Star heroine
-
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్‌తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం విశేషం. -
Deepika Padukone Unseen Photos: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బర్త్‌డే స్పెషల్.. ఈ రేర్ ఫొటోలు చూశారా?
-
7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్
బెంగాలీ తెర ప్రథమ మహిళగా చెప్పుకునే కానన్ దేవి ఇప్పటితరానికి తెలిసే ఆస్కారమే లేదు. చిన్నతనంలోనే సింగర్‌గా, నటిగా వెండితెరపై అడుగుపెట్టిన ఆమె పురుషాధిపత్యం ఉన్న రోజుల్లోనే వెండితెరపై మకుటం లేని మహారాణిగా నిలిచింది. రంగుల ప్రపంచంలో ఎన్నో విజయాలు చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం కన్నీటి కష్టాల సుడిగుండాలను దాటుకుంటూ ముందుకు సాగింది. ప్రేక్షకలోకానికి వినోదం పంచిన ఈ స్టార్ హీరోయిన్ 1992లో అనాధగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. అసలు ఎవరీ కానన్ దేవి? తన జీవిత కథ, వ్యధ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. తండ్రి మరణంతో ఆర్థిక కష్టాలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది కానన్ దేవి. 1916 ఏప్రిల్ 22న ఆమె ఈ లోకంలోకి అడుగుపెట్టినప్పుడు తను కోటీశ్వరురాలవుతుందని ఎవరూ ఊహించలేదు. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ ఈమె తల్లిదండ్రులు. తండ్రి దగ్గరుండి కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు. కొంతకాలానికే అతడు కన్నుమూయడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని వెంటాడాయి. ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో ఇంటి యజమాన్ని కానన్ కుటుంబాన్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఆరేడేళ్ల వయసులో పనిమనిషిగా మారిన కానన్ దిక్కు తోచని స్థితిలో ధనవంతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు తల్లీకూతుళ్లు. తలదాచుకోవడానికి నిలువ నీడ లేని వీరికి ఓ బంధువు ఇల్లు ఇచ్చి అందులో ఉండమన్నాడు. దేవుడిలా వచ్చి సాయం చేశాడనుకునేలోపే అతడు తన నిజస్వరూపం చూపించాడు. పట్టుమని ఏడేళ్లు కూడా లేని కానన్‌తో ఆమె తల్లితో బండచాకిరీ చేయించుకున్నాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది సహించలేకపోయిన కానన్ ఆ ఇంటి నుంచి తల్లితో పాటు బయటకు వచ్చేసింది. బాలనటి నుంచి స్టార్ హీరోయిన్గా ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో కోల్‌కతాను వదిలి తిరిగి హౌరా వెళ్లిపోయారు. వేశ్యాగృహాలకు సమీపంలో ఓ గది అద్దె తీసుకుని జీవించారు. వీరి కుటుంబ స్నేహితుడైన తులసి బెనర్జీ.. కానన్‌ను చూసి తను సినిమాల్లో రాణించగలదని గ్రహించాడు. అప్పుడు కానన్ వయసు 10 ఏళ్లు. మదన్ మూవీ స్టూడియో.. 'జైదేవ్' అనే సినిమాలో ఆఫర్ ఇచ్చింది. ఇందుకుగానూ కానన్ అందుకున్న నెల జీతం రూ.5/-. 1928-31 మధ్య బాలనటిగా పలు చిత్రాలు చేసింది. అదే సమయంలో గాయనిగానూ సత్తా చాటింది. శంకరాచార్య, రిషిర ప్రేమ్, జోరేబరత్, విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మురిపించింది. ఇందులో విష్ణుమాయ, ప్రహ్లాద్ సినిమాల్లో బాలనటుడిగా కనిపించింది. (చదవండి: టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్న ఈ అన్నదమ్ములను గుర్తుపట్టారా?) మేడమ్ సర్ మేడమ్ అంతే.. 21 ఏళ్లకే హీరోయిన్గా మారిన కానన్ అందానికి, నటనకు దాసోహం కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. తక్కువకాలంలోనే వెండితెర సూపర్‌స్టార్‌గా అవతరించింది. పాట పాడినందుకు రూ.1 లక్ష, సినిమాలో హీరోయిన్గా నటించినందుకు రూ.5 లక్షలు తీసుకునేది. మొత్తంగా కానన్ 40 పాటలు పాడగా దాదాపు 57 సినిమాలు చేసింది. హీరోలకు సలాం కొడుతున్న రోజుల్లో అందరిచేతా మేడమ్ అని పిలిపించుకున్న మొదటి హీరోయిన్ ఈవిడే! ఈమె దిగ్గజ నటులు కేఎల్ సెఘల్, పంకజ్ మాలిక్, ప్రథమేశ్ బరువా, పహరి సాన్యల్, చబీ బిస్వాస్, అశోక్ కుమార్ వంటి హీరోల సరసన నటించింది. హీరోలకు తీసిపోని రేంజులో కోటీశ్వరురాలిగా ఎదిగింది. కలిసిరాని రెండు పెళ్లిళ్లు కానన్ 1940 డిసెంబర్లో బ్రహ్మ సమాజ సభ్యులు హిరంబ చంద్ర మిత్ర కుమారుడు అశోక్ మిత్రాను పెళ్లాడింది. కానీ వీరి సంసార జీవితం సజావుగా సాగలేదు. పెళ్లైన ఐదేళ్లకే అతడికి విడాకులిచ్చింది. 1949లో బెంగాల్ గవర్నర్ దగ్గర ఏడీసీగా పని చేసిన హరిదాస్ భట్టాచార్జితో పెళ్లిపీటలెక్కింది. కానన్‌ను పెళ్లి చేసుకున్న హరిదాస్ దర్శకుడిగా తన లక్ పరీక్షించుకున్నాడు. కానీ అందరూ అతడిని కానన్ భర్తగానే గుర్తించారు. ఇది జీర్ణించుకోలేకపోయిన అతడు 1987 ఏప్రిల్ 4న భార్య ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. వీరిద్దరూ విడివిడిగా జీవించారు, అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. 1992 జూలై 17న కానన్ దేవి 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. తనను చివరి చూపు చూసేందుకు కూడా హరిదాస్ రాకపోవడం గమనార్హం. ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆమె అనాధగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. కానన్ దేవి చిత్రపరిశ్రమకు అందించిన సేవలను గుర్తించిన తపాలా శాఖ 2011లో ఆమె పేరిట ఓ స్టాంపును విడుదల చేసింది. చదవండి: దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్ బోలెడన్నిసినిమాలు చేసినా ఇప్పటికీ బ్రేక్ రాలే.. అమ్మడి టైం ఎప్పుడు మారుతుందో! -
తగ్గేదే లే అంటున్న స్టార్ హీరోయిన్లు
-
నటనకు గ్లామర్
ఇద్దరు పిల్లలకు తల్లి. ఎవ్వరూ నమ్మరు. నిజమో? కాదో? అయినా నమ్మించింది. తరచూ ఇండస్ట్రీ గ్లామర్‌ను తెచ్చుకునిదానికి నటన నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిని చూడండి నటనకు గ్లామర్ నేర్పించింది. నటికి నటనే ఐశ్వర్యం అనిపించింది. తమిళంలో ఆల్రెడీ మీరు స్టార్ హీరోయిన్. కానీ తెలుగులో కొత్త హీరోయిన్గా మొదలుపెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే బేసిగ్గా నా మాతృభాష తెలుగు. కానీ, నేను పుట్టి, పెరిగింది, స్కూల్, కాలేజ్ అంతా చెన్నైలో. నాన్నగారు(రాజేష్) ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు తెలియడం వల్ల ఈ ఇండస్ట్రీ కొత్త అనే భావన కలగలేదు. చెన్నైలో పుట్టి, పెరిగారు కదా. కొందరు మరచిపోతారు లేదా స్పష్టంగా మాట్లాడలేరు.. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. బయట తమిళ్లో మాట్లాడతాను. అది కూడా చాలా ఫ్లూయెంట్‌గా. చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల తెలుగుతో పోలిస్తే తమిళ్ చాలా బాగా మాట్లాడతా తమిళంలో చేసిన ‘కణా’ను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్? తెలుగులో భీమనేని శ్రీనివాస్‌గారు డైరెక్ట్ చేశారు. ఆయన రీమేక్ కింగ్. మనందరికీ తెలుసు. పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు హీరోయిన్లంటే ఫేస్‌లో కొంచెం అందంగా కనిపించాలనే ఫీలింగ్ ఉంది. అలా కాకుండా న్యాచురల్‌గా చేశాను. సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ని చూసినట్టు ఉండదు.. కౌసల్య పాత్రని మాత్రమే చూస్తారు. తెలుగు తెలుసన్నారు. డబ్బింగ్ చెప్పుకున్నారా? నేనే డబ్బింగ్ చెప్పాను. చాలా తమిళ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నేను ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాకి చెబుతుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కానీ, చాలా బాగుంది. తెలుగులో నేను ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నా. విజయ్ దేవరకొండ సినిమాలో నా పాత్ర తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడాలి. అది డబ్బింగ్ చెప్పడం నాకు ఇంకా చాలెంజింగ్‌గా ఉంటుందనుకుంటా. క్రికెట్టంటే మెన్గేమ్ అన్నట్టుంటుంది. మరి ఫీమేల్ క్రికెటర్‌గా నటించడం చాలెంజింగ్‌గా ఉందా? కచ్చితంగా. అందుకే నేను ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నా. క్రికెట్ చూస్తాను. కానీ ఎప్పుడూ బ్యాట్, బాల్ పట్టుకుంది లేదు. ఈ సినిమా కోసం కార్క్ బాల్తోనే ప్రాక్టీస్ చేశా. ఆ బాల్ చాలా హార్డ్‌గా ఉంటుంది. టెక్నిక్‌తో ఆడాలి. అది తెలియక దెబ్బలు తగిలించుకున్నా కూడా. ప్రాక్టిస్‌లో బౌలింగ్‌పై చాలా శ్రద్ధ పెట్టా. ‘కణ’ చిత్రానికి కంప్లీట్‌గా ఆరు నెలలు ప్రొఫెషనల్‌తో ట్రైనింగ్ తీసుకున్నా. సిన్సియర్‌గా చేశా. ఫీమేల్ సెంట్రిక్ మూవీని క్యారీ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అందరికీ దొరకదు. దొరికినా మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరం. ఒక హీరోలాగా.. హీరోయిన్ స్క్రీన్‌పై కనిపించగానే కింద ఉన్నవాళ్లంతా అరుస్తున్నారంటే అదే స్టార్ వ్యాల్యూ. ఒకమ్మాయి తెరపై కనిపిస్తే ఎంత స్పందన వస్తుంటే అంత స్టార్ వ్యాల్యూ ఉన్నట్టు. ఒక హీరోయిన్‌కి ఓపెనింగ్స్ ఉండాలంటే తను పెద్ద స్టార్ అయ్యుండాలి. నేను ఇండస్ట్రీకొచ్చిన ఆరేళ్లలో చాలా సినిమాలు చేశా. ఈ అమ్మాయి మంచి పాత్రలు చేస్తుందన్నది నా ప్రత్యేకత.. ఈ అమ్మాయి మీద పెట్టుబడి పెడితే తిరిగి వస్తుందనిపించుకున్నప్పుడే మనం ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేయాలి. ‘కణా’ తో ఐశ్వర్యా రాజేష్ అంటే మంచిగా చేస్తుంది, డబ్బులు కూడా వస్తాయని పేరొచ్చింది. దాని తర్వాత నేను చెత్త సినిమాలు చేస్తే కరెక్ట్ కాదు. నేను కూడా స్మార్ట్‌గా మూవ్ చేయాలి. హీరోయిన్స్ సినిమాను సింగిల్‌గా లాగేస్తున్నప్పటికీ, హీరో, హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్ తేడా చాలా ఉంది కదా... మీరెలా ఫీలవుతున్నారు? ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. తెలుగు, తమిళ సినిమా ఏదైనా అంతే. కానీ, హిందీ సినిమా అలా కాదు. దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్‌కి హెవీగానే ఇస్తున్నారు. వారు 15, 20 కోట్లు వసూలు చేస్తున్నారు ఇంచుమించు హీరోలతో సమానంగా. ఎందుకంటే వాళ్లు చాలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయి, బిజినెస్ ఉంది. అలా కూడా మన ట్రెండ్ మారితే బావుంటుంది. ఇప్పుడు నయనతారకి 5 కోట్లు ఇస్తున్నారంటే రెమ్యూనరేషన్ పెంచినట్టే కదా. హిందీలో ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, సోనమ్ కపూర్.. ఇలా అందరూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వాళ్లకీ బిజినెస్ ఉంది. వ్యాపారాన్ని బట్టే కదా రెమ్యునరేషన్ ఇస్తారు. క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడుతున్నారు.. భవిష్యత్తులో నిర్మాత అయ్యే ఆలోచనలున్నాయా? అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిర్మాత అవ్వాలంటే మనకి ఆర్థిక స్థోమత ఉండాలి. నిర్మాత జాబ్ అంత ఈజీ కాదు. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. మీ సినిమాలను గమనిస్తే గ్లామర్ సైడ్ వెళ్లకుండా ట్రెడిషనల్ రోల్సే ఎక్కువ చేశారు. అదేం లేదు. నాకు ఏది సరిపోతుందో ఆ పాత్రలు చేస్తా. నాకు కూడా ప్రయోగాలు చేయాలని ఉంది, భవిష్యత్తులో చేస్తా. గ్లామర్ పాత్రలంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. గ్లామర్‌కీ వల్గర్కి ఓ చిన్న లైన్ ఉంది. చూసినప్పుడు అందంగా కనిపిస్తే గ్లామర్ అంటారు.. చూసిన వెంటనే ‘అబ్బ.. ఏందిరా ఇది’ అంటే అది వల్గర్ అన్నమాట. ఎలాంటి గ్లామర్ నాకు సూట్ అవుతుందన్నది ఫస్ట్ నాకు తెలియాలి... దాన్నే గ్లామరస్ అంటారు. నా క్యారెక్టర్స్ వరకూ అన్నీ తల్లిగా, చెల్లిగా, స్కూల్ అమ్మాయిగా చే శా. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో 16 ఏళ్ల అమ్మాయిగా చేశాను. హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. కెరీర్ పీక్‌లో ఉండగానే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటారు... మా అమ్మ కూడా అలాగే అంటారు. పెద్దవారి ఆలోచన విధానం అంతే. అలా అనుకోకపోతేనే తప్పు. అంటే వారి అనుభవం అలాంటిది. మరి మీకేమైనా భయంగా అనిపించిందా? అలా ఏం లేదు. నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నా పనిని నమ్ముతాను.. నాపైన నమ్మకం ఉంది. అయితే చాలామంది కామెంట్స్ చేస్తుంటారు.. నువ్వేంటి హీరోయిన్... నీ బొంద? అని...(నవ్వు) డైరెక్ట్‌గా మిమ్మల్ని అనేవారా? అప్పుడు మీకెలా అనిపించింది? ఇన్‌డైరెక్ట్‌గా అనేవారు. నేను వెళ్లి కలిసినప్పుడు ఫ్రెండ్ రోల్, సిస్టర్ రోల్ ఇస్తాం అనేవారు.. అంటే వాళ్లది తప్పు అని చెప్పలేం. నాకు 18,19 ఏళ్ల టైమ్‌లోనే వెళ్లా. అప్పుడు బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడం రాదు.. సరైన మేకప్ వేసుకోవడం రాదు. తలకి నూనెపెట్టుకుని వెళితే డైరెక్టర్లు అలాగే అంటారు కదా? హీరోయిన్లంటే గ్రూమింగ్స్ అని వేరుగా ఉంటాయి. బాంబే నుంచి అమ్మాయిలు వస్తే వాళ్ల పెరిగిన విధానం వేరుగా ఉంటాయి.. మనది వేరు. వాళ్లు కొంచెం ఫాస్ట్ అన్నమాట. షార్ట్స్, టీ షర్ట్స్తోనే ఉంటారు వాళ్లు. చాలా బ్రాడ్, సిటీ లైఫ్, మెట్రో లైఫ్. మనకు తెలీదప్పుడు. మరి ఆ బాధను ఎవరి వద్ద చెప్పుకున్నారు? ఎవరి వద్దా చెప్పలేదు.. నాకు నేను చెప్పుకున్నాను. ప్రతిరోజూ నిద్రపోయేముందు నేను హీరోయిన్ అవ్వాలి అని వందసార్లు చెప్పుకునేదాన్ని. ‘మీటూ’ అని వింటున్నారు కదా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా...? మీటూ... నేను ఎలాంటి అమ్మాయినంటే నావద్దకొచ్చి ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొట్టే రేంజ్ నాది. బేసిక్‌గా నేను చాలా బోల్డ్‌గా ఉంటాను. నన్ను ఇంట్లో అలా పెంచారేమో? అలా అందరూ ఉండాలంటే బాగా తెలివితేటలు ఉండాలి కదా? ఇప్పుడొచ్చే అమ్మాయిలకు చెప్పనవసరం లేదు. చాలా తెలివిగా ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి నాకు తెలిసిన తర్వాత కడిగే చేపలో స్లిప్ అయ్యే చేపలాగా ఉంటానన్నమాట(నవ్వుతూ). ఎవరైనా పార్టీ ఉందంటూ ఆహ్వానిస్తే హైదరాబాద్ వెళుతున్నా, బాంబే వెళుతున్నా అంటూ తప్పించుకోవడమే. నెక్ట్స్ టైమ్ పిలిస్తే అయ్యో నేను ఊర్లో లేనే! అంటుంటాను. అలా ఉండాలంతే! మీకు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా? మీ తాతగారు, నాన్నగారిని చూస్తూనే పెరిగారు కదా? అప్పుడు షూటింగ్‌లకు వెళ్లేవారా? లేదండి.. నాకు పదేళ్లున్నప్పుడే నాన్నగారు చనిపోయారు. నేను పుట్టినప్పటికే నాన్నగారు సినిమాల్లోంచి ఔట్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ నాకు నాలుగైదేళ్లు ఉన్నప్పుడే.. చాలా బ్యాడ్ సర్కిల్ ఆయనది. చాలా ఉన్నాయి ఆ కథలు ఇప్పుడెందుకులే. తాతగారి గురించి అస్సలు తెలియదు. శ్రీలక్ష్మిగారంటే హైదరాబాద్‌లో ఉండేవారు. శ్రీలక్ష్మిగారి తమ్ముడి కూతుర్ని నేను. మణిరత్నంగారితో(నవాబ్) సినిమా చేయడం ఎలా అనిపించింది? తక్కువ టైమ్‌లోనే ఆ అవకాశం వచ్చిందనుకుంటా? రియల్లీ... చాలా వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే, తక్కువ టైమ్ ఏమీ కాదు ఆరేళ్లు అయ్యింది కదా(నవ్వుతూ). నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన బ్యానర్లో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. ఇందులో కథ మణిసార్ది. దర్శకత్వం వేరే అబ్బాయి చేస్తున్నాడు. మీ చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉన్నాయి కదా? ‘కాకా ముటై్ట’ చిత్రం చేసిన తర్వాత ఏడాదిన్నర సినిమాలు లేవు. ‘కాకా ముటై్ట’ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా చేశా. అప్పుడు నాకు 21ఏళ్లు. ఆ సినిమా నాకు ప్రపం^è వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. దానివల్లే నాకు హిందీ, మలయాళం సినిమాల్లో అవకాశాలొచ్చాయి.. ఒక నటిగా నేను ఎస్టాబ్లిష్ అయ్యానంటే ‘కాకా ముటై్ట’తోనే. ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా చూస్తే ‘కాకా ముటై్ట’లో అమ్మగా నటించింది నువ్వే కదా? అంటారు. తల్లి పాత్ర చేయడం బ్యాడ్ అయిందనిపించిందా? అలాంటిదేం లేదు.. పేరు బాగా వచ్చింది. దాని తర్వాత దుల్కర్ సల్మాన్‌తో సినిమా వచ్చింది. ‘అందమైన జీవితం’ అని తెలుగులో డబ్బింగ్ చేశారు. చాలామంది యూ ట్యూబ్‌లో చూశారు. దుల్కర్ సల్మాన్, నివిన్ పాలి, అర్జున్ రాంపాల్, ధనుష్‌తో చేశా. ‘సగవ్’ అనే సినిమాలో 65–70 ఏళ్ల వృద్ధురాలి గెటప్ వేశా. ఫ్లాష్‌బ్యాక్‌లో చిన్న పిల్లగానూ చేశా. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం.. ఇక్కడున్న వారందరూ ఇష్టమే. కానీ, ఎందుకో జూ.ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు చూస్తాం. మా ఇంట్లో నా సొంత అన్న ఉన్నాడులే. వాడికి జూ.ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయన యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ సూపర్బ్. డ్యాన్స్ ఎంతో∙గ్రేస్‌తో చేస్తారాయన. అందుకే ఆయనంటే నాకిష్టం. ఆయనతో ఓ సినిమా చేస్తే హ్యాపీ. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో మేకప్ లేదను కుంటా? లేదు. కాకపోతే గ్రౌండ్లో ఎండలో నిల్చోబెట్టారు కాబట్టి నల్లగా అయిపోయా. మేకప్ వేసినా, వేయకున్నా ఒకటే. టీత్ మీరు లక్కీ అనుకుని ఉంచారా? లేకపోతే ఏంటి? లక్కీ అనేం లేదు. అది తీస్తే మొత్తం సెట్ చేయడానికి ఆర్నెళ్లు పడుతుందన్నారు. బాగానే ఉంది. తీసుకోవడానికి టైమ్ లేదు. అందుకని అలాగే వదిలేశా. మీ డ్రీమ్‌రోల్స్ ఏంటి? నా డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమీ లేదు. ఏ పాత్ర వచ్చినా కూడా ఇదే నా డ్రీమ్ రోల్, చాలా బాగా చేయాలనుకుంటాను. (నవ్వు) -
ఛీ కొట్టాడు.. నెట్టేశాడు!
ఇప్పుడు కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్. సలామ్ కొట్టేవాళ్లూ, గొడుగు పట్టేవాళ్లూ ఉంటారు. కానీ, ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చాన్సులు అడిగితే ఛీ కొట్టినవాళ్లే ఎక్కువ. ఇటీవల ఓ సందర్భంలో ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు కంగన. ముఖ్యంగా ఓ పెద్ద మనిషి చేసిన నిర్వాకం గురించి ఆమె చెప్పారు. అతనికి కంగన తండ్రి వయసు ఉంటుంది. జస్ట్ చాన్స్ అడగడానికి వెళ్లిన కంగనాను అతను చాలా చులకనగా మాట్లాడాడు. దాంతో ఇద్దరికీ పెద్ద గొడవే అయింది. ఒక్కసారిగా అతను కంగనాను నెట్టడం, ఆమె పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆమె తల పగిలి రక్తం వచ్చింది. భరించలేక, చెప్పు తీసుకుని అతని తల మీద కొట్టింది కంగన. అతనికీ రక్తం వచ్చి కింద పడిపోయాడు. అతగాడి మీద కంగన పోలీస్ కంప్లయిట్ ఇచ్చింది. కానీ, ఖాకీ బాబులు లైట్‌గా మందలించి వదిలేశారు. ‘‘అప్పుడు చాలా షాకయ్యా. పెద్దవాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనిపించింది’’ అని కంగన అన్నారు. కానీ, తాను చెప్పుతో కొట్టిన వ్యక్తి పేరు మాత్రం ఆమె చెప్పలేదు. ఇదిలా ఉంటే.. తాను పడ్డ కష్టాలు, పడిన సంఘర్షణలతో ఓ పుస్తకం రాయాలనుకుంటున్నారు. కచ్చితంగా ఆ పుస్తకం హాట్ కేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో!
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయికల్లో జయప్రద ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న జయప్రద తన రెండో ఇన్నింగ్స్‌లో అడపా దడపా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘మహారథి’ తర్వాత తెలుగులో ఆమె వేరే చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. పాప్‌కార్న్ స్పోర్ట్స్ ఎంటర్టైన్ మెంట్స్, వి.ఎస్.వి ప్రొడక్షన్స్ పతాకంపై నీరజ్వాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చీరాలలో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నా. ఈ చిత్రనిర్మాత బాలగిరి నాకెప్పట్నుంచో తెలుసు’’ అన్నారు. చక్కని హాస్యం నేపథ్యంలో సాగే హారర్ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు. సంగీతదర్శకుడు డబ్బూ మాలిక్ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయన తనయుడు అమాల్ మాలిక్ పాటలు స్వరపరుస్తున్నారు. -
పోలీస్ గెటప్‌లో రీఎంట్రీ
సౌత్‌లో టాప్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్, కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయాత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవల జివి ప్రకాష్ హీరోగా నటించిన 'త్రిష లేదా నయనతార' సినిమాలో అతిథి పాత్రలో నటించిన సిమ్రాన్ మళ్లీ తన రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. గతంలో చేసినట్టుగా గ్లామర్ రోల్స్‌లో కాకుండా, ఈ సారి ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది సిమ్రాన్. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన భర్త దీపక్ నిర్మిస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన మర్థాని తరహా కథా కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌరీ శంకర్ అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించనున్నారు. -
ప్లాప్ వస్తే ఇటువైపు కూడా చూడరు
హిట్లు వస్తే చుట్టూ మూగేవారు ఒక ప్లాప్ వస్తే అటువైపు కూడా చూడదని నటి శృతిహాసన్ పేర్కొనడం టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. ఈ క్రేజీ బ్యూటీ స్వానుభవంతో చెబుతోందా లేదా ఇతరులకు జరిగిన ఘటనలను బట్టి అంటోందా తెలియదు గానీ అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఇండస్ట్రీలోని వారికి చురకలు అంటిస్తున్నారు. శృతి కెరీర్ అపజయాల నుంచే విజయాల స్థాయికి చేరుకున్నదన్న విషయం తెలిసిందే. తమిళంలో ఇటీవల విడుదలైన పూజై చిత్రంతోనే ఆమె తొలి హిట్ కొట్టారు. ఇక తెలుగులో పవర్, ఎవడు, రేసుగుర్రం చిత్రాలతో ప్రముఖ హీరోయిన్ల జాబితాలోకి చేరారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో నటించిన గబ్బర్ ఈస్ బేక్ ఇటీవలే తెరపైకి వ చ్చింది. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన రమణ చిత్రానికి రీమేక్. దీనిపై పరిశ్రమ వర్గాల్లో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. శృతి మాట్లాడుతూ చిత్రం పరాజయం పాలై తే అప్పటి వరకు చుట్టూ మూగిన వారు దూరమవుతుంటారన్నారు. స్టార్ హీరోయిన్ స్థానం గర్వంగా ఉంటుందని తెలిపారు. అయితే ఆ స్థాయికి చేరుకోవడం అంత సులభమైన విషయం కాదన్నారు. స్టార్ హీరోల సరసన నటించి రాణించడం కూడా కష్ట సాధ్యమేనన్నారు. నటనలో తన తల్లిదండ్రులు కమలహాసన్, సారికతో పోలుస్తూ ప్రశ్నిస్తున్నారని, వారితో తనను పోల్చడం సరికాదని అన్నారు. గబ్బర్ ఈస్ బ్యాక్ చిత్రం గురించి చెప్పాలంటే ఆ చిత్ర కాన్సెప్ట్, కథాపాత్రల రూపకల్పన చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ క్రేజీ నటి త్వరలో మరోసారి సూర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం.