Samantha Ruth Prabhu
-
Sam: ఇంతకీ సమంత మనసు దోచిన వ్యక్తి ఎవరు
-
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
స్కూల్ ఫంక్షన్ లో పిల్లలతో సరదాగా హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
మోస్ట్ పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
-
సమంత ఇంట్లో తీవ్ర విషాదం
-
కుటుంబంలో విషాదం..బాధలో హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
పబ్‌లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో చేసిన ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సామ్ ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తోంది.తను సమంతానా?ఈ వీడియోలో సామ్‌ను చూసి అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. సమంత అప్పటికంటే ఇప్పుడే యంగ్‌గా కనిపిస్తోంది.. తను సమంతే అని పోల్చుకోవడానికే చాలా కష్టంగా ఉంది.. అని నెటిజన్లు రకరకాలుగా కామంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. నిజంగా తను సమంతాయేనా? అని ప్రశ్నిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో, ముఖంలో మార్పులు సహజమే అని అభిమానులు అంటుంటే కొందరు మాత్రం తను ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. రష్మిక అనుకున్నామే!మరికొందరైతే తనను చూసి రష్మిక మందన్నా అనుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సామ్ నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 6న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. View this post on Instagram A post shared by TEA Music | The Entertainment Assignment Music (@teamusicdaily) చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి -
అలాంటి పాత్రలు చేయను: సమంత
‘‘ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు నేను చేయను’’ అంటున్నారు హీరోయిన్ సమంత. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్స్ వెర్షన్స్ . ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’ సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఇదే వేదికపై సినిమాల్లో మహిళల పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే ఎన్నో విషయాల గురించి ఆలోచించి, పాత్రలను ఎంచుకుంటాను. ప్రస్తుతం సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. సినిమాల్లో కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు నేను దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే ప్రకటనల విషయంలోనూ ఆలోచిస్తాను. ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర నాది. యాక్షన్స్ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేశా. కానీ, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చాన్స్‌ల కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా కొన్నింటినే ఎంచుకుంటున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు, నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది’’ అని సమంత పేర్కొన్నారు. -
తగ్గేదెలా అంటున్న సమంత మళ్ళీ...
-
పాత ఇంగ్లీష్ సినిమాల్లోని హీరోయిన్లా సమంత (ఫోటోలు)
-
సమంత దీపావళి సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
పేర్లు మర్చిపోయా!
జోరుగా, జోష్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సమంత ‘మయోసైటిస్’ వ్యాధి కారణంగా ఏడాదికి పైగా షూటింగ్స్‌కి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి పలు సందర్భాల్లో పంచుకున్నారామె. తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లోనూ ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో తాను ఒకరోజు జ్ఞాపక శక్తి కోల్పోయానని సమంత చెప్పిన విషయం వైరల్‌గా మారింది. ‘‘సిటాడెల్: హనీ బన్నీ’ షూటింగ్లో ఉన్నప్పుడు సడన్‌గా అంతా మర్చిపోయా. చాలామంది పేర్లు మర్చిపోయాను. ఆ షూటింగ్ కోసం ఉపయోగించిన సెట్ టైమ్ ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ పరిస్థితిలో నేను అన్నీ మర్చిపోయాను. ఎవరో మనుషులు వస్తున్నారు... వెళుతున్నారు.. ఓ స్టంట్ మాస్టర్ నా ముందు ఉన్నాడు... నేనేం చేస్తున్నానో తెలియలేదు. ఇలా అయోమయ స్థితిలో పడిపోయాను. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నా... ఆ టైమ్‌లో నన్నెవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, నా ఆరోగ్యం గురించి ఎవరూ అడగలేదని అనుకుంటుంటాను. కానీ ‘సిటాడెల్: హనీ బన్నీ’ యూనిట్ సహకరించింది.నేను కోలుకున్నాక షూటింగ్ చేశారు’’ అని పేర్కొన్నారు సమంత. అయితే సమంత ఇలా మర్చిపోయిన తర్వాత ఈ యూనిట్ డాక్టర్ని సంప్రదించిందట. ఆ విషయం సమంతకు గుర్తు లేదు. అందుకే ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ఆమె అనుకుంటున్నారు. ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబరు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సమంత గ్లామరస్ పిక్స్.. ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
లండన్‌లో ‘హనీ’ బిజీబిజీ : సమంతా స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
తమ్ముడి పెళ్లిలో సమంత.. ఫ్యామిలీతో కలిసిపోయినట్టేనా? (ఫొటోలు)
-
అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్
హీరోయిన్ సమంత అమెరికాలో జరిగిన పెళ్లిలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన చాలా ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అసలు ఈ వివాహ వేడుక ఎవరిదా అని ఆరాతీస్తే సమంత తమ్ముడు డేవిడ్దని తెలిసింది. ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు గొడవలన్నీ క్లియర్ చేసుకుని వాళ్లతో కలిసిపోయినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)తమిళనాడులో పుట్టి పెరిగిన సమంతకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీళ్లలో చిన్నోడే డేవిడ్. ఇతడి పెళ్లి అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగింది. నికోల్ అనే అమ్మాయినతో క్రిస్టియన్ సంప్రదాయంలో ఒక్కటయ్యాడు. ఈ వేడుకలో సమంత తోడు పెళ్లి కూతురిలా (బ్రైడ్స్ మేడ్) కనిపించింది. స్లీవ్‌లెస్ గౌనులో అందంగా మెరిసిపోయింది. ఇక తమ్ముడి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సామ్.. వైట్ హర్ట్, స్పార్కిల్ ఎమోజీతో పాటు 'ఫ్యామిలీ' అని రాసుకొచ్చింది.'ఏ మాయ చేశావె' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించింది. చివరగా 'ఖుషి' సినిమా చేసింది. ప్రస్తుతం 'సిటాడెల్ హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ చేసింది. నవంబరు 7న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత ఫ్యామిలీకి ఈమెకు మధ్య దూరం పెరిగిందని, అందుకే ముంబైలో ఒంటరిగా ఉందని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తమ్ముడి పెళ్లి వల్ల సమంత మళ్లీ కుటుంబానికి దగ్గరైపోయినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత' దినచర్య ఇదే..
-
రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేశావే సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి సమంత ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, ఆరోగ్యం సంబంధిత వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈసారి తన చర్మ సంరక్షణ కోసం తన రోజువారి దినచర్యలో భాగంగా తీసుకునే థెరపీ గురించి ఇన్‌స్టాలో చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోకి "లైఫ్ గోల్డెన్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేసింది. సమంత మచ్చలేని చర్మ రహస్యం ఏంటో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన చర్మం ప్రకాశవంతంగా డిస్కోబాల్ మాదిరిగా మెరుస్తూ ఉండేందుకు తాను ఉదయపు సూర్యకాంతిని తన ముఖంపై పడేలాచేసుకుంటానని అంటోంది. అంతేగాదు ఆయిల్ పుల్లింగ్, గువాషా, రెడ్‌లైట్ థెరపీలతో ముఖ వర్చస్సును కాపాడుకుంటానని చెబుతోంది. అలాగే తన రోజువారీ వెల్నెస్ రొటీన్లో భాగంగా రెడ్‌లైట్ థెరపీని తీసుకుంటానని తెలిపింది. ఇది కంటి సంరక్షణ తోపాటు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ రెడ్‌లైట్ థెరపీకి సంబంధించిన ఐ మాస్క్‌ల, ఫేస్ మాస్క్‌లు, ఫుల్ బాడీ ప్యానెల్ వంటి అనే సాధనాలు మార్కెట్లో ఉన్నాయి. దీని కోసం బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లోనే చర్మ వ్యాధుడి నిపుణుడి సలహాలతో తీసుకోవచ్చని అంటోంది సమంత. దీన్ని ఉదయం సాయంత్రంలో తీసుకుంటుంటే క్రమేణ చర్మం ఆకృతి మెరుగుపడుతుందని చెప్పింది. ఈ థెరఫీని ఇంట్లోనే పొందేలంటే ఉపయోగించాల్సిన పరికరాలు గురించి కూడా వెల్లడించింది. ఫోరో యూఎఫ్ఓ 2 పరికరం అనేది కొల్లాజెన్‌ని పెంచేలా చేసే రెడ్‌లైట్ థెరపీ పరికరం. ఇది క్రియోథెరపీని కలిగి ఉంటుంది. చర్మాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి గొంతు కండరాలకు ఉపశమనం కలిగించే హ్యాండ్‌హెల్డ్ పరికరం. ఇక మరొకటి డెన్నిస్ గ్రాస్ డీఆర్ఎక్స్ స్పెక్ట్రాలైట్ ఫేస్వేర్ప్రో అనేది నాలుగు రకాల లైట్లను కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ హ్యాండ్స్ ఫ్రీ రెడ్‌లైట్ పరికరం. ఇది ముఖ ఆకృతులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడమే గాక మొటిమలు, దాని తాలుకా గుర్తులను రీమూవ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అలాగే ముఖం, మెడను లక్ష్యంగా చేసుకుని మాన్యువల్‌గా పనిచేసే పోర్టబుల్ రెడ్‌లైట్ థెరపీ కావాలనుకుంటే సోలావేవ్ 4 ఇన్ 1 రేడియంట్ రెన్యూవల్ స్కిన్‌కేర్ బెస్ట్ అని చెబుతోంది. ఇది ఎర్రటి కాంతిని చర్మంపై ప్రసరించేలా చేసి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా ముఖం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) ఈ థెరపీతో కలిగే ప్రయోజనాలు..రెడ్‌లైట్ థెరపీ చర్మంపై ముడతలు, ఫైన్‌లైన్స్, వయసు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది. ముఖ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టోన్డ్ స్కిన్‌ను ప్రోత్సహిస్తుంది. చర్మం ఉపరితలంపై మచ్చలు, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపడేలా చేస్తుంది.(చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
సమంత రోజు ఎలా గడుస్తుందంటే...???
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన నటి సమంత రూత్ ప్రభు. మోడల్ నుంచి మొదలై స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతే దృఢంగా నిలబడుతోంది. ఆరోగ్యం సహకరించక పోయినా అచంచల విశ్వాసంతో తన కలల సాకారంకోసం నిబద్ధతగా సాగుతోంది. పురుషాధిక్య సినీ ప్రపంచంలో హీరోయిన్గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటూ అనేక ఆరోగ్య విషయాలను పంచుకోవడం సమంతాకు అలవాటు. ఈ క్రమంలో తన దినచర్య వివరాలను పంచుకుంది. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, క్రీడలతోపాటు, వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటోంది అనే ‘ది డే ఇన్ మే లైఫ్’ అనే చిన్న వీడియోలో షేర్ చేసింది. ఆరోగ్యాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తన అభిమానులకు చెప్పకనే చెప్పేసింది. ఆరోగ్యం పట్ల సమంత తీసుకుంటున్న శ్రద్ధకు, ఫిటె్నెస్కు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మీరు స్టార్. చాలా స్ఫూర్తి దాయకం! అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)కాగా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ ఫీనిక్స్ పక్షిలో తనను తాను నిరూపించుకుఉంటోంది. ఈక్రమంలోనే ప్రతిష్టాత్మక “సిటాడెల్” సిరీస్‌తో బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా కొత్త ప్రయాణం ప్రారంభించినట్టు సమంత స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సమంత ఇచ్చిన కౌంటర్ నాగ చైతన్య కేనా..?
-
ప్లేయర్‌గా మారిన సమంత.. ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వరుణ ధావన్ సరసన నటిస్తున్నారు. ఇటీవల తాను ఓ ఫ్రాంజైజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది.తాజాగా పికిల్ బాల్ లీగ్‌లో సందడి చేసింది. బ్యాట్ చేత పట్టుకుని ప్లేయర్‌గా ఆడుతూ కనిపించింది. పికిల్ బాల్ ఆడుతూ డ్యాన్స్ చేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితమే బిగ్ సర్ప్రైజ్ అంటూ ఈ లీగ్ పార్ట్నర్గా అడుగుపెడుతున్న సామ్ తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. -
గ్లామర్ పెంచిన సమంత కారణం అదేనా..?
-
ప్రత్యేక విషయం చెప్తా అంటూ పోస్ట్!