ఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది. చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో వివరించింది.
ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం ఆరోగ్యానికి చాలామందని సూచించింది. నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది.
ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్‌ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని ఆలోచనల గురించి చింతించకండి. వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది.
ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.
ధ్యానం ఉదయం, సాయంత్రం, నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్‌గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్‌స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్ అభిప్రాయం ప్రకారం ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం తేలింది.
ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
ధ్యానం, రకాలు
శ్రద్ధ ధ్యానం
ఆధ్యాత్మిక ధ్యానం
దృష్టి ధ్యానం
మంత్ర ధ్యానం
అతీంద్రియ ధ్యానం
లవింక్ కైండ్‌నెస్ ధ్యానం
విజువలైజేషన్; వాకింగ్ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment