
ఆస్తికం, నాస్తికం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. ఆస్తికులు భక్తి బాట పడితే.. నాస్తికులు సైన్సును నమ్ముతారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ప్రముఖ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే.. ఆయన స్నేహితుడు, విశ్వనటుడు కమలహాసన్ నాస్తికతకు ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా నటి నయనతార పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా గుళ్లు, గోపురాలు తిరిగొచ్చారు.
(ఇది చదవండి: బుల్లితెరపై యాంకర్‌గా సన్నీలియోన్.. ఎవరికి చెక్ పెడుతుందో)
తాజాగా మరో యువ నటి ఆత్మిక సైతం నయనతార, రజినీకాంత్ తరహాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. హిప్ హాప్ తమిళా ఆదికి జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కోడియిల్ ఒరువన్, కాట్టేరి, కన్నై నంబాదే, తిరువిన్ కాదల్ చిత్రాల్లో నటించారు. కాగా ఈమె ప్రస్తుతం భక్తి బా ట పట్టడం విశేషం. ఆద్మిక ప్రస్తుతం రజినీకాంత్ తరహాలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబాజీ గుహలో ధ్యానం చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
దీని గురించి ఆత్మిక స్పందిస్తూ తన ఆధ్యాత్మిక పయనం అన్నది ఆత్మ ఆదేశం అని పేర్కొన్నారు. బాబాజీ గుహకు వెళ్లాలని దైవమే పిలుపు వచ్చిందన్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరినట్లు చెప్పారు. అయితే ఇది తనకు మరణ అనుభవాన్ని చవిచూసే అనుభవమని పేర్కొన్నారు. అయితే కొన్ని మంచి పరిణామాలు సులభంగా కలిగాయని చెప్పారు. బాబాజీ గుహలో ధ్యానం కోసంకూర్చున్నప్పుడు కలిగిన దైవిక అనుభూతిని జీవితాంతం మరిచిపోలేనన్నారు. ఆ తర్వాత జీవితంపై తన దృష్టి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ లోకంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందాలని ఆత్మిక పేర్కొన్నారు.
(ఇది చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!)
Comments
Please login to add a commentAdd a comment