The Night Manager
-
ఎమ్మీ అవార్డ్స్‌లో 'ది నైట్ మేనేజర్'కు నిరాశ
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయుఉత్తమ నటుడు- తిమోతి స్పాల్ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మోఉత్తమ యానిమేషన్- టాబీ మెక్‌టాట్ ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్ -
రెండో భర్తతో విడాకులు.. పెళ్లైన 13 ఏళ్లకు నటి నిర్ణయం!
ది నైట్ మేనేజర్ నటి రుక్సర్ రెహ్మాన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు పెళ్లైన 13 ఏళ్ల తర్వాత తన రెండో భర్త ఫరూక్ కబీర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు తెలిపింది. సినీ దర్శకుడైన ఫరూక్ కబీర్‌తో రుక్సర్ విడాకులు తీసుకుంటున్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఫిబ్రవరి నుంచి వేరువేరుగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. (ఇది చదవండి: 'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్‌తో తమన్నాను మించిపోయిందిగా..!) రుక్సర్ రెహ్మాన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తాము విడిగా జీవిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ముగియడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు ఫరూక్ కబీర్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి దీని గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదన్నారు. కాగా.. రుక్సర్, ఫరూక్ మార్చి 2010లో వివాహాం చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి పీటలెక్కారు. గతేడాది ఆయన దర్శకత్వం వహించిన ఖుదా హాఫీజ్- 2లో ఈ జంట కలిసి పనిచేశారు. కాగా.. రుక్సర్ రెహ్మాన్ గతంలో అసద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. వారికి 27 ఏళ్ల ఐషా అహ్మద్ అనే కుమార్తె ఉంది. రుక్సర్ రెహ్మాన్.. పీకే, 83, గాడ్, తుస్సీ గ్రేట్ హో, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, వంటి చిత్రాలలో నటించింది. అంతే కాకుండా కుచ్ తో లోగ్ కహెంగే, డ్రీమ్ గర్ల్, అదాలత్ సిరీస్‌ల్లో కనిపించింది. తాజాగా.. ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్లో కనిపించింది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) View this post on Instagram A post shared by Rukhsar Rehman (@rukhsarrehman) -
'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్‌తో తమన్నాను మించిపోయిందిగా..!
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శోభిత రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలోనూ నటించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్-2'. ఈ సిరీస్ ఈనెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. (ఇది చదవండి: షూటింగ్లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!) అయితే ఈ వెబ్ సిరీస్‌లో శోభిత మరింత బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది మరికొందరు రొమాంటిక్ సీన్స్‌లో శోభిత.. తమన్నాను మించి పోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. గతంలో శోభిత ధూళిపాల.. అక్కినేని నాగ చైతన్య డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ బ్రిటన్‌కు చెందిన సిరీస్ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోడీ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, తిలోటమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) View this post on Instagram A post shared by SPARK EDITS and MEMES💥 (@priya_sparkedits) -
నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న రూమర్స్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. ఓసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: చైతో డేటింగ్ అంటూ రూమర్స్.. స్పందించిన శోభిత ధూళిపాళ) శోభిత మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. జీవితంలో ఎంత ఎదిగినా అణగిమణిగి ఉండాలి. సింపుల్‌గా, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.' అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... 'అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఎందుకంటే.. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కష్టపడుతున్నా. అని అన్నారు. కాగా.. నాగ చైతన్యతో శోభితా రిలేషన్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు! ) కాగా.. గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది. ప్రస్తుతం ఆమె ది నైట్ మేనేజర్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకెళ్తున్న శ్యామ్ సీఎస్
తమిళ సినిమా: చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్. తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా సంగీత దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారనే చెప్పాలి. కోలీవుడ్‌లో బిజీ సంగీత దర్శకుడు ఎవరంటే ముందుగా వినిపించేది ఈయన పేరే. కాగా విక్రమ్ వేద చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈయన తాజాగా ది నైట్ మేనేజర్ అనే హిందీ వెబ్ సిరీస్‌కు సంగీతాన్ని అందించడం విశేషం. ఇది 2016లో ఇదే పేరుతో ఆంగ్లంలో రూపొందింది. ఇప్పుడు దానికి హిందీలో రీమేక్ చేశారు. ఇందులో పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఫేమ్ శోభిత దూళిపాల, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రియాంక చోప్రా, ఫారుక్ నబీల్, నవీన్ సందీప్ మోడీ కలిసి నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. ఈ నెల 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. దీనికి సంగీతాన్ని అందించడం మంచి అనుభవంగా శ్యామ్ సీఎస్ పేర్కొన్నారు. ఇంతకుముందే విక్రమ్ వేద చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై మంచి గుర్తింపును తెచ్చుకున్నట్లు చెప్పారు. తాజాగా ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌కు ఎంతో అనుభవం కలిగిన అంతర్జాతీయ సంగీత కళాకారుల సహకారంతో సంగీతాన్ని అందించినట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌కి వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.