ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా? | Sobhita Dhulipalla Web Series In International Emmy Award Nominations | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipalla: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?

Published Mon, Nov 25 2024 9:28 PM | Last Updated on Mon, Nov 25 2024 9:30 PM

Sobhita Dhulipalla Web Series In International Emmy Award Nominations

ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్‌ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్‌ కమెడియన్‌, నటుడు  వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్‌.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్‌ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్‌లో నిలిచింది.

శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement