
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ పిల్లలే కావడం గమనార్హం.
మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్‌తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్ నిర్ధారించారు.
ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్ వార్‌లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్ ఆపరేషన్ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment