Meditation
-
మెడిటేషన్‌కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్‌లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్‌తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్‌గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్‌ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్‌తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..) -
మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతా
ఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది. చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో వివరించింది.ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం ఆరోగ్యానికి చాలామందని సూచించింది. నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది. ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్‌ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని ఆలోచనల గురించి చింతించకండి. వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.ధ్యానం ఉదయం, సాయంత్రం, నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్‌గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ అభిప్రాయం ప్రకారం ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం తేలింది.ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!ధ్యానం, రకాలుశ్రద్ధ ధ్యానంఆధ్యాత్మిక ధ్యానందృష్టి ధ్యానంమంత్ర ధ్యానంఅతీంద్రియ ధ్యానంలవింక్ కైండ్‌నెస్ ధ్యానంవిజువలైజేషన్; వాకింగ్ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి. -
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21
ఐక్యరాజ్యసమితి: ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. లీచెన్స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కలిసి భారత్ మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోíÙస్తున్నాం’అని హరీశ్ పేర్కొన్నారు. -
దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా...
నేను మూడుసార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో బ్రెయిన్ క్యాన్సర్. 2024లో మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్‌పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.చిన్నప్పటి నుంచి సవాళ్లేనల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. 1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించాను’ అని చెప్పారు నిర్మల. మరో రెండుసార్లు దాడిక్యాన్సర్ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్ క్యాన్సర్ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్‌ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్ నేచర్ క్యూర్’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి. నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె. -
క్లిష్ట సమయంలో అవే కాపాడాయి..!: సీఈవో అనుపమ్ మిట్టల్
షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడి అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారిగా ఊహించని నష్టాలతో వ్యాపారం దివాళ తీసే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో తనకు సహయపడిన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అటువైపుకి వెళ్లి ఉండకపోతే మళ్లీ ఇలా నిలబడి మీ ముందుకు వచ్చేవాడిని కాదంటున్నాడు. ఇంతకీ అతడిని వ్యాపారంలో మళ్లీ నిలబడేలా చేసినవి ఏంటో తెలుసా..!చిన్న వయసులోనే కోట్టు గడించారు. ఆయన మైక్రోస్ట్రాటజీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలోనే కంపెనీ విలువ రూ.300 కోట్లకు చేరుకుంది. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు అతడి బిజినెస్ ఢమాల్ అని పడిపోయింది.మళ్లీ తిరిగా కోలుకోలేనంత నష్టాలు, అప్పులు చవిచూశాడు. చెప్పాలంటే అనుపమ్‌కి అది అత్యంత గడ్డుకాలం. క్షణమో యుగంలో భారంగా గడుస్తున్న సమయం. అయితే ఆ సమయంలో అతడిని మళ్లీ బిజినెస్‌లో తిరిగి నిలదొక్కుకునేలా చేసింది యోగా, ఆధ్యాత్మికత సాధన అని చెప్పారు. తాను ఆ సమయంలో ఓటమి అంగీకరించడానికి సిద్ధంగా లేని స్థితిలో ఉన్ననని చెప్పారు. ఒక్కసారిగా తన కలంతా చెదరిపోయిన బాధ ఒక్క క్షణం నిలువనియడం లేదు. అయినా ఏదో తెలియని ధైర్యం ఏం చేసి దీన్ని మార్చేయాలి అనే ఆలోచనలే బుర్ర నిండా అంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో తాను శారీరకంగా, మానసికంగా చాలా క్రుంగిపోయానని అన్నారు. అప్పుడే తాను ధ్యానం, ఆధ్యాత్మికత వైపుకి మళ్లానని, అవే తనను మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలో నిలదొక్కుకునేలా చేశాయి. మళ్లీ ఇదివరకిటిలా విజయాలను అందుకునే స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. అంతేగాదు అలాంటి క్లిష్టమైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండటమే అతిపెద్ద ఐశ్వర్యం అన్నారు. అది తనకు యోగా, ఆధ్యాత్మికత వల్లే సాధ్యమై తిరిగి పుంజుకోగలిగానని చెప్పుకొచ్చారు అనుపమ్. ఒక థెరపిస్ట్ సాయంతో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తాను ఆ సమయంలో విజయాన్ని అందుకోలేనేమో అన్నంత ఉద్విగ్న స్థితలో ఉన్నాట్టు చెప్పారు. తనకి వైఫల్యం అంటేనే వెన్నులో వణుకు వచ్చేంత భయం కలిగిందని నాటి పరిస్థితిని వివరించారు. ఇక్కడ ఆధ్యాత్మికత మన గందరగోళ పరిస్థితిని చక్కబెట్టలేదు గానీ, అది మనం ప్రతిస్పందించే విధానంలో మార్పు తీసుకొస్తుంది. గెలుపే జీవితం అనే ఒత్తిడి నుంచి బయపటడి ఎలా తనను తాను శాంతపరుచుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించానని అన్నారు.ఆ సమయంలో మనకు మద్దతుగా కుటుంబ సభ్యలు, అర్థం చేసుకుని జీవిత స్వామి దొరకడం తన అదృష్టం అన్నారు. వాళ్లు గనుక మనకి తోడుగా నిలబడితే ఎంతటి కఠినమైన కష్టమైన సునాయాసంగా ఛేజించి విజయాలను అందుకోగలుగుతామని పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుపమ్. ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మీరు గొప్ప పెట్టుబడుదారు, ఎల్లప్పడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ప్రపంచాన్ని చుట్టిరానున్న ఇద్దరు నేవీ ఆఫీసర్లు..!) -
ధ్యానం.. ఆవాహనం
ఒత్తిడి సహా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే జ్ఞానం ఉన్నా ధ్యానమార్గం వైపు ప్రయాణించే తీరిక, సమయం లేక ఇబ్బంది పడుతున్నవారి సమక్షానికి ధ్యానమే తరలివస్తోంది. నగరంలోని ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, కళాశాల ప్రాంగణాల్లో ఉచితంగా ధ్యానాభిరుచిని పరిచయం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్‌కు శ్రీకారం చుట్టింది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ.. విహారం నుంచి ఆహారం దాకా కాదేదీ ఆ‘వాహనానికి’ అనర్హం అన్నట్టు సిటీలో ‘వీల్స్’ వీరవిహారం చేస్తున్నాయి. అదే క్రమంలో నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని నెలలుగా 3వేల మందికి పైగా తమ ధ్యాన చక్రాలు పలకరించాయని అంటున్నారు ఆధ్యాత్మిక వేదిక ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు. ధ్యాన మార్గం వైపు మళ్లించేందుకు..నగరంలో చదువుతో మొదలుపెడితే... ఉద్యోగాలు, వ్యాపకాల వంటివన్నీ ఒత్తిడి కారకాలుగా మారుతున్నాయి. ఈ ఒత్తిడి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. దీనికి అత్యుత్తమ పరిష్కారం ధ్యానం.. అయితే సమయాభావం కావచ్చు, తగినంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు... చాలా మంది ఈ పరిష్కారాన్ని అందుకోలేకపోతున్నారు. వారి కోసమే ఈ మెడిటేషన్ ఆన్ వీల్స్‌ను డిజైన్ చేశామని వీరు చెబుతున్నారు. ఆధ్యాత్మిక తోవ... ఈ వాహనంతో పాటు బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులు కొందరు ప్రయాణిస్తుంటారు. నగరవాసుల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న ప్రాంతానికే వెళ్లి వాహనం ద్వారా ధ్యానం చేసే అవకాశాన్ని కలి్పస్తారు. దీనికి ఎటువంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఆ వాహనానికి అవసరమైన పార్కింగ్ సమకూరిస్తే చాలు. కనీసం 2 గంటల నుంచి అత్యధికంగా 4 గంటల దాకా సేవలు అందిస్తారు. వాహనంలో ఒక్కో బ్యాచ్‌కు 10 మంది వరకూ హాజరు కావచ్చు. ధ్యానం అనంతరం వారి అనుభూతిని తెలుసుకుని, ఆసక్తి, అవసరాన్ని బట్టి వారికి ఆ తర్వాత ఉచిత ధ్యాన తరగతుల్లో పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తారు. ఐటీ కంపెనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ దాకా.. నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏ విద్యా సంస్థ అయినా, ఐటీ కంపెనీ అయినా, గేటెడ్ కమ్యూనిటీ అయినా కార్పొరేట్ సంస్థలైనా...ఏవైనా సరే ఈ ధ్యాన వాహన సేవలు కావాలంటే బ్రహ్మకుమారీస్ను సంప్రదించవచ్చు. అవసరమైతే మరికొన్ని అదనపు రోజులు కూడా వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు. కులమతాలకు అతీత సేవ... మెడిటేషన్ ఆన్ వీల్స్ అనేది దేశంలోనే తొలిసారి. ఈ వాహనం ద్వారా కులమతాలకు అతీతమైన «ఉచిత ద్యాన సేవ అందించనున్నాం. ఇప్పటికే గత 8నెలలుగా మూడు నుంచి నాలుగువేల మందికి మా వాహన సేవలు అందాయి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించాలని యోచిస్తున్నాం. –శివాణి, బ్రహ్మకుమారీస్ -
ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు..
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు.. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ, అధికబరువును నియంత్రించేలా చేస్తుంది బద్ధకోణాసనం. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు ఉంటాయి. కాబట్టి బటర్‌ఫ్లై ఆసనంగా కూడా దీనికి పేరు. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.కంప్యూటర్‌తో పని చేసేవాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైన సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.20 నుంచి 30 సార్లు..ముందుగా నేల మీద సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి, చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకొని, శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ ఐదుసార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. తర్వాత కళ్లు తెరిచి, కాళ్లను మెల్లగా పైకి, కిందకు 20 నుంచి 30 సార్లు కదుపుతూ ఉండాలి.రోజూ ఉదయం ఇలా చేస్తుంటే వెన్నెముక దృఢంగా అవుతుంది. లోయర్ హిప్స్, బ్యాక్ కండరాల బలం పెరుగుతుంది. ΄÷ట్ట కండరాలలోనూ మార్పులు వస్తాయి. ఒత్తిడి తగ్గి మైండ్, బాడీ విశ్రాంతి పొందుతాయి. కాళ్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. రక్తసరఫరా మెరుగై వెన్ను, మెడ, తలనొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
-
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం విరమించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఆయన దాదాపు 45 గంటలపాటు ధ్యానంలో నిమగ్నమయ్యారు. రెండు రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకున్నారు. ధ్యానం ముగిసిన తర్వాత మోదీ రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి సమీపంలోని తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. తిరవళ్లువర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం తీరానికి చేరుకున్న మోదీ హెలికాప్టర్లో తిరువనంతపురం బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మరోసారి ఎన్డీఏకే పట్టం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశవాద ‘ఇండియా’ కూటమిని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. విపక్ష కూటమి తిరోగమన రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ప్రజలు చూశారని, తమకు మళ్లీ అధికారం అప్పగించబోతున్నారని వెల్లడించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల క్రియాశీల భాగస్వామ్యమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు తోడ్పడిన భద్రతా దళాలకు సైతం ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రధాని మోదీ ధ్యానంపై కన్యాకుమారి జనం ఏమంటున్నారు?
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు చేరుకున్నారు. అక్కడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తున్నారు. ఈ మెమోరియల్ నిర్మాణంలో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఏక్నాథ్ రనడే పాత్ర ఎంతో ఉంది.వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని మోదీ ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేసిన తరువాత ధ్యానంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి, సన్యాసిలా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు.2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని కేదార్‌నాథ్‌లో ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌కి వచ్చారు. కాగా స్థానికులు ఇప్పుడు స్వామి వివేకానందతో నరేంద్ర మోదీని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని పేరు.. వివేకానందుని చిన్ననాటి పేరు కూడా నరేంద్ర కావడం విశేషం అని ఇక్కడివారు అంటున్నారు. అందుకే నాటి వివేకానందునిలా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కన్యాకుమారివాసులు చెబుతున్నారు. మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని స్థానిక మహిళలు అంటున్నారు.కన్యాకుమారిలోని వివేకానంద ఆశ్రమం మీడియా సెల్ కోఆర్డినేటర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాయింట్ డైరెక్టర్ ఏక్నాథ్ రనడే సమాధి ఉందన్నారు. నాటి రోజుల్లో అనేక నిరసనలను ఎదుర్కొంటూ, దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ప్రజల నుండి రూపాయి నుండి ఐదు రూపాయల వరకు విరాళాలు తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారన్నారు. వివేకానంద ఆశ్రమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అయితే భారతదేశ తత్వాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
మోదీ ధ్యాన ముద్ర
సాక్షి, చెన్నై: కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీ శుక్రవారం సూర్యోదయ వేళ సూర్యునికి ఆర్ఘ్యం సమరి్పంచారు. కాషాయ వ్రస్తాలను ధరించిన ప్రధాని మోదీ జపమాల చేబూని, కమండలంలోని జలాన్ని సముద్రంలోకి వదులుతూ ప్రార్థన చేశారు. అనంతరం సర్వశక్తిమంతుడైన ఆ సూర్యభగవానునికి ముకుళిత హస్తాలతో నమస్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, సంక్షిప్త వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ధ్యాన మంటపంలో ప్రధాని ధ్యానంలో ఉన్న ఫొటోలను, జపమాలతో ధ్యాన మంటపం చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తున్న ఫొటోలను కూడా బీజేపీ విడుదల చేసింది. మే 30వ తేదీ సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం జూన్ ఒకటో తేదీ సాయంత్రంతో ముగియాల్సి ఉంది. అయితే, ప్రధాని మోదీ పర్యటన కారణంగా వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద పర్యాటకులు ఇబ్బందులు పడ్డారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ ఆరోపించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రజలతోపాటు ఓడలు, విమానాలను కూడా అనుమతించలేదని చెప్పారు. ‘ఎన్ని భంగిమలు! ఎంతమంది ఫొటోగ్రాఫర్లు! స్వామి వివేకానంద మౌనంగా ఉన్నారు’అంటూ తమిళనాడు కాంగ్రెస్ ప్రధాని మోదీ ధ్యానంపై వ్యాఖ్యానించింది. -
కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ.. 45 గంటలు ధ్యానంలోనే..
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్‌లో 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు మోదీ. ధోతీ తెల్లటి శాలువ ధరించిన ప్రధాని.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, మోదీకి పూజారులు ప్రత్యేక హారతి అందించారు. అలాగే ఓ శాలువ, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని ప్రధానికి అందించారు.నేటి సాయంత్రంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముసిగింది. ర్యాలీలు పర్యటనలు, బహిరంగ సభలతో బిజీ బిజీగా గడిపిన ప్రధాని మోదీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో మునిగిపోనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. కాగా ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడం ఇదేం తొలిసారి కాదు. 2019లో కేదార్‌నాథ్‌ను, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.ప్రత్యేకత ఇదే..అయితే ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892 లో స్వామి వివేకానంద.. ఈ వివేకానంద రాక్ మెమొరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌ను నిర్మించారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనుండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 వ తేదీ వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. ఈ క్రమంలోనే భారత తీర రక్షక దళం, భారత నావికాదళం గట్టి నిఘా ఉంచాలని కోరింది.ఇదిలా ఉండగా ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా.. జూన్ ఒకటిన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ భావిస్తోంది. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రచారం ముగిశాక కన్యాకుమారికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. జూన్ 1న జరగనున్న ఏడవ, తుది విడత ఎన్నికల ప్రచారానికి మే 30వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుంది.ప్రచారం ముగించుకుని 30న ప్రధాని కన్యాకుమారి చేరుకుంటారు. జూన్ 1 వరకు 3 రోజుల పాటు ఆయన కన్యాకుమారిలోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానంద ఒకప్పుడు మూడు రోజులపాటు ధ్యానం చేశారు.ఈ పర్యటనలో ప్రధాని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనరు. 2019లోనూప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదార్‌నాథ్‌కు ధ్యానం చేసేందుకు వెళ్లారు. -
Swarved: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..? ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు 'స్వర్వేద్ మహామందిర్'. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ మందిర్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. ఇది ఏడు అంతస్తుల నిలయం. దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్‌తో అత్యంత అద్దంగా తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలది. దీన్ని వారణాసి సిటీ సెంటర్‌కి దాదాపు 12 కి.మీ దూరంలో ఉమరహా ప్రాంతంలో నిర్మించారు. ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు. ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై శిల్ప కళా నైపుణ్యం తెలియజేశాలా పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్లు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు కృషి ఫలితం. విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేదానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్సైట్ తెలిపింది. ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళిని ప్రకాశవంతం చేయడమే గాక ఈ ప్రంపంచాన్ని సదా శాంతియుతంగా ఉండేలా అప్రమత్తం చేస్తుందని ఆలయ వెబ్సైట్ పేర్కొంది. (చదవండి: ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!) -
Narendra Modi: బానిస మనస్తత్వం నుంచి విముక్తి
వారణాసి: బానిస మనస్తత్వం నుంచి భారత్ విముక్తిని ప్రకటించుకుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బానిసత్వంలో మగ్గుతున్న సమయంలో కుట్రదారులు మన దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయతి్నంచారని, మన సాంస్కృతిక చిహా్నలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ చిహా్నలను పునర్నిర్మించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాని మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారని చెప్పారు. ఇలాంటి ఆలోచనా విధానం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిందన్నారు. దీనివల్ల దేశం ఆత్మన్యూనత భావంలోకి జారిపోయిందని, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం పట్ల గరి్వంచడం కూడా మర్చిపోయిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాల తర్వాత కాలచక్రం మరోసారి తిరగబడిందని, బానిస మనస్తత్వం నుంచి విముక్తిని ఎర్రకోటపై నుంచి భారత్ ప్రకటించుకుందని స్పష్టం చేశారు. సోమనాథ్ నుంచి ప్రారంభించిన కార్యాచరణ ఇప్పుడొక ఉద్యమంగా మారిందని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్, మహాకాళ్ మహాలోక్ క్షేత్రాల అభివృద్ధే అందుకు నిదర్శనమని వివరించారు. బుద్ధా సర్క్యూట్‌ను గొప్పగా అభివృద్ధి చేశామని, బుద్ధుడు ధ్యానం చేసుకున్న క్షేత్రాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్శిస్తున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామ్ సర్క్యూట్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొన్ని వారాల్లో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ‘వికసిత్’లో పాల్గొనండి... మౌలిక సదుపాయాల లేమి మన ఆధ్యాతి్మక యాత్రకు పెద్ద అవరోధంగా మారుతోందని, ఆ పరిస్థితిని మార్చేస్తున్నామని మోదీ వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆధ్యాతి్మక గురువులు, మత పెద్దలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడంతస్తుల స్వర్వేద్ మహామందిర్ కేంద్రంలో ఏకకాలంలో 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. స్వరవేద శ్లోకాలను ఇక్కడి గోడలపై అందంగా చెక్కారు. నాలుగు కులాల సాధికారతే లక్ష్యం యువత, పేదలు, రైతులు, మహిళలనే నాలుగు కులాలు సంపూర్ణ సాధికారత సాధించాలన్నదే తన లక్ష్యమని మోదీ అన్నారు. సోమవారం వారణాసిలో ఆయన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రూ.19,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశ ప్రజలకు మోదీ 9 వినతులు 1. ప్రతి నీటి బొట్టును ఆదా చేయండి. జల సంరక్షణ విషయంలో ప్రజలను చైతన్యవంతులుగా మార్చండి 2. గ్రామాలకు వెళ్లండి. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచండి. 3. పరిశుభ్రతలో మీ ప్రాంతాన్ని నంబర్ వన్‌గా మార్చడానికి కృషి చేయండి. 4. స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించండి. 5. ఎంత ఎక్కువ వీలైతే అంతగా సొంత ఊరును సందర్శించండి. దేశమంతటా తిరగండి. మన దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోండి. 6. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రైతులను ప్రోత్సహించండి. 7. నిత్యం తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలను ఒక భాగంగా మార్చుకోండి. 8. జీవితంలో ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. 9. కనీసం ఒక పేద కుటుంబానికి అండగా నిలవండి. -
అతి పెద్ద ధ్యాన మందిరం ప్రారంభించిన ప్రధాని
వారణాసి:దేశంలోనే అతిపెద్ద ధాన్య మందిరం స్వర్వేద్ మహా ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో ప్రారంభించారు. ఈ మెడిటేషన్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఖ్యాతికెక్కింది. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఏడు అంతస్తుల్లో స్వర్వేద్ మహా ధాన్య మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని చెప్పారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమ వారాల్లో వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. #WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1 — ANI (@ANI) December 18, 2023 ఇదీచదవండి..‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
Vipassana Meditation: విపశ్యన ధ్యానానికి ఢిల్లీ సీఎం
ఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి పది రోజుల పాటు ధ్యానానికి వెళ్లనున్నారు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్న సెంటర్‌కు వెళ్లనున్నారనేది మాత్రం బయటకు వెళ్లడించలేదు. విపశ్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కోర్సు పూర్తయ్యే వరకు(పది రోజుల పాటు) మాట్లాడటం ద్వారా లేదా సంజ్ఞల ద్వారా సంభాషణకు దూరంగా ఉంటారు. అభ్యాసకులు ధ్యాన కేంద్రం నుంచి బయటకు రావడం నిషిద్ధం. బయటి వ్యక్తులు కేంద్రంలోకి వెళ్లడం కూడా ఉండదు. కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన సాధన చేస్తున్నారు. ఈ పురాతన ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగళూరు, జైపూర్‌తో సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు ధ్యానంలో ఉంటారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
మెగా మెడిటేషన్ సమ్మిట్ 2023
-
రజినీకాంత్, నయన్ బాటలో యంగ్ హీరోయిన్.. అదేంటో తెలుసా?
ఆస్తికం, నాస్తికం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. ఆస్తికులు భక్తి బాట పడితే.. నాస్తికులు సైన్సును నమ్ముతారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ప్రముఖ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే.. ఆయన స్నేహితుడు, విశ్వనటుడు కమలహాసన్ నాస్తికతకు ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా నటి నయనతార పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా గుళ్లు, గోపురాలు తిరిగొచ్చారు. (ఇది చదవండి: బుల్లితెరపై యాంకర్‌గా సన్నీలియోన్.. ఎవరికి చెక్ పెడుతుందో) తాజాగా మరో యువ నటి ఆత్మిక సైతం నయనతార, రజినీకాంత్ తరహాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. హిప్ హాప్ తమిళా ఆదికి జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కోడియిల్ ఒరువన్, కాట్టేరి, కన్నై నంబాదే, తిరువిన్ కాదల్ చిత్రాల్లో నటించారు. కాగా ఈమె ప్రస్తుతం భక్తి బా ట పట్టడం విశేషం. ఆద్మిక ప్రస్తుతం రజినీకాంత్ తరహాలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబాజీ గుహలో ధ్యానం చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. దీని గురించి ఆత్మిక స్పందిస్తూ తన ఆధ్యాత్మిక పయనం అన్నది ఆత్మ ఆదేశం అని పేర్కొన్నారు. బాబాజీ గుహకు వెళ్లాలని దైవమే పిలుపు వచ్చిందన్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరినట్లు చెప్పారు. అయితే ఇది తనకు మరణ అనుభవాన్ని చవిచూసే అనుభవమని పేర్కొన్నారు. అయితే కొన్ని మంచి పరిణామాలు సులభంగా కలిగాయని చెప్పారు. బాబాజీ గుహలో ధ్యానం కోసంకూర్చున్నప్పుడు కలిగిన దైవిక అనుభూతిని జీవితాంతం మరిచిపోలేనన్నారు. ఆ తర్వాత జీవితంపై తన దృష్టి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ లోకంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందాలని ఆత్మిక పేర్కొన్నారు. (ఇది చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) -
‘ఇండియా మెడిటేట్స్’ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్
బెంగుళూరు\హైదరాబాద్: ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘హర్ ఘర్ ధ్యాన్’ కార్యక్రమానికి తోడుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ నెల 24 నుండి 31 వరకూ ‘ఇండియా మెడిటేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విభిన్న నేపథ్యాలకు చెందిన అన్ని వయస్సుల వ్యక్తులకూ ధ్యానాన్ని పరిచయం చేసి వారిలో స్వీయ అవగాహన తీసుకురావటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంపూర్ణ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15న) ముగుస్తుంది. దేశపు సర్వతోముఖ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచిపోనుంది. ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజూ ఎనిమిది సార్లు (ఉదయం 6గం, 7గం, 8గం. లకు, మధ్యాహ్నం 2గం, 3గం, 4గం. లకు, మరలా సాయంత్రం 7గం, 8గం. లకు)ఆన్లైన్ ద్వారా ఉచితంగా ధ్యాన శిక్షణను అందిస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఆన్లైన్ సెషన్లను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి నిపుణులైన శిక్షకులు నిర్వహిస్తారు ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో పాల్గొనటం కోసం ఔత్సాహికులు indiameditates.org వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. అనంతరం వారికి వాట్సప్ గ్రూపు ద్వారా ప్రత్యక్ష ప్రసారపు లింకు అందించబడుతుంది. అంతేకాక ఈ విధానంలో ధ్యానం నేర్చుకున్న వారంతా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ను కూడా అందుకుంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 2 లక్షలమందికి పైగా భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా భారతసాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ధ్యానానికి గల సుగుణాలను, మన జీవితాలలో ధ్యానం కలిగించే పరివర్తనను గురించి భారతీయులందరికీ తెలియజేయడమే దీని లక్ష్యం.అక్టోబరు 26, 2022న బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అప్పటి నుండి హర్ ఘర్ ధ్యాన్ దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును పొందింది. ఇటీవలి కాలంలోనే లక్షలాదిమంది ఔత్సాహికులు అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుదేవ్ రవిశంకర్ మాట్లాడుతూ “ధ్యానం మీ దృక్కోణాన్ని మార్చడానికి సహాయపడుతుంది. ఇది మీరు విషయాలను గ్రహించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుస్తుంది. మీరు మాట్లాడే విధానం, వివిధ పరిస్థితులలో మీ స్పందనలు, మీరు వ్యవహరించే తీరు. వీటి పట్ల మీరు మరింత ఎరుకతో వ్యవహరిస్తారు’’ అని పేర్కొన్నారు. ధ్యానం రోగనిరోధక శక్తిని పెంచుతుందని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించి, వారి మనస్సును అదుపులో ఉంచి శారీరక మానసిక సామర్థ్యాన్నిపెంచుకోవడానికి తోడ్పడుతుందని నిరూపించబడింది. ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా పోలీసు శాఖ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ధ్యానశిక్షణను ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా సూచన మేరకు తెలంగాణాలోని 13 బెటాలియన్లలో సిబ్బందికి ధ్యానశిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఇప్పటికే 1000మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ బ్యాంకు బ్రాంచీలలోని ఉద్యోగులందరికీ ఈ శిక్షణను అందిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు, కళాశాలలు, విద్యాలయాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యాన శిక్షణను పొందారు. -
ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!
Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆత్మీయుల మరణం.. ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హెడ్‌స్పేస్ మెడిటేషన్ యాప్.. ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో 'హెడ్‌స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్‌స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) వేల కోట్ల సామ్రాజ్యం.. ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది. -
అలా ఉండడం దాదాపు అసాధ్యం: సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పిన సామ్.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ, వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) అయితే అంతకుముందే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు సామ్. ఇటీవలే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఖుషీ భామ. అయితే వైద్యం కోసం విదేశాలకు వెళ్లేముందు మనోధైర్యం కోసమే ఆలయాలకు వెళ్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత మరోసారి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ప్రముఖ యోగా గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక యెగా కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన యోగా శిబిరంలో సామ్ ఓ సామాన్య భక్తురాలిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇటీవలే ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకున్న భామ త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు బయలుదేరనుంది. (ఇది చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రోజంతా కేజ్రీవాల్ ధ్యానం
న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. -
స్థిరచిత్తం అంటే అదే!
అది గంగానదీ తీరం. లోతు తక్కువ ప్రదేశం. నది మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నదీ తీరంలో గట్టు వెంట గొర్రెల మంద మేస్తోంది. ఆ మందను చూసింది ఒక తోడేలు. మందలో చివరిలో మందకు కొద్దిదూరంలో ఒంటరిగా మేస్తోంది ఒక పొట్టేలు. తోడేలు చూపు దాని మీద పడింది. ‘ఈ బలిసిన పొట్టేలు అయితే రెండు రోజులకు సరిపోతుంది’ అనుకుంది. మాటు కాచి, పొంచి పొంచి దాని దగ్గరకు వచ్చింది. ఎండుటాకుల ధ్వనిని బట్టి ఏదో తనవైపు వస్తున్నట్లు గుర్తించింది పొట్టేలు. తల పైకెత్తి చూసింది. తన మీదికి దూకి వస్తున్న తోడేలు కనిపించేసరికి నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీదికి పరుగుతీసింది. అలా రెండు మూడు తిన్నెలు దాటి తీరాన్నుండి దూరంగా పోయాయి రెండూ. అంతలో వరదనీరు ఉరకలేస్తూ ఉరవడిగా వచ్చిపడుతోంది. పొట్టేలు ప్రాణ భయంతో ఇసుక దిబ్బ మీదినుండి నది నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలు మాత్రం దిబ్బమీదే నిలబడిపోయి, పొట్టేలు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వరద నీరు హెచ్చింది. మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు మునిగిపోసాగాయి. తోడేలు పొట్టేలు మీదినుంచి చూపు తిప్పుకునేసరికే అది నిలబడ్డ దిబ్బ చాలా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఆ దిబ్బమీది కొద్ది ఎత్తైన ప్రదేశం మాత్రమే మిగిలింది. తోడేలు ఆ ఎత్తు ప్రదేశానికి చేరింది. ఆ వరద అలా రెండురోజులు ఉంది. వేటాడటం అటుంచి, కనీసం ఒడ్డుకు చేరే మార్గం కనిపించలేదు. అది తనలో తనే ‘ఈ ప్రమాదాన్నుండి బయట పడతానో లేదో, ఇప్పటిదాకా ఎంతో హింస చేశాను. ఎన్నో జీవుల్ని చంపాను. ఆ కర్మ ఫలం నాకు మంచిని చేకూర్చదు. కాబట్టి బతికినన్ని రోజులు ఇక అహింసను, మైత్రిని, మంచితనాన్ని పాటించాలి’ అనుకుంది. ఆ దిబ్బమీదికి చేరి, కూర్చొని ధ్యానం చేయసాగింది. కొంత సమయం గడిచింది. ఎక్కడో సన్నగా మేక అరుపు దాని చెవులబడింది. తపస్సు భగ్నం అయ్యింది. మెల్లగా కళ్లు తెరిచింది. అటూ ఇటూ చూసింది. వరద కొద్దిగా తగ్గింది. తాను ఉన్న ఇసుక దిబ్బ ఇంకొద్దిగా బైట పడింది. దాని మీదకు చేరి అరుస్తూ ఉన్న మేకపిల్ల కనిపించింది. తోడేలు మెల్లగా లేచి మేక పిల్లకేసి వంగి వంగి నడవసాగింది. దాదాపు దగ్గరగా పోయి ఒక్క ఉదుటున దూకింది. కానీ.. గురి తప్పి నీటిలో పడడంతో శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని అటు చూసిన మేకపిల్లప్రాణభయంతో నది నీటిలోకి ఎగిరి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలుకు మరలా నిరాశ.‘లేదు. మరలా నేను నా మనస్సును కుదుట పరచుకోవాలి. హింసను విడనాడాలి. అహింసతో జీవించాలి. తపస్సు చేసి, చేసినపాప ఫలాన్ని రూపు మాపుకోవాలి’ అనుకుంది. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు శాంతంతో, అహింసతో, జీవ కారుణ్యాన్నీ, ధర్మాన్నీ ఆచరించడం కాదు. కోపం రావడానికి కారణాలు ఉన్నప్పుడూ, హింస చేసే అవకాశం వచ్చినప్పుడూ తప్పు చేసే పరిస్థితులు కలిగినప్పుడు అవి చేయకుండా ఉండటమే గొప్పతనం. అలా ఉంచగలిగిందే ధ్యానం. అలా మన చిత్తాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా మార్గం మనస్సును అలా దృఢంగా మలుస్తుంది’’అని చెప్పాడు. స్థిర చిత్తం అంటే అదే మరి! – డా. బొర్రా గోవర్ధన్ -
మీలోని శక్తి ఎంత?!
నలుగురితో కలిసి ఉన్నప్పుడు మనలోని బలం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొనే సమయంలో మానసికంగా మనంఎంతటి శక్తివంతులమో మనకే అర్ధమవుతుంది. ఈ సమయంలో భావోద్వేగాలలో మార్పులు తీవ్రంగా ఉంటే జీవన విధానంపై అవి చెడు ప్రభావం చూపుతాయి. ‘ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలివిడిగా ఉన్నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం శక్తిమంతులుగాఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటేవచ్చే సమస్యల అలలను సులువుగా ఎదుర్కోవచ్చు’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ‘సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ అనేది సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మందిలో గమనిస్తున్న విషయమేంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. నేను చెప్పిందే వినాలి’ అనే ధోరణి పెరగడం కూడా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది’ అంటున్నారు లైఫ్‌స్కిల్ ట్రెయినర్ జ్యోతిరాజ. ఎరుక అవసరం కొందరు తమచుట్టూ ఎవరికీ కనపడని ఒక వలయాన్ని సృష్టించుకుంటారు. పరిమితులను నిర్దేశించుకుని వాటిని దాటి బయటకు రారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా సృష్టించుకున్న వలయం ఎక్కడ ఛిన్నాభిన్నం అవుతుందో అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఫలితంగా భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులను నిందించడం, తమను తామే శిక్షించుకోవడం లేదా గాసిప్స్‌ని ఆశ్రయిస్తారు. ‘భావోద్వేగాల అదుపు కోల్పోతే ఏ బంధంలోనైనా బీటలు వస్తాయి. అందుకని వలయాలతో కాకుండా ఎరుకతో మెలిగితే మనలోని అంతర్గత శక్తి స్థాయిలు స్పష్టమవుతాయి’ అనేది నిపుణుల మాట. మౌనంగా ఉండటం మేలు అతిగా మాట్లాడటం, చేతల్లో మన పనిని చూపించకపోతే ఎదుటివారి ముందు మన శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భావోద్వేగాల్లోనూ మార్పు వస్తుంది. ఇది బంధుమిత్రుల మధ్య పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, పని ప్రదేశాలలో ఈ ‘శక్తి’ని బాగా గుర్తించవచ్చు. ఇబ్బందిని కలిగించే సంభాషణల్లో పా ల్గొనడం కన్నా, తక్కువ మాట్లాడం వల్ల శక్తిని, భావోద్వేగాల సమతుల్యతను కాపా డుకోవచ్చు. ఆ శక్తిని ఇతర సృజనాత్మక పనులకు బదిలిచేయవచ్చు. అవగాహనతో సరైన శక్తి అంతర్గత దిక్సూచిని భావోద్వేగ మేధస్సు అని కూడా అంటారు. ఇది సున్నితం–తీవ్రం రెండింటినీ సమాన స్థాయిలో ఉంచుతుంది. అంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా దూకుడుగా ప్రవర్తించబోతున్నాడో ముందే పసిగట్టి, నివారించే శక్తి వీరికుంటుంది. సరైన సమయంలో ఎలా స్పందించాలో తెలిస్తే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగల అంతర్గత శక్తి పెరుగుతుంది. పట్టు విడుపులు తెలుసుండాలి... ఏ అంశం వదిలేయాలి, దేనిని మన ఆధీనంలో ఉంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. అనవసరం అనిపించే సమస్య ఏదైనా వదిలేయడం కూడా తెలియాలి. పిల్లలైతే వారు చదువుల్లో ఆటపా టల్లో బిజీగా ఉంటారు. కాలేజీ స్థాయి యువతలో బిజీగా ఉంటారు. గృహిణుల్లో మాత్రం పిల్లలు పెద్దయ్యాక వారికి కొంత తీరిక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందునుంచే తమను తాము మలుచుకుంటూ ఉండాలి. తమలో ఉండే ఇష్టాయిష్టాలు, కలల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే సంతృప్తి వల్ల భావోద్వేగాల అదుపు, అంతర్గత శక్తి స్ఙాయిలు పెరుగుతాయి. ఈ ప్రా క్టీస్ ఇంట్లో పిల్లల చేత కూడా చేయిస్తే, వారిలోనూ కొత్త సమర్థతలు బయటకు వస్తాయి. భావోద్వేగాల అదుపుకు అంతర్గతశక్తిని మేల్కొల్పడమే సరైన ఆయుధం. – ఆచార్య జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రెయినర్ తట్టుకునే శక్తిని పెంచుకోవాలి.. సాధారణఃగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కంగారు పడిపోతాం. భయం ఆవరించేస్తుంది. ఈ ఒత్తిడి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. బ్యాక్‌పెయిన్, నెక్ పెయిన్, స్ట్రెస్.. వంటివి సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా ఆరోగ్యం, మానసిక స్థిరత్వానికి యోగ సాధన చేయడం ఒక భాగం చేసుకున్నాను. దీనితో పా టు ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన లేకుండా సమస్యలను తట్టుకుని, ముందడుగు వేసే శక్తినిచ్చే ఆయుధాలుగా వీటిని మలుచుకున్నాను. – కవిత ఎన్, సాఫ్ట్వేర్ ఉద్యోగిని -
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్ఫుల్నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు. మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్ఫుల్నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు. -
కాన్హా ధ్యాన కేంద్రం తెలంగాణకు గర్వకారణం
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్దదైన కాన్హా శాంతివనం ధ్యాన కేంద్రానిట్న తెలంగాణలో ఏర్పాటు చేయడం చాలా గొప్పవిషయమని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన రైజింగ్ విత్ ౖMðండ్‌నెస్ (యువజన సదస్సు) కార్యక్రమాన్ని కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఈ ప్రదేశాన్ని మార్చి వేసి.. పచ్చని చెట్లు పెంచి, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3ఐలకు.. అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి అభివృద్ధికి బాటలు వేసిందని, దీంతో యువత ఆలోచన, భావజాలంలో ఎంతో మార్పువచ్చిందని వివరించారు. ఈ ఆలోచనా విధానంతోనే రాష్ట్ర ప్రభుత్వం 240 కోట్లకు పైగా మొక్కలు నాటిందని చెప్పారు. కాగా, కేవలం ఐదు సంవత్సరాలలో లక్షలాది మొక్కలు నాటి బంజరు భూమిని పచ్చగా మార్చడంతో కాన్హా శాంతివనం ఎంతో గొప్పగా రూపుదిద్దుకుందని కొనియాడారు. యువతకు కరుణ, దయా, విలువల గురించి అవగాహనను కల్పించడానికి విద్యాసంస్థల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం గురూజీ దాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో స్వాభావికమైన దయ గుణం ఉంటుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో యూఏఈ, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 12 వేల మంది పాలుపంచుకుంటున్నారు. గురూజీ కమ్లేష్ పటేల్, యునెస్కో డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఖతీజా రెహ్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దురలవాట్లకు బానిసలుగా చేసే యాంగ్జైటీ.. తేలికగా అధిగమించండిలా..!
యాంగ్జైటీ అందరిలోనూ ఉంటుంది. ఆఫీస్‌లో అధికారులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేమేమో అని, చేపట్టిన ఫలానా పని విజయవంతమవుతుందో లేదో అని, ఏదైనా కొత్త ప్రదేశంలో నెగ్గుకువస్తామా అని... ఇలా ప్రతి విషయంలోనూ అందరిలోనూ ఈ యాంగై్జటీ కలుగుతుంది. అయితే అందరిలోనూ కలిగే ఈ భావోద్వేగాలనూ, ఉద్విగ్నతలను కొంతమంది తేలిగ్గా అదుపు చేసుకుంటారుగానీ... మరికొందరు అంత తేలిగ్గా అధిగమించలేరు. దాంతో యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక కొందరు ఆ స్థితిని అధిగమించడం కోసం తొలుత సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మరొక దురలవాటైన మద్యం. ఇంకొందరు ఎప్పుడూ పొగాకు నములుతూ ఉండే జర్దా, ఖైనీ, పాన్‌మసాలా వంటివాటికి అలవాటు పడి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లకు గురవుతుంటారు. కొందరు పాత అలవాట్లు వదులుకునేందుకు కొత్త అలవాట్ల బాట పడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. ఇది డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. అలా పొగాకు నమలడం, పొగతాగడం, మద్యంతో పాటు మరికొద్దిమందిలో మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు బానిసలై తమ కాలేయాలూ, మూత్రపిండాలను పాడుచేసుకుంటారు. యాంగ్జైటీని అధిగమించలేకపోగా... చివరకు లివరూ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆరోగ్యమంతా పాడైపోతుంది. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారు, దాన్ని అధిగమించడానికి అన్నిటికంటే మంచిదీ, తేలికైన మార్గం పుస్తకాలతో పరిచయం. పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల... అనేక పరిస్థితులతో మానసికంగా పరిచయం కావడం వల్ల తాము ఎదుర్కొన్న పరిస్థితి పెద్దగా కొత్తగా అనిపించదు. దాంతో యాంగై్జటీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ. అదేగాక... యోగా, ధాన్యం, మంచి మంచి హాబీల వంటి తేలిక మార్గాలతోనూ అధిగమించవచ్చు. -
International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం
ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఒకటుంది. దానిని తెలుసుకుని, ఆ శక్తిని చేరుకోవడానికి మార్గమే ధ్యానం. ఆ ధ్యానం యోగంలో భాగం. ధ్యానం అంటే మనసులోకి చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానయోగులే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనసు. ఆ మనసు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. అసలు మనం ఏ పని చేయాలన్నా మనస్సు సహకరించనిదే ముందుకు పోలేం. మనస్సును అదుపు చేయడానికి, జయించడానికి ముఖ్య సాధనం ధ్యానం. నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారాన్ని బట్టే మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు రూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో మనసు తేజోమయమవుతుంది. – డి.వి.ఆర్. మౌనంగా ధ్యానం చెయ్యి. ఈ బాహ్య ప్రపంచపు విషయాలేవీ నీకు అంతరాయం కలిగించకుండా చూసుకో. నీ మనస్సు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి నీకు చింత ఉండదు. మౌనంలో శక్తిని సమీకరించుకుని శక్తిజనక కేంద్రంగా మారు. – స్వామి వివేకానంద -
నడుస్తూ ధ్యానం చేయవచ్చని తెలుసా?!
ధ్యానం.. మనలోని అనవసర ఆందోళనలు, భయాలు మాయం చేసిమనసుకు ప్రశాంతత చేకూర్చే చక్కని మార్గం. అందుకే భారతీయసంప్రదాయంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుషులు, మునులుసదా అనుసరించేదిదే. అలాగే బుద్ధిజంలోనూ దీని పాత్ర అధికం. చక్కని వాతావరణంలో పద్మాసనం వేసుకొని కూర్చొని కాసేపు కళ్లు మూసుకొని అన్నింటినీ మరచిపోయి శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా ఎక్కువ మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్ వాక్) ఉందనే విషయం అందరికీ తెలీదు. వాకింగ్ మెడిటేషన్‌ను బౌద్ధంలో ‘‘కిన్హిన్ ’’అంటారు. దీనికే ‘సూత్ర వాక్’ అని మరోపేరుంది. జెన్ మెడిటేషన్, ఛన్ బుద్ధిజం, వియత్నమీస్ థైన్ తదితర విభాగాల్లో మెడిటేషన్ వాక్ ఒక భాగంగా భావిస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసే బదులుగా మధ్య మధ్యలో ఇలా వాకింగ్ మెడిటేషన్నూ చేస్తారు. కిన్హిన్ అనేది జాజెన్కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ. ఎలా చేస్తారు? మెడిటేషన్ వాక్‌లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్‌వైజ్ డైరక్షన్లో నెమ్మదైన అడుగులు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతారు. ఒక్కో అడుగుకు ముందు ఒక బ్రీత్(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్ధం. అంటే మనం ప్రశాంతత గుండా ప్రయాణించడమని అర్ధం చేసుకోవచ్చు. ఉపయోగాలు: 1. రక్తప్రసరణ మెరుగుపర్చడం తరచూ వాకింగ్ మెడిటేషన్ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవడంలో తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది. అంతేకాదు శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. 2. జీర్ణశక్తిని పెంచుతుంది ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. అంతేకాదు మలబద్ధకం నివారిస్తుంది. 3. ఒత్తిడి తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని చేసే ధ్యానం కన్నా నడుస్తూ చేసే ధ్యానంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. 2017లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మధ్య వయస్కుల్లో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు వాకింగ్ మెడిటేషన్ ద్వారా సమర్థంగా తగ్గినట్లు తేలింది. అయితే, కనీసం 10 నిమిషాల సమయం మెడిటేషన్ వాక్ చేయాల్సి ఉంటుంది. 4. చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిల్ని బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియ సమర్థంగా నియంత్రించినట్లు 2016లో వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వారానికి మూడుసార్లు రోజూ కనీసం అరగంట చొప్పున సాధారణ వాకింగ్ చేసేవాళ్లతో పోలిస్తే బౌద్ధ మెడిటేషన్ వాక్ చేసిన వాళ్లలో మధుమేహం నియంత్రణ, చక్కటి రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించారు. 5. డిప్రెషన్ తొలగిస్తుంది 2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్తప్రసరణ, ఫిట్నెస్ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యుక్తవయసువారు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఈ బౌద్ధ మెడిటేషన్ వాక్ ప్రక్రియను వారానికి కనీసం మూడుసార్లు చొప్పున 12 వారాల పాటు వారు అనుసరించారు. 6. ఆరోగ్యాన్ని పెంచుతుంది ప్రకృతి(ఏదైనా పార్క్/తోట/ వనం)లో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సమతుల స్థితి చేకూరుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్ వాక్ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితోపాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత తదితర వాటినీ మెడిటేషన్ వాక్ మెరుగుపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి
మెక్సికో: హిందూయిజంను ఇష్టపడనివారు ఉండరు. వీదేశీయులు కూడా భారత సంస్కృతిని, ఇక్కడి హిందూ దేవుళ్లను ఎంతగానో ఆరాధిస్తారు. భారత్‌లోని ప్రముఖ దేవాలయాలను కూడా వారు తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయెక్ కూడా హిందూయిజంపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రకటించారు. తను ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మి దేవిపై దృష్టి పెట్టడం ద్వారా ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించారు. సల్మా లక్ష్మీ దేవి ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఫొటో తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ‘నేను నా అంతర్గత సౌందర్యంతో కనెక్ట్ అవ్వాలనుకున్నపుడు ధ్యానం చేస్తాను. ఆ సమయంలో హిందూ దేవత అయిన లక్ష్మీ దేవిని స్మరించుకుంటాను. అది నాకు ఎంతో ఆనందం, ప్రశాంతను ఇస్తుంది. అప్పుడే మీ అంతర్గత సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది’ అంటూ సల్మా రాసుకొచ్చారు. (చదవండి: ‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత) సల్మా పోస్టు చూసిన బాలీవుడ్ నటి బిపాస బసు ‘అద్భుతం’ అంటూ కామెంటు చేశారు. అంతేగాక సల్మా ఇండియన్ ఫ్యాన్స్ కూడా తను లక్ష్మీ దేవతను ఆరాధిస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఇండియాకు రండి ఇక్కడ మీకు మరింత అంతర్గత శాంతి లభిస్తుంది. అంతేకాదు భారతీయుల ప్రేమను కూడా పొందుతారు’ అంటూ ఆమె పోస్టుకు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే హిందు దేవతలను ఆరాధించే వారిలో సల్మాతో పాటు జూలియా రాబర్ట్, రస్సెల్ బ్రాండ్, మిలే సైరస్ వంటి అంతర్జాతీయ ప్రముఖు నటులు కూడా ఉన్నారు. కాగా మెక్సికో దేశానికి చెందిన సల్మా మెక్సీకన్, అమెరికన్ సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఆమె హాలీవుడ్లో ‘డెస్పరాడో’, ‘వైల్డ్ వైల్డ్ వెస్ట్’, ‘ఫ్రిడా’, ‘స్పై కిడ్స్-3’ వన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో’ వంటి చిత్రాలతో నటించారు. (చదవండి: క్యాన్సర్‌తో దిగ్గజ రాక్‌స్టార్ కన్నుమూత) View this post on Instagram When I want to connect with my inner beauty, I start my meditation focusing on the goddess Lakshmi, who in Hinduism represents wealth, fortune, love, beauty, Māyā (literally meaning "illusion" or "magic”), joy and prosperity. Somehow her image makes me feel joyful, and joy is the greatest door for your inner beauty. Cuando quiero conectarme con mi belleza interior, comienzo mi meditación enfocándome en la diosa Lakshmi, quien en el hinduismo representa la riqueza, la fortuna, el amor, la belleza, Māyā (que literalmente significa "ilusión" o "magia"), alegría y prosperidad. De alguna manera su imagen me trae alegria, y piensa que la alegría es la puerta más directa para tu belleza interior. #innerbeauty #hinduism #lakshmi #meditation A post shared by Salma Hayek Pinault (@salmahayek) on Oct 7, 2020 at 6:39am PDT -
ట్రంప్ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా
బీజింగ్ : భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను చైనా కొట్టిపారేసింది.ఇరు దేశాల మధ్య థర్డ్‌పార్టీ (మూడో వ్యక్తి) జోక్యం అవసరంలేదని డ్రాగన్ దేశం తేల్చిచెప్పింది. భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే శక్తీసామర్థ్యాలు తమకు (ఇరుదేశాలకు) ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు దేశాలైన తమ మధ్య డొనాల్డ్ ట్రంప్ తన దూర్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనపై చైనా స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. (భారత్-చైనా వివాదం: యూఎన్ఓ జోక్యం) కాగా లదాఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రధానమంతత్రి నరేంద్ర మోదీనీ తాను సంప్రదించానని, దానిని ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే భారత్-చైనా సరిహద్దు వివాదంపై ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరగలేదని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. (ట్రంప్ మధ్యవర్తిత్వం పెద్ద జోక్) -
మాస్క్‌తో వ్యాయామం మంచిదేనా?
కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు తొడగడం నిత్యకృత్యమైపోయింది. అయితే కొందరు మాస్క్‌లు తొడిగే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే మాస్క్ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్సైజ్ చేసే సమయంలో మాస్క్ తొడగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాయామం చేయడం సరైన పద్ధతి అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే మాస్క్ తొడిగి వ్యాయామం చేయాల్సి వస్తే... కొన్ని అంశాలను గమనించడమూ ఎంతో అవసరం. మాస్క్‌తో వ్యాయామం ఎంతవరకు మంచిదో చూద్దాం. మామూలుగానైతే మాస్క్‌లు మంచివే. వైరస్‌లనూ, వ్యాధి కారక క్రిములనూ చాలావరకు నిరోధిస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తాయి. అయితే మీరు వాకింగ్‌గానీ, జాగింగ్ గానీ లేదా ఇతర వ్యాయామాలు చేసే సమయంలో మాస్క్ తొడిగితే ... ఆ తేడాను మీరే పసిగట్టగలరు. మామూలుగా వ్యాయామం చేసే సమయంలో అధిక శ్రమ కారణంగా మనకు కాస్తంత ఆయాసం రావడం మామూలే. అయితే ముక్కుకు అడ్డుగా ఏదీ లేనప్పుడు మామూలు కంటే మరింత ఎక్కువగా, ధారాళంగా గాలి పీలుస్తూ ఉంటాం. కానీ మాస్క్ అడ్డుగా ఉన్న సమయంలో మనం కాస్తంత తల బాగా తేలికైన ఫీలింగ్ (లైట్‌హెడెడ్‌నెస్) గానీ, కళ్లు తిరగడం గానీ, మగత గా అనిపించడం లేదా తగినంత చురుగ్గా లేకపోవడం, ఊపిరి అందకుండా ఉన్న ఫీలింగ్గానీ ఉంటే మాస్క్ వల్ల మీకు అందాల్సినంత ఆక్సిజన్ అందకుండా ఉందని అర్థం. అలాంటి సమయాల్లో మాస్క్ తొలగించి... జనసామాన్యానికి దూరంగా ఉంటూ వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం ముగించాక మళ్లీ మాస్క్ తొడుక్కోవచ్చు. తేలికపాటి నడక సాగించే వారు విడిగా ఇంట్లోనే మాస్క్ లేకుండా నడిచి... నడక ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ మాస్క్ ధరించడం మేలు. వ్యాయామం అప్పుడు అస్సలు మాస్క్ తొడగకుండానే ఉండాల్సిన వారు... మీరు గుండెజబ్బులతో బాధపడుతున్నవారా? లేదంటే... మీకు ఏవైనా శ్వాససంబంధమైన వ్యాధులున్నాయా? అలాగైతే వ్యాయామం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాధుల కారణంగా మీకు శ్వాసలో తగినంత ఆక్సిజన్ అందకపోతే ఇబ్బందులు ఖాయం. అందుకే వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ వంటివి చేస్తున్నప్పుడు మాస్క్ తొడగకుండా చేయడం అవసరం. అయితే బయట ఇప్పుడున్న వాతావరణంలో మాస్క్ తొడగకపోవడం అంత మంచిది కాదు కాబట్టి... మీరు ఇంటి ఆవరణలోనో, మేడపై ఖాళీస్థలంలోనో మాస్క్ లేకుండానే నడక కొనసాగించడం మంచిది. ఒకవేళ ఫేస్‌మాస్క్ ధరించక తప్పదని మీ డాక్టర్ చెబితే... మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందర ఒకసారి మీ డాక్టర్ సలహా తప్పక తీసుకునే ఎక్సర్సైజ్ ప్రారంభించాలి. డాక్టర్‌ను నేరుగా కలవడం కుదరకపోతే ఫోన్లో సంప్రదించాలి. పేషెంట్ స్వయానా కనిపిస్తుండే టెలిమెడిసిన్ పద్ధతైతే ఇంకా మంచిది. చాలా కాలంగా వ్యాయామం చేయకుండా ఇప్పుడే మొదలుపెడుతున్నారా? చాలాకాలం నుంచి వ్యాయామం చేయకుండా ఉన్నవారు... వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నవారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మాస్క్ తొడిగే నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం అస్సలు మంచిది కాదు. తొలుత తేలికపాటి వ్యాయామాలు/వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు చేస్తూ... క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవడం అవసరం. చాలాకాలం వ్యాయామం చేయకుండా ఇప్పుడు వ్యాయామం మొదలుపెట్టగానే... మగతగా, కళ్లుతిరుగుతున్నట్లుగా, స్పృహతప్పుతున్నట్లుగానూ అనిపిస్తే వ్యాయామాలు ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. మాస్క్‌తో వ్యాయామం చేస్తే ఏమవుతుంది? మామూలుగా మనం శ్వాసించేటప్పుడు గాలి చాలా ఫ్రీగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అయితే ఫేస్‌కు మాస్క్ ఉన్నప్పుడు అది గాలిని నిరోధిస్తూ, దాని కదలికలకు అడ్డుపడుతుంది. దాంతో అందాల్సిన మోతాదులో ఆక్సిజన్ అందదు. మాస్క్ ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌లో ఎంతో కొంత కొరత ఉంటుంది. అలాగే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డై యాక్సైడ్ మునపటిలా మొత్తం బయటి గాలిలోకే వెళ్లకుండా... ముక్కుకు ఆని ఉన్న మాస్క్ ప్రాంతంలోనే ఎక్కువ మోతాదు ఉండిపోతుంది. దాంతో మళ్లీ మరోసారి గాలి పీల్చినప్పుడు మొదటికంటే ఆక్సిజన్ తక్కువ అందడంతో పాటు, ముక్కుకు దగ్గరగానే ఉన్న కార్బన్ డైయాక్సైడ్ మళ్లీ లోపలికి ప్రవేశించడంతో అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు మరింత తగ్గుతాయి. ఇలా ఆక్సిజన్ అందాల్సినంత మోతాదులో అందకపోవడంతో ఇటు గుండెకూ, అటు మెదడుకూ తగినంత ఆక్సిజన్ అందకనే ఇలా తల దిమ్ముగా ఉండటం, తల తేలికైపోయినట్లుగా ఉండటం, ఊపిరి అందకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. మాస్క్ విషయంలో జాగ్రత్తలివి... ► ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి... కుటుంబసభ్యుల్లో ఎవ్వరికీ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలేవీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ తొడగకండి. అయితే కుటుంబసభ్యులైనా అందరూ తగినంత భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. ► ఇంటి ఆవరణలో లేదా మేడపైన విడిగా వ్యాయామం చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు వ్యాయామం చేస్తూన్నా కలివిడిగా కాకుండా విడివిడిగానే చేయాలి. ► బయటకు వెళ్లినప్పుడు తప్పక మాస్క్ ధరించే వెళ్లాలి. గుంపులు గుంపులుగా జనాలు ఉన్నచోటికి మీకు మాస్క్ ఉన్నా వెళ్లకండి. అక్కడ రద్దీ తగ్గాకే వెళ్లండి. తీవ్రమైన (హెవీ) వ్యాయామాలు చేసేవారు... ఇప్పుడు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ఎలాగూ పనిచేయడం లేదు. అయితే పర్సనల్ జిమ్‌లలో లేదా తమకు అందుబాటులో ఉండే వస్తువులతో చాలా తీవ్రంగా వ్యాయామాలు (ఇంటెన్స్ ఎక్సర్సైజ్) చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ వెయిట్లిఫ్టింగ్స్, స్ప్రింట్స్, ప్లయోమెట్రిక్స్, క్రాస్‌ఫిట్ సై్టల్ వర్కవుట్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ (హిట్స్–హెచ్ఐఐటీ) వంటి వ్యాయామాలు చేసేవారు మాస్క్ తొడుక్కోకుండా చేయడం అవసరం. కార్డియో వ్యాయామాలు చేసేవారు కూడా ఇవే పద్ధతులు అవలంబించాలి. మీకు తగినంత ఆక్సిజన్ అందుతుందో లేదో గుర్తించడం ఎలా? ఆక్సిజన్ తగినంతగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోడానికి ఉత్తమమైన మార్గం పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగించడం. దానిద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ మోతాదు ఎంత ఉందో తక్షణం తెలిసిపోతుంది. అయితే ఇలాంటి ఉపకరణాలు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి... మన దేహస్పందనలను జాగ్రత్తగా గమనించడం ద్వారా మనకు మనంగా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వ్యాయామం చేస్తున్న సమయంలో భరించలేనంత శ్రమ...ఊపిరందకపోవడం, (వ్యాయామంలో ఎంతో కొంత ఆయాసం ఉంటుందిగానీ... అది పూర్తిగా గాలి ఆడనంత తీవ్రంగా ఉంటే)... తల బాగా తేలికయిపోయినట్లు ఉండటం, అవయవాలు మొద్దుబారినట్లు అనిపించడం, తిమ్మిర్లుగా అనిపించడం, నిస్సత్తువగానూ, నీరసంగానూ, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం వ్యాయామం ఆపేయాలి. పైన పేర్కొన్నవన్నీ మన ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ లభ్యం కావడం లేదనడానికి సూచనలు. అలాంటప్పుడు అన్ని రకాల వ్యాయామాలు ఆపేసి, డాక్టర్ సంప్రదించి, మళ్లీ మీ డాక్టర్ వ్యాయామాలు చేయడానికి అనుమతించాకే మొదలుపెట్టాలి. -
ప్రాణాయామం.. ప్రాణాన్ని నిలబెట్టింది
ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి రోహిత్ దత్తా పూర్తిగా కోలుకొని బయటపడ్డారు. ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 బారి నుంచి తానెలా బయటపడిందీ వివరించారు. కరోనా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో సూచించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది కాసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రోహిత్ దత్తా మాట్లాడుతూ..ఆసుపత్రిలో ఉన్న 14 రోజులూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవాడినని వివరించారు. ఈ రెండింటితోనే తాను ఈ మహమ్మారి గండం నుంచి గట్టెక్కానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వీటిని అభ్యాసం చేయాలని సూచించారు. కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్న రోహిత్ దత్తా యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యం.. కరోనాను ఓడించేందుకు ఈ మూడే కీలకమన్నారు. రోహిత్ దత్తా ఫిబ్రవరి 24 న యూరప్ నుండి తిరిగి వచ్చారు. తర్వాత జ్వరంగా ఉండటంతో స్థానికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.దీంతో హాస్పిటల్లోనే క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది బాగా చూసుకున్నారని వివరించారు. తనను తాను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుకున్నట్టు తెలిపారు. సామాజిక దూరం పాటించాలని, ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై అవగాహన కలిగి ఉండాలని రోహిత్ దత్తా సూచించారు. కాగా, వేడినీళ్లు తాగాలని, రోజులో కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది -
కరోనా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి!
వాషింగ్టన్: చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా అమెరికాలోనూ విజృంభిస్తోంది. అక్కడ ఇప్పటికే 3,485 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా 65 మృతి చెందారు. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యోగా చేయాలని ప్రఖ్యాత హార్వార్డ్ మెడికల్ స్కూల్ సూచిస్తోంది. కరోనా వల్ల తలెత్తే భయం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులను యోగా, ధ్యానం దూరం చేస్తాయని తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటితో వ్యక్తి పూర్తిగా రిలాక్స్ కావొచ్చునని ‘కోపింగ్ విత్ కరోనా వైరస్ యాంగ్జయిటీ’ కథనంలో వెల్లడించింది. (చదవండి: కంగారెత్తిస్తున్న కరోనా) ఇలా చేస్తే మంచి ఫలితాలు.. ‘రెగ్యులర్‌గా యోగా చేసేవారిలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్ ఎలా చేయాలో హెడ్‌స్పేస్, కామ్, యోగా స్టూడియో, పోకెట్ యోగా వంటి ఎన్నో యాప్‌లు సులభంగా నేర్పిస్తున్నాయి’అని హార్వార్డ్ మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీ, సైకియాట్రిస్ట్ జాన్ షార్ప్, కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన డేవిడ్ జెఫెన్ పేర్కొన్నారు. ‘ఇప్పటికే మీరు యోగా చేస్తున్నవారైతే.. అలాగే కొనసాగించడం మంచిది. కానీ, కొత్తగా యోగా చేస్తాను అనుకుంటే.. పెద్దగా ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ, ఆరోగ్యం విషయంలో పరధ్యానంగా ఉన్నప్పుడు నూతనంగా చేపట్టే పనులు ఎంతోకొంత మేలు చేస్తాయి’అని వారు తెలిపారు. (చదవండి: ఉగ్రవాదులూ..యూరప్ వెళ్లొద్దు: ఐసిస్) శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయడం, హైజీన్‌గా ఉండటం, ఆఫీసుల్లో మునుపటిలా కాకుండా పనులు తగ్గించుకోవడం, ఇతరులకు దూరం పాటించడం, ఆరోగ్యరంగ నిపుణుల సలహాలు పాటించి, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుని మసలుకుంటే కరోనాకు దూరంగా ఉండొచ్చునని చెప్తున్నారు. ఇక కోవిడ్-19 భయాలను తగ్గించేందుకు, ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని పెంచేందుకు హోమం కాల్చడం, దైవ ప్రార్థనలు చేస్తామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ వెల్లడించింది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ సూచనల్ని ఉటంకిస్తూ.. ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం వైరస్ బారినపడి ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆందోళనను తగ్గిస్తాయని ప్రపంచ హిందూ కాంగ్రెస్ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకుడు అనిల్ శర్మ చెప్పారు. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తొలి బాధితుడు) -
యోగా, ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఒకే ఛత్రం కిందకు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతి, విద్వేషపూరిత వాతావరణం నేపథ్యంలో మానవజాతి మేలు కోసం దేశంలోని యోగా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకే ఛత్రం కిందకు రావాల్సిన అవసరముందని శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ పటేల్ (దాజీ) అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలోని కాన్హా శాంతి వనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దాజీతోపాటు పతంజలి యోగా పీఠం అధ్యక్షుడు యోగా గురు రాందేవ్ బాబా పాల్గొన్నారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో ప్రారంభమవుతోందని సంస్థ సెక్రటరీ ఉమాశంకర్ బాజ్‌పేయి తెలిపారు. కొత్తగా నిర్మించిన ధ్యాన కేంద్రం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, ఏకకాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు సౌకర్యాలున్నాయని ఆయన చెప్పారు. రాజ యోగం, సహజ మార్గంలో యోగ శిక్షణ ఉంటుందని, 3 రోజుల శిక్షణతో పాటు వారానికి ఒక రోజు చొప్పున 15 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామని సంస్థ జాయింట్ సెక్రటరీ చల్లగుళ్ల వంశీ వెల్లడించారు. అభ్యాసం చేయాలనుకునేవారు ఆన్లైన్లో (https://heartfulness.org) రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కాన్హా శాంతి వనానికి రావొచ్చు. ప్లేస్టోర్, ఐఫోన్ స్టోర్‌లోని హార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇళ్లల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం నేడు
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేశ్ డీ పటేల్ (దాజీ) మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఉదయం నుంచే పలు దేశాల నుంచి అభ్యాసీలు తరలివస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసేలా ‘హార్ట్ఫుల్నెస్’అనే సంస్థ అత్యాధునిక వసతులతో హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం 28న ప్రారంభం కానున్నది. సంస్థ అంతర్జాతీయ మార్గదర్శకులు దాజీ ఈ కేంద్రాన్ని సంస్థ మొదటి మార్గదర్శి లాలాజీ పేరిట అంకితం చేస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యాన కేంద్రంలో సెంట్రల్ హాల్, మరో 8 అనుబంధ హాళ్లు ఉన్నాయి. ఈ నిర్మాణం రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో సిడ్నీ హార్బర్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలతో పోటీ పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ‘హార్ట్ఫుల్నెస్’75వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 28 నుంచి 30, ఫిబ్రవరి 2 నుంచి 4, ఫిబ్రవరి 7నుంచి 9వ తేదీ నడుమ జరిగే సమావేశాల్లో 1.2లక్షల మంది ధ్యానంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 7న అన్నా హజారే ధ్యాన సాధకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న జరిగే కార్యక్రమంలో బాబా రాందేవ్ పాల్గొంటారు. 1400 ఎకరాల్లో విస్తరించిన ఈ ధ్యాన కేంద్రం 40వేలకు మందికి పైగా వసతి కల్పించడంతో పాటు, రోజుకు లక్ష మందికి వండి వార్చేలా వంట గది నిర్మించినట్లు సంస్థ మార్గదర్శి దాజీ వెల్లడించారు. 6 లక్షల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశారు. త్వరలో 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. -
మహాపిరమిడ్ పిలుస్తోంది!
సాక్షి, కడ్తాల్(రంగారెడ్డి): మహేశ్వర మహాపిరమిడ్ .. మహిళా ధ్యాన మహాచక్రాలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం మహా పిరమిడ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడ్తాల్ –ఆన్మాస్పల్లి గ్రామాల సమీపంలో ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిర్మితమైన అద్భుత కట్టడం ఇది. ధ్యాన జనులకు స్వర్గ ధామంగా పిలవబడుతున్న మహా పిరమిడ్‌లో ఈసారి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహా చక్రాలను నిర్వహిస్తున్నారు. ఈ మహా పిరమిడ్‌లో ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ధ్యాన చక్రాలను నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం దేశ విదేశాల్లోని ధ్యానులు అంతా కలిసి ఒకే చోట ధ్యానం నిర్వహించే కార్యక్రమమే ధ్యాన మహాచక్రాలు అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది జనుల మధ్య వైభవంగా ధ్యాన సంబరాలు నిర్వహిసుంటారు. ఈ సంవత్సరం ది ఇండియన్ పిరమిడ్ స్ప్రిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు మహాపిరమిడ్‌లో మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక వసతి, వైద్యం, రవాణా సౌకర్యం, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం.. 32,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 113.6 మీటర్ల ఎత్తుగా, 6 వేలకు పైగా ధ్యానులు ఒకే సారి ధ్యానం చేసేందుకు వీలుగా బండరాళ్లు, ఇనుముతో నిర్మించారు. పిరమిడ్ నలువైపులా పచ్చని చెట్లతో అందంగా ముస్తాబైంది. ఈ నిర్మాణం ఒక అద్భుతమని ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ వారు గతంలోనే గుర్తించి రికార్డును అందజేశారు. ఆదే విధంగా పిరమిడ్ మధ్యలో కింగ్ చాంబర్ పాటు క్వీన్ చాంబర్ ఉన్నాయి. కింగ్ చాంబర్‌పై 500 మంది వరకు, క్వీన్ చాంబర్‌పై 250 మంది వరకు ధ్యానం చేయవచ్చు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే ప్రాణ శక్తి మూడురెట్లు అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ధ్యానులు నమ్మకం. వలంటీర్ల నియామకం ధ్యానులకు సేవలందించేందుకు వలంటీర్లను నియమించారు. పిరమిడ్ పరిసరాలలో వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం బాలకేంద్రంతో పాటు అఖంఢ ధ్యాన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు వసతి గృహాలు, కుటీరాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల మంది ధ్యానం చేసేందుకు వీలుగా భారి ప్రాంగాణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక తయారు చేశారు. సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల రాక.. ధ్యాన మహా చక్రాలకు విశాఖ శారదా పీఠాధి పతి, స్వరూపానంద సరస్వతీ, సత్యసాయి ధ్యాన మండలి గురూజీ భిక్షమయ్య, కుండలిని యోగి శేష్బట్టర్, సుదర్శనాచార్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద్, సిద్ధయోగి అంతర్ముఖానందా, స్వరయోగి మహామాతాజీ రుషికేశ్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజూ జరిగే కార్యక్రమాలివే.. రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణుగాన సంగీతం, అనంతరం సాముహిక ధ్యానం, సందేశం, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పాటు, ధ్యాన గురువుల, ఆధ్యాత్మిక, ధ్యాన సందేశాలు 11 రోజులపాటు జరుగుతాయి. ముమ్మర ఏర్పాట్లు మహిళా ధ్యాన మహాచక్రాల కోసం మహేశ్వర పిరమిడ్ వద్ద ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. దేశం నలువైపులా నుంచే కాక విదేశాల నుంచి ధ్యానులు రానుండటంతో, వారికి కావలసిన వసతులు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజూ వేలాదిగా ధ్యానులు పాల్గొననుండటంతో వారికి ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. -
ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలి
సాక్షి, విజయవాడ: ధ్యానంపై మహిళలు శ్రద్ధ చూపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘విద్వత్ మహిళా సమ్మేళనం-2019’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక పక్క కుటుంబం, మరోవైపు ఉద్యోగాలు చేస్తూ మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం తోడ్పడుతుందన్నారు. ధ్యానం చేసేవారు ఓర్పుతో ఉంటారని చెప్పారు. యోగా,ధ్యానం.. మనలో ప్రకృతి కల్పించిన శక్తిని బయటకు తీసుకువస్తాయని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని..ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ధ్యానం అందరికి ఆరోగ్యదాయకం అని పేర్కొన్నారు. ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అధినేత్రి రాధారాణి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ విద్యాకన్నా తదితరులు పాల్గొన్నారు. -
మెడిటేషన్ కోసం విదేశాలకు రాహుల్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఆయన త్వరలోనే తిరిగి వస్తారని పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. రాహుల్ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లారన్నారు. నవంబర్ 5 నుంచి ఆర్థిక మందగమనం, రైతాంగ సంక్షోభం తదితర సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమావేశానికి రాహుల్ హాజరయ్యారని సూర్జేవాలా తెలిపారు. రాహుల్ ఇండోనేసియా వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ధ్యానం కోసం విదేశాలకు పోయిండు!!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లారు. ఈసారి ఆయన ధ్యానం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయన ఎక్కడికి వెళ్లింది వెల్లడించలేదు. దేశంలో ఆర్థికమాంద్యం నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా వారంపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఇలా విదేశాలకు వెళ్లిపోవడం హస్తం శ్రేణులను చిక్కుల్లో పడేసింది. నిజానికి కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు రాహుల్ గాంధే ప్లాన్ చేశారు. నవంబర్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అయితే, రాహుల్ తలపెట్టిన ఆందోళనల సమయంలో ఆయనే అందుబాటులో లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రాహుల్ ధ్యానం కోసం విదేశాలకు వెళ్లారన్న వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎంతో ప్రసిద్ది అని, అలాంటిది భారత్‌ను వదిలి ఆయన ధ్యానం కోసం వేరే దేశం ఎక్కడికో వెళ్లడం ఏమిటని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. విదేశీ ప్రయాణాల పేరిట రాహుల్ ఎక్కడికి వెళుతున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాత్రం రాహుల్ విదేశీ టూర్‌ను సమర్థించేందుకు తంటాలు పడుతోంది. రాహుల్ మార్గనిర్దేశకత్వంలో ఆయన సూచనల మేరకే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నామని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. -
మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడికి సమీపంలోని ఓ గుహను సందర్శించి అక్కడ కాసేపు ధ్యానం చేసిన విషయం తెల్సిందే. ఆ గుహకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ గుహను ‘ఆధునిక ధ్యాన గుహ’ లేదా ‘రుద్ర గుహ’ అని పిలుస్తారు. ఆ గుహలో ఇద్దరు కొంచెం కష్టంగా, ఒక్కరు హాయిగా పడుకునేందుకు ఓ మంచం, ఆ మంచం మీద ఓ మెత్తటి పరుపు ఉంటుంది. పగటి పూట ప్రకృతి అందాలను తిలకించేందుకు మంచం పక్కనే ఓ కిటికీ కూడా ఉంది. గుహకు మరోపక్కన స్నానం చేసేందుకు కుళాయితో కూడిన సదుపాయం, మరో దిక్కున టాయిలెట్ సౌకర్యం ఉంది. ఆలయానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో, సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఈ గుహ ఉంది. పొడువు ఐదు మీటర్లు, వెడల్పు మూడు మీటర్లు ఉండే ఈ గుహలో 24 గంటల విద్యుత్ సౌకర్యం, చార్జింగ్ ప్లగ్గులు ఉన్నాయి. టెలిఫోన్ సౌకర్యం ఉంది. స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యంతోపాటు మనిషి సాయం కూడా ఉంది. అక్కడున్న గంట కొట్టగానే 24 గంటలపాటు అందుబాటులో ఉండే అటెండర్ వస్తాడు. ఉదయం తేనీరు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ సరఫరా చేస్తారు. విడిచిన చొక్కాలను తగిలించుకునేందుకు నాలుగైదు కొక్కాలు గల హ్యాంగర్ (మోదీ ఫొటోలో కుడివైపు కనిపిస్తుంది)కూడా ఉంది. ఎప్పుడు చల్లగా ఉండే ఈ గుహకు ఎయిర్ కండీషన్ సౌకర్యం మాత్రం లేదు. ‘గార్వల్ మండల్ వికాస్ నిగమ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గుహను గతేడాది కృత్రిమంగా నిర్మించారు. దీనికి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చయిందట, కేదారినాథ్ ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షించడానికి ఇక్కడ ఇలాంటి నాలుగైదు గుహలను నిర్మించాలనుకున్నారు. ఇంతకుముందు ఈ రుద్ర గుహను కనీసంగా మూడు రోజులపాటు బస చేసేలా మూడువేల రూపాయలకు అద్దెకు ఇచ్చేవారు. పర్యాటకులు ఒక్క రోజుకు మించి ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడక పోతుండడంతో ఇటీవల రోజువారి ప్యాకేజీని ప్రవేశపెట్టారు. టీ, టిఫిన్, భోజన సదుపాయాలతో రోజుకు 990 రూపాయలను ఛార్జి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఈ గుహలోనే పడుకొని ఆదివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఈ గుహలో 17 గంటలపాటు గడపగా, మీడియా పొరపడి ఆయన ఈ గుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు అని రాసింది. బీజేపీ అధికారికంగా ‘కేదారినాథ్‌లో ధ్యానం చేస్తున్న కర్మయోగి’ అంటూ నాలుగు ఫొటోలతో ట్వీట్ చేసింది. ఇదెక్కడ ఆదివారం నాటి పోలింగ్‌ను ప్రభావితం చేస్తుందోనని భయపడిన సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. మోదీ తన వ్యక్తిగత విశ్వాసాలకు మీడియా ప్రచారం కల్పించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారి ఎన్నికల ప్రచారంపై ఒకటి, రెండు రోజులపాటు నిషేధం విధించి చేతులు దులుపుకునే అలవాటున్న మన ఎన్నికల కమిషన్‌కు, ఆఖరి విడత పోలింగ్ ముగియడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుతానికి మౌనం వహించింది. దేనికైనా స్పందించే గుణం కలిగిన నెటిజన్లు మాత్రం కృత్రిమ గుహలో మోదీ ధ్యానం చేయడం పట్ల వ్యంగోక్తులు విసురుతున్నారు. వారిలో ఒకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడో జమ్మూలోని వైష్ణవి దేవీ గుహను సందర్శించిన ఫొటోను ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీకన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జాయ్ షా మే 9 నుంచి 11వ తేదీ వరకు ఈ గుహలో బసచేసి వెళ్లారు. ఈ గుహను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మోదీ రాకతో తమ గుహకు మహర్దశ పట్టుకున్నట్లేనని, దీంతో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ‘గార్వల్ మండల్ వికాస్ నిగమ్’ జనరల్ మేనేజర్ బీఎల్ రానా మీడియాతో వ్యాఖ్యానించారు. -
వజ్ర కాయమా..? వజ్రంలాంటి మనసా?
ధ్యానం, యోగం అనేవి చిత్త ఏకాగ్రత కోసం, దృఢ చిత్తం కోసం చేసే సాధనా మార్గాలు. అలాంటి మార్గంలో సాధన చేయాలనుకున్నారు ఏడుగురు అన్నదమ్ములు. వారు కాశీరాజ్యవాసులు. ఏడుగురూ సర్వాన్ని త్యజించి అడవికి వెళ్లారు. రాలిన పండ్లు, పక్షులు తిని వదిలిన పండ్లు మాత్రమే తినేవారు. పులులూ, సింహాలూ వేటాడి తిని వదిలేసిన మాంసాన్నే ముట్టేవారు.జీవహింస చేయకుండా అలా జీవిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా మనస్సును అదుపు చేయడం కాస్త కష్టంగానే తోచింది. దాంతో వారి సాధన మనస్సు నుండి శరీరానికి మారింది. యోగసాధన మారి క్రమేపీ యోగాసనాల సాధనకు మళ్లారు. రకరకాల ఆసనాలు వేస్తూ శరీరాన్ని వజ్రతుల్యంగా మార్చుకున్నారు. ఎండా, వానా, చలి బాధల్ని తట్టుకోగల శరీరాన్ని పొందారు. చివరికి శారీరక దృఢత్వమే యోగంగా నమ్మారు.కొన్నాళ్లకి ఆ ప్రాంతానికి ఒక ధ్యాని వచ్చాడు. వారి యోగసాధన చూసి, వారితో ‘‘యోగులు మిగిలింది మాత్రమే తినాలి. మీరు నిజంగా మిగిలిందే తింటున్నారా?’’అనడిగాడు.‘‘అవును స్వామీ! మేము జీవహింస చేయం. పక్షులూ, జంతువులూ తినగా మిగిలిందే తెచ్చుకు తింటున్నాం’’ అన్నారు.‘‘అయితే, ఎంగిలి తింటున్నారన్నమాట. ఎంగిలి తిని, ఎంగిలి సాధన చేస్తున్నారన్నమాట’’అన్నాడు. ‘‘మిగిలింది తినాలంటున్నారు. ఎంగిలి అంటున్నారు. ఏమి దీని మర్మం?’’అని అడిగారు వారు.‘‘మిగిలింది తినడం అంటే... ఒకరికి పెట్టగా మిగిలింది తినడం. ఒకరు తిని మిగిల్చింది తినడం కాదు. మొదటిది త్యాగం. రెండోది లోభం. అదే ఎంగిలి. ఏ యోగి దృఢచిత్తం కోసం సాధన చేస్తాడో ఆ యోగిసాధన ఒకరికి పెట్టగా మిగిలింది తినడంతో సమానం. ఏ యోగి దృఢశరీరం కోసం సాధన చేస్తాడో ఆ యోగ సాధన ఒకరు తిని మిగిల్చినది తిన్నదానితో సమానం’’ అని చెప్పాడు.ఆ సోదరులు తమ తప్పు తెలుసుకున్నారు. మిగిలింది తినడం అంటే ఏమిటో గ్రహించి, సరైన సాధన చేశారు. ధ్యానం అంటే మనోసాధన అని, బుద్ధుడు చెప్పిన సందేశం ఇది. డా. బొర్రా గోవర్ధన్ -
‘అయోధ్య’ మధ్యవర్తిత్వంతో ఉపయోగం ఏంటీ?
సాక్షి, ముంబై: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివసేన అభిప్రాయపడింది. రామమందిరం అనేది దేశ ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, దానిని కేవలం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేరని పేర్కొంది. మందిర నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీచేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రికలో శనివారం కథనాన్ని ప్రచురించింది. హిందూవుల ఆంకాంక్ష అయిన రామమందిరాన్ని 25 ఏళ్లుగా ఎందుకు నాన్చుతూవున్నారని సేన ప్రశ్నించింది. ‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు! -
నా ప్రభువే కాపాడాడు
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ‘అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్ధం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’ అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, ‘హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికి సాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?’ అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’శాపగ్రస్తుడా..దుర్మార్గుడా..దూరంగా పారిపో..’ అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరోపాచిక విసురుతూ..‘జీలానీ . నిన్ను నీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ‘కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు.. నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది.దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు. మాసం మహాత్మ్యం పుణ్యఫలాలనిచ్చే పుష్యం: పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం. పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి బుద్ధి కారకుడు కావడం వల్ల ఈ మాసం బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమైనది. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చే నూనె. కాబట్టి ఈ మాసంలో నువ్వులు, నువ్వులనూనెతో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్రవచనం. అలాగే ఇది మంచు కప్పబడి ఉండే మాసం కాబట్టి పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైలగ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ నువ్వులనూనె ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేయడం. అలాగే సంక్రాంతి పిండి వంటలన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. ఇక ఈ మాసం శూన్యమాసం అని ఆందరూ ఆడిపోసుకుంటారు కానీ, అత్యుత్తమమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదీ, రైతులు పండుగగా, పితృదేవతల పండగగా చెప్పుకునే సంక్రాంతి పండగ వచ్చేది కూడా ఈ మాసంలోనే కాబట్టి చిన్న చూపు తగదు. -
ఇలా చేస్తే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది!
న్యూయార్క్ : ఒకే పనిని అలా ఎక్కువ సేపు చేయటం వల్ల, ఒక క్లిష్టమైన పనిని చేస్తున్నపుడు.. మెదడు కొంచెం మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. ఆలోచనలు రాక తికమక పడిపోతాం.. ఆ కొద్ది క్షణాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తాయి. అలాంటి సమయంలో కొద్ది సేపు మెడిటేషన్ చేయటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. ప్రతి రోజు మెడిటేషన్ చేసే వాళ్లు కావచ్చు, కొత్తగా మొదటిసారి చేస్తున్న వారు కావచ్చు సత్వర ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘‘యాలె యూనివర్శిటీ’’, ‘‘స్వర్త్ మోర్ కాలేజీ’’ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొంతమంది కాలేజీ విద్యార్థులకు మెడిటేషన్‌కు సంబంధించిన ఆడియోలను ఒక పది నిమిషాల పాటు వినిపించగా.. క్లిష్టమైన పరీక్షల్లో వారు చక్కటి ప్రతిభ కనపరిచారు. క్లాస్ రూం సబ్జెక్టులను విన్న వారు అంతగా రాణించలేకపోవటం గమనార్హం. కాలేజీ విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ఒక గ్రూపునకు మెడిటేషన్ ఆడియోలను, మరొక బృందానికి టెస్టుకు సంబంధించిన ఆడియోలను వినిపించారు. అయితే మెడిటేషన్ ఆడియోలు విన్న వారు ఎక్కువ చురుకుగా ప్రవర్తించారు. ఇప్పటివరకు వారాల, నెలల తరబడి మెడిటేషన్ చేసే వారు మాత్రమే చురుగ్గా ఉంటారన్న భావన తప్పని తేలింది. మొదటిసారి మెడిటేషన్ చేసిన వారు చురుగ్గా ఉంటారని వెల్లడైంది. -
‘రాహుల్ ముఖం నాకు అస్సలు నచ్చదు’
డెహ్రాడున్ : ధ్యాన సాధన ధార్మిక సంస్థ గాయత్రి పరివార్ చీఫ్ ప్రణవ్ పాండ్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ముఖం తనకు అస్సలు నచ్చదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ సంస్థను రాహుల్ సందర్శించడానికి వస్తే సంతోషమే గానీ అమిత్ షా లాగా ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ సంస్థల మద్దతు కూడగట్టడంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ప్రణవ్ పాండ్యా, స్వామి అద్వేశానంద్, స్వామి సత్యమిత్రానంద్ తదితరులతో సమావేశమయ్యారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది అనుచరులు కలిగి ఉన్నామని చెప్పుకునే గాయత్రి పరివార్ మద్దతు కోసం వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాయత్రి పరివార్ ప్రణవ్ పాండ్యాతో బుధవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమైన అనంతరం.. తాము బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రణవ్ పాండ్యా ప్రకటించారు. -
ఈ క్షణంలో ఏం చేస్తున్నాం?
యువకుడు వెళ్లాల్సినరోజు బాగా వర్షం పడుతోంది. అందుకని పావుకోళ్లు వేసుకుని, గొడుగు పట్టుకుని ఆ గ్రామానికి వెళ్లాడు. ఒక ఆశ్రమంలో చేరాడు ఒక యువకుడు. అక్కడ ధ్యానం గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కేవలం ధ్యానం చేయించడమే శిక్షణ. ప్రతి శిష్యుడు గురువులకు శుశ్రూష చేస్తూ సాధన చేస్తాడు. ధ్యానం అంటే కేవలం ఒక అలౌకిక స్థితి మాత్రమే కాదనీ, భౌతిక జీవితం పట్ల పూర్తి స్వీయస్పృహ కలిగివుండటం కూడా ధ్యానమేననీ ఆ యువకుడికి చెప్పారు. యువకుడు పూర్తిగా నిమగ్నమైపోయాడు. అలా సాధనలో పదేళ్లు గడిచాయి. అతడు శిష్యరికం వదిలి గురువుగా పదోన్నతి పొందే రోజు వచ్చింది. సమీప గ్రామంలో వున్న పిల్లలకు ధ్యానపాఠం చెప్పడానికి పెద్ద గురువు పిలిపించాడు. యువకుడు వెళ్లాల్సినరోజు బాగా వర్షం పడుతోంది. అందుకని పావుకోళ్లు వేసుకుని, గొడుగు పట్టుకుని ఆ గ్రామానికి వెళ్లాడు. తరగతి గదిలోకి వెళ్లేముందు చెప్పుల్నీ గొడుగునూ గోడ పక్కన వదిలి లోపలికి నడిచాడు. పెద్ద గురువు చిరునవ్వుతో పలకరిస్తూ– ‘ఇప్పుడు లోపలికి వచ్చావు కదా! నీ గొడుగును నీ పావుకోళ్లకు ఎడమవైపు నిలిపావా? కుడివైపా?’ అని ప్రశ్నించాడు గురువు. యువకుడు తత్తరపడ్డాడు. అతడి దగ్గర తక్షణం సమాధానం లేదు. ప్రతిక్షణం ధ్యానంలో ఉండటం తనకు ఇంకా అలవడలేదని గ్రహించాడు. మరింత సాధన కోసం మరో ఆరేళ్లపాటు మళ్లీ శిష్యుడిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. -
నీలోకి నీవు తొంగి చూసుకో!
వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం పొందబోయే సుఖం కోసమే ప్రయత్నిస్తారు. పూర్వం మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడు యుద్ధం పాపానికీ, దుఃఖానికీ కారణమైనని భావించి, ఆయుధాలను పక్కన పడవేసి, నిర్వేదంలో కూరుకుపోయి ఉన్నప్పుడ శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మయుద్ధం క్షత్రియులకు పూర్వపుణ్యం వల్లనే దొరుకుతుందని, అది రాబోయే మహాపుణ్యానికి సాధనా మార్గమని, అదే మహాసుఖానికీ, ఆనందానికీ కారణమని తెలిపాడు. ఇక్కడ కృష్ణపరమాత్మ అర్జునుడిని యుద్ధంచేయమని బలవంతం చేయలేదు, కేవలం యుద్ధం ఎందుకు చేయాలో చెప్పాడంతే! దాంతో అర్జునుడికి దుఃఖనివృత్తి జరిగి, యుద్ధం వైపు మనసు మళ్లింది. అంటే దుఃఖాన్ని తొలగించుకోవడం వల్ల ఆనందం కలుగుతుందన్నమాట. లోకంలో ప్రజలు కోరే ధనం, ధాన్యం, ఇల్లు–వాకిలి, విద్య, అధికారం, కీర్తి, మర్యాద, పుణ్యం, బంధువర్గం మొదలైనవన్నీ తమ తమ సుఖానికి లేదా ఆనందాన్ని పొందడం కోసమేనని భావిస్తారు. ఎందుకంటే, ఆనందాన్ని కలిగించేది సుఖం మాత్రమే, సుఖాన్ని చేకూర్చేది ఆనందం మాత్రమే. వేదాలు, ఉపనిషత్తులూ ఏమి చెబుతాయంటే, అవివేకులైన వారు మాత్రమే తాత్కాలిక ఆనందాన్ని, సుఖాన్ని కోరుకుంటారు. వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం పొందబోయే సుఖం కోసమే ప్రయత్నిస్తారు. గట్టిగా ఆలోచించి చూస్తే, సుఖం లేదా ఆనందం అన్నది శరీరంలోనిదే కానీ శరీరానికి అవతల ఉన్నది కాదు. సుఖం మాత్రమే తమకు అనుకూలమైనదని భావించినప్పుడు, దానికి ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే అవుతాయి. కాబట్టి దుఃఖ పరిహారాన్నీ, ఈ లోకపు అల్పసుఖాన్నీ, శాశ్వత మోక్షసుఖాన్నీ కోరేవారు, దైవానుగ్రహం కోసం కృషి చేయాలనీ, తద్వారానే జీవుల దుఃఖ నివృత్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవంతుణ్ణి నమ్మని వాళ్ల సంగతేమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి యోగశాస్త్ర పితామహుడు పతంజలి ముని ఏమి చెబుతాడంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరు వేసుకో. ఆ తర్వాత నీలోకి నీవు తొంగి చూసుకో. నువ్వు ఆలోచించిన కొద్దీ నీ ఆలోచనా పరిధి పెరుగుతుంది. దుఃఖ నివృత్తి జరుగుతుంది. ఆనందం కలుగుతుంది. అలా తనలోకి తాను తరచి చూసుకోవడమే ధ్యానం. -
ధ్యానంతో మార్పులు అవాస్తవం!
లండన్: ధ్యానం మనుషుల్లో మార్పు తెస్తుందనే విషయం పూర్తిగా అవాస్తవమని తాజా అధ్యయనంలో తేలింది. ధ్యానం ద్వారా మానవుల్లో సత్ప్రవర్తన వస్తుందనడం కేవలం అపోహ మాత్రమేనని వెల్లడైంది. బ్రిటన్‌లోని కోవెన్ట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి గానూ ‘«ధ్యానం వల్ల ప్రశాంతత, కరుణ వంటి భావనలు వస్తాయా, లేదా’అనే అంశంపై గతంలో నిర్వహించిన 20 అధ్యయన ఫలితాలను వారు పరిశీలించారు. మెడిటేషన్ ద్వారా సానుకూల దృక్పథం వస్తుందని తొలుత భావించినా, దీనిలో సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నట్లు వారు గుర్తించారు. మెడిటేషన్ చేసే బృందాన్ని, చేయని వారిని విడివిడిగా పరిశీలించిన అనంతరం వారు ఈ అంచనాకు వచ్చారు. మెడిటేషన్ టీచర్లు నిర్వహించిన అధ్యయనాల్లో ధ్యానం గురించి పాజిటివ్‌గా రాసినట్లు తెలిపారు. మెడిటేషన్ చేసేవారు ఎలాంటి పనులు చేయకుండా ఉన్నప్పుడు సానుకూల దృక్పథంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. ఒకవేళ వాళ్లు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దూకుడు స్వభావం, పక్షపాత వైఖరిని అదుపు చేసుకోలేకపోతున్నట్లు స్పష్టమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ధ్యానం ద్వారా ఓ వ్యక్తి స్వభావం, భావనలు ఇతరుల మీద ఎలా ప్రభావం చూపుతాయనే అంశం మీద మరింత అధ్యయనం చేస్తున్నామని వర్సిటీకి చెందిన మిగైల్ ఫారిస్ తెలిపారు. పరిశోధన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మంచిమాట
ప్రచండ వాయువు మేఘాలను ఛిన్నాభిన్నం చేసినట్టు పావనమైనటువంటి భగవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. క్రమం తప్పక ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానం చేయకుండా ఉండలేని స్థితికి వస్తారు. జపం ఒక సాధన. ప్రయత్నించి అభ్యసించాలి. మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎందుకంటే, ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే. -
ఒక నిమిషం – ఒక విషయం
ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే– ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’’ అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఆరోగ్యానికి చాలా మంచిది’ అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం (అరటితోట)లోనూ విహరిస్తాడు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. ఆయనకు తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. ధ్యానం... విధానం సుఖాసనంలో.. హాయిగా.. కూర్చుని .. చేతులు రెండూ కలిపి.. కళ్ళు రెండూ మూసుకుని.. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే.. ఏకధారగా.. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా వుండరాదు. ఈ విధమైన ఆలోచనారహిత–స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి.. అపారంగా శరీరంలోకి ప్రవేశించి.. నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత (సంవత్సరాలు) వుంటుందో.. కనీసం అన్ని నిమిషాలు.. తప్పనిసరిగా.. రోజుకి రెండుసార్లుగా.. ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. ధ్యానం వల్ల లాభాలు... ♦ ధ్యానసాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, క్యాన్సరు, గుండెనొప్పి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. దుర్గుణాలు, దురలవాట్లను కూడా పోగొట్టుకోవచ్చు. ♦ మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ♦ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి. ♦ ధ్యాన సాధన చేసిన వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలుగుతారు. ♦ మూఢ నమ్మకాలు, భయాలు పోతాయి. చావు–పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని జయించగలరు. ♦ ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. -
ధ్యానంతో ‘గుండె’ పదిలం
వాషింగ్టన్ : ధ్యానంతో గుండెజబ్బులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులతో బాధపడేవారు ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి వైద్యంతో పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ముప్పు తగ్గుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాలం పాటు ధ్యానం చేసిన వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది..? గుండె జబ్బులను తగ్గించే క్రమంలో ధ్యానం ఉపయోగపడుతుందా? అనే దానిపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు పలు సమీక్షలు జరిపిన తర్వాత తాజా నిర్ణయానికి వచ్చారు. మామూలుగా కూర్చుని చేసే ధ్యానం వల్ల గుండె సంబంధ వ్యాధులు, పనితీరుపై ప్రభావాన్ని గుండెజబ్బుల నిపుణులు పరిశీలించారు. దీనిలో తాయిచి, యోగా వంటి వాటితో గుండె జబ్బుల ముప్పు తగ్గుతున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. విపాసన, జెన్, రాజయోగ వంటి పద్ధతులను ఆచరించే వారిని పరిశీలించగా వారిలో ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, కంటినిండా నిద్ర పోవటంతో పాటు మంచి జీవనం గడుపుతున్నట్లు తేలింది. రక్తపోటు స్థాయిలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. అయితే, ఎంతమేరలో రక్తపోటు తగ్గుతుందనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతేకాదు, గుండె జబ్బులకు ప్రధాన కారణంగా భావించే పొగతాగే అలవాటు కూడా ధ్యానం వల్ల తగ్గినట్లు తేలింది. మొత్తమ్మీద గుండెజబ్బు బాధితులను ప్రమాదం నుంచి కాపాడే ఒక సాధనంగా ధ్యానాన్ని గుర్తించవచ్చని వెల్లడించారు. ‘ఏ ప్రాంతానికి చెందిన వారికైనా ధ్యానం అనుకూలమైన విధానం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుబాటులో ఉన్న రకరకాల పద్ధతుల్లో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. చక్కని జీవన విధానం, వైద్య చికిత్సలతో పాటు ధ్యానం ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.’ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ పేర్కొంది. క్రీస్తు పూర్వం 5000 వ సంవత్సరం నుంచి వివిధ పద్ధతుల్లో ధ్యానాన్ని ప్రజలు ఆచరిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దీనికి పలు మతాలు, తాత్విక ఆలోచనలతో సంబంధాలున్నాయి. అయినప్పటికీ లౌకిక విధానంగా, ఒక వైద్య విధానంగా కోట్లాదిమంది ఆచరిస్తున్నారు. -
ధ్యానం... అంతరయానం!
ఆత్మీయం అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే... అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం (తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. ఆ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికే ధ్యానం చేయడం అవసరం. ధ్యానం అంటే నిర్మలమైన, నిశ్చలమైన నీలోకి నీవు చేసే ప్రయాణం. -
స్వర్గం... నరకం!
ఆత్మీయం బౌద్ధానికీ, తావోయిజానికి జరిగిన సమ్మేళనానికే జెన్ అని పేరు. జెన్ అంటే ధ్యానం అని అర్థం. ధ్యానమంటే లోపల, వెలుపల నిరంతరం ఎలాంటి అడ్డుగోడలు లేకుండా గమనించడం. జెన్ అనేది ఒక జ్ఞానసాగరం. అందులో జలకాలాడి ముత్యాలు ఏరి మానవసమాజానికి అందించిన వారున్నారు. కేవలం మాటలను మాత్రం నమ్మే స్థితి నుంచి బయటపడేసేందుకు, మనిషి మనసుని వాస్తవమనే దాన్ని నేరుగా స్పృశించడానికి, స్వభావాన్ని సహజసిద్ధంగా తెలుసుకుని నడుచుకోవడానికి తోడ్పడేదే జెన్. ‘‘కోపం, గర్వం, ద్వేషం, అసూయ వంటి గుణాలు వీడనప్పుడు జీవితం నరకమవుతుంది. రాగద్వేషాలు లేకుండా సహనాన్ని పాటించినప్పుడు జీవితం స్వర్గమవుతుంది’’ అని చెబుతుంది జెన్. మచ్చుకు ఓ చిన్న కథను చూద్దాం: ఓ జెన్ గురువును కలిసిన సైనికుడు ‘‘స్వర్గం, నరకం అంటుంటారు కదా? అవి ఎలా ఉంటాయి’’ అని ప్రశ్నించాడు. అప్పుడా గురువు ‘‘ఏంటీ నువ్వు సైనికుడివా? నువ్వు ఓ బిచ్చగాడిలా కనిపిస్తున్నావు. నిన్నసలు ఏ చక్రవర్తి సైనికుడిగా నియమించాడు?’’ అని తాపీగా అన్నాడు. ఈ మాటలతో సైనికుడికి ఎక్కడ లేని కోపమొచ్చింది. వెంటనే ఒరలోంచి కత్తి తీసి నరికేస్తానని ఆయన మీదకెళ్ళాడు. కానీ గురువు ఏ మాత్రం చలించలేదు. ‘‘ఇదిగో ఈ నీ కోపావేశమే నీకు నరకం చూపుతుంది’’ అని ఎంతో శాంతంగా చెప్పిన మాటలతో సైనికుడి లో ఆవేశం అణగారిపోయింది. గురువుగారిపై తీసిన కత్తిని తీసినట్లే ఒరలో పెట్టి ఆయనకు నమస్కరించాడు. ఆ వెంటనే గురువు ‘‘ఇదిగో ఈ ప్రవర్తనతో నీకు స్వర్గద్వారాలు తెరచుకున్నాయి’’ అని అతడి కళ్ళు తెరిపించాడు. -
ఏకాగ్రత.. ధ్యానం!
ఆయన ఓ న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ దొంగలను, హంతకులను, రకరకాల నేరాలు చేసే వారిని చూసి చూసి మానసిక ఒత్తిడికి లోనయ్యే వారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడే వారు కాదు. ఇది గమనించిన ఆయన మిత్రులు ఆయనను ఒక జెన్ గురువు దగ్గరకు తీసుకు వెళ్లి పరిస్థితి వివరించి... ‘‘అయ్యా! మీరే ఈయనకు ధ్యానం చేసే పద్ధతి నేర్పాలి....’’ అని గురువుని కోరారు. జెన్ గురువు అలాగే అని రోజూ ఓ గంట పాటు ఆ న్యాయమూర్తికి ధ్యానం నేర్పారు. కానీ న్యాయమూర్తి ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మారడం లేదు. ధ్యానం మీద మనసు నిలపలేకపోయారు. గురువు మాటలు బుర్రకెక్కడం లేదు. ఓ రోజు న్యాయస్థానంలో ఓ కేసు వాదనకు వచ్చింది. ఓ దొంగ పట్టపగలు ఓ అమ్మాయి మెడలో గొలుసు దొంగలించి పట్టుబడ్డాడు. పోలీసులు అతనిని పట్టుకొచ్చి న్యాయమూర్తి ముందు నిలబెట్టారు. న్యాయమూర్తి అతనిని చూశారు. ‘‘దొంగతనం నేరం... పైగా అందరి ముందూ ఓ అమ్మాయి మెడలో గొలుసు లాక్కోవచ్చా...? నిన్ను చూసిన వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరా?’’ అని అడిగారు న్యాయమూర్తి. ఆ దొంగ తల అడ్డంగా ఊపాడు. ‘‘అయ్యా, దొంగిలిస్తున్నప్పుడు నాకు గొలుసు ఒక్కటే పెద్దగా అనిపించింది. చుట్టూ ఉన్న వారెవరూ నా కంటికి కనిపించలేదు’’ అన్నాడు దొంగ. న్యాయమూర్తి పెనునిట్టూర్పు విడిచారు. ‘‘దొంగవెధవా! నీకు ధ్యానం బాగా తెలుసులా ఉంది... ధ్యానానికి కావలసింది ఏకాగ్రత. అది నీవు సాధించావు. అభినందనలు. అయితే అది మంచి పనులకు ఉపయోగించాలి కానీ, చెడుపనులకు ఉపయోగించ కూడదు. ఈసారెప్పుడైనా నీ ఏకాగ్రతను దొంగతనాలకు ఉపయోగించావంటే కఠిన కారాగార శిక్ష తప్పదు. ఇప్పుడు మాత్రం చిన్న జరిమానాతో వదిలిపెడుతున్నాను’’ అని చెప్పి, తాను కూడా ధ్యానంలో ఏకాగ్రత సాధించాలని మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నారు న్యాయమూర్తి. – యామిజాల జగదీశ్ -
‘నేను’ లయమైతేనే కైవల్యం
ఆత్మీయం నీరు ఏ పాత్రలో వుంచితే ఆ పాత్ర ఆకారం పొందుతుంది. మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో యోగి మనసు తేజోమయమవుతుంది. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకృతమై విలీనమవుతాయి. అప్పుడే అనిర్వచనీయమైన చైతన్యానుభూతిని ఆస్వాదిస్తాడు. ధ్యానస్థితిలో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు వుంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ‘ధ్యానం చేస్తున్నాను’ అనే భావన పోతుంది. «ధ్యాన వస్తువు, ధ్యానం చేసే వ్యక్తి మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యాన వస్తువు కూడా లయమైపోతుంది. ద్యానం చేసే వ్యక్తి మాత్రమే మిగులుతాడు. ‘నేను ధ్యానం చేస్తున్నాను’ అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు. ఆ అహంకారం ‘నేను’గా చివరి వరకూ వుంటుంది. ఎవరికైతే ‘నేను’ కూడా లయమైపోతుందో, అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే స్వయంప్రకాశంగా మిగులుతుంది. అదే నిజమైన సమాధి, కైవల్యం. -
నీలోకి చేసే ప్రయాణం ధ్యానం
ఆత్మీయం నీలో, నాలో– మనలో ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ. ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఆ పరమాత్మ. ఆ సత్యాన్ని అవగతం చేసుకుని, ఆయనను చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. ఆ ధ్యానం ‘యోగ’ంలో భాగం. ధ్యానం అంటే ఎవరి మనసులోకి వారు చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు. అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే...అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం(తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. -
ప్రార్థన... అంటే..! దేవునితో సంభాషణే!!
రోజూ ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసికంగా ఎంతో బలం కలుగుతుంది. క్రమబద్ధంగా చేసే ప్రార్థన మనసు బలం పుంజుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ వ్యాకులత, దిగులు లేకుండా గడిపేందుకు తోడ్పడుతుంది. రోజూ ప్రార్థన చేసే అలవాటు లేనివారికి ప్రార్థన చేయడం చాలా కష్టం అవుతుంది. ఏకాగ్రత కుదరదు. అనునిత్యం తోటివారితో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటైన వాళ్లకు ప్రార్థనలో మౌనంగా కూర్చోవడం కష్టమే. సమయం భారంగా కదులుతున్నట్లు ఉంటుంది. నిమిషం... గంటలా దీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. దీనితో సహనం సడలి, ప్రార్థన సరిగా సాగదు. కానీ ఒకరు చెప్పడం వల్ల లేదా ఒకరు శాసించడం వల్లనో ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ప్రార్థనను దినచర్యలో భాగంగా అలవరచుకోవడం అవసరం. అది తెలుసుకుంటే జీవితానికి చాలా ఉపయోగం. స్నానం, భోజనం, ఉద్యోగం, నిద్ర ఎలాగో, ప్రార్థన కూడా అలాగే చేయాలి. ప్రతిరోజూ దైవప్రార్థనతోనే రోజును ప్రారంభించాలి. దైవప్రార్థనతోనే రోజును ముగించాలి. అలా క్రమ క్రమంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే, మెల్ల మెల్లగా అది బాధ్యత కన్నా కూడా భగవంతుడితో విడదీయరాని మహోన్నతమైన బంధంగా మారుతుంది. చివరగా ఒకమాట... ‘మనుషులతో అయితే మాట్లాడవచ్చు’ అనుకునేవారు... మౌనంగా దేవునితో మాట్లాడవచ్చు... అని కూడా తెలుసుకోవాలి. నిజానికి కష్టం సుఖం పంచుకోవడానికి దేవునికి మించిన ఆత్మబంధువు ఎవరున్నారు!? ఆత్మీయం -
ఉపాధ్యాయులకు మెడిటేషన్‌పై శిక్షణ
చేగుంట: స్థానిక పాఠశాలల ఇంగ్లిష్ మీడియం ఉపాధ్యాయులకు బుధవారం మెడిటేషన్ (ధ్యానం)పై శిక్షణ కల్పించారు. హైదరాబాద్ విపశ్యన ధ్యాన కేంద్రానికి చెందిన టీపీ రెడ్డి, మార్కండేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఎక్కువ సమయం బోధించడంతో అలసటకు గురవుతారని, వారికి మానసిక ప్రశాంతత అవసరమని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు సైతం కొంత మానసిక ప్రశాంతత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగాబాయి, సీఆర్పీలు సాయి, సయ్యాజీ, ఆర్పీ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానంతో ఆధ్యాత్మిక ఉన్నతి
సీతానగరం (తాడేపల్లి రూరల్): ఉత్తరాఖండ్‌లోని హట్ వేదానంద తపోవన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరమహంస శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్ సీతానగరంలోని పుష్కర ఘాట్‌లో మంగళవారం స్నానం చేశారు. ధ్యానం, యోగ సాధనపై భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వం అలవరచుకొని కర్మను, బాంధవ్యాలను విడిచి పెట్టకుండా జ్ఞాన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. తాను శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ గురువు వద్ద శిష్యరికం చేసి జ్ఞాన సముపార్జన చేశానన్నారు. సమస్త మానవాళి మానసిక ప్రశాంతతకు ధ్యానం ఒక్కటే మార్గమని భక్తులకు తెలియజేశారు. -
అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం
మాండూక్యోపనిషత్తు హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది. కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా ప్రధానమైన పది ఉపనిషత్తులలో ప్రముఖ స్థానాన్ని పొందింది. సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధానపాత్ర వహించింది. ఓంకారాన్ని ‘ప్రణవం’ అంటారు. అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో అన్ని దశలలో అందించే ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే శాస్త్రీయమైన నాదోపాసన. కులమతాలతో, స్త్రీపురుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం. విశ్వమంతా ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే. ఓంకారమే పరబ్రహ్మ. పరమాత్మ. ఇది నాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది. మొదటిది మెలకువగల బాహ్యప్రజ్ఞ. ఇది అగ్నిస్వరూపం. అగ్నికి ఏడు అంగాలు, పందొమ్మిది ముఖాలు ఉంటాయి. స్థూలమైన అనగా భౌతికదృష్టి కలిగి ఉంటుంది. రెండవది స్వప్నస్థానం. అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమై ఉంటుంది. ఈ తైజసరూపానికి కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది ముఖాలు ఉంటాయి. ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది. ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను ‘సుషుప్తి’ అంటారు. ఇది మూడవ స్థానం. పరబ్రహ్మ సుషుప్తస్థితిలో, ఒకే ఒక్కడుగా, ‘ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై ఉంటాడు. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషో తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ఇతడే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి. అన్నిటి పుట్టుకకు, నాశనానికి మూలకారణం ఇతడే. అద్వైతస్థానం నాలుగవది. ఇదే పరమాత్మ. అంతఃప్రజ్ఞకు, బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ అతీతం. ప్రజ్ఞాసహితమూ కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు. పట్టుకోవడానికి దొరకదు. ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ రహితం. శాంతం, మంగళప్రదం, అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ. దానిని తెలుసుకోవాలి. దానికి ఓంకారమే ఆధారం. వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో లీనం కావడానికి మానవులకు ఆధారమైనది ఓంకారం. ఆత్మ యొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం అవుతాడు. ఆనంద మయుడు అవుతాడు. శబ్దరూపమైన పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారంలో మూడు మాత్రలు ఉన్నాయి. (మాత్ర అంటే చిటిక వేసినంత కాలం). అవి అ, ఉ, మ్ అనే మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి. దానికి మకారాన్ని కలిపితే ఓమ్ అయింది. దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం. దానితో ఓంకారం సంపూర్ణ పరబ్రహ్మం అవుతుంది. ఓంకారంలోని మొదటిపాదం ‘అ’. ఇది జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం. వ్యాప్తి, ప్రథమస్థానం అనే లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ సరిపోతాయి. ఇది తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు. సాధకులలో ప్రథముడు అవుతాడు. ప్వప్నస్థానంలో ైతె జసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది. మాత్ర ఎక్కువదనం వల్ల, రెండిటి మధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి తేజస్సుకీ పోలికలున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టడు. సుషుప్తస్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది. కొలత కొలిచే నేర్పు, గ్రహింపగల శక్తీ ఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం. ఇది తెలుసుకున్నవాడు దేనినైనా అంచనా వేసి తెలుసుకోగలుగుతాడు. అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః ప్రపంచోపశమః శివోద్వైత ఏవ మోంకార ఆత్మైవ! సంవిశత్యాత్మనాత్మానంయ ఏవం వేద, య ఏవం వేద నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు. అది వ్యవహారాలకు అందదు. జ్ఞానేంద్రియాలు ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైతస్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని. ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి బ్రహ్మజ్ఞానం స్వయంగా లభిస్తుంది. ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుంది. సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞానప్రదాయిని మాండూక్యోపనిషత్తు. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
సేవ కూడా సాధనే...
ధ్యానమార్గం యోగ, ధ్యానం ఇవి శరీరాన్ని, మనసును మలినాల నుంచి విముక్తం చేసినా అసలైన సంతృప్తి మాత్రం స్వార్థ రహితమైన సేవ నుంచే వస్తుందని కొందరు యోగ సాధకుల ఉవాచ. పుణ్యక్షేత్రాల సందర్శన, పవిత్ర స్నానాలు, మొక్కులు ఇవి ఊరటను కలిగించవచ్చేమోగాని సాటి మానవునికి సేవ చేయడంలో వచ్చే సంతృప్తికి సమానం కాదని అంటున్నారు. సేవలో నిమగ్నమైతే- కష్టంలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి సాయం చేయడంలో నిమగ్నమైతే మనసు దాదాపు ధ్యానంలో నిమగ్నమైనంతగా శుభ్రపడుతుందని అంటున్నారు. ద్వేషాన్ని నాటితే ద్వేషం, సేవను నాటితే సంతోషం ఫలాలుగా దక్కుతాయనేది గుర్తుంచుకోవాలంటున్నారు. మరణం అనివార్యం. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఈ రోజే సత్యమని ఈ క్షణమే శాశ్వతమని నిష్కల్మషమైన మనసుతో సాటి వారికి ఆనందం కలిగించే పని చేస్తే దైవాన్ని దర్శించినట్టే అని యోగసాధకుల ఉవాచ. -
మంచి నిద్రకు యోగా...
ధ్యానమార్గం అమెరికాలో ఇప్పుడు యోగాకు మంచి ఆదరణ లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కంటే కూడా మంచి నిద్రకు ఇది ఉపయోగపడుతోందని అక్కడి అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ధ్యానం వల్ల నిద్రలేమిని సులభంగా పోగొట్టవచ్చని అక్కడ వైద్యులు పేషంట్లకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, కీళ్ల నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్, పార్కిన్సన్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్నవారు ధ్యానం ద్వారా సుఖ నిద్రను పొందవచ్చని చెబుతున్నారు. శ్వాస మీద దృష్టి పెట్టి సుఖాసనంలో కూర్చుని పాజిటివ్ సంకల్పం తీసుకుంటూ ఉంటే నిద్ర దానికదే వస్తుందట. వెల్లికిలా పడుకుని ఒక చేయి పొత్తి కడుపు మీద మరో చేయి ఛాతీ మీద ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టి మెల్లగా లోనికి తీసుకుంటూ బయటకు వదులుతూ రిలాక్స్ అవుతున్నట్టుగా భావిస్తూ మనసు తేలిక పడుతున్నట్టు ఊహించుకుంటే నిద్ర రావడం ఖాయమని అక్కడి నిపుణులు తెలుపుతున్నారు. -
మౌనం
ధ్యానమార్గం యోగసాధనలో ధ్యానానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. ధ్యానం అంటే ఒకరకంగా మానసికంగా మౌనావస్థకు చేరుకోవడమే. అంటే, ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా మౌనం పాటించనిదే ధ్యానం చేయడం సాధ్యం కాదు. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. మౌనం పాటించడం వల్లనే వారిని మునులు అంటారు. రోజుల తరబడి మౌనం పాటించడం లౌకిక జీవితం గడిపే సామాన్యులకు సాధ్యం కాదు. వారానికోసారి లేదా పర్వదినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో సామాన్యులు కూడా మౌనవ్రతం పాటించడం మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట మేరకు కొందరు లౌకిక జీవితం గడుపుతూనే, అప్పుడప్పుడు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. ఇంతకీ మౌనవ్రతం ఎందుకు పాటిస్తారు? మౌనం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటారా..? మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిరాకు, కోపం, వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానానికి అలాంటి ప్రశాంత పరిస్థితే అవసరం. అందుకే, ధ్యాన సాధనకు ఉపక్రమించేవారు తొలుత మౌనాన్ని ఆశ్రయించాలి. -
పరిశుభ్రత, త్రికరణశుద్ధితోనే సంపూర్ణ ఆరోగ్యం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు విజయనగర్‌కాలనీ: శస్త్ర చికిత్స అవసరమైన వారు కూడా మెడిటేషన్‌తో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ప్రధాని నరేంద్రమోడి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని ఆడిటోరియం హాలులో ‘క్లీన్ నేచర్-క్లీన్ నేషన్’ పేరిట నిర్వహించిన ప్రచారోద్యమ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రతతో పాటు మానవుని ఆలోచనలు కూడా త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించిగలడన్నారు. ఈ ప్రచారోద్యమంలో బ్రహ్మకుమారీలు పర్యావరణ పరిరక్షణ పట్ల మన పూర్వీకుల విజ్ఞత తెలియజేసి ఆ సాంప్రదాయాన్ని ప్రజలు కొనసాగించేందుకు ప్రోత్సహిస్తారన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. విజయకిశోర్ మాట్లాడుతూ కళాశాలలోని 1400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కళాశాల ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతారన్నారు. ప్రతి విద్యార్థి ఈ కళాశాలలో చదివే నాలుగు సంవత్సరాలలో చదువుతో పాటు ప్రకృతి పరిశుభ్రత, దేశ పరిశుభ్రతతో పాటు శాంతి సామరస్యంతో సుందరమైన జీవనాన్ని సాగించగలిగే ఎన్నో అంశాలను నేర్చుకుంటారన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రచారోద్యమం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటిస్తూ ఈ నెల 29న కరీంనగర్లో ముగిస్తుందన్నారు. బ్రహ్మకుమారిస్ సరళా దీదీ, మోహన్ సింఘాల్, లేఖ, జ్యోతి, శాంతి సరోవర్ రిట్రీట్ సెంటర్, గచ్చిబౌలి డెరైక్టర్ రాజయోగిని కులదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణాలతో పాటు గ్రామాలు, పల్లెలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయంటూ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. -
మ్యూజిక్‌తో హ్యాంగోవర్ పరార్..
వారాంతాల్లో పబ్‌లు, పార్టీలు సిటీజనులకు అలవాటైన లైఫ్‌స్టైల్. రాత్రంతా పార్టీ చేసుకొని.. పొద్దున్నే ఈ తలనొప్పి ఏంట్రా దేవుడా.? అని తల పట్టుకొని రోజంతా కూర్చోవడం.. అది కాస్త సండే అయితే హాలీడేని హ్యాంగోవర్‌తో ఇంట్లోనే గడపటం బోరింగ్. ఇక మండే అయితే బాబోయ్.. ఆఫీస్‌కు వెళ్లడం కష్టమే.. వెళ్లినా ఒక పట్టాన వదలని హ్యాంగోవర్‌తో చిక్కులే. అయితే దీన్ని వదిలించుకోవడానికే సులువైన చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. - ఓ మధు మ్యూజిక్ మంత్రం మ్యూజిక్ హ్యాంగోవర్ రిలీవర్‌గా పనిచేస్తుందని, ముఖ్యంగా నాజియా ఫీలింగ్‌ను తగ్గిస్తుందని ఇటీవల విదేశాల్లో చేసిన పరిశోధనల్లో తేలింది. హ్యాంగోవర్ తగ్గాలంటే నిద్రపోవాలి. హాయిగా నిద్రపోతూ రిలాక్స్ కావడానికి స్లో మ్యూజిక్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. సంగీతానికి పిల్లలు, పాములు చలించటమే కాదు ఇప్పుడు హ్యాంగోవర్ కూడా చిక్కిపోవాల్సిందే అంటున్నాయి ఈ పరిశోధనలు. వికారం, నొప్పి నుంచి మనసును మళ్లించడానికి మ్యూజిక్ కన్నా మంచి మందు ఉండదట. మంచి సంగీతం పాజిటివ్ ఆలోచనలను పెంచి మంచి జ్ఞాపకాలను మేల్కొలిపి బాధను తగ్గించేస్తుందన్నది ఈ పరిశోధనల సారాంశం. ధ్యానం ప్రధానం మెడిటేషన్ కూడా హ్యాంగోవర్ తగ్గించేందుకు బాగా పనిచేస్తుందని రుజువైంది. కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం మంచి చిట్కా. అలాగే నచ్చిన వ్యాయామం కూడా మంచి ఫలితాన్నిస్తుందని పరిశోధనలో తేలింది. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చాలా మంది తరచూ పాటించే పద్ధతులు కౌంటర్ పెయిన్ కిల్లర్ హ్యాంగోవర్ వల్ల కలిగే పెయిన్ తగ్గించుకోవడానికి ఈ టాబ్లెట్లు వాడతారు. రీడిహైడ్రేటింగ్ తరచూ నీళ్లు సిప్ చేస్తూ ఉండటం. లేదా స్పోర్ట్స్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, అల్లం టీ లాంటివి తీసుకుంటూ ఉండటం. వివిధ దేశాల్లో హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి పాటించే పద్ధతులు రష్యా: స్టీమింగ్ ద్వారా తల భారాన్ని తగ్గించుకోవడం.. జపాన్: ప్లమ్ తినడం ఇటలీ: కాఫీ సేవనం చైనా: గ్రీన్ టీ తాగడం యూఎస్: టమాటో జ్యూస్ తాగడం లేదా గుడ్లు తినడం పోలాండ్: పికిల్ జ్యూస్ తాగడం నెదర్లాండ్: బీర్ సేవనం -
తపఃఫలం
జ్యోతిర్మయం పూర్వజన్మల్లో చేసిన పుణ్యఫలంగా లభించేది మాన వ జన్మ అయితే, ఆ మానవ జన్మ కూడా తెలుగువాని గా, తెలుగు మాతృభాషగా కలిగి ఉండే రీతిలో లభిం చడం పరమైకాగ్రచిత్తంతో సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితమే తప్ప వేరొకటి కాదు. ‘ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ నాల్పస్య తపసఃఫలమ్’ అని శతాధిక గ్రంథకర్త అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో పుట్టిన అప్పయ్యదీక్షితులు గొప్ప అలంకార శాస్త్ర పండితులు. మరొక ఆరు అంశాలు సుదీర్ఘకాలం తీవ్రంగా చేసిన తపస్సు ఫలంగా లభించేవే. ‘భోజ్యం భోజనశక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనా న్వయా విభవో దానసంపత్తిః నాల్పస్య తపసః ఫలమ్॥ అని ఒక ప్రాచీన కవి పేర్కొన్నాడు. అనాయాసంగా జీవనయాత్ర కొనసాగించా లంటే జీవనాధారమైన భోజన పదార్థాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉండకూడదు. అనల్ప మైన తపస్సు ఇచ్చిన ఫలితంగానే సమృద్ధిగా భోజన పదార్థాలు సిద్ధిస్తాయి. కొరత లేకుండా భోజన పదార్థాలు లభిస్తున్నాయి, కాని వాటిని భుజించే అదృష్టం కొందరికే దక్కుతుంది. పూర్వ జన్మల్లో చేసిన తపస్సు ఫలితంగానే కొందరే దేన్నైనా తినగలిగే ఆరోగ్యవం తులుగా, తిన్నది జీర్ణించుకునే సమర్థులుగా జీవిస్తున్నారు. చాలా మంది కోట్ల ఆస్తులు ఉండి కూడా తినడానికి అవకాశం లేకుండా జీవనం సాగిస్తున్నారు. శ్రోతలను ఆకర్షించగలిగే రీతిలో ప్రవచనం చేసే శక్తి, ఆ ప్రవచనాన్ని సమర్థంగా చేయడానికి అవసరమైన ప్రజ్ఞ కూడా పూర్వ జన్మల్లో చేసిన తపస్సు ఫలంగా లభించేవే. అలాగే తరతరాలకు తరగని సంపదలు లభించడానికీ, ఆ సంపదలకు తగినట్టుగా ఆపన్నుడి దుఃఖం తొలగే విధంగా దానం చేయాలనే భావన కలగడానికి కూడా తపః ఫలమే కారణమని పూర్వకవి నిశ్చితాభిప్రాయం. సంపదలు లభించడమే కాకుండా అవి యజమాని క్షేమానికీ, దీనజనులను ఉద్ధరించడానికి కూడా ఉపయోగపడాలని వివిధ శాస్త్రాలను అభ్యసించడం వల్ల ఏర్పడిన ప్రజ్ఞను శ్రోతలు అలరించే రీతిలో ప్రవచనం చేయగలుగుతున్నట్లుగా ఉపకరిం చాలనీ, భోజన పదార్థాలు సమృద్ధిగా లభించడమే కాకుండా వాటిని తినగలిగే యోగ్యత, జీర్ణించుకునే శక్తి కూడా మానవులకు చాలా చాలా అవసరమనీ, ఇవన్నీ అధిక తపస్సు ఫలితంగానే లభిస్తాయనీ ప్రాచీన కవి భావన. సత్ఫలదాయకమైన తపస్సును ఏకాగ్ర చిత్తంతో కొనసాగించి అధిక సంఖ్యలో ప్రజలు శుభఫలితాలను పొందాలని ఆశిద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
శివం.. సుందరం
మహాశివరాత్రి పర్వదినం.. జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఓంకారనాదం ప్రతిధ్వనించాయి.. శివపంచాక్షరీ జపంతో శ్రీశైలం పులకించింది. వేకువజాము నుంచే పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణమ్మకు వాయినాలు సమర్పించి తమను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. క్షేత్రంలో సాయంత్రం ప్రభోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రాత్రి ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో మల్లన్న పాగాలంకరణ ఘట్టం కొనసాగింది. -
మంచి నిద్ర కావాలా..!
మెళకువ రాని, ఆందోళన లేని నిద్ర కావాలా..! అయితే మీరు రోజూ యోగా చేసేవారైతే ఆ యోగం పడుతుందంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. నిద్రపట్టక బాధపడుతూ.. మాత్రలు వేసుకునే బదులు ప్రశాంతంగా యోగా చేస్తే చాలు, బ్రహ్మాండమైన నిద్ర వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రశాంత స్థితిలో యోగా చేసి, బాగా నిద్రపోతే.. ఆ తర్వత తాము శారీరకంగా, మానసికంగా రోజూ ఏమేం పనులు చేస్తున్నామో, అందులో ఏవి ఆనందాన్నిస్తాయో తెలుసుకోవచ్చని అంటున్నారు. సాధారణంగా కాస్త వయసు మీరిన తర్వాత వచ్చే నిద్రలేమి దరిచేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లవుతుందని సదరు అధ్యయనం వెల్లడించింది. "మనసును నియంత్రించుకుని యోగా చేస్తే నిద్రలేమితో బాధపడే ఏ వయసు వాళ్లయినా ఉపశమనం కలగనుందని మేం చేసిన పరిశోధనలో తేలింది'' అని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన డేవిడ్ బ్లాక్ అన్నారు. ఇందుకోసం వారు సగటున 66 సంవత్సరాల వయసుగల 49 మందిపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. పెద్దవారిలో నిద్ర సమస్యకు పేరుకుపోయిన కొవ్వులాంటి పదార్థాలు కారణమని కూడా ఈ పరిశోధనల్లో తెలిసింది. -
ధ్యానం ద్వారానే శక్తి చేకూరుతుంది...
అకుంఠిత దీక్ష, సూక్ష్మ దృష్టి, నిశిత బుద్ధి, గొప్ప సామర్థ్యం లాంటి సుగుణాలను ఎవరు కల్గి ఉంటారో వాళ్ళే ఘనకార్యాలు సాధిస్తారు. దానికంతటికి ఎంతో శక్తి అవసరం. దాన్ని అన్వేషించగలిగితే విజయాల పరంపరే. అది ఎక్కడి నుంచి వస్తుందన్నదే అందరి ప్రశ్న. శక్తి అనేది భక్తి భావంతో కూడిన ధ్యానం ద్వారానే సాధ్యం అని శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి అభిప్రాయపడ్డారు. శిష్యుల్లో చైతన్యం కల్గించేవారే గురువు. ఉత్తమ గురువనే వారు విజ్ఞాన సంపన్నుడై ఉండాలి. లౌకిక - అలౌకిక విషయాలపై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. వాటిని చేధించే మార్గాలు తెలిసి, శిష్యులచే సాధన చేయించే సామర్థ్యం కల్గి ఉండాలి. ఉత్తమ శిష్యులకు విజ్ఞానం - తపస్సాధన ఈ రెండు లక్షణాలు తప్పని సరి. ప్రతి వ్యక్తీ తన జీవితం సుఖవంతం కావటానికి సద్గురువును ఆశ్రయించాలి. గురువు అనుగ్రహం పొందగలిగినప్పుడే జీవితం ఫలప్రదమవుతుంది. మానసిక ప్రశాంతత.. ఇప్పుడు తరచు వినవస్తున్న ప్రశ్న మానసిక ప్రశాంతత. ఇది రెండు మూడు రకాలుగా వస్తుంది. దీన్ని సాధించడం సులువే. వివేకం.. ధ్యానం.. సాధన.. ఎవ రైతే వీటిని చిత్తశుద్ధిగా ఆచరించగలుగుతారో వారు నిజజీవితాన్ని జయించినట్లే. ఇవి సాధించటం కష్టసాధ్యమేమీ కాదు... చాలా సంఘటనలు బయట వింటూ ఉంటాం. ఓ పరిశ్రమకు కొత్త అధికారి వస్తారు. ఆయనకు ధ్యానంపై అవగాహన ఉంటుంది. రోజూ తమ ఉద్యోగులతో కొంత సేపు ధ్యానం చేయిస్తాడు. తర్వాతనే విధుల్లోకి పంపుతారు. అలా చేయటంతో పరిశ్రమ పురోభివృద్ధి చెందిందని వింటూ ఉంటాం. అలాగే మానసిక ప్రశాంతతకు కూడా ధ్యానమే సరైన మార్గం అంటాను. యువత - కార్యసాధన.. యువత కార్యసాధకులు అవ్వాలి. అమృతం లభించేవరకు పాల సముద్రాన్ని మధించినట్లుగా. జీవిత పయనంలో ఎన్నో ఎన్నో ఎదురౌతాయి. వాటిని నిరంతర భక్తి ద్వారానే ఎదుర్కొవచ్చు. ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా పూనుకొన్న పని నెరవేరే వరకూ వదలనే వదలరు. ఉత్తమ శిష్యులకు ఒక తలంపు రావాలి. అదే భక్తి భావం. ఆకలితో అలమటిస్తున్నవారకి ఆహారం ఇస్తే అది దైవానికి సమర్పించే నైవేద్యం వంటిదే. ‘దుఃఖపూరితమైన ఈ ప్రపంచంలో నిజమైనది ప్రేమ బిందువే. అది సముద్రమంత గొప్పది. కష్టనష్టాల తర్వాతే సుఖాలు. ఆధ్యాత్మిక సాధన... వివేకవంతంగా ధ్యానం కొనసాగిస్తే దైవభక్తి అబ్బుతుంది. ఒకవేళ ఆ మార్గంలో అవరోధాలేమైనా ఎదురైతే వాటిని దైవానుగ్రహంతో జప, హోమాలతో ఎదుర్కొనవచ్చు. మానవుడికి ఎదురయే కష్టనష్టాలను తొలగించగలిగేది దైవానుగ్రహమొక్కటే! అందుకు సాధన చాలా ముఖ్యమైంది. దైవం బోధపడితే దైవధర్మం బోధపడుతుంది. మోక్ష మార్గం.. మానసిక సన్యాసం చాలా ముఖ్యమైంది. దీన్ని పొందగలిగినవాడు మోక్షాన్ని పొందగలడు. ఈ సృష్టిలో కనిపించేదంతా అశాశ్వతం. ఆ విషయాన్ని బాగా తెలుసుకొన్న వారెవరైనా సరే మోక్షానికి దగ్గరైనట్లే. జీవితంలో మార్పులన్నింటికీ కాలమే ప్రధాన కారణం. బుద్ధిమంతులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాపాలన్నింటినీ పోగొట్టుకుంటారు. ఆ తర్వాత సాత్వికుడుగా మారిపోతారు. దీనిని ఇప్పుడిప్పుడే అందరూ గ్రహిస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సంతోషకర పరిణామం. వివేకవంతులు... ప్రవాసాంధ్రులు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు గదా. వారు వివేకవంతులు కాబట్టే పుట్టిన గడ్డను వదిలి దూరంగా ఉన్నా ఇష్టంగా ఆచరిస్తున్నారు. వివేకవంతులకు సూక్ష్మదృష్టి ఉంటుంది. అందుకే వారు ఖండాంతరాల్లో కూడా విజయకేతనం ఎగురవేస్తున్నారు. ప్రజ్ఞావంతులకు వారిలోని ప్రజ్ఞతోబాటు భక్తి, ప్రేమ, కరుణ, దయ అన్నీ తగుపాళ్లలో ఉంటాయి. అందుకే స్వదేశంలోనే కాదు, విదేశాలలో కూడా రాణించి, నిలదొక్కుకొని విజేతలు అవుతున్నారు. ఇక్కడ అలా జరగటం లేదు. ఏదేమైనా సకల జనులకు భక్తి భావం అబ్బి, సుఖసంతోషాలతో వించాలని ఆశిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను. - కోన సుధాకర్ రెడ్డి, సాక్షి -
ధ్యానం జ్ఞానం
కడ్తాల/ఆమనగల్లు: ధ్యానం చేయడం వల్ల మనస్సులోని దివ్యత్వం బయటికి వచ్చి, స్వానుభవం పొందడమే ధ్యానమని ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ధ్యాన సంబరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున 5 నుంచి 7గంటల వరకు పత్రీజీ ఆధ్వర్యంలో సామూహిక వేణుగాన ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులను ఉద్దేశించి పత్రీజీ సందేశమిచ్చారు. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యా స, గొప్పపుస్తకాలు చదవడం, మంచివారితో స్నేహం చేయడం, మౌనం, శాఖాహారం తదితర పనులతో చిన్నప్పటి నుండే సాధన చేయడంతో ధ్యానం నేర్చుకోవచ్చని చెప్పారు. ధ్యానం చేస్తే వారికి వారే మిత్రుడని, ధ్యానం తెలిసినవారు యోగిలా ఉండాలన్నారు. వైరాగ్యాన్ని తిప్పికొట్టేందుకు ధ్యానం పుట్టిందన్నారు.సూక్ష్మశరీరం అనేక లోకాలు తిరిగి జ్ఞానం నేర్చుకోవడమే ధ్యానమన్నారు. భూలోకం గొప్ప ఆధ్యాత్మీక పాఠశాల అని, ఆధ్యాత్మిక అనుభవాలు పొం దడానికి మనమంతా భూలోకానిక వచ్చామని పత్రీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన పుస్తకాలు ఆవిష్కరించడంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టార్లు తమధ్యాన అనుభవాలను వివరించారు. రాత్రి నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానుల ను ఆకట్టుకున్నాయి. ముంబైకి చెందిన పండిత్ మిలింద్ రాయ్కర్ వాయలెన్ సంగీతం, ఖమ్మంకు చెందిన వికలాంగుడు అరుణ్‌కుమార్ నృత్యం, స్నేహలత భరతనాట్యం, అశ్వని కూచిపూడి నృత్యం అలరించాయి. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం పిరమిడ్‌ను సందర్శించేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సాంబశివరావు, నందప్రసాద్, జెవీ రమణ, ప్రేమయ్య, రవిశాస్త్రి, నిర్మల, మాధవి, మల్లిఖార్జున్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
శ్రేష్ఠమైన దానం
సిద్ధార్ధ రాకుమారుడు రాజ్యం వదిలి, దాదాపు ఆరేళ్లు ధ్యానం చేసి, జ్ఞానోదయం పొంది, బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన సంవత్సరానికి తిరిగి తన కపిలవస్తు రాజ్యానికి వచ్చాడు. అప్పటికే బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొడుకు ఒక భిక్షువుగా వచ్చాడని ఆయన తల్లిదండ్రులు కొంత బాధపడ్డా, కుమారునికి మంచి వస్త్రాన్ని బహూకరించాలని అనుకున్నారు. బుద్ధుని తల్లి గౌతమి తాను స్వయంగా అందమైన వస్త్రాన్ని నేసి కుమారుని దగ్గరకు తీసుకు వెళ్లింది. ‘‘నాయనా.. ఇది నా కానుక. తీసుకో’’ అంది. అందుకు బుద్ధుడు, ‘‘అమ్మా.. నీ వాత్సల్యానికి సంతోషం. ఈ వస్త్రాన్ని మా బౌద్ధ సంఘానికి బహూకరించు’’ అన్నాడు. ‘‘లేదు నాయనా. ఇది నీ కోసమే అల్లాను. నీవు నీ సంఘానికి నాయకుడవు. గొప్పవాడవు. పైగా నా బిడ్డవు’’ అంది గౌతమి. ‘‘నిజమే. కానీ అమ్మా.. ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే మరింత గొప్పది. ఉన్నతుడైన ఒక వ్యక్తి కంటే చెడ్డవారితో ఉన్నప్పటికీ ఆ సంఘమే గొప్పది. సంఘమే ఉన్నతమైనది. వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది. వ్యక్తి కంటే సంఘానికి చేసే దానమే శ్రేష్ఠమైన దానం’’ అన్నాడు. బుద్ధుని మాటలు విని గౌతమి ఆ నూతన వస్త్రాన్ని సంఘానికి దానం చేసింది. - బొర్రా గోవర్ధన్ -
కప్ప
ఇన్ని మెట్లు ఎట్లా ఎక్కి వచ్చిందో! కుర్చీ కింద చేరి ధ్యానం చేసుకుంటుంది. సన్నటి రంధ్రాల్లో గరుడ పచ్చలు పొదిగినట్టున్న కళ్లు మెడ లేకున్నా గొంతులో దాచుకున్న బెకబెకల శబ్ద సర్వస్వం పైకి చూస్తుందా తనలోకి చూసుకుంటుందా చెప్పడం కష్టం. దాని కళ్లలో తడియారని నీటి తళకులు. రసాత్మక వాక్యంలో కావ్యాన్ని బంధించినట్లు దాని కంటి పొరలపైన సముద్రాలను చదువుకోవచ్చు అక్షరాలు నన్ను చుట్టుముట్టినప్పుడు కవిత్వంగా మారిపోతాన్నేను పెన్ను ముడిచేసరికి కుర్చీ కింద కప్ప లేదు ఇల్లంతా వెతికినా కప్పకు సంబంధించిన ఖాళీలే తప్ప కాకరకాయ చర్మం లాంటి దాని వీపు కనపడలేదు ఎక్కడ పుట్టిందో! అడవులు పిచ్చుకకు లోకువయినట్లు కప్ప ఏ మహా సాగరాలను లొంగదీసుకుందో ఎగిరి గంతేసేటప్పుడు దాని సాగదీసిన చలన సౌందర్యం మనసు కాన్వాసుపై ముద్రించుకుపోయింది ఏ విశాల వర్షాలు రాల్చిన మృదు చర్మాంబర ధారియో కదా కప్ప చిన్నప్పటి మా ఊరి మడుగంతా కప్పల మహోత్సవంతో సవ్వడి చేసేది ఇప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడల్లా కప్ప గుర్తుకొస్తుంది అప్పుడప్పుడు నా నిద్రలో ప్రవేశించి సుప్త చేతనను జాగృతం చేస్తుంది - డా. ఎన్.గోపి -9391028496 -
కూల్‌గా...దూసుకెళ్లండి!
మన దేశంలో టాప్ స్పోర్ట్స్‌మెన్‌కు ప్రత్యేకంగా మెంటల్ కోచెస్ ఉంటారు. వారి సలహాలు ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. అయితే ఆ సలహాలను ఆటకు మాత్రమే కాదు...మన నిజజీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. జీవితం అనేది నాటకమే కాదు... ఆట కూడా. మానసిక నిపుణులు తరచుగా ఆటగాళ్లకు చెప్పే విషయాలు, వాటిని మనకు ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం... విజువలైజేషన్... విజువలైజేషన్ గురించి ఆటగాళ్లకు తరచుగా చెబుతుంటారు. జరగబోయే ఆటను విజువలైజ్ చేసుకోవడం వల్ల ఆట గురించి ఒక స్పష్టమైన చిత్రం మెదడులో రూపుదిద్దుకుంటుంది. ఎక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ మన బలప్రదర్శనకు అవకాశం ఉంది...మొదలైన విషయాల్లో స్పష్టతకు రావచ్చు. ఇప్పుడు మన విషయానికి వద్దాం... ఉన్నట్టుండి ఆఫీసులో పెద్ద ప్రాజెక్ట్ బాధ్యతలు మీకు అప్పగించారు. ఆ ప్రాజెక్ట్‌ను మీరు విజయవంతం చేయాలంటే విజువలైజ్ చేసుకోవడం అవసరం. 1.పని ఇలా ఉండబోతోంది. 2.నా బలహీనతలు ఇవి. బలాలు ఇవి. 3.ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయంలో ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఇలా అధిగమించాలి. 4. ముందుగా అనుకున్న దారిలో వెళుతున్నప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోతే ‘ప్లాన్ బి’ సిద్ధంగా ఉంచుకోవాలి. స్థూలంగా చెప్పేదేమిటంటే, ‘మెంటల్ ఇమేజరీ’ అనేది మన ఆలోచనలను పదును పెడుతుంది. ఎన్నో పరిష్కారాలను శ్రమ లేకుండా అందిస్తుంది. ధ్యానం చేస్తే జయం మనదే.... రాహుల్ ద్రావిడ్ రిటైరైనప్పుడు ఆయన భార్య విజేత మీడియాకు ఒక విషయం చెప్పారు... ‘‘ఆటకు ఒక రోజు ముందు రాహుల్ తన గదిలోకి వెళ్లి మెడిటేషన్, విజువలైజేషన్ ఎక్సర్సైజులు చేసేవారు’’ అని. పరాజయానికి ఆప్తమిత్రులు...ఒత్తిడి, గందరగోళం. పని చేసే సామర్థ్యం మనలో ఉన్నప్పటికీ ఈ రెండు లక్షణాల వల్ల ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. అందుకే మనసును తేటగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని చిత్తడి చేయడానికి ధ్యానం చేయడం అవసరం. మనసు బలంగా ఉండడానికి ఇది ఎంతో అనివార్యం. పాజిటివ్ సెల్ఫ్‌టాక్... ఎవరైనా తమలో తాము మాట్లాడుకుంటుంటే వింతగా చూస్తాం. నిజానికి ఇలా మాట్లాడుకోవడం అనేది గొప్ప లక్షణం అంటుంది స్పోర్ట్స్ సైకాలజీ. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లందరికీ ఈ అలవాటు ఉంది! భయం, సందేహం, సంక్లిష్టం...ఇలా అనేక విషయాలకు పరిష్కారాలను మనలో మనం మాట్లాడుకోవడం ద్వారా పొందవచ్చు. మనలో మనం మాట్లాడుకునే సమయంలో మనమే ప్రశ్న అవుతాం. సమాధానం మనమే అవుతాం. మనలో మనం మాట్లాడుకునేదంతా మంచిదే అని కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పాజిటివ్ సెల్ఫ్టాక్కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని పాజిటివ్ సెల్ఫ్-ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. కాన్స్టంట్ లెర్నర్... క్రీడారంగంలో ‘కాన్స్టంట్ పెర్ఫార్మెన్స్’ అనేది భ్రమ అని చెబుతుంటారు. అయితే జీవితమనే ఆటకు ఈ సూత్రం వర్తించకపోవచ్చు. నిరంతరం నేర్చుకోవడం అనేది నిరంతర విజయాలకు కారణమవుతుంది. ‘‘నువ్వు ఆడిన ప్రతి చెత్త ఆట నుంచి కనీసం పది విషయాలు నేర్చుకోవచ్చు’’ అని చెబుతోంది స్పోర్ట్స్ సైకాలజీ. ఇక మన విషయానికి వస్తే ప్రతి పొరపాటు నుంచి పది పాఠాలు నేర్చుకోవచ్చు. కాన్స్టెంట్ పెర్ఫార్మర్గా మనల్ని మనం నిరంతరం రుజువు చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి... ఆటగాళ్లకు ఇలా చెబుతుంటారు: ‘మీ పాత్రను అర్థం చేసుకోండి. పర్సనల్‌ను, ప్రొఫెషనల్న వేరు చేయండి.’ ఒక పని చేయడానికి ముందు...మనం ఏదైనా కావచ్చు. పని చేపట్టి తరువాత మాత్రం ‘నేను ఇది’ ‘నేను ఇలా మాత్రమే ఉంటాను’ ‘నేను ఇలా మాత్రమే చేయగలుగుతాను’....ఇలాంటి ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టండి. పనిలో మీ పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోండి. విజయానికి సాధన చేయండి. శుభం