Kantara Movie Got First Place In IMDB Rank All Over India - Sakshi
Sakshi News home page

Kantara Movie: ఆ జాబితాలో కాంతార నెంబర్‌వన్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?

Published Tue, Oct 18 2022 8:02 PM | Last Updated on Tue, Oct 18 2022 9:15 PM

Kantara Movie  Gets First Place In IMDB Ranks All Over India - Sakshi

Kantara Movie: ఇటీవల విడుదలైన కన్నడ మూవీ 'కాంతార' పలు రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఓ రేంజ్‌లో బాక‍్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన టాప్ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాలో  ఈ చిత్రం మొదటిస్థానంలో నిలిచింది. ఐఎండీబీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సెప్టెంబరు 30న పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిషభ్ శెట్టి హీరో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. పెద్ద సినిమాల రికార్డులు సైతం బద్దలవుతున్నాయి. టాలీవుడ్‌లో హిట్‌ చిత్రాలు బాహుబలి: ది కన్‌క్లూజన్(101), బాహుబలి: ది బిగినింగ్(182), ఆర్ఆర్ఆర్(190) స్థానాల్లో నిలిచాయి. 

(చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న 'కాంతార'.. మౌత్‌టాక్‌తోనే సూపర్‌ హిట్‌)

ఇప్పడు ఎవరి నోటా విన్నా ‘కాంతార’ పేరే వినిపిస్తోంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లోనూ రిలీజైంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ జాబితాను వెల్లడించగా.. తొలి స్థానంలో కాంతార, రెండోస్థానంలో రామాయణ, మూడో ప్లేస్‌లో రాకెట్రీ నిలిచాయి. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించినట్లు తెలిపింది. కాగా.. ఈ సినిమా మలయాళ వర్షన్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement