ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Star Heroine Nayanthara Bio Documentary Film Streaming Date Revealed | Sakshi
Sakshi News home page

Nayanthara: ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Oct 30 2024 12:53 PM | Last Updated on Wed, Oct 30 2024 1:41 PM

Star Heroine Nayanthara Bio Documentary Film Streaming Date Revealed

సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్‌ సరసన జవాన్‌ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్‌డేట్స్‌ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్‌ ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్‌ చేయించుకుందని సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 

(ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్‌ ఏం లేదు!)

అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్‌కు నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement