IMDb
-
ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్‌గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్‌లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచారామె.అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు. -
నాగచైతన్యతో ఎంగేజ్మెంట్.. టాప్‌లో శోభితా ధూళిపాళ్ల
అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం వారి రెండు కుటుంబాల మధ్య మాత్రమే నిశ్చితార్థం జరిగింది. దీంతో వారిద్దరి టాపిక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే, ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల జాబితాలో శోభిత ధూళిపాళ్ల టాప్ ప్లేస్‌కు చేరుకుంది.ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను IMDB (ఇండియన్ మూవీ డేటాబేస్) తాజాగా విడుదల చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నటి శోభిత ఒక్కసారిగా రెండో స్థానంలో నిలిచింది. నాగచైతన్యతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆమె సిద్ధం కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. వారిద్దరి గురించి మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు గూగుల్ సర్చ్ చేశారు.షారూఖ్‌ను దాటేసిన శోభితఐఎండీబీ జాబితా ప్రకారం ఈ వారం ప్రథమ స్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ నిలిచింది. ముంజ్యా మూవీ విజయం తర్వాత ఆమె క్రేజ్ భారీగా పెరిగింది. చైతుతో ఎంగేజ్మెంట్ వల్ల రెండో స్థానంలోకి శోభిత వచ్చేసింది. షారూఖ్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ తర్వాత స్థానాల్లో వరుసగా ఉన్నారు. -
ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో కల్కి మొదటిస్థానంలో నిలిచింది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ జాబితాలో కల్కి తర్వాత మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మలయాళ చిత్రాలు సత్తా చాటగా.. టాలీవుడ్ నుంచి కల్కి, హనుమాన్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది. ‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟Halfway through 2024, we're excited to share the Most Popular Indian Movies of the year (so far!) 🎬✨Which one's your top pick? 🤔1. Kalki 2898-AD pic.twitter.com/9eCnBR7zYM— IMDb India (@IMDb_in) July 23, 2024 -
పుష్ప-2 సినిమా క్రేజ్ వేరే లెవెల్.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్!
టాలీవుడ్లో మోస్ట్ అవైటేడ్ చిత్రాల్లో పుష్ప-2: ది రూల్ ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మరోసారి వాయిదా వేశారు. దీంతో పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఐఎండీబీ ప్రకటించిన జాబితాలోనూ పుష్ప-2 మొదటిస్థానంలో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో దేవర, వెల్కమ్ టూ ద జంగిల్, గోట్, కంగువా, సింగమ్ ఏగైన్, తంగలాన్, భూల్ భూలయ్యా-3, ఆరోన్ మే కహాన్ దమ్ తా, స్త్రీ-2 చిత్రాలు నిలిచాయి. టాలీవుడ్ మూవీ తొలిస్థానంలో నిలవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే ఈ జాబితాపై పుష్ప-2 మేకర్స్ కూడా స్పందించారు. డిసెంబర్ 6న వచ్చేస్తున్నాం.. తగ్గేదేలే అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న రూమర్లకు చిత్రబృందం చెక్ పెట్టింది. డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కాగా.. ఈ మూవీ మరో నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది.#ThaggedheLe 💥🤙🏻#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024. https://t.co/ctfCrGX33B pic.twitter.com/AuPTXwUOpA— Pushpa (@PushpaMovie) July 23, 2024 -
సినీతారలకు ర్యాంకులు.. టాప్ టెన్‌లో అంతా వాళ్లే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ వెల్లడించింది. గత పదేళ్లుగా వారికి లభించిన క్రేజ్ ఆధారంగా ఈ లిస్ట్‌ను రూపొందించారు. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ నిలిచారు. టాప్ టెన్‌లో ఆందరూ బాలీవుడ్ తారలే నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న మొదటి 100 మంది సినీతారల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.దక్షిణాది తారల విషయానికొస్తే ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం. ఆ తర్వాత తమన్నా 16, నయనతార 18 స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ హీరోల విషయానికొస్తే ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, జూనియర్ ఎన్టీఆర్ 67 స్థానాల్లో ఉన్నారు. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ ఇవాళ విడుదల చేసింది. టాప్-100 సినీ తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨Do you spot your favourites?The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ— IMDb India (@IMDb_in) May 29, 2024 -
ఆ రికార్డ్ అందుకున్న ఏకైక ఇండియన్ చిత్రంగా '12th Fail'
అనురాగ్ పాథక్ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్ IMDb రేటింగ్ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం 69వ 'ఫిలిం ఫేర్' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12Th ఫెయిల్ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్డేట్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనోజ్ జీవిత కథను ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ 12Th ఫెయిల్ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్లో గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) -
IMDB నుంచి మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్..
-
ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్ మూవీ జవాన్‌లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. గతంలో సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ను వెనక్కి నెట్టి సోషల్ మీడియా ఫేమ్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. IMDb నివేదిక ప్రకారం ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నయనతార నం.1 స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సోషల్ మీడియాలో అత్యధికంగా శోధించిన, ట్రెండింగ్ సినిమాలను గుర్తించడం ద్వారా ఈ రేటింగ్ ఇస్తుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్) ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను ఈ ఏడాది ప్రారంభం నుంచి IMDb విడుదల చేస్తుంది. వారానికోసారి విడుదలయ్యే ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా అభిమానులు శోధించారు. గ్లోబల్ ఇండియన్ సెలబ్రిటీ అభిమానులు కింగ్ ఖాన్ కంటే నయనతారపై ఎక్కువ ఆసక్తి చూపారు. IMDb షేర్ చేసిన తాజా జాబితాలో, జవాన్ సూపర్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ కంటే నయనతార ముందుంది. గత వారం జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, నయనతార 3వ స్థానంలో నిలిచింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార IMDb ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో ఎక్కువ మంది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. నయనతార అగ్రస్థానంలో ఉండగా, కింగ్‌ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. జవాన్ దర్శకుడు అట్లీ కుమార్ గత వారం పదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. విష్నేష్ శివన్ రియాక్షన్ IMDb యొక్క ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉండటంపై విఘ్నేష్ శివన్ స్పందించారు. నయనతార భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తన భార్య సాధించిన విజయాల గురించి తరచుగా ప్రశంసిస్తుంటారు. తాజాగా విఘ్నేష్ తన 'తంగమాయె' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొనియాడాడు. విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ప్రౌడ్ ఆఫ్ యు తంగమయ్య' అని రాసి తన భార్యను ట్యాగ్ చేశాడు. (ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ) -
ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?
ఓటీటీల రాకతో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయిందనే చెప్పాలి. కాలక్షేపం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా గడప దాటకుండానే అరచేతిలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. థియేటర్లో రిలీజైన సినిమాలతో పాటు ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు లేదా కొత్త వెబ్ సిరీస్‌లతో మస్త్ మజా అందిస్తున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లలోనే ఓటీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభిరుచికి తగ్గట్లుగానే కామెడీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల కంటెంట్‌ను అందిస్తోంది. ఈ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్డీబీ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సాక్ర్డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే సిరీస్‌లు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో కింది పట్టికలో చూసేయండి. వాటిలో మీకు నచ్చినవాటిని వీకెండ్లో చూసేయండి. ర్యాంక్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 1 సాక్ర్డ్ గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ 2 మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్ 3 స్కామ్ 1992 సోనీలివ్ 4 ద ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ 5 ఆస్పిరంట్స్ యూట్యూబ్ 6 క్రిమినల్ జస్టిస్ హాట్‌స్టార్ 7 బ్రీత్ అమెజాన్ ప్రైమ్ 8 కోటా ఫ్యాక్టరీ నెట్‌ఫ్లిక్స్ 9 పంచాయత్ అమెజాన్ ప్రైమ్ 10 పాతాళ్ లోక్ అమెజాన్ ప్రైమ్ 11 స్పెషల్ ఓపీఎస్ హాట్‌స్టార్ 12 అసుర్: వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ జియో సినిమా 13 కాలేజ్ రొమాన్స్ సోనీలివ్ 14 అఫరన్ జియో సినిమా 15 ఫ్లేమ్స్ అమెజాన్ ప్రైమ్ 16 దిండోరా యూట్యూబ్ 17 ఫర్జి అమెజాన్ ప్రైమ్ 18 ఆశ్రమ్ MX ప్లేయర్ 19 ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్ 20 ఉందేఖి సోనీలివ్ 21 ఆర్య హాట్‌స్టార్ 22 గుల్లక్ సోనీలివ్ 23 టీవీఎఫ్ పిచర్స్ జీ5 24 రాకెట్ బాయ్స్ సోనీలివ్ 25 ఢిల్లీ క్రైమ్స్ నెట్‌ఫ్లిక్స్ 26 క్యాంపస్ డైరీస్ MX ప్లేయర్ 27 బ్రోకెన్: బట్ బ్యూటిఫుల్ MX ప్లేయర్ 28 జంతారా: సబ్కే నంబర్ ఆయేగా నెట్‌ఫ్లిక్స్ 29 తాజ్ ఖబర్ హాట్‌స్టార్ 30 అభయ్ జీ5 31 హాస్టల్ డేస్ అమెజాన్ ప్రైమ్ 32 రంగ్‌బాజ్ జీ5 33 బందిష్ బందిత్స్ అమెజాన్ ప్రైమ్ 34 మేడ్ ఇన్ హెవన్ అమెజాన్ ప్రైమ్ 35 ఇమ్మాచ్యూర్ అమెజాన్ ప్రైమ్ 36 లిటిల్ థింగ్స్ నెట్‌ఫ్లిక్స్ 37 ద నైట్ మేనేజర్ హాట్‌స్టార్ 38 క్యాండీ జియో సినిమా 39 బిచ్చూ కా ఖేల్ జీ5 40 దహన్: రాఖన్ కా రహస్య హాట్‌స్టార్ 41 జేఎల్ 50 సోనీలివ్ 42 రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ 43 రే నెట్‌ఫ్లిక్స్ 44 సన్‌ఫ్లవర్ జీ5 45 ఎన్సీఆర్ డేస్ యూట్యూబ్ 46 మహారాణి సోనీలివ్ 47 ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ 48 చాచా విధాయక్ హై హమారా అమెజాన్ ప్రైమ్ 49 యే మేరీ ఫ్యామిలీ అమెజాన్ మినీ టీవీ 50 అరణ్యక్ నెట్‌ఫ్లిక్స్ View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ -
టాప్-3లో రష్మిక.. అల్లు అర్జున్ను దాటేసిందిగా!
నేషనల్ క్రష్, కన్నడ భామ 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ ఒక్కసారిగా తిరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ కేటగిరిలో శ్రీవల్లి చోటు సంపాదించుకుంది. ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్-3లో నిలిచింది. రష్మిక ఈ లిస్టులోకి ఎంట్రీ అవ్వడం ఇదే మొదటిసారి. ఈ జాబితాలో అల్లు అర్జున్ 17వ ప్లేస్‌లో నిలిచారు. తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులోకి కొత్తగా డెబ్యు ఇచ్చిన వాళ్లలో వెట్రిమారన్, అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్, తమన్నా, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేశ్‌ల దసరా సినిమా హిట్ కావడంతో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా మారారు. కాగా.. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘పుష్ప2’ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. Bringing you this week's edition of new entrants who made into IMDb's Popular Indian Celebrities Feature this week ✨💛 Wondering where you can find it? On the IMDb app on iOS and Android! 🍿 Who's your favourite? pic.twitter.com/LnCUYt2he7 — IMDb India (@IMDb_in) April 14, 2023 With his birthday last week and the anticipation building for the release of #Pushpa2 , @alluarjun in on everyone’s minds right now as he debuts on the IMDb Popular Indian Celebrities Feature at #17! 🔥 pic.twitter.com/ci45NoJzNk — IMDb India (@IMDb_in) April 14, 2023 -
ఆ పది సినిమాల్లో ఐదు మనవే
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్‌లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ నటులు వీళ్లే.. అగ్రస్థానంలో సౌత్ హీరో
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాదిలో మోస్ట్ పాపులర్ నటుల జాబితాను విడుదల చేసింది. దేశంలో టాప్ టెన్ నటుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో తమిళ నటుడు ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నటీనటుల పేర్లను ఐఎండీబీ పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐఎండీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. రెండోస్థానంలో బాలీవుడ్ నటి అలియా భట్, మూడోస్థానంలో ఐశ్వర్యరాయ్, నాలుగోస్థానంలో మెగా హీరో రామ్ చరణ్ నిలవగా.. సమంత ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కేజీఎఫ్ హీరో యశ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. Aaaand we have arrived at the moment we’ve all been waiting for 🥁 Presenting the IMDb Top 10 Most Popular Indian Stars of the year 💛 Who was your favourite Indian star this year? 🎬⭐️ #IMDbBestof2022 pic.twitter.com/w6deLsCZ9y — IMDb India (@IMDb_in) December 7, 2022 -
Kantara Movie: తగ్గేదేలే అంటున్న 'కాంతార'.. ఆ లిస్ట్‌లోనూ ఫస్ట్ ప్లేస్
Kantara Movie: ఇటీవల విడుదలైన కన్నడ మూవీ 'కాంతార' పలు రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఓ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఈ చిత్రం మొదటిస్థానంలో నిలిచింది. ఐఎండీబీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సెప్టెంబరు 30న పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిషభ్ శెట్టి హీరో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. పెద్ద సినిమాల రికార్డులు సైతం బద్దలవుతున్నాయి. టాలీవుడ్లో హిట్ చిత్రాలు బాహుబలి: ది కన్‌క్లూజన్(101), బాహుబలి: ది బిగినింగ్(182), ఆర్ఆర్ఆర్(190) స్థానాల్లో నిలిచాయి. (చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న 'కాంతార'.. మౌత్‌టాక్‌తోనే సూపర్ హిట్) ఇప్పడు ఎవరి నోటా విన్నా ‘కాంతార’ పేరే వినిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లోనూ రిలీజైంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ‘టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్’ జాబితాను వెల్లడించగా.. తొలి స్థానంలో కాంతార, రెండోస్థానంలో రామాయణ, మూడో ప్లేస్‌లో రాకెట్రీ నిలిచాయి. తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించినట్లు తెలిపింది. కాగా.. ఈ సినిమా మలయాళ వర్షన్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. India’s Current Top 250 Films: What are your favourites from this list?🤔 Regularly updated, the IMDb Top 250 is a collection of the most loved & highest-rated Indian films by fans. This list is as of 17th October, 2022.#IMDbTop250 pic.twitter.com/02sYGdDZHL — IMDb India (@IMDb_in) October 17, 2022 -
కాంతార సెన్సేషన్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2లను దాటేసిందిగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ కేజీఎఫ్ 2 రికార్డును బద్ధలు కొట్టింది. ఐఎమ్‌డీబీలో కేజీఎఫ్ 2 మూవీకి 8.4, ఆర్ఆర్ఆర్ సినిమాకు 8 రేటింగ్ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.6 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ చిత్రంగా కాంతార నిలిచింది. కాగా అఖండ ప్రేక్షకాదరణ అందుకుంటున్న కాంతార నేడు హిందీలో రిలీజైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం (అక్టోబర్ 15న) ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. చదవండి: ఎందుకింత ద్వేషం, అతడిని బతకనివ్వండి: నటి -
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్‌వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.3 8. మాయి (నెట్‌ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
2022లో మోస్ట్ పాపులర్ 10 సినిమాలివే..
కరోనా వల్ల సగటు ప్రేక్షకుడు మళ్లీ థియేటర్‌కు వస్తాడా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేశాయి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 చిత్రాలు.. ఇవే కాకుండా ఇంకెన్నో సినిమాలు ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నిరూపించాయి. మరీ ముఖ్యంగా ఈసారి సౌత్ సినిమాలు బాలీవుడ్‌ను రఫ్ఫాడించాయి. హిందీలోనూ వసూళ్లలో దూసుకుపోతూ విశ్లేషకులను సైతం ఆశ్చ్యపరిచాయి. తాజాగా ఐఎమ్‌డీబీ(ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) ఈ ఏడాది టాప్ టెన్ మూవీస్ అండ్ టీవీ షోల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 8.8 రేటింగ్‌తో విక్రమ్ మొదటి స్థానంలో నిలిచింది. మరి తర్వాతి స్థానంలో నిలిచిన సినిమాలేంటో కింద చూసేయండి.. 1. విక్రమ్: 8.8/10 2. కేజీఎఫ్ చాప్టర్ 2: 8.5/10 3. ద కశ్మీర్ ఫైల్స్ : 8.3/10 4. హృదయం: 8.1/10 5.ఆర్ఆర్ఆర్ : 8/10 6. ఎ థర్స్డే: 7.8/10 7. ఝండ్: 7.4/10 8. సామ్రాట్ పృథ్వీరాజ్: 7.2/10 9. రన్‌వే 34: 7.2/10 10. గంగూబాయి కథియావాడి: 7/10 View this post on Instagram A post shared by IMDb (@imdb) టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ 1. క్యాంపస్ డైరీస్: 9/10 2. రాకెట్ బాయ్స్: 8.9/10 3. పంచాయత్: 8.9/10 4. అపహరణ్: 8.4/10 5. హ్యూమన్ : 8/10 6. ఎస్కేప్ లైవ్: 7.7/10 7. ద గ్రేట్ ఇండియన్ మర్డర్: 7.3/10 8. మై: 7.2/10 9. ద ఫేమ్ గేమ్: 7/10 10: యే కాలి కాలి అంఖేన్: 7/10 View this post on Instagram A post shared by IMDb (@imdb) చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు డ్యాన్స్ !.. 'వావ్' అని హీరో కామెంట్ రన్నింగ్ సీన్లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్ స్టార్ -
ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు
కరోనా అనంతరం ఈ ఏడాది వరల్డ్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ తర్వాత కేజీయఫ్ 2 ఉంటుంది. అయితే తాజాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. ఐఎండీబీ(imdb) ఇటీవల రిలీజ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రమైన ‘కేజీయఫ్ 2’, తాజాగా విడుదలైన మరో కన్నడ మూవీ ‘777 చార్లీ ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ అధిగమించాయి. కేజీయఫ్ 2, 101వ స్థానంలో నిలువగా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా అధిగమించాయి. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కే కిరణ్ రాజ్ దర్శకత్వంలో ‘777 చార్లీ’ చిత్రం రూపొందింది. ధర్మ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క (పెట్) ప్రవేశించి.. అతని జీవితాన్నిఎలా మార్చేసిందనేది ఈ కథ. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి. -
ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Telugu Web Series As Per IMDB Rating: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విభిన్నమైన కథలతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే పెట్టింది పేరుగా బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సిరీస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ మారింది. వెబ్ సిరీస్‌లు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. తెరకెక్కించడమే కాకుండా తెలుగు నేటివిటికి తగినట్లుగా మలిచి మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తీసుకుని వాటికి రేటింగ్ నిర్ణయిస్తుంది ఐఎమ్‌డీబీ వెబ్సైట్. ఈ రకంగా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులను మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. 1. లూజర్-8.8 రేటింగ్ (జీ5) 2. కుడి ఎడమైతే-8.4 రేటింగ్ (ఆహా) 3. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ-8.4 రేటింగ్ (జీ5) 4. కొత్త పోరడు-8.3 రేటింగ్ (ఆహా) 5. తరగతి గది దాటి-8 రేటింగ్ (ఆహా) 6. గాడ్ ఆఫ్ ధర్మపురి-7.8 రేటింగ్ (జీ5) 7. పరంపర-7.6 రేటింగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. మస్తీస్-7.2 రేటింగ్ (ఆహా) 9. చదరంగం-7.1 రేటింగ్ (జీ5) 10. బ్యూటీ అండ్ ది బేకర్-7 రేటింగ్ (ఆహా) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. -
బాలయ్య బీభత్సం.. అన్‌స్టాపబుల్ ‘షో’ సరికొత్త రికార్డు
గతంలో వెండితెరపై కనిపించి అలరించిన తారలు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టెలివిజన్‌లోనూ హోస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ జాబితాలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్, నాని ఇప్పటికే హోస్ట్‌లుగా వ్యవహరించి టెలివిజన్‌లోనూ తగ్గేదేలే అనిపించారు. అయితే ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ట వస్తాడని ఎవరూ ఊహించి ఉండరూ. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్‌షోకు ఊహించని రెస్సాన్స్ వస్తోంది. దీంతో వెండితెరపై మాత్రమే కాదు ఏ తెరపైన అయినా బాలయ్య అడుగు పెడితే రికార్డులు మోత మోగాల్సిందేనని నిరూపించారు. (చదవండి: Balayya: 'దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య) ఇప్పటి వరకు తెలుగులో చాలా టాక్షాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షా సాధించినంత విజయాన్ని మాత్రం ఏ షో సాధించలేకపోయాయి. ఎందుకంటే.. నిన్నటి వరకు వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను అలరించిన బాలయ్య తొలిసారి హాస్ట్‌గా వ్యవహరిస్తూ తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఈ షో చూసిన కొందరు వింటేజ్ బాలయ్యని చూస్తున్నామని నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి హిట్ టాక్‌తో ఏ మాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది. తాజాగా ఈ షో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీ.. టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోలలో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 7 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకొక మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్‌తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
Jai Bhim IMDB Rating: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది