world news
-
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డీఎస్టీ రద్దు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్ సేవింగ్ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.‘రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్ సేవింగ్ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే, ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.ఎనర్జీ సేవింగ్.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.1784లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తొలిసారిగా డేలైట్ సేవింగ్ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ను అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్ టైం యాక్ట్ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది. అయితే హవాయ్,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు. అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్ మార్కో రుబియో 2022లో సన్‌షైన్ ప్రొటెక్షన్ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్‌లో పాసైనప్పటికీ.. హౌజ్‌లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి ట్రంప్ అనుచరగణం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్ మధ్య డేలైట్ టైం ను.. నవంబర్-మార్చి మధ్య స్టాండర్డ్ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్‌స్టాప్ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి. -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
Syria: పిల్ల చేష్టలనుకుంటే.. నియంత పాలన అంతానికి నాంది పలికింది!
ఏ పని చేస్తే ఏం జరుగుతుందో.. తెలిసీతెలియని వయసులో ఆ బాలుడు చేసిన పని.. సిరియా ముఖచిత్రాన్నే మార్చేసింది. నిరంకుశ పాలనపై దేశం మొత్తాన్ని ఒకతాటిపైకి తెచ్చి నిరసన గళం విప్పేలా చేసింది. అసద్ నియంత పాలనకు వ్యతిరేకంగా అప్పటిదాకా రెబల్స్ చేస్తున్న తిరుగుబాటును.. ముమ్మరం చేయడానికి నాంది పలికింది. ఆ చర్యే.. దశాబ్దాల పోరు తర్వాత సిరియాకు స్వేచ్ఛా వాయువుల్ని అందించబోతోంది. కానీ, యుక్తవయసుకొచ్చిన అతని ముఖంలో మాత్రం సంతోషం కనిపించడం లేదు.తన తండ్రి హఫీజ్ మరణాంతరం వారసత్వంగా వచ్చిన సిరియా అధ్యక్ష పదవిని బలవంతంగానే అంగీకరించాడు డాక్టర్ బషర్ అల్ అసద్. అయితే నియంత పోకడకు అలవాటు పడడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. అదే సమయంలో అరబ్ విప్లవం మొదలైంది. కుటుంబ పాలనలో నలిగిపోయిన సిరియన్లకు ఈ విప్లవం ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. దారా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మువావియా సియాస్నే.. ఈజిప్ట్, ట్యూనీషియలో ఏం జరిగిందో టీవీల్లో చూశాడు. పరుగున వెళ్లి తన స్నేహితులను పోగు చేశాడు. స్కూల్ ఆ గోడ మీదే కొన్ని రంగులు తీసుకుని రాతలు రాశాడు.‘‘డాక్టర్.. తర్వాత నీ వంతే!’’ అంటూ అధ్యక్షుడు అసద్‌ను ఉద్దేశించి సరదాగా రాసింది సియాస్నే బృందం. పిల్ల చేష్టలనుకుని.. ఎవరూ ఆ రాతల్ని పట్టించుకోలేదు. కానీ, కొన్నాళ్లకు పోలీసులు ఆ రాతలను సీరియస్‌గా తీసుకున్నారు. దగ్గర్లోని కొందరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని రాసిందో ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు విషయం సియాస్నే తండ్రికి తెలిసి భయపడ్డాడు. ‘ఎందుకు రాశావ్?’ అనే కొడుకును అడిగితే.. అలా జరిగిపోయిందంటూ నిర్లక్క్ష్యపు సమాధానం ఇచ్చాడు. అయితే వెంటనే దాక్కోమని సలహా ఇచ్చాడు ఆ తండ్రి. ఉదయం వెళ్లొచ్చులే అని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ బాలుడు. అయితే..వేకువజామున 4 గం. ప్రాంతలో మువావియా సియాస్నే చేతులకు బేడీలు పడ్డాయి. గోడ మీద రాతలు రాసే టైంలో మరో ముగ్గురు స్నేహితులు మువావియా వెంట ఉండడంతో.. వాళ్లనూ లాక్కెళ్లారు. పాడై పోయిన భోజనం, ఒంటి మీద నూలుపోగు లేకుండా కర్రలతో బాదుతూ.. కరెంట్ షాక్‌తో థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. దాదాపు నెలన్నరపాటు ఆ నలుగురికి నరకం అంటే ఏంటో చూపించారు. ఇంతలో తమ బిడ్డల కోసం ఆ తండ్రులు స్టేషన్ల గడప తొక్కారు.‘‘వీళ్లను మరిచిపోండి. ఇళ్లకు పోయి మీ పెళ్లాలతో మళ్లీ పిల్లల్ని కనండి. చేతకాకపోతే.. మీ ఆడాళ్లను మా దగ్గరకు పంపండి’’ అంటూ అతిజుగుప్సాకరంగా మాట్లాడిన ఆ పోలీసుల మాటలను దిగమింగుకుని వాళ్ల తండ్రులు వెనుదిరిగారు. మానవ హక్కుల సంఘాల ద్వారా తమ పిల్లలను విడిపించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈలోపు నెల గడిచింది. విషయం దేశం మొత్తం పాకింది.అధ్యక్షుడు అసద్‌కు కోపం తెప్పించిన ఆ నలుగురు పిల్లల విముక్తి కోసం వేల మంది రోడ్డెక్కారు. వాళ్లను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. ఈ ఉద్యమం దావానంలా వ్యాపించింది. మార్చి 15, 2011లో అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియా వ్యాప్తంగా సంఘటితంగా జరిగిన ప్రజా నిరసన కార్యక్రమాలు(Day of Rage).. ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే.. అప్పటికే అణచివేతను అలవాటు చేసుకున్న అసద్.. ఆ ఉద్యమాన్ని హింసాత్మకంగా మారేదిశగా కవ్వింపు చర్యలకు దిగాడు. అది కాస్త.. లక్షల మందితో తిరుగుబాటుగా తయారైంది. 45 రోజుల తర్వాత.. క్షమాభిక్ష పేరిట ఆ నలుగురిని విడిచిపెట్టారు. మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వైపు చూడకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. అయితే.. మువావియా జీవితం అప్పటి నుంచి కుదేలయ్యింది. నాలుగేళ్ల తర్వాత అంతర్యుద్ధంలోనే తన తండ్రి తుటాలకు బలయ్యాడు. ఆ తర్వాతి రోజుల్లో సిరియా విముక్తి పేరిట ఏర్పాటైన సైన్యంలో చేరాడతను. ఇన్నేళ్ల అంతర్యుద్ధాన్ని.. అందులో పోయిన లక్షల ప్రాణాలను తల్చుకుంటూ.. తాను అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని కాదని అంటున్నాడు.‘‘మేం జైలు నుంచి బయటకు వచ్చాక.. బయట ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. వాళ్లంతా మాకు మద్దతుగా వచ్చారా? అని ఆశ్చర్యపోయాం. ఆ క్షణం సంతోషంగానే అనిపించింది. కానీ, ఇప్పుడు ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. ఆనాడు అలా నేను గోడ మీద రాసి ఉండకపోతే.. అసద్‌కు కోపం తెప్పించి ఉండకపోతే.. తిరుగుబాటు ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదేమో!. లక్షల ప్రాణాలు పోయేవి కావేమో అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు’’.. అయితే అసద్ పాలనకు ముగింపు పడినందుకు మాత్రం తనకు సంతోషంగానే ఉందంటున్నాడతను.కీలక పరిణామాలు..మువావియా-అతని స్నేహితుల అరెస్ట్.. తదనంతర పరిణామాల తర్వాత అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేశారు. ఉగ్ర సంస్థలు, తిరుగుబాటు దారులు మరోవైపు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టే యత్నం చేశారు. కానీ, వీటినీ అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చింది. నిరంకుశ పాలన దిశగా అసద్‌ను అడుగులేయించింది. 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకోగా.. 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా సిరియాలో రంగ ప్రవేశం చేశాయి.మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి.అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 13 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు.అయితే 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ మిత్రదేశం రష్యాకు పలాయనం చిత్తగించక తప్పలేదు. హమ్జా అలీ అల్ ఖతీబ్.. బషర్ అల్ అసద్ కర్కశపాలనకు బలైన ఓ పసిప్రాణం. కేవలం 13 ఏళ్ల వయసులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నాడంటూ అభియోగాలు మోపి అరెస్ట్ చేసి.. కస్టడీలో తీవ్రంగా హింసించారు. చివరకు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. రమారమి.. మువావియా సియాస్నేని హింసించిన సమయంలోనే ఈ ఘటనా జరిగింది. అయితే సోషల్ మీడియాలో సిరియా నియంతాధ్యకక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా.. హమ్జా పేరిట నడిచిన ఉద్యమం ఈనాటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.‘‘ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం’’ అని యూన్ సుక్ యోల్ ప్రకటించారు.BREAKING NEWS:🇰🇷 Korea's President Yoon Suk Yeol declared martial law amid escalating political tensions, citing opposition parties' actions as a threat to national stability.#SouthKorea #MartialLaw #YoonSukYeol #Politics #Democracy #AsiaNews pic.twitter.com/uDysiGBeyd— Shahadat Hossain (@shsajib) December 3, 2024అయితే యూన్ ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించుకుంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.South Korean lawmakers and citizens have been barred from entering the parliament building following President Yoon Suk Yeol's declaration of martial law. #SouthKorea pic.twitter.com/NWok44FNfG— Geo View (@theGeoView) December 3, 20242022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
ఇస్కాన్‌పై నిషేధం దిశగా..
ఢాకా/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జాగరణ్ జోత్ సంఘం సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేసిన వేళ అక్కడ మరో కీలక పరిణామం సంభవించింది. ఇస్కాన్‌ను బంగ్లాదేశ్‌లో నిషేధించాలంటూ అక్కడి హైకోర్టులో బుధవారం రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇస్కాన్ మతసంబంధ సంస్థేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాల్ కోర్టుకు తెలిపారు. కృష్ణదాస్ అరెస్ట్, ఇస్కాన్, హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా అతివాద ముస్లిం సంఘాల సభ్యుల ఆందోళనలు, మైనారిటీలపై దాడుల నడుమ ప్రభుత్వం తన స్పందన తెలియజేయడం గమనార్హం. ఘర్షణ ఘటనలో 30 మంది అరెస్ట్ కృష్ణదాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ మైనారిటీ హిందువులు, కృష్ణదాస్ మద్దతుదారులు వేర్వేరు చోట్ల చేపట్టిన ర్యాలీలను బంగ్లాదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో చిట్టోగ్రామ్లో జరిగిన ఘర్షణ ఘటనలో 30 మందిని అరెస్ట్‌చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లామ్ మరణించిన విషయం తెల్సిందే. అయితే కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదలచేయాలని బంగ్లాదేశ్ హిందూ బుద్ధి్దస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ డిమాండ్చేసింది. ఐరాస జోక్యం చేసుకోవాలి 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్ట్ ఐదున షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై 200కుపైగా దాడుల ఘటనలు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని భారత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ‘‘ అతివాదుల కనుసన్నల్లో అపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. మానవత్వానికి మచ్చతెచ్చే రీతిలో హిందువులపై దాడులు చేస్తున్నారు. ఈ అంశంలో ఐరాస కలుగజేసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనాలి’’ అని గిరిరాజ్ బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో అన్నారు. ఇస్కాన్, హిందువులపై దాడులు ఆగేలా బంగ్లాదేశ్‌పై భారత్ ఒత్తిడి పెంచాలని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ భారత విదేశాంగ శాఖను కోరారు. హిందువుల పరిరక్షణ కోసం ప్రభుత్వమే పాటుపడాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారుచంద్రదాస్ బ్రహ్మచారి వేడుకున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత, హిందువులపై ముస్లిం అతివాదుల ఆగడాలు, ఉగ్రదాడులతో తమ దేశం వేగంగా అరాచకత్వం వైపు పయనిస్తోందని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహ్మూద్ ఆందోళన వ్యక్తంచేశారు. -
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో NPP విక్టరీ
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. -
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్‌సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
మస్క్ వర్సెస్ మడురో: ఆయన గెలిస్తే గనుక..
వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్ మడురో విసిరిన సవాల్‌కు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారాయన.నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్‌కు నికోలస్ మడురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్ ఎక్స్ అధినేత ప్రకటించారు. వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. -
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా నగరం న్యూయార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ పార్క్‌లో తుపాకుల మోత మోగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం రోచెస్టర్ ప్రాంతంలోని మాపెల్వుడ్ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చనిపోయింది ఒక మహిళగా తెలుస్తోంది. ఆరుగురికి బుల్లెట్ గాయాలుకాగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఒక్కడా? గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారా?.. తదితర వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.#UPDATE : Multiple people were shot at least one person is dead after a shootout occurred at Maplewood Park. Multiple police agencies have the area lockdown. #Rochester #NewYork #MassShooting #Shooting #USA #America #MaplewoodPark pic.twitter.com/ZwNcCW014W— upuknews (@upuknews1) July 29, 2024 -
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిన చైనా రాకెట్
లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకొంది. అయితే పర్వత ప్రాంతంలో ఈ రాకెట్ పడిపోవడంతో నష్టం తప్పింది. Chinas kommerzielle Trägerrakete Tianlong-3 ist bei einem Teststart abgestürzt.#China #XiJinping #Rocket #Space #SecretStory #Taiwan #Breaking #news #Explosion #USA pic.twitter.com/uIqaCFZHVG— Brennende Frage (@brennende_frage) July 1, 2024బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందని, గాంగ్యీ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో పడిపోయిందని వెల్లడించింది. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.పేలుడు తర్వాత అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. తియాన్‌లాంగ్3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది.ఇదిలా ఉంటే.. జూన్ 22న చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. -
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
ఎట్టకేలకు స్వేచ్ఛ.. లండన్ జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది. జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. JULIAN ASSANGE IS FREEJulian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు.. ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్‌పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్‌లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. #JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్‌గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్సైట్ వికీలీక్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.అసాంజే మీద కేసు ఏంటంటే..2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు. 2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. ఐదేళ్లుగా జైల్లో.. ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్‌తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్‌లోని బెల్మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడం గమనార్హం. 14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలుపదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది. -
మలావీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. -
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్‌క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
మూడురోజులైనా ఆమె ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్యను వెతికే క్రమంలో.. ఆ భర్తకు గుండె బద్ధలయ్యే దృశ్యం కనిపించింది. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఇండోనేషియాలో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఫరీదా అనే 45 వివాహిత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ భారమైన పొట్టతో కదల్లేని పరిస్థితిలో కనిపించింది. అనుమానంతో దాని పొట్ట చీల్చి చూడగానే ఓ మహిళ తలభాగం బయటపడింది. వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చూడగా.. అది ఫరీదాగా నిర్ధారణ అయ్యింది. ఒంటిపై దుస్తులు అలాగే ఉండడంతో ఆమెను గుర్తు పట్టిన భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. సాధారణంగా కొండచిలువలు జంతువులను తప్ప మనుషులపై పెద్దగా దాడులు చేయవు. కానీ, ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో మనుషులపై దాడుల ఘటనలు పెరిగిపోయాయి. కిందటి ఏడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి.. దానిని చంపి అతన్ని రక్షించారు. కొన్నాళ్ల కిందట ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. అయితే అది జీర్ణించుకోలేకపోవడంతో.. ఆ మృతదేహం కొన్నాళ్లకు బయటపడింది. -
అమెరికాలో గంజాయి బ్యాచ్‌లకు ఊరట!
‘‘గంజాయిని కలిగి ఉన్నా.. లేదంటే సేవించినంత పని చేసినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.వాషింగ్టన్: అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని నెమ్మదిగా ఆ దేశంలో చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చబోతున్నారన్నమాట.అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించడం గమనార్హం. ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్ బారిన పడుతున్నారనే 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్-1 డ్రగ్ కింద ఉంచారు. ఈ షెడ్యూల్-1 డ్రగ్స్‌లో హెరాయిన్, ఎల్ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన ఇంతకాలం కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్3 డ్రగ్స్‌లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. షెడ్యూల్-3 డ్రగ్స్‌లో కెటామైన్, పెయిన్కిలర్స్లో వాడే కోడైన్(codeine) ఉన్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్‌లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు.వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. గంజాయిని రీక్లాసిఫై చేసే ప్రతిపాదనను మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ ప్రాసెస్‌ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్‌సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు.బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఓ ఆలోచన.. ఆరేళ్ల కష్టం.. ఫొటోలో వెలకట్టలేని అద్భుతం
ఫొటో అంటే అందమైన జ్ఞాపకం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఓ జీవితం. ఇప్పుడంటే మితిమీరిన ఫొటోల వల్ల దీనికి విలువ లేకుండా పోయింది గానీ ఒకప్పుడు ఫొటో అంటే అపురూపం. ఆల్బమ్స్‌లో జాగ్రత్తగా దాచుకునే వెలకట్టలేని అద్భుతం. ఫొటో తీయాలంటే కెమెరా ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. కానీ దాని వెనక బోలెడంత తపన ఉండాలనేది ఇప్పటి జనరేషన్‌కి ఏ మాత్రం తెలియని మాట. (ఇదీ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!) ఇప్పుడు పిల్లాడి దగ్గరి నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్స్ వాడేస్తున్నారు. సెకనుకి పదుల ఫొటోలు తీసి పడేస్తున్నారు. కానీ ఓ ఫొటోగ్రాఫర్.. ఒక్క ఫొటో కోసం ఏకంగా ఆరేళ్లు ఎదురుచూశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. 2017లో ఓ ఆలోచన పురుడు పోసుకుంటే.. అతడు ఇన్నేళ్ల కష్టానికి తగ్గ ఫలితం 2023 డిసెంబరులో కనిపించింది. తన కెమెరా కంటితో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఒక్క ఫొటోలో వంద సినిమాలకు సరిపడా సంతృప్తి పొందుపరిచాడు. ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ వలెరియో మినాటో.. ఇటలీలోని టురిన్ అనే ఊరిలో మాన్విసో కొండ.. దాని ముందు చర్చి.. వెనక చంద్రుడు.. ఒక్కటిగా వచ్చే ఫొటో తీశాడు. ఈ ఛాయాచిత్రంలో ముందు చర్చి దాని వెనక ఓ పెద్ద పర్వతం, ఆ వెనక పున్నమి చంద్రుడుని బంధించాడు. అయితే ఇలా ప్రతి డిసెంబరులో మాత్రమే వస్తుంది. 2017 నుంచి ఇలాంటి ఫొటో తీద్దామని ప్రయత్నిస్తుంటే.. వాతావరణం, వెలుతురు సమస్యల ఇతడికి సవాలు విసిరాయి. కానీ గతేడాది డిసెంబరు 20న మాత్రం తను అనుకున్నది సాధించాడు. ప్రపంచం మెచ్చే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. (ఇదీ చదవండి: రాయల్ కరీబియన్ ‘పర్ల్’.. స్పెషల్ ఏంటంటే?) View this post on Instagram A post shared by Valerio Minato (@valeriominato) -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
Zoleka: క్యాన్సర్‌తో మండేలా మనవరాలి కన్నుమూత
జొహన్నెస్‌బర్గ్: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) కన్నుమూశారు. జొలేకా.. రచయిత, ఉద్యమకారిణి కూడా. చాలా కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో మండేలా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కారణంగా.. జొలేకా ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించినట్టు వైద్యులు తెలిపారు. జొలేకా తొలిసారిగా 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. 2016లో మరోమారు అది బయటపడింది. కానీ, ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. నెల్సన్ మండేలా కూతురు జింద్జీకి జొలేకా 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి జొలేకాకు వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా జొలేకా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు. లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్లో సైతం వెల్లడించారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం ప్రకటించింది. -
Iraq: భారీ అగ్నిప్రమాదం.. వంద మందికిపైగా మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివాహ వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగి వంద మందికి పైగా మృతి చెందారు. వందాలది మంది గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా సజీవ దహనం అయ్యారు.మృతుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణాసంచా కాల్చే క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. 110 dead including the bride and groom in the fire incident at a wedding hall in Hamdaniyah,Iraq 550 injured Video is from AVA Media#Iraq #Hamdaniyah pic.twitter.com/I4dSQbQi1s — North X (@__NorthX) September 26, 2023 Nineveh Governor: Preliminary investigations indicate that the Hamdaniyah fire was caused by fireworks inside the wedding hall.#Iraq pic.twitter.com/1IuH0vqpif — Alahad TV-EN (@ahad_en) September 27, 2023 -
అమెరికాలో మరోసారి కాల్పులు
రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం క్యాంపస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్‌కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing pic.twitter.com/Nte6OxelM6 — Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023 -
‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’
ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. ఏదో అద్భుతం జరిగినట్లు నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల నుంచి బయటపడ్డారు. ఓవైపు 40 రోజులు వాళ్లు ఎలా అడవిలో గడిపారనే దానిపై ప్రపంచం చర్చించుకుంటుండగా.. అదే టైంలో రెస్క్యూ టీం శ్రమపై కొలంబియాలో సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. రియల్ హీరోలుగా అభివర్ణిస్తోంది ఆ దేశమంతా. ఈ తరుణంలో.. సదరు రెస్క్యూ గ్రూప్ ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం చిన్నారుల జాడ దొరకగా.. వాళ్లను ప్రత్యేక విమానంలో రాజధాని బోగోటాకు తరలించి చికిత్స అందించడంతో వాళ్లు కోలుకున్నట్లు తెలిపింది. హుయిటోటోకు చెందిన ఆ పిల్లలు సర్వైవర్ స్కిల్స్(ఆపదలో తమను తాము రక్షించుకోవడం) ద్వారా బయటపడినట్లు చెప్పింది. అంతేకాదు.. రెస్క్యూ టీంలో సభ్యుల్లో చాలా మంది స్థానిక తెగకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. ‘‘ఆ నలుగురిలో పెద్ద లెస్లీ. తన చేతిలో చిన్న పసికందు ఉంది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆకలిగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లలో ఒక పిల్లాడు మమ్మల్ని చూసి కిందపడిపోయాడు. దగ్గరికి వెళ్లగానే ఏడుస్తూ మా అమ్మ చనిపోయిందని చెప్పాడు. వెంటనే వాళ్లకు ధైర్యం అందించాలనుకున్నాం. మేం మీ నాన్న పంపితేనే వచ్చాం. మీమూ మీ కుటుంబం లాంటివాళ్లమే అని చెప్పాం అని బృందంలోని సభ్యులు ఒక్కొక్కరుగా వివరించుకుంటూ వచ్చారు. పిల్లల్ని రక్షించాక వాళ్లను నవ్వించేందుకు తాము చేయని ప్రయత్నమంటూ లేదని చెబుతున్నారు వాళ్లు. వాళ్లు ఆరోగ్యంగానే కనిపించారు. అయినా తాగడానికి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ అందించాం. సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ, వాళ్ల ముఖాల్లో నవ్వు రాలేదు. తల్లి లేదన్న బాధ నెలరోజులైనా ఆ చిన్నారుల ముఖం నుంచి వీడిపోలేదు. సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పాం. పొగాకు తాగుతూ.. పాటలు పాడుతూ వాళ్లను నవ్వించే యత్నం చేశాం. అక్కడున్న పవిత్రమైన చెట్ల ఆకుల్ని పూజించాం. కథలు చెప్పాం. అందులో చిన్నారితో పాటు ఐదేళ్ల బాబు కూడా ఈ 40 రోజుల గ్యాప్‌లోనే పుట్టినరోజులు అయిపోయాయట. అందుకే వాళ్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటలు పాడాం. వాళ్లు తేరుకుంటున్న సమయంలోనే ఎయిర్‌లిఫ్టింగ్ చేశాం. ఆస్పత్రిలో వాళ్లు కోలుకుంటున్నారు అని బృందం సభ్యులు చెప్పుకొచ్చారు. నాలుగు రోజులపాటు కొనప్రాణంతో.. ఇదిలా ఉంటే.. చిన్నారుల తండ్రి పిల్లలతో మాట్లాడాక ఆ వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తన భార్య ప్రమాదం జరిగిన వెంటనే చనిపోలేదని పిల్లలు ఆ విషయం తనకు చెప్పారని ఆయన వివరించారు. మాగ్దలీనా ముకుటుయ్ తెగ నాయకురాలు. ఆమె ప్రమాదానికి గురయ్యాక తీవ్రంగా గాయపడింది. నాలుగు రోజుల పాటు ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్లాడింది. ఆ టైంలో పిల్లలు ఆమె వెంటే ఉన్నారు. ఊపిరి ఆగిపోయేముందు ఆమె వాళ్లను.. ఎలాగైనా అడవి నుంచి బయటపడమని చెప్పి కన్నుమూసింది. మే 1వ తేదీన ఆ పిల్లలు, వాళ్ల తల్లి, ఓ తెగ నాయకుడు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. విమానం ముందు భాగం ధ్వంసం కావడంతో.. అక్కడ ఉన్న ముగ్గురు(పిల్లల తల్లి కూడా) మరణించారు. అయితే వెనకభాగంలో కూర్చున్న పిల్లలు సురక్షితంగా బయటపడి.. భయంతో అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. దాదాపు 40 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ల జాడను గుర్తించింది ఓర్డోనెజ్ గోమెస్ నేతృత్వంలోని బృందం. ఆ నలభై రోజులపాటు అడవుల్లో దొరికే పండ్లు, గింజలు, దుంపలు, వేళ్లు తిని బతికారు వాళ్లు. ఆ చిన్నారుల ధైర్యానికి ముఖ్యంగా తన తోబుట్టువుల్ని రక్షించుకునేందుకు లెస్లీ చేసిన సాహసానికి అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: డాల్ఫిన్ కోసం వెళ్తే.. జరిగింది ఇది! -
నా విజయాల పట్ల గర్వపడుతున్నా: బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన స్వయంగా విషయాన్ని వెల్లడించారు. 2019లో ప్రజలు అందించిన అఖండ విజయం పట్ల బోరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. నా హయాంలో సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది. కొత్త నేత వచ్చే దాకా ఆ స్థానంలో నేనే కొనసాగుతా, కన్జర్వేటివ్ పార్టీ త్వరలో కొత్త నేతను ఎన్నుకుంటుంది అని ప్రకటించారాయన. సహచర మంత్రుల ఒత్తిళ్ల మేరకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. కరోనా టైంలో బ్రిటన్ సంఘటితంగా ఉండి.. మహమ్మారిని ఎదుర్కోవడాన్ని ప్రస్తావించారాయన. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఇక బోరిస్ రాజీనామాపై ప్రతిపక్ష లేబర్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో సంబురాలు మొదలుపెట్టింది.