కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.
రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.
ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment