కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా? | Malayalam Star Mohanlal to play Rishab Shetty father in Kantara Chapter 1 | Sakshi
Sakshi News home page

Mohanlal: కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?

Published Tue, Oct 1 2024 5:13 PM | Last Updated on Tue, Oct 1 2024 7:02 PM

Malayalam Star Mohanlal to play Rishab Shetty father in Kantara Chapter 1

కాంతార మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషబ్‌ శెట్టిని  మోహన్‌లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్‌-1 లో మోహన్‌లాల్‌ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.

(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్‌ లుక్‌ వీడియో.. రిషబ్‌ శెట్టి ఉగ్రరూపం)

కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement