![Road Accident At Prayagraj Highway Near Maha Kumbh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Pragraj.jpg.webp?itok=TN8PZmRe)
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.
వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/21_14.jpg)
VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025
Comments
Please login to add a commentAdd a comment