Sobhita Dhulipala Steamy Romance Scene In The Night Manager Part 2, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: 'ది నైట్ మేనేజర్'.. బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోతున్న తెలుగమ్మాయి..!

Published Fri, Jun 30 2023 9:22 PM | Last Updated on Sat, Jul 1 2023 11:20 AM

Sobhita Dhulipala Steamy Romance Scene In The Night Manager Goes Viral - Sakshi

గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న శోభిత రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నటించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్-2'. ఈ సిరీస్ ఈనెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది.

(ఇది చదవండి: షూటింగ్‌లో కనీసం ఫుడ్‌ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!)

అయితే ఈ వెబ్ సిరీస్‌లో శోభిత మరింత బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది మరికొందరు రొమాంటిక్ సీన్స్‌లో శోభిత.. తమన్నాను మించి పోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. గతంలో శోభిత ధూళిపాల.. అక్కినేని నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.  

కాగా..  ది నైట్ మేనేజర్ బ్రిటన్‌కు చెందిన సిరీస్‌ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోడీ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, తిలోటమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.

(ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement