న్యూయార్క్‌లో కాల్పుల కలకలం | Gun Firing Incident At New York's Rochester | Sakshi
Sakshi News home page

New York Gun Firing: న్యూయార్క్‌ పార్క్‌లో కాల్పుల కలకలం, ఒకరి మృతి

Published Mon, Jul 29 2024 7:39 AM | Last Updated on Mon, Jul 29 2024 9:54 AM

New York Park Gun Firing Incident Today News Updates Telugu

వాషింగ్టన్‌: అమెరికా నగరం న్యూయార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ పార్క్‌లో తుపాకుల మోత మోగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. 

స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం  రోచెస్టర్‌ ప్రాంతంలోని మాపెల్‌వుడ్‌ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చనిపోయింది ఒక మహిళగా తెలుస్తోంది. ఆరుగురికి బుల్లెట్‌ గాయాలుకాగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఒక్కడా? గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారా?.. తదితర వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement