తారా ఖన్నా మళ్లీ వచ్చేస్తోంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తారాఖన్నాగా నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. ఈ సిరీస్‌లో శోభిత నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 2019 మార్చి 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైందీ సిరీస్. నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అద్భుతమైన ట్విస్ట్‌తో మేకర్స్ ఈ సిరీస్‌ను ముగించగా రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నాలుగేళ్ల ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా మేడ్ ఇన్ హెవెన్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండో సీజన్ ప్రసారం కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. 'మొత్తానికి అధికారికంగా విడుదల తేదీ చెప్పేశాం.. షాదీ బిజినెస్ చూసేందుకు మరోసారి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది శోభిత ధూళిపాళ.
ఈ గుడ్‌న్యూస్ విని అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. 'హమ్మయ్య.. ఆగస్టు 10 లీవ్ తీసుకుని అయినా చూసేస్తా', 'దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాం.. దేవుడా ఇప్పటికి కనికరించావా?', 'పట్టరాని సంతోషంతో ఏడుపు తన్నుకొస్తుందేంటి?' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి సీజన్లో ఉన్న శోభిత, అర్జున్, కల్కి కొచ్లిన్, జిమ్ సారబ్, శశాంక్ అరోరా, శివంగి రాస్తోగి సహా తదితరులు సీక్వెల్లోనూ నటించారు. ఇష్వాక్ సింగ్, త్రినేత్ర వంటి కొత్తముఖాలు కూడా సీక్వెల్లో కనిపిస్తాయి.
చదవండి: పక్షవాతంతో మంచానపడ్డ నటి.. బికినీ ఫోటోలు షేర్ చేసి
విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన నటి
Comments
Please login to add a commentAdd a comment