
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో చేసిన ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సామ్ ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తోంది.

తను సమంతానా?
ఈ వీడియోలో సామ్‌ను చూసి అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. సమంత అప్పటికంటే ఇప్పుడే యంగ్‌గా కనిపిస్తోంది.. తను సమంతే అని పోల్చుకోవడానికే చాలా కష్టంగా ఉంది.. అని నెటిజన్లు రకరకాలుగా కామంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. నిజంగా తను సమంతాయేనా? అని ప్రశ్నిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో, ముఖంలో మార్పులు సహజమే అని అభిమానులు అంటుంటే కొందరు మాత్రం తను ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు.
రష్మిక అనుకున్నామే!
మరికొందరైతే తనను చూసి రష్మిక మందన్నా అనుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సామ్ నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 6న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment