వాషింగ్టన్: అమెరికాలో పాకిస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో ఓ 19 అంతస్తుల హోటల్ ఉంది. ఆ హోటల్‌కు అమెరికా ప్రభుత్వం అద్దె రూపంలో ఏకంగా 220 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలస దారులు మన దేశంలో విడిది చేసేందుకు.. మనమే వాళ్లకి వసతి కల్పిస్తున్నాం. అందుకు డబ్బులు కూడా మనమే చెల్లిస్తున్నాం. ఇది ఆమోద యోగ్యం కాదని అన్నారు.
ప్రస్తుతం, న్యూయార్క్ నగరం మాన్హాటన్‌లో పాక్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూజ్‌వెల్ట్ హోటల్ గురించి రచయిత జాన్ లెఫెవ్రే ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
A taxpayer-funded hotel for illegal migrants is owned by the Pakistani government which means NYC taxpayers are effectively paying a foreign government to house illegals in our own country. This is nuts. https://t.co/Oy4Z9qoX45
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 1, 2024
ఆ పోస్ట్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆధీనంలో ఉన్న రూజ్‌వెల్ట్ హోటల్‌కు న్యూయార్క్ నగర పాలక సంస్థ అద్దె రూపంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి 220 మిలియన్లు (రూ.1860.40 కోట్లు) చెల్లిస్తోంది. ఉదాహరణకు.. న్యూయార్క్‌కు వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పాకిస్థాన్ పౌరులు న్యూయార్క్‌కు వస్తుంటారు. వచ్చిన వాళ్లు వీసా,జాబ్ రకరకలా సమస్యల వల్ల అక్కడే ఉండాల్సి ఉంది..ఇమ్మిగ్రేషన్ సమస్య ఉంటే అమెరికా వదిలి వారి సొంత దేశం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు వీలు లేదు.మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారు.
ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మాన్హాటన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిలైన్స్‌కు చెందిన రూజ్‌వెల్ట్ హోటల్‌ను అమెరికా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఆ హోటల్‌లో వసతి కల్పిస్తుంది. హోటల్‌ను అద్దెకు తీసుకున్నందుకు రూ.1860.40 కోట్లు చెల్లిస్తుంది.
ఈ అంశంపై వివేక్ రామస్వామి స్పందిస్తూ.. ‘మన దేశ ట్యాక్స్ పేయర్లు అక్రమ వలస దారులు బస చేసేందుకు హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌కూ అద్దె చెల్లించడం విడ్డూరంగా ఉంది’ అని పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూస్‌వెల్ట్ పేరుతో ఉన్న ఈ 19 అంతస్తుల భవనంలో మొత్తం 1200 గదులున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి కేంద్రంగా మారుతోందని రచయిత జాన్ లెఫెవ్రే ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment