లాండ్‌ టైట్లింగ్‌ చట్టం - అబద్దాలు vs నిజాలు | Land Titling Act - Lies vs Truths | Sakshi
Sakshi News home page

లాండ్‌ టైట్లింగ్‌ చట్టం - అబద్దాలు vs నిజాలు

Published Sat, May 11 2024 2:44 PM | Last Updated on Sun, May 12 2024 9:04 AM

Land Titling Act - Lies vs Truths

లాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై సమగ్ర పరిశీలన

అబద్దాల షట్టర్‌ దించేలా నిజాల వివరణ

పుకార్లు నమ్మొద్దు.. ఇవిగో ఆధారాలు

“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-

👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.

👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను  లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది

👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.

ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ  ఒరిజినల్సే.

👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”

మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. 

ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.

👉:  “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”

ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి  రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన  అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత  90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి  Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై  రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile  నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్కు (LTAO)  అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”

ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.

ఇంతకుముందే IVR calls / Voice Recordings  ద్వారా  ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును  అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?

జగనన్న భూహక్కు, భూరక్ష
ఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.

Notice in form 14 (Ground Truthing)

Notice in form 33A (Ground Validation)

Notice in form 42 (Providing copy of LPM)

Notice in form 43  (Section 10(2)

ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.

సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి  వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న,  బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల  ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా  చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.

ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా?  ఇప్పుటి  దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా?  పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.

ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా?  ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు  పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా?  ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ  మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement