పేరు హనీ... అంత మాత్రాన స్వీట్ గాళ్ అనుకుంటే పొరపాటే. శత్రువులను రఫ్ఫాడించేటప్పుడు గరమ్ గాళ్ అయిపోతుంది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సమంత కనిపించనున్న సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ. బన్నీగా వరుణ్, హనీ పాత్రలో సమంత కనిపిస్తారు. గురువారం ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. ఒకవైపు వరుణ్ ధావన్... మరోవైపు సమంత.... ఇద్దరూ పోటాపోటీగా విలన్లను రఫ్ఫాడిన దృశ్యాలు ఈ టీజర్‌లో కనిపించాయి.
ఈ భారీ ఫైట్‌ని సమంత అవలీలగా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హాలీవుడ్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్ ఇది. సమంత ఓ లీడ్ రోల్‌లో ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్– డీకే ‘సిటాడెల్’కి దర్శకులు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment