Rochester
-
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా నగరం న్యూయార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ పార్క్‌లో తుపాకుల మోత మోగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం రోచెస్టర్ ప్రాంతంలోని మాపెల్వుడ్ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చనిపోయింది ఒక మహిళగా తెలుస్తోంది. ఆరుగురికి బుల్లెట్ గాయాలుకాగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఒక్కడా? గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారా?.. తదితర వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.#UPDATE : Multiple people were shot at least one person is dead after a shootout occurred at Maplewood Park. Multiple police agencies have the area lockdown. #Rochester #NewYork #MassShooting #Shooting #USA #America #MaplewoodPark pic.twitter.com/ZwNcCW014W— upuknews (@upuknews1) July 29, 2024 -
అమెరికాలో కాల్పులు: 12 మంది మృతి
-
విషాదం : కాల్పుల్లో 12 మంది మృతి
వాష్టింగన్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకుఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయలపాలైయ్యారు. పౌరుల మృతిపై యావత్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం) -
చోరీ చేసి లైవ్ టీవీకి చిక్కాడు!
షికాగో: కాలం కలిసిరాకపోతే బ్యాంక్ కు కన్నమేసినా కెమెరా సాక్షిగా అడ్డంగా దొరికిపోతాం. కావాలంటే అమెరికాలోని రొచెస్టర్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి చదవండి. స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగిన చోరీ గురించి లైవ్ రిపోర్టు చేసేందుకు కేఐఎంటీ-టీవీకి చెందిన రిపోర్టర్ ఆడమ్ సాలెట్ మంగళవారం బ్యాంక్ వెలుపల నించునున్నాడు. లైవ్ రిపోర్టు చేస్తుండగా బ్యాంకు నుంచి ఓ వ్యక్తి కంగారుగా బయటకు పరుగులు తీస్తూ వచ్చాడు. సాలెట్ తన సొంత కెమెరాతో అతడిని చిత్రీకరించాడు. ఈ దృశ్యం టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది. తర్వాత అతడు దొంగ అని తెలియడంతో సాలెట్ పోలీసులకు సమాచారం అందించాడు. 'ఓహ్.. అతడు దొంగ!. ది ఈజ్ లైవ్ టీవీ. ఇప్పుడు పారిపోయిన వ్యక్తి దొంగని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. దొంగను పట్టుకోవడానికి 911 నంబర్ కు ఫోన్ చేస్తున్నా. మళ్లీ తర్వాత మాట్లాడతా' అంటూ లైవ్ లో సాలెట్ గడగడ చెప్పేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాలెట్ స్టేట్ మెంట్ తీసుకుని లైవ్ టీవీ పుటేజీ పరిశీలించారు. గంట తర్వాత దొంగను పట్టుకున్నారు. నిందితుడు రియన్ లిస్కో(36)గా గుర్తించారు. అంతకుముందు రోజే అతడు స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ దొంగతనం చేశాడు. మరోసారి చోరీకి వచ్చి కెమెరాకు చిక్కాడు. రెండు చోరీలు అతడే చేసినట్టు పోలీసుల కచ్చితంగా చెబుతున్నారు. కాగా, లైవ్ టీవీలో బ్యాంకు దొంగను పట్టిచ్చిన ఆడమ్ సాలెట్ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.