
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. అయితే కొత్త ఏడాదిలో ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి మాత్రం నానా తంటాలు పడుతోంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన సొంత బ్యానర్‌లోని మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది.
అయితే తాజాగా సమంతను ఓ అవార్డ్ వరించింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రముఖ సంస్థ ఆమెను సత్కరించింది. చెన్నైకి చెందిన ఎంసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు సమంతకు అవార్డ్‌ను అందజేశారు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ అందించే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌కు ఆమెకు అందించారు. చెన్నైలో జరిగిన వేడుకలో సమంత ఈ అవార్డ్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సామ్. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్‌కు కూడా మరో అవార్డ్‌ను అందుకుంది ఈ ముద్దగుమ్మ.
(ఇది చదవండి: 'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్)
కాగా.. సమంత 2010లో అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే అనే సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. సామ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సిటాడెల్ హనీ బన్నీ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు, డీకే కూడా హాజరయ్యారు.

రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తలు
కాగా.. ఇటీవల రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ సమంతపై వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్‌లో వీరిద్దరు జంటగా కనిపించడంతో మరోసారి రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి సమంత, రాజ్ నిడిమోరు ఓకే వేదికపై మెరిశారు. దీంతో మరోసారి సమంతపై డేటింగ్ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే సామ్ కానీ.. రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment