రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొననుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట.
అంతేకాదు... ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరంను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో రామ్‌చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment