Brinda
-
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. -
ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్
ఈ శుక్రవారం థియేటర్లలోకి తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు కలిపి 11 వరకు రిలీజ్ కానున్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 25 మూవీస్ & వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలానే డబ్బింగ్ మూవీస్ కూడా కొన్ని ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)ఓవరాల్ లిస్టులో చూసుకుంటే రక్షణ, తెప్పసముద్రం సినిమాలతో పాటు మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ, బృందా సిరీస్.. అలానే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ 2 లాంటి డబ్బింగ్ చిత్రాల్ని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దిగువన జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజైనవి.. మిగతావన్నీ కూడా శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం.ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఆగస్టు 02)ఆహారైల్ - తమిళ మూవీతెప్ప సముద్రం - తెలుగు సినిమా (ఆగస్టు 03)రక్షణ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్తుజ్ పే మైన్ ఫిదా సీజన్ 2 - హిందీ సిరీస్బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)హాట్స్టార్కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ఫ్లిక్స్మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి - తెలుగు డాక్యుమెంటరీసేవింగ్ బికినీ బాటమ్ - ఇంగ్లీష్ సినిమాజో రోగన్ - ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్ (ఆగస్టు 03)బ్రేకింగ్ అండ్ రీఎంటరింగ్ - మాండరిన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఫ్రమ్ మీ టూ యూ కిమీ ని తొడోకే సీజన్ 3 - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)షుమిక్కోగురాషీ - జపనీస్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)బోర్డర్ లెస్ ఫాగ్ - ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)మ్యాన్ లఫెర్ట్ టెమో - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)అన్ స్టెబుల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) సోనీ లివ్బృందా - తెలుగు డబ్బింగ్ సిరీస్జియో సినిమాటరోట్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 03)దస్ జూన్ కీ రాత్ - హిందీ సిరీస్ (ఆగస్టు 04)డ్యూన్ పార్ట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)గుహ్డ్ చడీ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)బుక్ మై షోద బైక్ రైడర్స్ - ఇంగ్లీష్ సినిమారీస్టోర్ పాయింట్ - తెలుగు డబ్బింగ్ మూవీలయన్స్ గేట్ ప్లేస్లీపింగ్ డాగ్స్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని 'మహారాజ' విజయ్ సేతుపతి.. ఎందుకంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'శివం భజే', 'తిరగబడరా సామీ', 'ఉషా పరిణయం', 'బడ్డీ' సినిమా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్క దానిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్ లిస్టులో నాలుగు మాత్రం ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత)ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష 'బృందా' సిరీస్‌తోపాటు కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది దిగువన లిస్ట్ చూసేద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు)నెట్ఫ్లిక్స్ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ మూవీ) - ఆగస్టు 01లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 01మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ సినిమా) - ఆగస్టు 01అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) - ఆగస్టు 02సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్) - ఆగస్టు 03అమెజాన్ ప్రైమ్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01హాట్స్టార్ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29నో వే ఔట్ (కొరియన్ సిరీస్) - జూలై 31కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 02బుక్ మై షోద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02జియో సినిమాడ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 01గుహ్డ్ చడీ (హిందీ మూవీ) - ఆగస్టు 01టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - ఆగస్టు 03దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) - ఆగస్టు 04సోనీ లివ్బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 02ఆపిల్ ప్లస్ టీవీఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
బృంద వస్తోంది
హీరోయిన్ త్రిష టైటిల్ రోల్లో నటించిన థ్రిల్లింగ్ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘బృంద’. సూర్య మనోజ్ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో పోలీసాఫీసర్ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్‌తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. చిత్రీకరణ సంగతలా పక్కనబెడితే వరస అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హీరో గాయపడగా.. ఇప్పుడు సాంగ్ తీస్తున్న సమయంలో టైంలో స్టార్ కొరియోగ్రాఫర్ గాయపడింది. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) గతంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో 'కన్నప్ప' మూవీ వచ్చింది. ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు కన్నప్ప మూవీ తీస్తామని మంచు విష్ణు చాలారోజుల నుంచి చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సీన్స్ తీస్తున్నారు. అయితే నవంబరు మొదట్లో హీరో విష్ణు గాయపడ్డాడు. డ్రోన్ తగలడంతో విష్ణు మోచేతికి గాయమైంది. ఇది అయిపోయిందనుకునేలోపు ఇప్పుడు సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ కాలికి ఫ్రాక్టర్ అయింది. ఓ పాట కోసం స్టెప్స్ కంపోజ్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ మధ్యలో నిలిపేశారు. అలానే ఆమెని కూడా కొన్నిరోజులు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ సూచించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
ఆకట్టుకుంటున్న కాల భైరవ ‘వీర శూర మహంకాళి’ సాంగ్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా... ’అంటూ సాగే ఈ పాట కీలక సన్నివేశంలో రానుందని చిత్ర బృందం పేర్కొంది. . అమ్మవారు పూనినట్లుగా హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు