ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.
ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.
కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్‌లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు.
అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024
- ట్రిప్తి డిమ్రీ
- దీపికా పదుకొణె
- ఇషాన్ ఖట్టర్
- షారుఖ్ ఖాన్
- శోభితా ధూళిపాళ్ల
- శార్వరి
- ఐశ్వర్యరాయ్ బచ్చన్
- సమంత
- అలియా భట్
- ప్రభాస్
Comments
Please login to add a commentAdd a comment