వాష్టింగన్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకుఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయలపాలైయ్యారు. పౌరుల మృతిపై యావత్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం)
Comments
Please login to add a commentAdd a comment