా.. చంద్రబాబూ మీకు అబద్ధాలు ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బందరు పోర్టుకు వేల ఎకరాలు భూ సేకరణ చేస్తారు. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటావు. భోగాపురం విమానాశ్రయానికి కూడా భూములు బలవంతంగా తీసుకుంటావు. ఇప్పుడు తుందుర్రులో కనీసం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేస్తావు. అదేమని ప్రశ్నించే ప్రజలపై హత్యాయత్నం కేసులు పెడతావు. జైళ్లకు పంపుతావు. ప్రజలను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటావు. ఇది సరైంది కాదని ఎదిరించి చంద్రబాబు ఆగడాల్ని అడ్డుకుంటే అభివద్ధి నిరోధకులుగా ముద్రవేస్తాడు. అయ్యా.. చంద్రబాబు అభివద్ధి నిరోధకుడు నీవా? మేమా? చంద్రబాబు ఇవన్నీ మార్చుకో. రాష్ట్రం కోసం పనిచేయడం నేర్చుకో’ అంటూ ప్రధా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా మెగా ఫుడ్ పార్క్ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడతామని వ్యతిరేకిçస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసు వేధింపులకు దిగడంతో బాధితులకు అండగా ఉంటానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తణుకు వెళ్లి అక్కడ సబ్‌జైలులో ఉన్న తుందుర్రు చెందిన ఆరేటి సత్యవతిని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం తణుకు నుంచి రేలంగి, అత్తిలి, భీమవరం మీదుగా తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అక్వా ఫుడ్‌పార్క్ బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం అబద్ధాలు ఆడినట్టే చివరకు ఫ్యాక్టరీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల నుంచి చంద్రబాబు అబద్ధాలే చెబుతున్నాడు ‘ఎన్నికల సందర్భంలో ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాడు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక అబద్ధాలతో ప్రజలను మోసం చేశాడు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం అప్పులు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు రద్దు చేస్తానన్నాడు. చివరికి చదువుకున్న పిల్లల్ని కూడా వదల్లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. జాబు రాకపోతే నిరుద్యోగ భతి ఇస్తానని అబద్ధాలు చెప్పి ఏ ఒక్కటి సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఫ్యాక్టరీని ప్రజలు అడ్డుకుంటుంటే మళ్లీ మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని అబద్ధాలు చెబుతున్నాడు. ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చుపెట్టి షెడ్లు వేసుకున్నట్టు చెబుతున్నారు. అలాంటి ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీకి ప్రభుత్వ నిధులతో ఎలా పైపులైన్ వేస్తారు. ఒక పక్కన ఆ ఫ్యాక్టరీ వల్ల జీరో పర్సంట్ కాలుష్యం అని చెబుతున్న చంద్రబాబు ఫ్యాక్టరీ కలుషిత వ్యర్థాలను సముద్రంలోకి పంపించేలా పైపులైన్ వేస్తానని చెబుతున్నారు. అంటే ముడుపుల కోసం ఏ పని చేసేందుకైనా చంద్రబాబు వెనుకాడడు. లేదంటే ప్రజలను మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని కొత్త డ్రామాలు అడుతున్నాడు. చంద్రబాబు గారూ.. పైపులైన్ డ్రామాలు కట్టిపెట్టండి’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సీఫుడ్ ఫ్యాక్టరీ కాలుష్యం అని తెలీదా? ‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చంద్రబాబు తెలీదా? కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని పది కిలోమీటర్ల దూరంలోని మారిస్తే అక్కడ మనుషులు ఉండరు. సముంద్ర తీరంలో ఇదే ప్యాక్టరీ యజమానులకు 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత భూమిని ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా దాని వల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది. ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్తాకూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గదం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను బతకదు, పొలాలు మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు. బాబును నమ్ముకుంటే బంగాళాఖాతమే..! పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబటిట పర్వాలేదు గానీ ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక్కటే. ఏదైనా ఫ్యాక్టరీని పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదష్టితో ఉండాలి. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి. వీళ్ల లెక్కల ప్రకారం 15–20 కోట్లు పెట్టామంటున్నారు. ఈ షెడ్లును ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు. మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు. ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్దవాతావరణం సష్టించారు. ఊళ్లో 144 సెక్షన్ పెట్టారు. యాజమాన్యాన్ని కోరుతున్నా ప్రజల అభిష్టం మరకు దీన్ని ఇక్కడి నుంచి తరలించండి. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు. ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు. వీటన్నింటి దష్టిలో పెట్టుకుని పెద్ద మనస్సుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాదు కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. ఫ్యాక్టరీని తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల తరువాత మన ప్రభుత్వమే వస్తుంది.. చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమే అని గుర్తుపెట్టుకోంది. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. అప్పుడు ప్రజల అభిష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులకు భరోసా ఇచ్చారు. సభలో పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వంకా రవీంధ్రనాథ్, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు -
చంద్రబాబు లక్ష్యం నెరవేరదు: అంబటి
హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సీపీ అడ్డుపడుతోందని ప్రతిపక్షంపై చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు నోరు విప్పితే పచ్చి అబద్ధాలే అని, ఆయనకు లక్షల కోట్లు సంపాదించాలన్న పిచ్చి పట్టిందని అంబటి విమర్శించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతికి మాత్రమే అడ్డుపడుతున్నామని అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమా అని చంద్రబాబు అంటున్నారని, దమ్ముంటే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీ అవసరమో కాదో ప్రజలే చెబుతారన్నారు. తాము ఏకపక్షంగా ఎన్నికయ్యామని చెప్పుకోవటం సిగ్గుచేటు అని అంబటి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ ఉంటే టీడీపీకి పుట్టగతులు ఉండవని బాబుకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు మాత్రం కేసుల్లో స్టేలు తెచ్చుకుంటారని, అదే ప్రభుత్వంపై ఎవరైనా స్టే తెచ్చుకుంటే ఉన్మాదుల్లా వ్యవహరిస్తారని అంబటి అన్నారు. తెలంగాణలో నయీం ట్యాక్స్‌లా ఏపీలో లోకేవ్ ట్యాక్స్ నడుస్తోందని అంబటి ఎద్దేవా చేశారు. లోకేశ్ అంటేనే అవినీతి అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లక్ష్యం తన కొడుకు లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడమే అని, అయితే ఆయన లక్ష్యం నెరవేరదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంబటి మండిపడ్డారు. నిజాల్ని కప్పిపుచ్చి తాను సమర్థుడినని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. -
హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా పూర్తిచేసిన ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొ ట్టిన మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సూచించారు. పీసీసీ నేత హర్షవర్దన్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. అబద్ధాలతో పాలమూరు ప్రజల ను టీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టలేరన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలను 2012లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఒకప్పుడు నవయుగ కాంట్రాక్టర్లను జైలులో పెట్టాలన్న టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నెత్తిన ఎక్కించుకున్నారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను భారీగా పెంచారని, అన్ని వివరాలను అందించాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
బత్తలపల్లి : పంటనష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోకుండా అబద్ధాలతో మోసపుచ్చుతున్నారని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో ఎండిపోయిన వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతు పెద్దిరెడ్డితో మాట్లాడారు. ‘నేను మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన విత్తనాలే వేశాను. పూతే రాలేదు సార్. ఊడలు దిగే సమయంలో వర్షాలు పడలేదు. పంట ఎండిపోతున్నా రెయిన్గన్లు కూడా ఇవ్వలేదు’ అని రైతు తెలిపాడు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో పంటలు ఎండి.. రెయిన్గన్లతో రక్షక తడులు అందక నష్టాలపాలైన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్గన్లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకుంటే రైతులు పంటలను ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు. రైతులను ఆదుకోకపోతే కంచుకోటగా ఉన్న ‘అనంత’లో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిం నరసింహులు, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంగళరెడ్డి, సర్పంచులు సూర్యనారాయణరెడ్డి, సంజీవు, కాశప్ప, జయచంద్రారెడ్డి, జయరామిరెడ్డి, చల్లా క్రిష్టా, ముసలయ్య, పరేష్, లింగారెడ్డి, కప్పల నారాయణస్వామి, ప్రసాద్‌రెడ్డి, పాళ్యం అప్పస్వామి, పామాల నాగభూషణ, బాల ఈరప్పగారి అప్పస్వామి, తప్పెట పెద్దన్న, టీసీ కాటమయ్య, పోట్లమర్రి హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, సుధాకరరెడ్డి, కమతం ఆంజనేయులు, ధర్మవరం మండల నాయకులు పాల్గొన్నారు. -
రుణమాఫీ లేదు.. ఏం లేదు..
ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి వద్ద వాపోయిన మహిళలు ఆత్మకూరురూరల్ : ‘చంద్రబాబు పొదుపు మహిళలకు రుణమాఫీ అంటూ ఊదరగొట్టి ఒక్కొక్కరి ఖాతాలో కేవలం రూ.3,000 జమచేసి ఆ సొమ్ము సైతం వాడుకునేందుకు వీల్లేకుండా కొర్రీలు పెట్టారని’ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మండలంలోని పాతజంగాలపల్లి గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీకాలనీలో బద్దెల లక్ష్మమ్మ తన ఐదు నెలల వయస్సు ఉన్న మనుమరాలికి గుండెలో చిల్లు ఉందని డాక్టర్లు చెప్పారని, ఆ పాపకు ఆరోగ్యశ్రీకార్డు లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దేవరపాటి కొండయ్య అనే వ్యక్తి తనకు గతంలో పింఛన్ వస్తుండేదని, ప్రస్తుతం నిలిపేశారని చెప్పాడు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి రావడం కోసం వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. అర్హులైన వారికి పక్కాగహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఒక్క ఇళ్లుయినా కట్టిన పాపానపోలేదన్నారు. రైతులవాణిని అసెంబ్లీలో వినిపిస్తానన్నారు. సర్పంచ్ గడ్డం విజయసేన, జి.శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాయకులు ఉల్సా పెంచలయ్య, సానా వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీరాములు, ముక్కమళ్ల రఘురామిరెడ్డి, వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి, యానాదిరెడ్డి, ఖాజావలి, ఖాదర్‌బాష, షేక్ ఖాజావలి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, ఎండీ ముజీబ్, ఓబుల్‌రెడ్డి, రహీం, వశీం, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
హోదా వచ్చేవరకు ఉద్యమం
మీ స్వార్థం కోసం జనం.. ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే పీఆర్కే వెల్లడి మాచర్ల : ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు హోదా సంజీవని కాదని, ప్యాకేజీలు ఇస్తామని మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ తొలినుంచీ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం అత్యంత దారుణమన్నారు. మంగళవారం స్థానిక కేసీపీ అతిథి గృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతున్నా టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలతో ప్యాకేజీల గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు హోదా ఇవ్వాలని వాదించిన బీజేపీ అధికారంలోకొచ్చాక చట్టంలో లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని మాట్లాడటం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం హోదా విషయంలో ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతో అన్ని రకాలుగా ప్రయోజనం.. పా్యకేజీ అనేది ఒకేసారి ఇస్తారని, ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని, దీనిని తెలుసుకోకుండా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు రోజుకోరకంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నార ని, త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని జగన్మోహన్రెడ్డి కలిస్తే చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తూ వార్తలు ప్రచురించటం బాధాకరమన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి ప్రత్యేక హోదా సాధించేవరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. పుష్కరాలకు రాజకీయ రంగు.. పుష్కర స్నానాలు భక్తుల మనోభావాలకు సంబంధించినవని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడులో నాలుగు నెలలుగా మంచినీటి కోసం ఇబ్బంది పడుతుంటే నీటి సమస్య పరిష్కారానికి డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం పుష్కరాల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తోందన్నారు. సొంత డబ్బులా పుష్కర ఘాట్లకు పార్టీ రంగులు వేయటం దారుణమన్నారు. పార్టీ మీద ప్రేమ ఉంటే సొంత డబ్బుతో ఘాట్ల నిర్మించి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బుతో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. సమావేశంలో పార్టీ యువజన lసంఘం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఉరి
♦ అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలా...! ♦ నిరుగ్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకోవడమా ♦ అసలు ఆ పథకమే లేదనడం సిగ్గుమాలిన వ్యవహారం ♦ బాబు వచ్చినా జాబు రాలేదు ... నిరుద్యోగ భృతి ఊసేలేదు... మరోసారి బాబు దగా ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి ... ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదువుకోకపోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి... తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వకపోయినా నెలకు రూ.2 వేలు భృతైనా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లాలోని సుమారు 72 వేల నిరుద్యోగులు అధికారికంగా ఉపాధికల్పన కార్యాల యంలో ఇప్పటి వరకూ నమోదు చేసుకుని మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ సీపీ గళంతో బయటపడిన బండారం నిండు శాసన సభ ... వైఎస్సార్ సీపీ జగన్మోహన్ రెడ్డి అనర్గళ ప్రసంగం ... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రశ్నల పరంపర ... ‘నేను అధికారంలోకి వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి... మీ కలల కు భరోసా నేనంటూ’ చంద్రబాబు ఇచ్చిన దగాకోరు హామీని గుర్తు చేస్తున్న వేళ... పచ్చి అబద్ధపు పదజాలం తో ‘పచ్చ’ సమూహం ఎదురు దాడి. ప్రశ్నోత్తరాల సమయం లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అడిగిన మరో ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు లేచి ‘నిరుద్యోగ భృతి పథకం’ మా పరిశీలనలోనే లేదంటూ నిస్సిగ్గుగా బుకారుుంపులకు దిగారు. పూర్తి రుణమాఫీ హామీ ఇవ్వలేదంటూ చంద్రబాబు రెండు నెలల కిందట మాట మార్చిన తీరు మరిచిపోక ముందే మరోసారి మడం తిప్పడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబు మాటలు ఒట్టి బూటకం : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా బాబు వస్తే జాబు వస్తుందని ఆశించి మోసపోయాం. బీటెక్ పూర్తి చేసి 3 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారు. అది కూడా బూటకమే. - షేక్ హబీబున్నీసా, బీటెక్ విద్యార్థిని, వైపాలెం అబద్దాల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డ్ ఎన్నికలకు ముందు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు నేడు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి పథకం లేదని ప్రకటించడం దారుణం. నిత్యం అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేందుకు యత్నిస్తున్నారు. వెంటనే నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. - మారెడ్డి రామకృష్ణారెడ్డి, నిరుద్యోగి, ఒంగోలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేసిన హడావిడి చూసి నిరుద్యోగులు బాబుకు ఓట్లు వేసి మోసపోయారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు. ⇔ కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు. ⇔ స్కూల్క్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్‌ను తొలిగించి వారి స్థానంలో ఉన్న టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ⇔2011లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన గ్రూప్- 1, గ్రూప్- 2, గ్రూప్ -4 నోటిఫికే షన్, 2014 డీఎస్సీ నోటిఫికేషన్ తప్ప ఎటువంటి నియమకాలు చేపట్టలేదు. సుమారు మూడేళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు చాలా మందికి వయోఃపరిమితి దాటిపోతుంది. ⇔ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. ⇔ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, ఇంతవరకూ నియామకాలు జరగలేదు. సర్టిఫికేట్ల వెర్ఫికేషన్కే పరిమితమయ్యారు. ⇔నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మ్యానిఫెస్టోలో ఐదో వాగ్దానంగా పొందుపరిచారు.అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా రెండేళ్లలో రూ.288 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. రెండురోజుల క్రితం ప్రకటించిన బడ్జెట్లో కూడా దీని ఊసు లేదు. ⇔ రేషన్డీలర్లను కూడా రాజకీయ కారణాలతో తొలగించారు. బాబు వచ్చిన తర్వాత రోడ్డున పడ్డ ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకక చిన్నా, చితక పనులు, కూలీపనులు చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ⇔ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్‌లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీ లేవంటూ మిమ్మల్ని భరించలేమంటూ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ అపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు. -
చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!
కిడ్స్ మైండ్స్ * మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి? - వాణి, పాలకొల్లు హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు. దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. * మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు? - మంజూష, చెన్నై మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి. వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు. * మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి. - శ్రీనివాసరావు, నంద్యాల బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి. అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
‘సహనం’పైనా అసత్యాలేనా?
భారతీయులు దురాక్రమణకు గురవుతూ వచ్చారే కానీ, వారెన్నడూ ఇతర దేశాలపై దండెత్తలేదు అనే భావాన్నీ, తమను జయించిన వారి పట్ల కూడా సహన భావం ప్రదర్శిస్తున్న ఏకైక జాతి భారతీయులే అనే భావాన్నీ చారిత్రక వాస్తవాలు పూర్వపక్షం చేస్తున్నాయి. కానీ చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల స్థాయి అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పిత భావనలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. మన జాతి గురించీ, మన గురించీ చాలామంది భారతీయుల్లో పాతుకుపోయి ఉన్న రెండు బలమైన విశ్వాసాలపై నేను రాయాలనుకున్నాను. ఇవే అభిప్రాయాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. ఆయనిలా చెప్పారు. ‘‘ప్రస్తుతం దేశంలో ఒక కొత్త ధోరణిని చూస్తున్నాం. దేశంలో సహనభావం తగ్గిపోతోందని వారంటున్నారు. కానీ ప్రపంచంలోనే సహనాన్ని పాటిస్తున్న ఏకైక దేశం ఇండియా. నూరు శాతం కాకున్నా 99 శాతం వరకు సహనాన్ని మనం పాటిస్తున్నాం’’ అంటూనే వెంకయ్య మరిన్ని మాటల్ని జోడించారు. ‘‘మీరు చరిత్రకేసి చూసినట్లయితే, ఇండియా అనేక దేశాల దురాక్రమణకు గురవుతూ వచ్చింది కానీ, ఒక్కటంటే ఒక్క దేశం పైన అయినా భారత్ దండెత్తిన, దురాక్రమించిన ఘటన లేనే లేదు. భారతీయులకు అలాంటి వైఖరి లేదు కూడా. అన్ని మతాలనూ మనం గౌరవిస్తున్నాం. అదే భారత్ గొప్పతనం. భారతీయుల రక్తంలోనే సహనభావం ఇంకిపోయి ఉంది.’’ భారతీయులు అనేకమంది పై రెండు విశ్వాసాలను కలిగి ఉన్నారు. మొదటిదాన్ని చూస్తే ఇండియా ఎప్పటికీ దురాక్రమణకు గురవుతూనే వచ్చింది కానీ భారతీయులు ఎన్నడూ ఏ దేశాన్నీ దురాక్రమించలేదు. ఇక రెండో భావన ఏమిటంటే, భారతీయులు అంటే పై సందర్భంలో హిందువులు విశిష్టమైనవారు. ఎందుకంటే మనకు సహనభావం ఉంది కనుక. మన మధ్యే జీవిస్తూ ఉన్న మన విజేత పట్ల కూడా మనం సహనభావం ప్రదర్శిస్తున్నాం కనుక. పైన ప్రస్తావించిన వాటిలో రెండో విశ్వాసాన్ని మనం మొదట చూద్దాం. మనకు జరిగిన అనుభవాలనే అనేక ఇతర దేశాలు కూడా పొంది ఉన్నాయి. ఉత్తర భారతదేశాన్ని ముస్లింలు జయించిన శతాబ్దంలోనే అంటే 1066వ సంవత్సరంలో ఇంగ్లండ్‌ను ఫ్రెంచ్ వాళ్లు జయించారు. ఇండియాలా కాకుండా, ఇంగ్లండు భూస్వామ్య కులీనవర్గం, ఉన్నత వర్గాల్లోని అధికశాతం విదేశీ మూలాలు కలిగిన వారే. క్వీన్ ఎలిజిబెత్ సైతం శాక్సె-కోబర్గ్ గోథా రాజవంశానికి చెందినవారు. పేరు సూచిస్తున్నట్లుగా ఆమె ఇంగ్లిష్ వ్యక్తి కాదు. జర్మన్ మూలానికి చెందింది. జర్మన్ వ్యతిరేక మనోభావాలు పెచ్చరిల్లిన కారణంగా ప్రపంచ యుద్ధ కాలంలోనే ఆమెకున్న జర్మనీ పేరు పక్కకు వెళ్లి విండ్సార్ అనే బ్రిటిష్ పేరు వచ్చి చేరింది. అయితే ఇంగ్లండ్ కులీనవర్గాలు తమ విదేశీ మూలాలను ఎంతో ఆత్మగౌరవంతో అట్టిపెట్టుకున్నారు. తమ విదేశీ మూలాన్ని వారెన్నడూ తప్పుగా భావించలేదు. ఆ తర్వాత 200 సంవత్సరాలకు కుబ్లయ్ ఖాన్ పాలనలో మంగోలులు చైనాను జయించి తమ భూభాగంలో కలిపేసుకున్నారు. మంగోల్ యువాన్ రాజవంశాన్ని చైనా ప్రజలు గొప్పగా తలుచుకుంటారు. ఇక ఉత్తర ఆఫ్రికా అయితే క్రీస్తు పూర్వం 450 (హెరొడోటస్ చరిత్రపై తొలి పుస్తకం రాసిన కాలం) లేదా అంతకు మునుపటి కాలం నుంచే వివిధ జాతుల కలయిక నుంచి రూపొందింది. ఇక టర్కీని మధ్య ఆసియా టర్కులు జయించారు. గ్రీకులతోపాటు వివిధ జాతుల ప్రజలు ఇక్కడ నివసించేవారు. టర్కీని అనటోలియా అని పిలిచేవారు. గ్రీకు భాషలో అనటోల్ అంటే తూర్పు అని అర్థం. దీని కారణంగా సైప్రస్ అర్ధ టర్కిష్ గానూ అర్ధ గ్రీకుగాను ఉంటోంది. మన భారత, పాకిస్తాన్ దేశాలకు మల్లే ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఇరుగుపొరుగునే జీవిస్తున్నారు పైగా వారిలో ఎవరికీ అపరాధ భావన లేదు. హంగరీ పేరు హున్స్ నుంచి వచ్చింది. వీరు మధ్యాసియాకు చెందిన గిరిజన తెగ ప్రజలు. వీరు హంగరీని జయించి యూరోపియన్లతో కలిసిపోయారు. హంగేరియన్ అనేది ఇండో యూరోపియన్ భాష కాదు. గ్రీకులు శతాబ్దాలపాటు ఈజిప్ట్‌ను పాలించడమే కాకుండా వారితో కలసి జీవించారు. (ఈజిఫ్టు చివరి రాణి క్లియోపాత్రా వాస్తవానికి గ్రీకు మాట్లాడేది.) ఇవి చరిత్రకు సంబంధించి నా జ్ఞాపకాలలోంచి నేను ఇచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాబట్టి మనకు సహనభావం ఉంది లేదా మనల్ని జయించిన విజేతలతో కూడా కలసి జీవించాము కాబట్టి మనది అసాధారణ జాతి లేదా విశిష్టమైన జాతి అని వెంకయ్య నాయుడు చెప్పిన మాట శుద్ధ తప్పు. ఇక రెండో విషయాన్ని, అంటే భారతీయులు ఎన్నడూ మరో దేశాన్ని ఆక్రమించలేదు అనే కల్పిత గాథను చూద్దాం. దీనికి సంబంధించి మనం చరిత్రలో ఎంతో వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతీయ చక్రవర్తి రంజిత్ సింగ్ సేనానులు అతడి పాలనా కాలపు చివరి రోజుల్లో కాబూల్‌ను ఆక్రమించారు. అయితే రంజిత్ సింగ్ తనను తాను ఇండియన్‌గా కాకుండా పంజాబీలాగే భావించుకునేవాడు. ఎందుకంటే ఇండియా జాతీయ రాజ్యంగా మారకముందే ఇది జరిగింది. కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. అశోక చక్రవర్తి కాందహార్‌లో సుప్రసిద్ధ స్తూపాన్ని నిర్మించాడు. ఇది ఆయన గౌరవార్థం అక్కడ నిర్మించి ఉంటారంటే నాకు సందేహమే. అశోకుడు కాందహార్‌పై దాడి చేసి ఉంటాడు లేక అఫ్ఘానిస్తాన్ లొంగిరాకపోతే దాడి చేస్తానని బెదిరించి ఉండవచ్చు కూడా. అఫ్ఘానిస్తాన్ కూడా ఇండియాలో భాగమేనని కొంతమంది చెప్పవచ్చు. దీనికి నేను చెప్పేది ఒకటే. మహమ్మద్ గజనీ నుంచి ఇబ్రహీం లోడీ, షేర్ ఖాన్ సూర్ల వరకు ఉత్తర భారతదేశంలో అఫ్ఘాన్ విజయాల చరిత్రను చూసినట్లయితే ఇండియాయే అఫ్ఘానిస్తాన్‌లో భాగమని కూడా చెప్పవచ్చు మరి. నేను చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే, హిందువులు శాంతికాముకులు, ఉదార స్వభావులు అని చెప్పే భావన ఆధునికమైన దేకావచ్చు. మన రక్తాన్ని మనమే చిందించడం మనకెప్పుడూ ఒక సమస్య కాలేదు. ఉదాహరణకు మరాఠాలు గుజరాత్‌ను జయించారు. వారు ఇప్పటికీ బరోడాపై పట్టు కలిగి ఉన్నారు. ఇది శాంతియుతమైన లేక ప్రజాస్వామికమైన ఆక్రమణ అయితే కాదు. అశోకుడు కళింగ దేశాన్ని నేలమట్టం చేశాడు. వేలాది ఒరియా ప్రజలను ఊచకోత కోశాడు. ఏ ఒక్కరూ ఈ అభిప్రాయంతో విభేదించరనుకుంటాను. చైనా, బర్మా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై దాడి చేయకుండా అతడిని అడ్డుకున్నది సహనభావం కాదు, ఆ దేశాలకు వెళ్లడానికి అశోకుడికి వీసా లేకపోవడం అసలే కాదు. అవి మనకు సహజ సిద్ధమైన సరిహద్దులు. విదేశాన్ని లేక ఉపఖండేతర భూభాగాన్ని జయించడానికి ఉత్తర భారత రాజవంశాలకు భౌగోళిక పరమైన అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఇక దక్షిణాదికి వస్తే ఇతర ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం ముస్లింల ఆక్రమణకు, ఇంగ్లండ్ దేశం ఫ్రాన్స్ ఆక్రమణకు గురవుతున్న కాలంలోనే, చోళరాజుల పాలనలో తమిళ జాతీయులు ఆగ్నేయాసియా ప్రాంతం పై దండెత్తి ఆక్రమించారు. ఎందుకంటే నావికా బల సామర్థ్యం ఉన్న అతి కొద్ది భారతీయ రాజరికాల్లో చోళులూ ఒకరు. ఇంతవరకు ఇక్కడ ప్రస్తావించిన విషయాలు చరిత్రలో తేలినవే. నేను ఒక్కటీ కొత్తగా చెప్పింది లేదు. కానీ చరిత్ర చెప్పే ఈ చేదు వాస్తవాలను పక్కన బెట్టి చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పితగాథలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
చుక్కలు తెమ్మన్నా...
‘ఏప్రిల్ 1 విడుదల’ అనగానే మీకు ఆ సినిమాలో దివాకరం గుర్తుకురావాలి. నోరు తెరిస్తే అతడు చెప్పే అబద్ధాలు గుర్తుకు రావాలి. అతడు అంతా బోగస్. మన నాయకులలో కొందరిది కూడా అదే కోరస్. ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నా మైనా... చేస్తాలే ఏమైనా’ అని మొదలు పెడతాడు రాజేంద్రప్రసాద్. ‘షోలే ఉందా?’ అంటే, ‘ఇదిగో ఇందా’ అంటాడు. ‘చాల్లే ఇది జ్వాల కాదా’ అంటే, ‘తెలుగులో తీశారే బాలా’ అని క్యాసెట్ ఇచ్చిపంపిస్తాడు. ‘ఖైదీ ఉందా?’ అంటే, ‘ఇదిగో ఇందా’ అంటాడు. ‘ఖైదీ కన్నయ్య కాదే’ అంటే, ‘వీడికి అన్నయ్య వాడే’ అని మాయచేస్తాడు. ‘జగదేక వీరుని కథ... ఇది పాత పిక్చరు కదా’ అంటే, ‘అతిలోక సుందరి తల అతికించి ఇస్తాపద’ అంటాడు. ఇలా నానా రకాల అబద్ధాలు ఆడి, మాయలతో పబ్బం గడుపుకుంటాడు. మన లీడర్లు కొందరు సరిగ్గా ఇలాగే పాలన గడుపుకుంటున్నారు. రైతుల కిచ్చిన మాట మర్చిపోయారు. చేస్తానన్న పనుల ఊసెత్తడం మానేశారు. -
అబద్ధాలతో కాలయాపన
డోన్‌టౌన్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అబద్ధాలతో ముఖ్యంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. డోన్‌లోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ మాటకు కట్టుబడి ఉండలేక కట్టుకథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలను మరింత దారుణంగా మోసం చేసిన ఘనతను చంద్రబాబు మూటగట్టుకున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు. ఇక నిరుద్యోగ భృతి 1.75 లక్షల ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని, అయితే ఆ ప్రస్తావనే ముఖ్యమంత్రి తీసుకరావడం లేదని విమర్శించారు. రైతుల పై వడ్డీ భారం మోపడమే కాకుండా, ఇన్పుట్ సబ్సిడీని కూడా వర్తింపజేయకుండా వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జీవో నంబర్ ఎంస్ 13ను ను రాద్ధాంతం చేసిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అదే జీవోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయ, ఇతర అవసరాల నిమిత్తం కేంద్రం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, దాన్ని కూడా తప్పుబట్టి నిధులు లేనట్లు ప్రజల ముందు డ్రామా ఆడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల నిర్మాణం.. అవినీతికి నిలయంగా మారడం ఖాయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వివాదం ముదిరి రైతుల ఆందోళన ఉద్ధృతంగా మారకముందే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. స్వతంత్ర రాజకీయాలే మాకు తెలుసు..: రావుబహుదూర్ శేషారెడ్డి స్వతంత్రంగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆ నాడు డోన్, వెల్దుర్తి, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు మాత్రమే నియోజకవర్గంగా ఉండేదన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు కానీ, తన కుటుంబానికి ఎక్కడా కూడా టీడీపీ సభ్యత్వం లేదన్నారు. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో చేరానని, నేడు జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్నారు. తనను ఎన్నికల ముందు మూడేళ్ల క్రితమే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో పెద్దమనిషిగా ప్రస్తుత ఉపముఖ్యమంతి కేఈ క్రిష్ణమూర్తి, తదుపరి 1985లో విబేధాలు తలెత్తడంతో తెలుగునాడు పార్టీ పెట్టడం, ఆ తరువాత ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కోసం విబేధాలు పొడచూపిన వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. వాటిని కాదని నిజాయితీ గల రాజకీయాల పై విమర్శించడం పెద్ద మనుషుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. డోన్ పట్టణంలో నత్తనడకన నడుస్తున్న ఫ్లై ఓవర్ పనులను పురోగతిలో తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నానన్నారు. ఇక పక్షపాత ధోరణితో ఎంపిక చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. అనంతరం ప్యాపిలి మండలంలో బూర్గుల గ్రామంలో గడ్డి వామి దగ్ధమై నష్టపోయిన రైతు ఓబులేసుకు రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు,మాజీ ఎంపీపీ రామక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు వలసలరామక్రిష్ణ,వ్యక్తిగత సహాయకులు అంకిరెడ్డి,మాజీ సర్పంచ్ మల్లెంపల్లె రామచంద్రుడు,కోట్రాయి వెంకటేశ్వర్‌రెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి,గార్లదిన్నె రామసుబ్బయ్య, ఎస్టీ సెల్ జిల్లాకార్యదర్శి శివ, తిరుపతయ్య, మైనార్టీ నాయకులు రఫి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది అబద్ధాల ప్రభుత్వం
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ఒట్టి మాటలు, అబద్ధాల ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా విమర్శించారు. ఇలాంటి దగుల్బాజీ, దగాకోరు ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని వారు మండిపడ్డారు. కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. బడ్జెట్లో రాయలసీమకు, ముఖ్యంగా కడప జిల్లాకు తీవ్ర అన్యాయం చేశార న్నారు. రాయలసీమ వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వర్షాలు పడక, పంటలు పండక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. వారి ఇక్కట్లను తీర్చేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చే శారు. 2012 నుంచి 2014 వరకు ఇన్పుట్ సబ్సిడీకి బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు. గండికోటకు జూలై కల్లా నీరిస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి, మంత్రులు బడ్జెట్లో ఒట్టి చేతులు చూపారని ఎద్దేవా చేశారు. రూ. 1500 కోట్లు అవరమైన ప్రాజెక్టుకు కేవలం రూ. 169 కోట్లు కేటాయించి 35 టీఎంసీలు ఎలా నింపుతారని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 1800 కోట్లు అవసరం కాగా, రూ. 200 కోట్లు మత్రమే కేటాయించారన్నారు. కాలువలు పూర్తి కాకపోవడం వల్ల జీడిపాలెం దాటి కిందికి నీరు వచ్చే పరిస్థితి లేదని, కానీ ప్రభుత్వం పులివెందులకు నీరిచ్చిన తర్వాతే కుప్పానికి తీసుకెళ్తామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుగంగకు సంబంధించి వెలుగోడు వద్ద 6 కి.మీ కాలువ విస్తరిస్తేనే వరద నీటిని పూర్తిగా నింపుకొనే అవకాశముంటుంద ని, ఆ కాలువలను పూర్తి చేయడానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. రుణమాఫీకి గత బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయించి, ఇప్పుడు రూ. 4200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మైనార్టీలపై అక్కసు ప్రదర్శించారు: రాచమల్లు ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే ముస్లిం, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం అక్కసు ప్రదర్శించిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. మైనార్టీలకు కేవలం రూ. 379 కోట్లు బడ్జెట్లో కేటాయించడం దారుణమన్నారు. బీసీలు, చేనేతల వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇందులో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. డ్వాక్రారుణాలకు రూ. 14 వేల కోట్లు అవరమైతే, రూ. 1000 కోట్లు మాత్రమే కేటాయించినందున, ఈ ఏడాది కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావని తెలిపారు. వాస్తవాలు వినే స్థితిలో లేరు: అంజద్‌బాషా ప్రభుత్వం భ్రమల్లో బతుకుతోందని, వాస్తవాలను వినే స్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు లేరని ఎస్బీ అంజద్‌బాషా విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిద్దామని ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం చర్చకు సంసిద్ధంగా లేదని విచారం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చేనేతలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది మొదటిరోజే.. అబద్దాలా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం రోజు చంద్రబాబు ...కొన్ని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లోని విషయాలన్నీ అబద్దాలేనని ఆమె గురువారమిక్కడ అన్నారు. ప్రతీ మాట ప్రజల్ని వంచించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏడాది మొదటి రోజే అబద్దాలు చెబితే ఎలా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మాటల గారడి పక్కనపెట్టి చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాబు పాలనంతా బాదుడే బాదుడు అని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు. -
ఏడాది మొదటిరోజే.. అబద్దాలా?
-
100 రోజుల పాలనలో ఒరిగింది శూన్యం
- ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు - వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలరాజు విమర్శ బుట్టాయగూడెం : చంద్రబాబు 100 రోజుల పాలనలో అబద్ధాలు, మోసపూరిత మాటలు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కి అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. రుణాలను మాఫీ చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన బాబు కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులు, డ్వాక్రా మహిళలను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. 100 రోజుల టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, తొలిసంతకానికి చంద్రబాబు అర్థం లేకుండా చేశారని బాలరాజు విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం పెట్టి రైతుల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ పెంపు, పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేద మహిళలకు స్మార్ట్ సెల్ఫోన్లు వంటి హామీలు ఏమయ్యాయో ఆయనకు, టీడీపీ నాయకులకే తెలియాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని , ఎన్నికుట్రలు కుతంత్రలు చేసినా తమ పార్టీని అడ్డుకోలేరని బాలరాజు స్పష్టం చేశారు. -
అబద్ధం ఆడవలసి వస్తోంది!
అబద్ధం... ఒక్కోసారి ఆడాల్సి వస్తుంది. అందంగా అబద్ధాలు చెప్పడంలో మగాళ్లు కూడా ఆడవారికి ఏమాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే... మగాళ్లు అబద్ధం ఆడటానికి కారణం కూడా చాలాసార్లు ఆడవారే! ప్రేమికుడి కథలు! ప్రియురాలి రూపంలోనో, భార్య అవతారంలోనో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితంలోకి ప్రవేశిస్తుంది. దాంతో, అబద్ధాలు ఆడాల్సిన తరుణం వచ్చేసినట్టే. అంటే, ‘ప్రేమలో మునిగి ఉన్నవారూ పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు మగ మహారాజులందరూ అసత్య హరిశ్చంద్రులేనా’ అనే పాయింట్ లేవదీయొచ్చు. అందరూ అన్ని సందర్భల్లోనూ అబద్ధాలు ఆడతారన్నది ఇక్కడ చర్చ కాదు. కొన్ని సందర్భాల్లోనైనా మగాడు అబద్ధం చెప్పాల్సి వస్తుందన్నది పాయింట్. ఎలా అంటారా... నెలలోని నాలుగో ఆదివారం నాడు ‘డియర్... మనం ఐమ్యాక్స్‌లోని ‘స్పైడర్‌మ్యాన్-2’ త్రీడీలో చూద్దామా’ అని ప్రియురాలు ఓ కోరిక కోరిందే అనుకోండి! గుండెమీద చెయ్యేసుకుని జేబు సత్తువ తెలిసున్న ఓ మగాడు చెప్పే అబద్ధం ఏమై ఉంటుంది... ‘ఆ సినిమా బాలేదట. మా ఫ్రెండ్స్ చూసి బాగా బోర్ ఫీలయ్యారట. నెక్స్ట్ వీక్ ఇంకోటి ప్లాన్ చేద్దాం’ అని! అనుకోకుండా ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లాల్సి వస్తే... ‘నాన్న అర్జెంట్‌గా ఊరికి రమ్మని ఫోన్ చేశారు. తిరిగొచ్చాక నీకు కాల్ చేస్తా’ అని ప్రియురాలితో ప్రియుడు చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో పార్టీ... రోజంతా లవర్‌కి ఫోన్ చేయడం కుదర్లేదు. మర్నాడు మగాడు చెప్పే నిజం లాంటి అబద్ధం... ‘సారీరా... నిన్న నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.’ ఈ తరహా సందర్భోచితంగా అబద్ధాలు ఆడటం అనే కళలో మగాడు పట్టు సాధిస్తాడు. ఇక, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చెప్పే అబద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది! భర్త కథలు! భర్తగా మారిన మగాడికైతే అబద్ధాలు ఆడాల్సిన సందర్భాలు ఎన్నో! మగాడి మైండ్‌లో ఏవో ఆలోచనలు గిర్రుమంటుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఓ కొత్త చీరకట్టుకుని భార్య ఎదురుగా వస్తుంది. ‘ఏమండీ... ఎలా ఉంది?’ అంటుంది. మనకి ఎలా ఉంటుంది? మూడ్ ఎలా ఉన్నా సరే... ‘చాలా బాగుంది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు’ అని చెప్పక తప్పని పరిస్థితి. అద్దం ముందు భార్య నిలబడి ఉంటుంది. ‘ఏమండీ... ఈ మధ్య నేను లావైనట్టున్నాను కదా’ అని అడుగుతుంది. ‘అలాంటిదేం లేదు. నీకంటే లావుగా ఎంతమంది లేరు! మనం ఎలా ఊహించుకుంటే అలానే ఉంటాం’ అంటాడు మగాడు. ఆరోజు భార్య బర్త్‌డే. సాయంత్రం పార్క్‌కి తీసుకెళ్తానని పతిదేవుడు వరమిచ్చేసి ఉంటాడు. కానీ, మరచిపోయి ఉంటాడు! సాయంత్రం ఆవిడ ఫోన్ చేసింది. ‘సారీ... డియర్. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. తొందరగానే బయల్దేరాను, కానీ...’- ఇదీ మగాడి మాట. అనుకోకుండా మిత్రులతో సినిమాకి వెళ్లాల్సి వచ్చింది. థియేటర్లో ఉండగా భార్య ఫోన్ చేసింది. ‘అయామ్ ఇన్ మీటింగ్. కాల్ యు లేటర్’ అనే సందేశం మగాడు పంపాల్సిన సందర్భం ఇది. ప్రేమతో భార్యకి బహుమతి కొంటాడు. మురిసిపోయిన భార్య ‘దీని ఖరీదు ఎంత?’ అని అడుగుతుంది. రేటు తగ్గించి చెప్పాల్సిన తరుణం ఇది. ‘ఇవాళ తలనొప్పిగా ఉంది’, ‘ఇంకోసారి ఆలోచిద్దాం’, ‘వచ్చే ఏడాది గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం’, ‘మీ అమ్మావాళ్లింటి దగ్గర పదిరోజులు ఉండిరా! నా గురించి ఆలోచించకు. పాపం, వాళ్లకీ మా అమ్మాయి నాలుగు రోజులు ఉండాలనే కోరిక ఉంటుది కదా’.. ఇలా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులు నిత్య జీవితంలో మగాడికి ఎదురవుతూనే ఉంటాయి. అబద్ధం ఒక్కోసారి మగాడికి అవసరం. చాలాసార్లు అదే ఆయుధం. కొన్నిసార్లు అదే వరం. అతి కొద్ది సందర్భాల్లో మాత్రం శాపం! - సురేష్‌బాబా -
'పిట్టలదొరలా చంద్రబాబు ప్రగల్బాలు'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిట్టలదొరలా ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటును వేశామన్న మీ ఎంపీల మాటలు మీకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీకి తేడా ఏంటి? విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి కేంద్రాన్ని తొందరపెట్టిన విషయం మీకు గుర్తులేదా? అని అడిగారు. ఏ ప్రాంతంలోనూ 10 ఎమ్మెల్యే సీట్లు గెలవలేని మీరు రాష్ట్రాన్ని సింగపూర్‌గా ఎలా మారుస్తారు? 9 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు సీమాంధ్రకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పగటివేషగాడిలా కబుర్లు చెప్పడం మానుకోమని పద్మ సలహా ఇచ్చారు. -
బాధితుల కళ్లే.. పట్టిస్తాయి!
డిజిటల్ ఫొటోగ్రఫీలో కొత్త టెక్నిక్ ఆవిష్కరణ లండన్: మహిళలు, పిల్లలు, నిస్సహాయులైన ఇతరులపై దాడి చేసి నేరాలకు పాల్పడేవారిని.. ఇకపై బాధితుల కళ్లే పట్టించనున్నాయి. బాధితుల కనుపాపల్లోని ప్రతిబింబాల ఆధారంగా.. వారిపై దాడి చేసినవారిని తేలిగ్గానే గుర్తించేందుకు ఉపయోగపడే ఓ కొత్త పద్ధతిని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు కనుగొన్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీలో సరికొత్తదైన ఈ టెక్నిక్‌తో చాలా కచ్చితత్వంతో అనుమానితులను గుర్తించినట్లు పరిశోధన బృందం సారథి రాబ్ జెన్కిన్స్ వెల్లడించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నప్పుడు లేదా ఎవరినైనా బందీలుగా పట్టుకున్నప్పుడు తీసిన బాధితుల ఫొటోలు, కెమెరా రికార్డింగుల ఆధారంగా వారి కళ్లలోని ప్రతిబింబాలను ఈ పద్ధతిలో గుర్తించవచ్చని తెలిపారు. బాధితుల ముఖం ఫొటోలను బాగా జూమ్ చేసి.. వారి ముఖం కన్నా 30 వేల రెట్లు చిన్నగా కళ్లలో ఉన్న ప్రతిబింబాన్ని కూడా చూడవచ్చన్నారు. కొంతమందిపై ఈ టెక్నిక్‌ను ఉపయోగించగా.. తమపై దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను 71 శాతం కచ్చితత్వంతో, తెలిసిన వ్యక్తులను 84 శాతం కచ్చితత్వంతో గుర్తించారని వివరించారు. మనిషి కంటిపాప ఓ నల్ల అద్దంలాంటిదని, దాని ఫొటోలను జూమ్ చేసి హై రెసొల్యూషన్ ప్రతిబింబాలను చూడవచ్చన్నారు. నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారంగా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని తెలిపారు. -
మోడీవన్నీ అసత్యాలే: ప్రధాని
జబల్పూర్(మధ్యప్రదేశ్): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు వల్లె వేస్తున్నారని, రాజకీయ లబ్ధికోసం వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. ప్రధాని ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో మాట్లాడారు. రాజకీయాల స్థాయిని బీజేపీ దిగజార్చుతోందని, రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని దుయ్యబట్టారు. ఇతరులను అప్రతిష్టపాలు చేయడంపైనే దృష్టి పెట్టే పార్టీ(బీజేపీ) దేశానికి ఏం చేయగలదన్న విషయాన్ని ఆలోచించాలని ప్రజలను కోరారు. ‘‘ఇతరులను అప్రతిష్టపాలు చేయడంలో తనకున్న ఉత్సాహాన్ని చూపుతూ బీజేపీకి చెందిన ఓ అగ్ర నేత అసత్యాలను వల్లె వేస్తున్నారు. చారిత్రక అంశాలను సైతం వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌పై దాడి చేయాలన్న ఆత్రుతతో బీజేపీలో సైతం అనేకమంది గౌరవించే నేత గురించిన వాస్తవాలను తప్పుగా చెబుతున్నారు’’ అంటూ మోడీపై విరుచుకుపడ్డారు. ఇతర నేతలపై వ్యక్తిగతంగా దాడి చేయడంపైనే బీజేపీ ఆసక్తి చూపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మోడీకి ట్యూషన్ పెట్టించండి: దిగ్విజయ్ ఇండోర్: నరేంద్ర మోడీకి చరిత్ర పాఠాలు నేర్పించేందుకు ట్యూషన్ పెట్టించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి సూచించారు. శనివారం ఆజాద్‌నగర్‌లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ...‘ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థికి స్కూల్ స్థాయిలో చదువుకున్న చరిత్రపై కనీస అవగాహన లేదు’ అని విమర్శించారు. -
మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది మంచి ప్రవర్తన, అర్థం చేసుకునే తత్వం. నచ్చనిది చిన్నవాటిక్కూడా అబద్ధాలు చెప్పడం, ఫాల్స్ ప్రెస్టీజ్. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? పని మొదలెడితే అయ్యేదాకా వదలను. అది నచ్చుతుంది. అయితే నచ్చనిది కూడా అదే. ఎందుకంటే, ఒకదాని మీదే ఉండిపోవడం వల్ల మిగిలినవన్నీ మిస్ అయిపోతాను. తర్వాత బాధపడతాను. మీ ఊతపదం? దేన్నీ ఊతంగా తీసుకునే అలవాటు లేదు నాకు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? వ్యక్తి కాదు, వ్యక్తులు. మా అమ్మానాన్నలు. కొందరు గురువులు, పరిశ్రమలో కొందరు పెద్దవాళ్లు... వీళ్లందరి ప్రభావమూ ఉంది నామీద. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? నా ప్రమేయం లేకుండానే ప్రొడ్యూసర్ని అయ్యి చాలా నష్టపోయాను. నా జీవితంలో అది చాలా పెద్ద లాస్. అలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండేదని ఫీలవుతుంటా. అత్యంత సంతోషపడిన సందర్భం? ఇంకా చూడలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? ఇంకా చూడదలచుకోలేదు. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆకలితో అంతగా ఎప్పుడూ పోరాడింది లేదు. అయితే ఆకలేస్తే క్రియేటివిటీ బాగుంటుందని శ్రీశ్రీ గారు అన్న మాట చదివి, కావాలని ఆకలితో ఉండి, ఐడియాలు రాక కాగితాలు చింపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? వాళ్ల తప్పు లేకపోయినా, నా వల్ల చెడ్డపేరు మూటగట్టుకున్న స్నేహితులు, స్నేహితురాళ్లందరికీ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? ఎవరికీ తెలియని విషయమా... (నవ్వుతూ) అది నాక్కూడా తెలియదు. మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది? నన్ను అందరూ ఎప్పుడూ అపార్థమే చేసుకుంటారు. నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటల వల్ల దగ్గరివాళ్లు కూడా నన్ను తప్పుగా అనుకుంటూ ఉంటారు. అయితే నేను మళ్లీ సర్దిచెప్పేయగలను కాబట్టి బంధాలు విచ్ఛిన్నం కావు. మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? హారర్ సినిమాలంటే చచ్చేంత భయం. చూడ్డానికే కాదు, ఆలోచించడానిక్కూడా. చిన్నప్పుడు గాయత్రి అనే సినిమా సగం చూసి బయటికొచ్చేశాను. ఇంకెప్పుడూ చూడకూడదని డిసైడ్ చేసుకున్నాను. అయితే రామ్‌గోపాల్ వర్మ గారి హారర్ సినిమాలు చూస్తే నవ్వొస్తుంది కాబట్టి వాటిని చూస్తుంటాను. మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఎంత కష్టపడితే అంతే దక్కుతుంది. అదృష్టవశాత్తూ దక్కాల్సిన దానికంటే ఎక్కువ దక్కినా... అది మన దగ్గర ఉండదు. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సినిమాలకి, పుస్తకాలకి, బట్టలకి. దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? ఏమీ కోరుకోను. బ్లాంక్ అయిపోతాను. మామూలుగా గుడికెళ్లినప్పుడు ఏదైనా కోరుకుందామంటేనే నాకేమీ గుర్తు రావు. నాకు తెలిసి దేవుడు ప్రత్యక్షమైతే, మరుక్షణమే ఆయనలో ఐక్యమైపోతానేమో! ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? పాటలు పాడేసుకుంటూ ఉంటాను. జానే కహా గయే వో దిన్, జీనా యహా మర్నా యహా, ఇది తొలిరాత్రి, ఆగదు ఏ నిమిషము నీ కోసము, కుంతీకుమారి, ఏ నావదే తీరమో... ఇవన్నీ నాకిష్టమైన పాటలు. వాటిని పాడుకుంటాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? హాయిగా నా ఆలోచనల్లో నేనుంటాను. భవబంధాల మీద, ఈ జంఝాటాల మీద నాకు మమకారం లేదు. అందుకే చావు తరువాత వచ్చే మరో లైఫ్‌ని తలచుకుంటూ ఆ రోజంతా హ్యాపీగా గడుపుతాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? అమ్మాయిగా పుట్టినా ఫర్లేదు, అబ్బాయిగా పుట్టినా ఫర్లేదు. కానీ ఈ తల్లిదండ్రులకే పుట్టాలి. కానీ నాకో డౌటు. మా అమ్మానాన్నలిద్దరూ కూడా వచ్చే జన్మలో భార్యభర్తలుగానే పుట్టాలని కోరుకుంటున్నారో లేదోనని! నాకైతే మాత్రం వచ్చే జన్మలో కూడా వాళ్లు అలాగే పుట్టాలని, నేను వాళ్లకి పుట్టాలని ఉంది. - సమీర నేలపూడి మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. Designer: Kusuma