Actress Sobhita Dhulipala Opens Up About Her Husband Qualities, Deets Inside - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: నన్ను చేసుకునే వ్యక్తి ఇలా ఉండాలి: శోభిత ధూళిపాళ

Published Wed, Jun 21 2023 4:07 PM | Last Updated on Wed, Jun 21 2023 4:28 PM

Actress Sobhita Dhulipala Open About Her Husband Qualities - Sakshi

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై  వస్తున్న రూమర్స్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. ఓసారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో  డేటింగ్‌ గాసిప్స్ గుప్పుమన్నాయి.  తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చింది. 

(ఇది చదవండి: చైతో డేటింగ్‌ అంటూ రూమర్స్‌.. స్పందించిన శోభిత ధూళిపాళ)

శోభిత మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి.  జీవితంలో ఎంత ఎదిగినా అణగిమణిగి ఉండాలి. సింపుల్‌గా,  మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి.  ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.' అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. 

తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... 'అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్‌ లైఫ్‌ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఎందుకంటే..  ఎన్నో ఆడిషన్స్‌ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కష్టపడుతున్నా. అని అన్నారు. కాగా.. నాగ చైతన్యతో  శోభితా రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు! )

కాగా..  గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్‌ సెల్వన్‌​ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్‌ చేసింది. మంకీ మ్యాన్‌ అనే హాలీవుడ్‌ సినిమాలోనూ శోభిత నటించింది. ప్రస్తుతం ఆమె ది నైట్‌ మేనేజర్‌-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement