
అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.
డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది.
బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు.
క్యూలికాన్‌లో జరిగిన గ్రూప్‌వార్‌లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్ వద్దు!
Comments
Please login to add a commentAdd a comment