ఓటీటీలోకి స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ.. టీజర్‌ చూస్తే చాలు! | Star Heroine Debut Horror Thiller Web Series Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Trisha: సరికొత్త థ్రిల్లర్‌ సిరీస్‌తో త్రిష ఎంట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Tue, Jul 9 2024 8:31 AM | Last Updated on Tue, Jul 9 2024 9:31 AM

Star Heroine Debut Horror Thiller Web Series Streaming On This OTT

కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్‌ తర్వాత మెగాస్టార్‌తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. 
 

అయితే ఇప్పటికే పలువురు స్టార్స్‌ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్‌ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

టీజర్‌ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ‍్ సిరీస్‌లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement